Learning from the best ❤️🥰
Afforestation is essential to mitigate the effects of climate change, and we are responsible to protect and preserve our natural resources.
రైతు భరోసా గోవిందా..
తులం బంగారం గోవిందా..
రైతు రుణమాఫీ గోవిందా..
రూ. 4,000 పింఛను గోవిందా..
మహాలక్ష్మి 2,500 గోవిందా..
ఆరు గ్యారంటీలు గోవిందా ..
కాంగ్రెస్ పార్టీ గోవిందా..
రేవంత్ రెడ్డి గోవిందా..
అంటూ ముగ్గులు వేసి నిరసన తెలిపిన అదిలాబాద్ జిల్లా, ఇచ్చోడ మండలం, ముఖ్రా కే గ్రామస్తులు.
6 గ్యారంటీలను నమ్మి మోసపోయామని,100 రోజులో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు అమలు చేయలేదని, రైతు భరోసా రూ. 15,000 ఇస్తానని చెప్పి రెండు సీజన్లు ఎగగొట్టాడు అని, రుణమాఫీ కాలేదని, ఆరు గ్యారంటీలు బోగస్ అయ్యాయని అన్నారు. రైతు భరోసా రాక పండుగ చేసుకునేదెట్లా అంటూ ఇంటి ముందు ముగ్గులు వేసి నిరసన తెలిపారు.
వందేళ్ల అభివృద్ధిని పదేళ్ల స్వల్ప కాలంలోనే చేసి చూపించి, తెలంగాణ దమ్మెంతో ప్రపంచానికి పరిచయం చేశాడు కేసీఆర్..
తెలంగాణ ప్రతి అడుగులో కేసీఆర్ సంతకం ఉంది. నువ్వెన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా, దాన్ని చెరపలేవు చిట్టి నాయుడు.
రేవంత్ సొంత ఇలాకాలో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన తండా వాసులు.
కొడంగల్‌లోని ఆర్బీ తండాలో ఫార్మా వద్దంటూ, మా పొలాలను నాశనం చేయొద్దంటూ ఆగ్రహం. ఆందోళన చేస్తున్న ప్రజలను అడ్డుకున్న పోలీసులు.
ప్రజలని హింసించడమేనా ప్రజాపాలన?
నేను రెండు నెలల గర్భవతి, నన్ను స్కానింగ్ కోసం తీసుకెళ్ళడానికి ఎవరూ లేరని రోడ్డుపై బైఠాయించిన బెటాలియన్ కానిస్టేబుల్ భార్య.
మా ఆయన బెటాలియన్ కానిస్టేబుల్. మాకు 19 నెలల బాబు ఉన్నాడు. ఇంట్లో మా అత్తమామలు వయస్సు పైబడ్డ వాళ్లు. కాంగ్రెస్ ప్రభుత్వ మొండి వైఖరి వల్ల ఎక్కువ డ్యూటీలు వేస్తుండటంతో నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి కూడా అవకాశం రావడం లేదు.
"ఈ బతుకు బతకడం కంటే సచ్చిపోవడమే మేలు" అంటూ బెటాలియన్ కానిస్టేబుల్ భార్య ఆవేదన వ్యక్తం చేసింది.
రకరకాల చార్జీల పేరిట పేద, మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచేందుకు కరెంటు చార్జీలు పెంచే కుట్ర చేస్తున్నది కాంగ్రెస్ సర్కార్.
అదనపు ఆదాయం కోసం ప్రజలపై రూ.18 వేల కోట్ల అదనపు భారం మోపాలన్న సర్కార్ ఆలోచన దుర్మార్గం.
విద్యుత్ అంటే వ్యాపారం కాదు..
రాష్ట్ర ప్రగతిని పరుగులు పెట్టించే ఒక రథ చక్రం.
విద్యుత్ సంస్థల బలోపేతం కోసం చేసే ఖర్చును భారంగా చూడడం కరెక్టు కాదు.. ప్రభుత్వం బాధ్యతగా చూడాలి.
- విద్యుత్ ఛార్జీల పెంపునకు సంబంధించిన ఈఆర్సీ సిరిసిల్లలో ఏర్పాటు చేసిన బహిరంగ విచారణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS