గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో సైనిక్ పాఠశాల ఏర్పాటు చేయడానికి వేములవాడ పట్టణంలోని జవహార్ లాల్ నెహ్రూ ఎడ్యుకేషనల్ సొసైటీ భవన సముదాయాన్ని సైనిక్ స్కూల్ కల్నల్ కులకర్ణి గారితో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించడం జరిగింది.
ముస్తాబాద్ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి ధరణి పోర్టల్ లోని దరఖాస్తులు, కళ్యాణలక్ష్మీ, శాదీముబారక్ దరఖాస్తులు పెండింగ్ లో ఉండకుండా చూడాలని, రెండు పడక గదుల ఇండ్ల దరఖాస్తులు, ఇతర దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించడం జరిగింది.
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రభుత్వ విభాగాలను పరిశీలించి గౌరవ కలెక్టర్ గారి అనుమతులు లేకుండా ఎలాంటి మరమ్మతులు చేపట్టకూడదని జిల్లా అధికారులను ఆదేశించి ఒకవేళ తప్పనిసరిగా అవసరం ఉన్నప్పుడు గౌరవ కలెక్టర్ గారి నుండి అనుమతి పొందిన తర్వాతమాత్రమే మరమ్మత్తులు చేసుకోవాలని తెలిపారు
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు పోలీస్ గౌరవ వందన స్వీకరణ అనంతరం 10 గంటలకు మువ్వన్నెల జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం సమర్పించడం జరిగింది.
భారత రాజ్యాంగం దేశంలోని 18 సంవత్సరాలు నిండిన వారందరికీ కల్పించిన శక్తివంతమైన వజ్రాయుధం ఓటు హక్కు అని, ప్రతి ఓటరూ నిష్పక్షపాతంగా తన ఓటు హక్కును వినియోగించుకోవాలని మంగళవారం జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా సిబ్బందితో ఓటు హక్కు వినియోగం, ప్రాధాన్యతపై ఓటరు ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.
The best time to plant a tree was 20 years ago and the 2nd best time is NOW!
Happy to see our plantation programme excel. Here are some heart warming pictures of our fruit bearing trees planted at Mission Bhagiratha's premises.
Each one, Plant one 🌱
@SmitaSabharwal
@MPsantoshtrs గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా @KheemyaN గారు విసిరిన ఛాలెంజ్ ను నేను స్వీకరించి మొక్కలు నాటడం జరిగింది. అలాగే ఈ ఛాలెంజ్ ను @DistrictRajanna, @DrdoRajanna, @Rdo_Sircilla గార్లకు ఛాలెంజ్ స్వీకరించాలని కోరుతున్నాను.
May the joy, cheer, mirth and merriment of this divine festival surround you forever. May the happiness, that this season brings… Festive occasions fill our lives with a new charm and happiness. May this Diwali prove to the beginning of something great in your life!
జాతి పిత మహాత్మాగాంధీ గారి 150 వ జయంతి సందర్భంగా కలెక్టరేట్ లో, సిరిసిల్ల గాంధిచౌక్ లో మరియు వేములవాడ మునిసిపాలిటీ లో జరిగిన జయంతి వేడుకలలో పాల్గొనడం జరిగింది.
ఈరోజు C నారాయణ రెడ్డి కళామందిరం లో జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవం కార్యక్రమంలో గౌరవ కలెక్టర్ గారితో కలిసి కళాకారుల ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూసి, ఫుడ్ ఫెస్టివల్ లో పాల్గొని, గర్భవతులకు రాగి లడ్డులు పంపిణీ చేయడం జరిగింది.
ఈరోజు కలెక్టరేట్ మరియు పొదుపు భవన్ లో జరిగిన కొండ లక్ష్మణ బాపూజీ గారి జయంతి వేడుకల్లో గౌరవ జడ్పీ చైర్మన్ గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గార్లతో కలిసి పాల్గొనటం జరిగింది.