Dear @revanth_anumula anna, @battivikramarka sir @TelanganaCMO
We the Guest faculty working in Government Degree colleges across Telangana state humbly requesting you, pls pay our salary on 1st of every month as Junior Colleges guest faculty,outsourcing and contact employees.
ఎప్పటి నుంచో తనను చూడాలనుకుంటున్న ఓ అభిమాని కోరికను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు తీర్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం కామధేనువులంక గ్రామానికి చెందిన సత్యనారాయణ సీఎం చంద్రబాబుకు వీరాభిమాని. తమ నియోజకవర్గానికి చంద్రబాబు వస్తున్నారని, దూరం నుంచైనా ఆయన్ను చూడాలని మాట్లాడిన వీడియో వైరల్ అయ్యి సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లింది. సత్యనారాయణ గారూ సిద్ధాంతంలో కలుద్దాం అని సీఎం రిప్లై కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ (మీ భూమి – మీ హక్కు) కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్దాంతం వెళ్లిన సీఎం చంద్రబాబు కార్యక్రమం అనంతరం తన బస్సులోకి సత్యనారాయణను ప్రత్యేకంగా పిలిపించుకున్నారు. కాసేపు ఆత్మీయంగా మాట్లాడి కుటుంబ వివరాలు, ఆరోగ్యం గురించి ఆరా తీశారు. తన కుమారుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడని, అతనికి వైద్యసాయం అందించాలని సత్యనారాయణ కోరారు. తమ గ్రామానికి డ్రైనేజ్ సదుపాయం కల్పించాలని విన్నవించారు. ఆ సమస్యలపై భరోసా ఇచ్చి సత్యనారాయణకు ఇల్లు కూడా నిర్మించి ఇవ్వాలని కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు.
#AndhraPradesh
చిరంజీవి హీరోగా హిట్లర్ సినిమా వచ్చింది. ఆ హిట్లర్ అర్థం వేరు. రెండో ప్రపంచ యుద్ధం తెచ్చిన నియంత హిట్లర్ కు, జన బాహుళ్యంలో ఉన్న హిట్లర్ కు తేడా ఉంది.
- మంత్రి శ్రీధర్ బాబు
#Revanthreddy#Chiranjeevi#Hitler
@cryptomemes190@revanth_anumula@Min_SridharBabu@RahulGandhi CM anna we have worked a lot for bringing our praja prabhutvam in to power anna but atleast not considering our small requests which are not impacting on finance anna. Pls look into our problem anna, justice possible only with you anna 🙏 @mpponguleti
ఇవాళ రాజీవ్ వర్థంతి యాదిలో...
నాకు నా రాజీవ్ ని తిరిగి ఇవ్వండి..
నేను తిరిగి వెళ్లిపోతాను.
అలా తిరిగి ఇవ్వకపోతే నన్ను కూడా తాను కలిసిన ఈ మట్టిలోనే కలిసి ఇక్కడే చనిపోనివ్వండి..
-సోనియా గాంధీ
ఏం జరిగిందో మీకు తెలియదు.
నేను ఎలా కలిసానో కూడా తెలియదు.
ఆ చిరునవ్వు, ఎత్తు, ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించే ఆ కళ్ళు, ఆ తేజస్సు. నేను మొదటి సారి తనని చూసినప్పుడు ఎంత సేపు చూసానో నాకే తెలియదు.
నాతోటి మిత్రుణ్ణి అడిగాను ఇంత అందంగా వున్నాడు ఎవరు ఈయన అని. అతడు భారతీయుడు, పండిట్ నెహ్రు గారి కుటుంబం అని సమాధానం చెప్పాడు. నేను అలానే చూస్తూ ఉండిపోయాను.
మరుసటి రోజు నేను భోజనానికి వెళ్ళినప్పుడు, ఆయన కూడా అక్కడ ఉన్నాడు. ఆ రోజులు ఎంత సంతోషంగా వుండెనో, అదొక స్వర్గం. మేము నదుల వెంట తిరుగుతూ, కారులో డ్రైవ్ చేసుకుంటూ, చేతులలో చేతులతో వీధుల్లో నడుస్తూ, సినిమాలు చూసాం. మేము ఒకరికొకరం అసలు ప్రేమను వ్యక్తపరిచినట్టు నాకు గుర్తు లేదు అయినా అవసరం లేదు, ప్రతిదీ సహజమైనది, మేము ఒకరికోసం ఒకరు పుట్టారనుకున్నాం. అప్పుడే మేము కలిసి జీవించాల్సిన సమయం వచ్చింది అని నిర్ణయించుకొన్నాం.
ఇందిరాగాంధీ గారు ప్రధాని అయ్యారు. ఇంగ్లాండ్ వచ్చినప్పుడు రాజీవ్ ఇందిరాగాంధీ గారితో కొంచెం భయస్తులుగానే ఉన్నారు.
మేము వివాహ చేసుకోవాలంకుంటున్నాం అని దానికి మీ అనుమతి కావాలని ఆడిగాం. దానికి ఇందిరా గారు మమ్మల్ని భారతదేశానికి రావాలని కోరారు.
భారతదేశం, నేను ప్రపంచంలోని ఏ మూలలోనైనా రాజీవ్‌తో కలిసి ఉండవచ్చు అనే ధైర్యం నాకుండేది. ఇందిరాజీ పెళ్లిలో నెహ్రూజీ బహుకరించిన గులాబీ చీర నాకిచ్చారు. అది నేను ధరించాను. నేను, రాజీవ్ ఒక్కటయ్యము, నాకల నిజమైన వేల, ఎన్నో ఆశలతో నేను, రాజీవ్ ఇద్దరం కలిసి కొత్త జీవితం ఆరంభించి, నేను ఇక్కడే ఉండిపోయాను.
రోజులు ఎలా గడిచాయో అసలు గుర్తులేదు. రాజీవ్ సోదరుడు విమాన ప్రమాదంలో మరణించారు. ఇందిరాజీకి మద్దతు అవసరం. రాజీవ్ రాజకీయాల్లోకి రావడం ప్రారంభించాడు.
నాకు నచ్చలేదు. శాయశక్తులా ఆపగలగిన ప్రతి ప్రయత్నం చేసిన. కానీ మీరు భారతీయులు తల్లి ముందు భార్య మాటను ఎక్కడ వింటారు. అతను రాజకీయాల్లోకి వెళ్ళాడు.అతను వెళ్ళినాక నాకు సమయం కేటాయించడమే తగ్గింది. అయిన దేశం కోసం కష్టపడుతున్నాడు, పేద ప్రజల అవసరాలు తీరుస్తాడు అనుకోని సర్దుకున్న.
అంత బాగుంది అనుకునే సమయంలో ఒక రోజు ఇందిరాజీ బయటకు వచ్చినప్పుడు కాల్పుల శబ్దం వినిపిచ్చింది.
బయటకువచ్చి చూస్తే రక్తపు మడుగులో ఇందిరాజీ. ఆసుపత్రికి తీసుకెల్లేలోపల నా చేతులు రక్తపు ముద్దలో తడిసిపోయింది. చివరకు నాచేతిలోనే ప్రాణాలు విడిచారు. మీరు ఎప్పుడైనా చావుని ఇంత దగ్గరగా చూసారా?
రాజీవ్ పూర్తిగా దేశానికి చెందినవాడు. నేను కూడా తనతో ప్రతి అడుగులో ఉన్నాను. తర్వాత మా ఆయనను అలానే పొట్టనబెట్టుకున్నారు. ఒక రోజు, అతని ముక్కలైన శరీరం కూడా ఇంటికి తిరిగి వచ్చింది. ముఖం బట్టతో కప్పబడి ఉంది.
నవ్వుతున్న, గులాబీ ముఖం లోథాకు తిరిగి వచ్చింది. ఈ రోజు, నా ఇంట్లో ఒకరు కాదు ఇద్దరు కుటుంబ సభ్యులను కోల్పోయాను.
ఈ దేశం నాది, నా దేశంతో మాత్రమే ఈ ప్రేమను పంచుకోనివ్వండి. నేను అతని చివరిసారిగా చూసిన ముఖాన్ని మరచిపోవాలనుకుంటున్నాను. మొదట చూసిన ఆ రెస్టారెంట్, ఆ సాయంత్రం, ఆ చిరునవ్వు ఉంది చూడండి అది మాత్రమే గుర్తుంచుకోవాలనుకుంటున్నాను. నేను ఈ దేశంలో రాజీవ్ తో ఎక్కువ సమయం గడిపాను. రాజీవ్ లేకుండా ఇంకా ఎక్కువ సమయం గడిపాను.
ఒక గురుతర బాధ్యతను పోషించాను. అధికారం ఉన్నంత వరకు, అది అతని వారసత్వాన్ని బద్దలు కొట్టకుండా నిరోధించాను. అది ఈ దేశ శ్రేయస్సు యొక్క అత్యంత అద్భుతమైన క్షణాలను ఇచ్చింది. ఇల్లు మరియు కుటుంబాన్ని నిర్వహించాను. పరిపూర్ణమైన జీవితాన్ని గడిపాను.
నేను నా పని చేశాను. రాజీవ్‌కు ఇవ్వని వాగ్దానాలను కూడా పరిష్కరించాను.
ప్రభుత్వాలు వచ్చి వెళ్తాయి. ఇప్పుడు ఈ పరాజయాలు నాకు తేడా కలిగిస్తాయని మీరు అనుకుంటున్నారా? మీ దుర్వినియోగం, విదేశీయుల బహుమతి, బార్ బాలా, జెర్సీ ఆవు, వితంతువు, స్మగ్లర్, డిటెక్టివ్…అనే మాటలు, ఒక టీవీ ఛానెల్ నాపట్ల తప్పుగా ప్రవర్తించడం, ట్విట్టర్ మరియు ఫేస్బుక్లో అనియంత్రిత పోకడలతో తిట్లు.. అవి నన్ను బాధపెడుతున్నాయా? లేదు. అవంటున్న వారిమీద ఖచ్చితంగా నాకు జాలి వేస్తుంది.
గుర్తుంచుకోండి. ప్రేమించబడిన వారి శవాన్ని చూడటం ఎంత బాధగా ఉంటుందో. చాలా బాధ పడ్డాను. తరువాత మనస్సు రాయి అయ్యింది. అయితే మీరు నన్ను ఇంకా ద్వేషిస్తున్నారు.
నేను ఈ రోజే తిరిగి వెళ్ళిపోతాను. కానీ నా రాజీవ్‌ను తిరిగి ఇవ్వండి. మీరు తిరిగి ఇవ్వకపోతే, శాంతియుతంగా, నన్ను రాజీవ్ చుట్టూ, ఈ మట్టిలో ఇక్కడే కలిసి పోనివ్వండి.
(సోనియా గాంధీ లేఖ నుండి సారాంశం)