Thank you so much for gave me such a lovely gift. Your gift made so special today. It is not the gift that is important in my life, will support my carrier . I will keep this gift for ever. You are not only the hero, you are the first supporter of your fans.@AlluSirish@alluarjun
జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురం చిత్రాడలో నిర్వహించిన జయకేతనం బహిరంగ సభ విజయవంతం అయ్యేందుకు కృషి చేసిన ప్రతి ఒక్క @JanaSenaParty నాయకులకు, జన సైనికులకు, వీరమహిళలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
జనసేన పార్టీ 11 సంవత్సరాల ప్రస్థానం పూర్తి చేసుకుని 12 వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకోవడంలో అనేకమంది వేదిక మీద లేకపోయినా సరే ఎంతో కష్టపడ్డారు, సభ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. వారికి పేరుపేరునా ధన్యవాదాలు త��లియజేయాల్సిన బాధ్యత నాపై ఉంది.
ముందుగా ఈ వేడుకను ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించుకునేందుకు, అన్ని విధాలుగా సహకరించి, శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేసిన పోలీస్ శాఖ @APPOLICE100 వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రాష్ట్ర @dgpapofficial శ్రీ హరీష్ కుమార్ గుప్తా IPS గారికి, కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ IPS గారికి, @KAKINADAPOLICE వారికి, క్షేత్రస్థాయిలో పనిచేసిన ప్రతి ఒక్క పోల��స్ అధికారికి, బందోబస్తులో కీలక పాత్ర పోషించిన నా కానిస్టేబుల్ సోదరులకు కృతజ్ఞతలు.
అలాగే సహకరించిన జిల్లా అధికార యంత్రాంగానికి, కాకినాడ జిల్లా కలెక్టర్ శ్రీ షాన్మోహన్ IAS (@CollectorKakin1) గారికి
పార్టీ తరఫున ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు అవసరమైన వివిధ రకాల కమ��టీలను ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు కార్యక్రమం ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ, జయకేతనం సభ విజయవంతం అయ్యేందుకు క్షేత్రస్థాయిలో పనిచేసిన గౌ|| మంత్రివర్యులు, జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ @mnadendla గారికి, గౌ|| మంత్రి శ్రీ @kanduladurgesh గారికి గౌ|| ఎమ్మెల్సీ, పార్టీ సీనియర్ నాయకులు శ్రీ పిడుగు హరిప్రసాద్ గారికి, కాకినాడ ఎంపీ శ్రీ @tangella_uday గారికి, పిఠాపురం ఇంచార్జి శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్ గారికి, శాసన స���్యులకు, పార్లమెంట్ సభ్యులకు, వివిధ జిల్లాల నాయకులకు, నా హృదయపూర్వక ధన్యవాదాలు.
అలాగే కార్యక్రమం ఏర్పాట్లను పూర్తిస్థాయిలో పరిశీలించి, సభాస్థలం ఎంపిక నుంచి, సభ పూర్తయ్య వరకు అడుగడుగునా అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ, ఏ విధమైన అసౌకర్యం జరగకుండా నిర్వహించిన జనసేన పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ @KSSRaoJSP గారికి, వారి కమిటీ సభ్యులకు నా ధన్యవాదాలు.
సభకు హాజరైన జనసేన శ్రేణులకు అ���్యవసర వైద్య సేవలు అందించేందుకు బృందాన్ని సిద్ధం చేసి, వైద్య సేవలు అందించిన డాక్టర్ సెల్ బృందానికి, ��భ ప్రాంగణంలో సేవలు అందించిన వాలంటీర్ సోదరులకు ధన్యవాదాలు.
ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా వీక్షించేందుకు, కార్యక్రమ సారాంశాన్ని చేరవేసేందుకు అన్ని విధాలుగా సహకరించిన మీడియా మిత్రులకు, పాత్రికేయులకు, లైవ్ కవరేజ్ అందించిన సిబ్బందికి ధన్యవాదాలు. జనసేన పార్టీ 11 ఏళ్ల ప్రయాణాన్ని వివరిస్తూ పార్టీ చేపట్టిన కార్యక్రమాలను, వివరిస్తూ వివిధ డాక్యుమెంటరీలో రూపొందించి వాటిని ప్రజలకు తెలిసేలా ప్రదర్శించిన జనసేన పార్టీ సోషల్ మీడియా విభాగం @JSPShatagniTeam టీం బృందానికి ధన్యవాదాలు.
వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమ ప్రదర్శనలు నిర్వహించి జనసేన పార్టీ సంస్కృతులను కాపాడే విధానం తెలియజేసేందుకు కృషి చేసిన సాంస్కృతిక విభాగం కమిటీకి, శ్రీ హరీష్ పాయి గారికి, కళాకారులను మనస్ఫూర్తిగా అభినందిస్తునలు తెలియజేస్తున్నాను.
తీవ్రమైన ఎండ ఉన్న��్పటికీ, కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి డిహైడ్రేషన్ అవ్వకుండా వారికి దారి పొడవునా ఫుడ్ స్టాల్స్ ఏర్పాటుచేసి పండ్లు, మజ్జిగ, నీరు, ఆహారం అందించిన ఫుడ్ కమిటీ విభాగానికి, స్టేజ్ డెకరేషన్, లైటింగ్, సౌండింగ్ బృందానికి, ప్రతీ ఒక్క కార్మికుడికి, కార్యక్రమం అనంతరం ప్రాంగణాన్ని పరిశుభ్రం చేసి, స్వచ్ఛ ఆంధ్రలో పాల్గొన్న ప్రతీ ఒక్కరినీ అభినందిస్తున్నాను.
సభకు స్థలాన్ని అందించిన దాతలకు, సభా వేదిక వద్ద పారిశుధ్య సేవలు అందించిన పారిశుధ్య సిబ్బందికి, వారిని సత్కరించిన గౌ|| MLC పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ @NagaBabuOffl గారికి ధన్యవాదాలు.
కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు సహాయ, సహకారాలు అందించిన జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం సిబ్బందికి, నా వ్యక్తిగత భద్రత సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో జనసేన పార్టీ బలోపేతం కోసం నూతన ఉత్సాహంతో, ప్రజల పక్షాన నిలబడి పనిచేయాల్సిందిగా జనసేన శ్రేణులకు పిలుపునిస్తున్నాను.
#JanaSenaJayaKethanam #JanaSena12thFormationDay