యుద్ధంలో చావో రేవో లెక్క తేలే వరకు వెనుదిరగని దార్కారిగాణ్ణి..
అయినప్పటికీ నేను పిరికోణ్ణి..
నేస్తమా..
మంచోడి పిరికితనం చేతగాని లక్షణం కాదు..
చెడ్డోడిపై పంజా విసిరే ఆయుధమని మరువరాదు !
పిరికితనాన్ని పరార్ చేసే ఈ అక్షరమాల..
ప్రతి పిరికోడికి అంకితం✨🧘🏻♂️
- పాలమాకుల శ్రీనివాస్ ✍🏻
99 శాతం ఇలాంటోళ్లే.. మీరు అలాంటోళ్లేనా..!
వినండి.. చదవండి.. చెప్పండి
🤷🏻♂️'పిరికోణ్ణి'..దార్కారిగాణ్ణి కూడా🏋🏻
నేను చాలా చాలా పిరికోణ్ణి..
'తేడాసింగ్'లంటే గజగజ వణికేంత పిల్లిలాంటోణ్ణి..మాటలతో కొట్లాటలు, చేతలతో ఘర్షణలంటే విపరీతమైన భయమున్నోణ్ణి..!
🇮🇳ఈ దేశం ఫలానది ఇస్తానని చెప్పదు. అవకాశం మాత్రం కల్పిస్తుంది. సద్వినియోగం చేసుకుంటే సమాజం కీర్తిస్తుంది. దుర్వినియోగం చేసుకుంటే దుఃఖం ముంచెత్తుతుంది
మహనీయుడు మహాత్మాగాంధీ చూపిన మార్గం అనుసరణీయం. ఆచరించిన జీవన విధానం ఆచరణీయం. జాతిపిత జయంతి శుభాకాంక్షలు✨
-పాలమాకుల శ్రీనివాస్✍🏻
స్ఫూర్తి ప్రదాత జయంతి
జై 'జవాన్'..జై 'కిసాన్'అని నినదిస్తూ, భారత ప్రధానిగా విధులు నిర్వర్తించిన మహనీయుడు లాల్ బహదూర్ శాస్త్రి. నిగర్వి,నిరాడంబరుడైన ఆయన జీవన విధానం తరతరాలకు స్ఫూర్తిదాయకం. అత్యున్నత హోదా అలరించినా..అతి సాధారణ జీవితం గడిపిన లాల్ బహదూర్ శాస్త్రి చరిత అనిర్వచనీయం.
🤷🏻♂️మానేరులో జల విహారం చేయాలి...సిరిసిల్ల పర్యాటకంగా మరింత వికసించాలి. ప్రపంచ పర్యాటక దినోత్సవం శుభాకాంక్షలతో..💐
- పాలమాకుల శ్రీనివాస్,
పుట్టింది, పెరిగింది, ఎదిగింది మానేరు ఒడ్డునే..నేనూ సిరిసిల్ల నేల బిడ్డనే
🇮🇳✨'నా ప్రాణమా..తెలంగాణమా. సర్వంగా 'సెల్యూట్'✨🇮🇳
మంచి కోసం ప్రాణం ఇస్తా,
ప్రాణాన్ని పణంగా పెట్టి చెడుపై పోరాడుతా.
నిజాయితీ కోసం నిలబడుతా, ధర్మం కోసం తలపడుతా.
పోరాటం నాకు కొత్త కాదు, భయపెడితే లొంగే రకం కానే కాదు.
భయపెట్టి బతకడం చేతకాదు,
బానిసగా బతకడం అలవాటే లేదు.
అణచివేత నుంచే తిరుగుబాటు పుడుతుంది,
ఉద్యమ కెరటమై ఎగిసిపడుతుంది..
ఆ ఉద్యమ కెరటం నేనే అవుతా.
వివేకం నా బలం,
వినయం నా ఆభరణం,
తేడా వస్తే తిరుగుబాటు బావుటా ఎత్తే తొలి వీరుడిని అవుతా.
విలీనమా, విమోచనమా, విముక్తా, జాతీయ సమైక్యతా దినోత్సవమా, ప్రజాపాలనా దినోత్సవమా.. పేరేదైనా సరే..
🌹✨ కాకా తో కేక..వారూ మెగాస్టారే! ✨🌹
ప్రజారాజ్యం స్థాపించిన కొత్తలో... ఆ పార్టీ అధినేత మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్ కూడా ఆ రోజుల్లో మీడియాలో మెగాస్టారే! అంత క్రేజ్ ఉండేది.
2009లో మెదక్ జిల్లాలో చిరు చేసిన 3 రోజుల ప్రజా అంకిత యాత్రలో...
🌹✨ప్రజారాజ్యంఅధినేతగా మీరు (చిరంజీవి గారు)మెదక్ జిల్లాలో పర్యటించారు.దుబ్బాకలో సభముగియగానే ఈటీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అది చేసిన జర్నలిస్ట్ (పాలమాకుల శ్రీనివాస్)నేనే. ఆ మధురజ్ఞాపకం ఇదే. @KChiruTweets గారు పుట్టినరోజు శుభాకాంక్షలు. తిరుమల శ్రీనివాసుడి దివ్యాశీస్సులు🌹✨