ధన్యవాదాలు @mnadendla Sir...!
నేడు శ్రీకాకుళంలో జరిగిన టెక్కలి నియోజకవర్గ సమీక్షా సమావేశంలో నన్ను గుర్తించి నా గురుంచి ప్రస్తావించడం చాలా ఆనందకరం.
మీరు మాకు అందించిన సలహాలతో, సూచనలతో జనసేన పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తూ ఉంటాం
#JSPNewAgePolitics@PawanKalyan@JSPShatagniTeam
ఆముదాలవలస AMC చైర్మన్‌గా @JSPRamMohan గారు.
ఆముదాలవలస వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) చైర్మన్‌గా నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ పేడాడ రామ్మోహన్ రావు గారిని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా వారికి నా
హృదయపూర్వక శుభాకాంక్షలు.
కోటబొమ్మాళి జనసేన పార్టీ అధ్యక్షులు పాగోటి అనిల్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు! 💐
కోటబొమ్మాళి మట్టిలో మొలిచిన సేవా గుణం...
జనసేన జెండా కింద నడిచే ధీర గుణం!
పాగోటి అనిల్ కుమార్ గారంటే ఓ నమ్మకం...
సమాజం కోసం తపించే ఒక నిఖార్సైన వ్యక్తిత్వం!
@JSPAnilKumar
#2YrsOfTrustDevelopmentWelfare#PawanKalyanAneNenu
2 ఏళ్ల ప్రజా ప్రభుత్వం
2 ఏళ్ల అభివృద్ధి ప్రస్థానం
2 ఏళ్ల గ్రామ స్వరాజ్యం
"పవన్ కళ్యాణ్ అనే నేను..." అనే ప్రతిజ్ఞతో
ప్రజా సేవకు అంకితమై,
పాలనలో తనదైన ముద్ర వేసి,
రాష్ట్ర అభివృద్ధికి, గ్రామ స్వరాజ్య సాధన దిశగా అడుగులు వేస్తూ...
దేశ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన జనసేన పార్టీ అధినేత, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
#2YrsOfTrustDevelopmentWelfare#PawanKalyanAneNenu
"పవన్ కళ్యాణ్ అనే నేను" అంటూ 2 ఏళ్ల క్రితం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణ, సైన్స్ & టెక్నాలజీ శాఖల మంత్రిగా విప్లవాత్మక నిర్ణయాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న శ్రీ @PawanKalyan గారు.
కళ్ల ముందే గోదావరి కలుషితమవుతుంటే ఇన్ని రోజులూ ఏం చేశారు?
•అధికారులను ప్రశ్నించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు
•పీసీబీ అందించిన ల్యాబ్ రిపోర్టుపై సమీక్ష సమావేశం
•అనుమతించదగిన పరిమితుల కంటే గోదావరిలో ఎక్కువగా కాలుష్య కారకాలు గుర్తింపు
•ఆంధ్ర పేపర్ మిల్లు, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కు నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు
•నిర్లక్ష్యం వహించిన రాజమండ్రి పీసీబీ అధికారులపై క్రమశిక్షణ చర్యలకు ఉప ముఖ్యమంత్రివర్యులు ఆదేశం
పవిత్ర గోదావరి నదిని పారిశ్రామిక రసాయనాలు, నగర మురుగు నీరు ఎంత దారుణంగా కలుషితం చేస్తున్నాయో ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) అధికారులు అందించిన ల్యాబ్ రిపోర్టులో వెలుగు చూశాయి. గత నెల మే 25న ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా బోటుపై వెళ్లి నల్లా ఛానల్, ఆంధ్ర పేపర్ మిల్లు లగూన్స్ (మడుగులు) వద్ద సేకరింపజేసిన నీటి నమూనాల పరీక్షా ఫలితాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. అత్యాధునిక సాంకేతికతతో జరిపిన ఈ పరీక్షలలో, అనుమతించదగిన పరిమితుల కంటే కాలుష్య కారకాలు అధిక రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఈ నివేదికపై ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తూర్పుగోదావరి జిల్లా ఉన్నతాధికారులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సోమవారం అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు.
గోదావరి నదిని మురుగుమయం, రసాయనమయం చేస్తున్న ప్రస్తుత పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా, కళ్ళ ముందే గోదావరి నది ఇంతలా కలుషితమవుతున్నా, ఇన్ని రోజులుగా సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఎందుకు కాలయాపన చేశారని అధికారులను ప్రశ్నించారు. అధికారులు చట్టపరంగా వాళ్లు చేయాల్సిన విధులను ఎందుకు నిర్వర్తించకుండా నిర్లక్ష్యం చేశారని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న పరిశ్రమలపై గతంలో ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు.
* ఆందోళనకర స్థాయిలో కోలిఫామ్ బ్యాక్టీరియా
భక్తులు ఎంతో పవిత్రంగా భావించే రాజమహేంద్రవరం కోటిలింగాల ఘాట్, నల్లా ఛానల్ పరిసరాల్లో గోదావరి నది నీరు మురుగునీటి వల్ల తీవ్రంగా కలుషితమైందని ల్యాబ్ పరీక్షల్లో తేలింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అధికారులు ఇక్కడ నీటి నమూనాలను సేకరించి పరీక్షించగా ఆందోళనకరమైన నిజాలు బయటపడ్డాయి. సాధారణంగా నది నీటిలో మనుషులు స్నానాలు చేయడానికి కోలిఫామ్ బ్యాక్టీరియా సంఖ్య 500 MPN/100ml లోపు ఉండాలి. కానీ నల్లా ఛానల్ సమీపంలోని కోటిలింగాల ఘాట్ తీరంలో ఇది ఏకంగా 2420 MPN/100ml కి చేరింది. నీటిలో కాలుష్యాన్ని చూపే బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ పరిమితి 3mg/L కంటే తక్కువ ఉండాలి. కానీ ఇక్కడ అది 5.2 mg/L గా నమోదైంది. 73 శాతం పెరిగింది. దీనివల్ల నీటిలో ఆక్సిజన్ తగ్గిపోయి చేపలు, జలచరాలు చనిపోతున్నాయి. నీటి స్వచ్ఛత గరిష్టంగా 5 NTU పాయింట్లు ఉండాలి. కానీ పరీక్షల్లో ఇది 8.4 నుండి 14.2 NTU వరకు వచ్చింది. మురుగునీరు కలవడం వల్ల గోదావరి నీరు పూర్తిగా రంగుమారిపోతోంది. మురుగు కాలువలో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ పరిమితి 250 mg/L దాటకూడదు. కానీ ఇక్కడ 263 mg/L గా నమోదైంది. నీటిలో నైట్రేట్ పరిమితి 45 mg/L దాటకూడదు. కానీ ఇక్కడ ఏకంగా 119.6 mg/L గా తేలింది. రసాయన ఎరువుల అవశేషాలు, ఫ్యాక్టరీల వ్యర్థాలు కలవడం వల్లే నైట్రేట్లు ఇంతగా పెరిగాయి. ఈ ల్యాబ్ నివేదిక ప్రకారం ఈ నీరు స్నానాలు చేయడానికి గానీ, గృహ అవసరాలకు గానీ ఏమాత్రం పనికిరాదు. ఈ నీటి వల్ల కలరా, టైఫాయిడ్, విరేచనాలు, చర్మవ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా నైట్రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల చిన్న పిల్లలకు ఆక్సిజన్ అందక బ్లూ బేబీ సిండ్రోమ్ అనే వ్యాధి వచ్చే ముప్పు ఉందని నివేదిక హెచ్చరించింది.
* పరిమితికి మించి ప్రమాదకర రసాయనాలు
ఆంధ్ర పేపర్ మిల్లు లగూన్ వద్ద సేకరించిన నీటి నమూనాలను పరీక్షించగా నివ్వెరపోయే నిజాలు వెల్లడయ్యాయి. నీటిలో సల్ఫైడ్, డివోబీ, ఫాస్ఫేట్లు పరిమితికి మించి ఉన్నట్లు వెల్లడయ్యింది. బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ పరిమితి 30 mg/L లోపు ఉండాలి. కానీ ఇక్కడ అది 36 mg/L ఉంది. 20 శాతం అధికంగా నమోదైంది. ఫ్యాక్టరీ వ్యర్థాలను సరిగ్గా శుద్ధి చేయకపోవడం వల్లే నీటిలో ఆక్సిజన్ పూర్తిగా తగ్గిపోయి చేపలు, ఇతర జలచరాలు మృత్యువాత పడుతున్నాయి. నీటిలో ఫాస్ఫేట్ పరిమితి 5 mg/L ఉండాల్సి ఉండగా.. ఇక్కడ 5.3 mg/L గా తేలింది. నీటిలో సల్ఫైడ్ పరిమితి 2 mg/L మాత్రమే ఉండాలి. కానీ ఇక్కడ ఏకంగా 3.4 mg/L ఉన్నాయి. 70 శాతం అధికారంగా నమోదైంది. ల్యాబ్ నివేదిక ప్రకారం ఫ్యాక్టరీ విడుదల చేస్తున్న ఈ వ్యర్థ జలాలు చుట్టుపక్కల ప్రజల ఆరోగ్యాన్ని, మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీస్తున్నాయి. ఈ నీటిని సరిగ్గా శుద్ధి చేయకుండా గృహ అవసరాలకు వాడటం మానవ ప్రాణాలకే అపాయమని నివేదిక హెచ్చరించింది.(1/2)
National Panchayat Awards | Honoring Panchayats for Excellence in Good Governance, Innovation, Citizen-Centric Initiatives, and Sustainable Development
Andhra Pradesh was awarded 5 National Panchayat Awards at the National Panchayat Awards Distribution Ceremony organized by the Ministry of Panchayati Raj on June 3, 2026. This achievement reflects the state's ongoing commitment to strengthening grassroots governance and sustainable development in rural areas.
Four Gram Panchayats of the state were honored under various categories of the Deen Dayal Upadhyay Panchayat Sustainable Development Award, while one Block Panchayat was presented with the Nanaji Deshmukh Best Panchayat Sustainable Development Award.
Hon’ble Deputy CM & Forest Minister Sri @PawanKalyan garu launched the preparation of 2.5 crore Seed Balls at the Butterfly Park, Mulapadu, on #WorldEnvironmentDay.
Joining SHG women, students, NGOs and officials, he personally prepared seed balls using native species and reviewed drone-based seed dispersal in forest landscapes.
He directed officials to complete 2.5 crore seed balls by June 15, proposed Yoga Halls in every Eco-Tourism Park, and assured support for traditional artisans through promotion and a Wood Bank initiative.
A major step towards a greener Andhra Pradesh. 🌱🌍
@APDeputyCMO
#WorldEnvironmentDay #SeedBallCampaign #GreeningAndhraPradesh #PawanKalyan #APForestDepartment #EcoRestoration #GreenAndhraPradesh
2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియకు శ్రీకారం
* మహిళలు, చిన్నారులతో కలసి స్వయంగా విత్తన బంతులు తయారు చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
* డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్ వెదజల్లే ప్రక్రియను వీక్షించిన ఉప ముఖ్యమంత్రివర్యులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాఖ మంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు ఎన్టీఆర్ జిల్లా, మూలపాడులో శుక్రవారం ఉదయం బటర్ ఫ్లై పార్క్ లో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలసి స్వయంగా సీడ్ బాల్స్ తయారు చేశారు. అంకుడు, తెల్లపొణికి, వేప, కుంకుడు, రావి, మర్రి, వెదురు, ఉసిరి, చింత, మోదుగ తదితర స్వదేశీ జాతి విత్తనాలతో ఈ సీడ్ బాల్స్ తయారు చేశారు.
• రాష్ట్రవ్యాప్తంగా 300 ప్రాంతాల్లో సీడ్ బాల్స్ తయారీ
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 300 ప్రాంతాల్లో విస్తృతంగా సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మూలపాడు బటర్ ఫ్లై పార్క్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు వీక్షించారు. సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియలో పాల్గొన్న ప్రజలతో ముచ్చటించారు. ఏఏ విత్తనాలతో సీడ్ బాల్స్ తయారు చేస్తున్నారు? ఎంత మొత్తంలో రూపొందిస్తున్నారు? అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. వన సంరక్షణకు పని చేస్తున్న మహనీయుల స్ఫూర్తితో విత్తన బంతుల తయారీ ప్రక్రియను బాధ్యతగా ముందుకు తీసుకువెళ్లాలన్నారు. సీడ్ బాల్స్ ఆవశ్యకతను వివరించిన చిన్నారులను అభినందించారు. జూన్ 15వ తేదీ నాటికి 2.5 కోట్ల సీడ్ బాల్స్ రూపొందించాలని అధికారులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు. అనంతరం డ్రోన్ల సహాయంతో కొండ శిఖరాలపై విత్తన బంతులు జారవిడిచే ప్రక్రియను పరిశీలించారు.
•ప్రతి ఎకో పార్కులో ఒక యోగా హాల్
అంతకు ముందు మూలపాడు బటర్ ఫ్లై పార్కులో అటవీ శాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను శ్రీ పవన్ కళ్యాణ్ గారు సందర్శించారు. బటర్ ఫ్లై పార్కు నమూనా పరిశీలనలో అక్కడ యోగా హాల్ నిర్మాణం ఆయనను ఆకట్టుకుంది. ప్రతి ఎకో టూరిజం పార్కులో ఒక యోగా హాల్ నిర్మించే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
•కొయ్య బొమ్మలు, కళాకృతుల ప్రచారానికి హామీ
అనంతరం కొండపల్లి కొయ్య బొమ్మలు తయారీకి వినియోగించే తెల్ల పొణికి దుంగలను పరిశీలించారు. పక్కనే ఏర్పాటు చేసిన కొండపల్లి కొయ్య బొమ్మలు, ఉదయగిరి కళాకారులు నిర్ధ, బిళ్ల నిర్ధ, వేప కర్రతో తయారు చేసిన గ్లాసులు, గరిటలు వంటి వంట ఇంటి సామాగ్రిని ఆసక్తిగా తిలకించారు. కళాకారులు రూపొందించిన చెక్క వాచ్, ల్యాప్ టాప్ శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఆకట్టుకున్నాయి. చిత్తూరు నుంచి వచ్చిన కళాకారులు బొమ్మల తయారీకి అవసరం అయిన చెక్క లభించడం లేదని తెలుపగా, వుడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కొయ్య బొమ్మల కళాకారుల చేత ప్రముఖ స్వతంత్ర సమరయోధులు, హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణారావు గారి ప్రతిమను తయారు చేయించాలని కోరారు. అద్భుతమైన కళారూపాలకు మార్కెటింగ్ కల్పించేందుకు, ప్రచారం ద్వారా ప్రాచుర్యం కల్పించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి రెండు నెలలకి ఓ ప్రాంతంలో చేతి వృత్తుల కళాకారులను కలిసే ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మైలవరం శాసన సభ్యులు శ్రీ వసంత కృష్ణప్రసాద్ గారు, అటవీ, పర్యావరణ శాఖల ముఖ్యకార్యదర్శి శ్రీ కాంతిలాల్ దండే గారు, పీసీసీఎఫ్ శ్రీ పీవీ చలపతిరావు గారు, అటవీశాఖ సలహాదారుడు శ్రీ మల్లికార్జునరావు గారు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మీశ గారు, జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శ్రీ సామినేని ఉదయభాను గారు, మైలవరం ఇంఛార్జ్ శ్రీ అక్కల రామ్మోహన రావు గారు తదితరులు పాల్గొన్నారు.
(1/5)
My stand on Telangana and the interests of its people has always been consistent.
Following the bifurcation of Andhra Pradesh, while certain law and order concerns were raised, I clearly opposed the implementation of Section 8, as I believed it would undermine the self-respect and right to self-governance of the people of Telangana.
I have always maintained that respecting the aspirations and rights of the people of Telangana is as important as addressing the security concerns of the people of Andhra Pradesh.
Instead of invoking provisions like Section 8, I believed that special coordination mechanisms, parliamentary oversight, and measures that build mutual trust between the two states would provide a more constructive and lasting solution.
I have never supported politics that seeks to destabilize Telangana. My belief has always been in protecting the interests of the people of both Telugu states through mutual respect, peace, cooperation, and a spirit of brotherhood.
#JaiBharat
#JaiHind
ఏ రస్తా యుద్ధాలు చేస్తుందో
ప్రాణాల్ని ఆటబంతుల్లా
విసిరేస్తుందో
గెలుస్తుందో ఓడుతుందో
కానీ ముందుకు పోతుందో
అదే నా రస్తా
ఏ రస్తాలో సంకెళ్లు కూడా
సవాల్ చేస్తాయో
ఏ రస్తాలో అపజయం కూడా
అగ్నిజ్వాలై మండుతుందో
ఏ రాస్తాలో మరణం
మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో
అదే నా రాస్తా...
- Maha Kavi’ Seshendra’
( An excerpt from Aadunikha MahaBharatham)
My commitment to Telangana statehood is not something that began recently.
In 2009, while leading the Yuva Rajyam youth wing of Praja Rajyam Party, I participated in the Telangana Samajika Nyaya Sabha alongside Osmania University student leaders and Gaddar Garu.
At a time when the Congress government led by the late YSR garu, was opposed to the formation of Telangana, I openly supported the aspirations of the Telangana people and gave a call for a “Samajika Telangana” a Telangana built on the foundations of social justice, self-respect, and equal opportunities for all sections of society.
My support for Telangana was never driven by political expediency. It was guided by conviction and a belief that the democratic aspirations of the people deserved recognition and respect.
The stand I took then reflects my unwavering commitment to Telangana and its people. My support for Telangana statehood was not a matter of politics, it was a matter of principle.
#JaiTelangana #JaiHind
I will address a press-meet at my home in Jubilee Hills ,today between 4.30 to 5.30 pm.I hope Telangana police dept atleast gives me permission to do a pressmeet with JSP leaders. Let’s see…
అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, యువతకు ఉపాధి, రైతులకు భరోసా, పారదర్శక పాలనతో "బంగారు తెలంగాణ" నిర్మాణం జరగాలని ఆకాంక్షిస్తూ..
రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు!
జై తెలంగాణ! జై హింద్!!
#TelanganaFormationDay#JaiTelangana
FAKE NEWS ALERT 🚨
రేపు హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న సంధ్య కన్వెన్షన్‌లో జరగనున్న జనసేన పార్టీ తెలంగాణ నవనిర్మాణ సభకు సంబంధించి కొన్ని మీడియా సంస్థలు, వెబ్ న్యూస్ ఛానల్స్ పూర్తిగా అవాస్తవ కథనాలను ప్రచారం చేస్తున్నాయి.
• రేపు జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారు పాల్గొంటున్న ఈ సభకు అనుమతి నిరాకరిస్తూ, పోలీసు వారు జారీ చేసిన నోటీసుపై జనసేన పార్టీ లీగల్ సెల్ తెలంగాణ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిందని, దానిని కోర్టు తిరస్కరించిందని, సభకు అనుమతి లభించలేదని ప్రచారం చేస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు.
• వాస్తవానికి, ఈరోజు సాయంత్రం కోర్టు సమయం ముగిసిన తరవాత, ఏవేవో కారణాలను సాకుగా చూపుతూ, పోలీస్ శాఖ అనుమతి నిరాకరణ నోటీస్ జారీ చేసింది. దీంతో ఈరోజు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం కుదరలేదు. రేపు ఉదయం జనసేన పార్టీ గౌరవ తెలంగాణ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి సభ నిర్వహణకు అనుమతి కోరనుంది.
• ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టబద్ధంగా, శాంతియుతంగా సభలు నిర్వహించుకునే హక్కు ప్రతి రాజకీయ పార్టీకి ఉంది. అదే రాజ్యాంగబద్ధ హక్కుతో జనసేన పార్టీ తెలంగాణ నవనిర్మాణ సభను నిర్వహించేందుకు అన్ని చట్టపరమైన మార్గాలను అనుసరిస్తోంది.
• అందువల్ల మీడియా ప్రతినిధులు, వెబ్ ఛానల్స్, జనసేన శ్రేణులు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు అవాస్తవ కథనాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాము.
@JSPTelangana@PawanKalyan
రంపచోడవరం అడవుల్లో ఉచ్చులు, ట్రాప్లను నిర్వీర్యం చేసిన అటవీ సిబ్బందికి అభినందనలు
•వన్యప్రాణి సంరక్షణలో క్షేత్రస్థాయి అటవీ సిబ్బంది పని తీరు ప్రశంసనీయం
‘హనుమాన్ ఫౌండేషన్ స్ఫూర్తితో వన్యప్రాణుల సంరక్షణకు అటవీ శాఖ క్షేత్రస్థాయి సిబ్బంది కృషి చేస్తున్నారు. ఇటీవల రంపచోడవరం అటవీ ప్రాంతంలో దుండగులు ఏర్పాటు చేసిన ఉచ్చులు, ట్రాప్లను పెద్ద ఎత్తున నిర్వీర్యం చేసి వన్యప్రాణుల ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పును తొలగించారు’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు క్షేత్ర స్థాయి అటవీ సిబ్బందిని ప్రశంసించారు. మూడు రోజుల పాటు కఠినమైన పరిస్థితుల మధ్య శ్రమించి 242 ఉచ్చులు, 10 ఫుట్ ట్రాప్ లు, 10 కిలోమీటర్ల పొడవు ఉన్న కరెంటు తీగలు తొలగించిన మిగిలిన సిబ్బందికి స్ఫూర్తినిస్తుంది అన్నారు. అడవుల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణ పట్ల సిబ్బంది నిరంతర అప్రమత్తత, అంకితభావం ఉండాలని ఉప ముఖ్యమంత్రివర్యులు స్పష్టం చేశారు. వేటగాళ్ల నుంచి వన్యప్రాణులను రక్షించడం కూడా ఒక రెస్క్యూ ఆపరేషన్‌తో సమానమనీ, ఈ దిశగా అటవీ సిబ్బంది ఎంతో నిబద్దతతో ముందుకు వెళ్ళాలి అన్నారు. రంపచోడవరం సిబ్బంది చేసిన ఈ ఆపరేషన్ ను ఉన్నతాధికారులు ఉప ముఖ్యమంత్రివర్యుల దృష్టికి తీసుకువచ్చారు.
అటవీ శాఖ ఉన్నతాధికారులతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “అటవీ సరిహద్దు ప్రాంతాల్లో నివసించే గిరిజనులు అడవులు, వన్యప్రాణుల సంరక్షణ బాధ్యతను తరతరాలుగా సంప్రదాయంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. అటవీ సంపద, వన్యప్రాణుల ప్రాణాలతో ఆటలాడుకునే వ్యక్తుల పట్ల కూడా గిరిపుత్రులు అప్రమత్తతతో వ్యవహరించి అటవీ శాఖకు సహకరించాలి. ఎక్కడైనా ఉచ్చులు, ట్రాప్‌లు, అనధికారికంగా ఏర్పాటు చేసిన కరెంటు వైర్లు గుర్తిస్తే తక్షణమే ఆ సమాచారాన్ని అటవీ శాఖ సిబ్బంది దృష్టికి తీసుకురావాలి. వన్యప్రాణుల వేట జీవ వైవిధ్యాన్ని, అటవీ పర్యావరణ సమతుల్యతను దెబ్బ తీస్తుంది. జీవ వైవిధ్యానికి నిలయమైన మన అటవీ వారసత్వ సంపదను పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ దిశగా ప్రజలంతా అటవీ శాఖకు సహకరించాలని కోరుతున్నాను. ఇందులో భాగంగా అటవీ శాఖ సిబ్బంది స్థానికులతో స్నేహపూర్వకంగా మెలగాలి” అన్నారు.
@AndhraPradeshCM@HANUMAN_APGOV@PIB_India@APDeputyCMO