తెలంగాణ కాంగ్రెస్ పార్టీ యాదవులకు,బహుజనులకు బద్ద వ్యతిరేకమా..? ఈశ్వరమ్మ యాదవ్ పై కాంగ్రెస్ పార్టీ నాయకుడు శివచరణ్ రెడ్డి దారుణం గా అవమానించడాన్ని BC SC ST JAC తీవ్రంగా ఖండిస్తుంది, వ్యతిరేకిస్తుంది.వెంటనే శివచరణ్ రెడ్డి ఈశ్వరమ్మ కి తెలంగాణలోని యాదవలందరికి బహిరంగ క్షమార్పణలు చెప్పాలని,అదే సమయం లో శివచరణ్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుండి శాశ్వతం గా బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే శివచరణ్ రెడ్డి బయట అడుగు పెట్టనివ్వం అని హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు రెడ్డి సంఘాల jac వైఖరి ఏమిటో తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నాం.
@INCIndia@Bmaheshgoud6666
#BCSCST
#TPCC
#Revathreddy
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంకన్న మృతదేహానికి అధికార లాంఛనాలతో దహన సంస్కారాలు చేయాలి.
నిన్న విధినిర్వహణలో ఉన్న మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ ముద్దోజు వెంకన్న పైకి బొగ్గు లారీ దూసుకొచ్చి మృతి చెందడం తీవ్ర బాధాకరం.ఈ వెంకన్న అట్టడుగు సామాజిక వర్గం నుండి ఎన్నో అణిచివేతల్ని ఎదుర్కొని వచ్చి ఒక అధికారి అయ్యాడు.ప్రభుత్వానికి ఒక సైనికుడిగా పనిచేస్తూ డ్యూటీ లో చనిపోయాడు. కాబట్టి ప్రభుత్వం వెంటనే అధికార లాంఛనాలతో దహన క్రియలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.ముఖ్యమంత్రి వెంటనే ఆ దిశగా.. చీఫ్ సెక్రటరీ కి ఆదేశాలు ఇవ్వాలి. ఆ కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి.హైదరాబాదులో ఒక ఇల్లు కోసం 500 గజాల స్థలం ఇవ్వాలి. మృతుడు వెంకన్న భార్యకు గ్రూప్ 1 క్యాడర్ ఉద్యోగం వెంటనే ప్రకటించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. మరణం పట్ల కొన్ని అనుమానాలు ఉన్నాయి కాబట్టి వెంటనే మెజిస్ట్రేట్ తో ఎంక్వైరీ వేసి విచారించాలి అని పైన పేర్కొన్న అన్ని డిమాండ్లను అమలు చేయాలని ప్రభుత్వాన్ని BC SC ST JAC & DSP డిమాండ్ చేస్తుంది.
@TelanganaCMO@revanth_anumula@Ponnam_INC
#DTOVenkanna
#Telangana
#BCSCST
అఖిల భారతీయ సంత్ రవిదాస్ ధార్మిక అధ్యక్షులు సుఖదేవ్ మహారాజ్ మరణం నాకు, DSP ఉద్యమానికి తీరని లోటు. గురువు గారు దశాబ్దానికి పైగా ఉద్యమానికి దారిదీపం గా ఉన్నారు..గురూజీ మీరు చూపిన రవిదాస్ ఆశయాలను మేము కొనసాగిస్తాం.
#Sukhdevmaharaj#Santravidas#Ravidasia
తెలంగాణ..మీడియా రంగం లో... సామాజిక,రాజకీయ ప్రగతి చక్రం గా మారిన "మన తొలి వెలుగు (M.T.V)చానల్" కి 2 వ వార్షికోత్సవ శుభాకాంక్షలు.ఈ ఛానెల్ అధిపతి రఘు గార్కి మరియు స్టాఫ్ కి కంగ్రాట్స్ & మీరు ఇలా శత వసంతాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను.
#ManaToliveluguAnniversary#JournalistRaghu
మార్చ్ 31 న జరిగే BC,SC,ST- JAC సభకు ఆహ్వానం
🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸
"మన హక్కుల కోసం - మన రాజ్యం కోసం" రాజీ లేకుండా పోరాడే వివిధ కుల సంఘాల నాయకులు, BC,SC,ST వేదికల లో పనిచేసే మిత్రులకు, పీడిత ప్రజల కోసం ప్రాణ సమానంగా పనిచేసే సోదరులందరికీ BC,SC,ST - JAC ఆవిర్భావ సభకు ఆహ్వానం పలుకుతున్నాం.
31. 3. 2025,2 pm న సుందరయ్య విజ్ఞాన కేంద్రం పెద్ద హాల్ , హైదరాబాద్ లో.. జరిగే సభకు తప్పక రండి. ఈ తెలంగాణలో ఒక నూతన మార్పులో భాగస్వాములమౌదాం.
"కొండ పైకి బండి ని లాగ గలిగే వారికే ఆహ్వానం."
#BCSCSTJAC
#Telangana
"HCU - కంచ గచ్చిబౌలి భూములను "... రాష్ట్ర ప్రభుత్వం తన వద్ద ఉంచుకున్నా లేదా వాటిని తెగనమ్ముకొన్నా అందులో BC,SC,ST లకు 90% వాటా ఇవ్వాలని BC,SC,ST - JAC డిమాండ్ చేస్తుంది. ఒకవేళ ఆ భూములు ప్రభుత్వం వద్ద ఉంటే అందులో 350 ఎకరాలు BC,SC,ST లకు పంచండి.
ఒకవేళ ఆ భూముల్ని 40, 000 కోట్లకు అమ్ముకుంటే అందులోనూ BC,SC,ST లకు 30,600 కోట్ల పైసల్ని పంచాలని డిమాండ్ చేస్తున్నాం. ఇదే కదా... రాహుల్ గాంధీ కుల గణన సిద్దాంతం. సంపదని అన్ని కులాలకు పంచండి. మేం ఇదే డిమాండ్ చేస్తున్నాం.
"పర్యావరణం - జీవ వైవిధ్యం" కోసం ఆ భూములను ఆ విధంగా నే ఉంచితే అది అభినందనీయం.
#HCUlands
#hcubiodiversity
ముందుగా జగ్జీవన్ రామ్ 117 వ జన్మదిన శుభాకాంక్షలు.
నాటి రాజ్య వ్యవస్థ లో జగ్జీవన్ రామ్..మన ప్రజల ప్రతినిధిగా,దౌత్య వేత్త గా చరిత్ర లో మిగలడానికి..కారణం తన గురువు, సమానత్వ ప్రబోధకుడు.. ఐన "సంత్ రవిదాస్ ఆరాధకుడు" కాబట్టే, అందుకే స్వాభిమాని గా ఎదిగి, ఆత్మగౌరవం తో వ్యక్తి నిర్మాణం పొంది, తను వున్న కాంగ్రెస్,జనతా పార్టీ ల అగ్రకుల వ్యవస్థలో ఉండి కూడా..తన లౌక్యం తో అణగారిన కులాలకు..దేశానికి సేవ చేయగలిగాడు,సందర్భానుసారం, అప్పుడప్పుడు తిరుగుబాటు వ్యక్తి గా కూడా మారి పోయి... చిట్ట,చివరికి అంబేడ్కర్ మార్గం లోకి పరివర్తన చెందాడు.తన లో ఇంత పెద్ద మార్పు రావడానికి .. సంత్ రవిదాస్ వాక్యాలే తన జీవిత సౌధానికి పునాది రాళ్ళు అయ్యాయి. అందుకే ..మన ఎస్సీ, ఎస్టీ, బీసీ ల రాజకీయ ప్రతినిధులకు జగ్జీవన్ రామ్, కొండలక్ష్మణ్ బాపూజీ,TN సదాలక్ష్మి... లు కొంతమేరకైనా ఆదర్శం కావాలి.
#BabuJagjivanRam
#BCSCST
#మల్లీశ్వరి ఆత్మహత్య కు కారకుడైన జాన్ రెడ్డి పై మర్డర్ కేసు నమోదు చేయాలి.
🔹🔸🔹🔸🔹🔸🔹🔸
నల్లగొండ జిల్లా,నిడమానూరు మండలం, బొక్కమంతల పాడు గ్రామానికి చెందిన మల్లీశ్వరి ని పెండ్లి చేసుకుంటానని నమ్మించి, ఎంతో కాలం సహజీవనం చేసి చివరికి ఆమెను మోసం చేసి వేరే పెళ్ళి చేసుకున్న జాన్ రెడ్డి పై మరియు అతని కుటుంబ సభ్యులపై వెంటనే మర్డర్ కేసు నమోదు చేసి తక్షణం అరెస్టు చేయాలి. ఈ విషయంలో వెంటనే జిల్లా SP, DSP జాన్ రెడ్డి పై చర్యలు చేపట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా భారీ ధర్నాలు నిర్వహిస్తాం.
మల్లీశ్వరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం, ఆ కుటుంబం ధైర్యంగా ఉండాలని కోరుతున్నాం . ఈరోజు, రేపు (ఏప్రిల్ 16 &17) జరిగే కొవ్వొత్తుల ర్యాలీ లో JAC , DSP నాయకులంతా పాల్గొనాలని తెలియచేస్తున్నాం.
#ArrestJanReddy
#NallagondaPolice
ఎదురెదురు కాల్పుల్లో ఎవరెవరు ఉన్నారు..?
🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔹
#తెలంగాణ#ఛత్తీస్గఢ్ సరిహద్దుల కర్రెగుట్టల లో పోలీసుల మధ్య జరుగుతున్న ఎదురు కాల్పుల్లోను మరియు అంతక ముందు కూడా జరిగిన ఎదురు కాల్పులలో ఇరువర్గాల వైపు చనిపోతున్నదంతా 99.99% ఆదివాసులు,అణగారిన వర్గాలే వున్నారు,ఇట్లా ఒకే సామాజిక & పేద వర్గాల లో ఎందుకు ఇంత భయంకరమైన అన్యాయం జరుగుతుంది అని ప్రపంచం ప్రశ్నించ లేకపోతుందీ..! అందుకే మా ప్రతిపాదన..అగ్ర నాయకత్వం లో వున్న అగ్రవర్ణ మావోయిస్టులు,అగ్ర భాగాన వున్న అగ్రవర్ణ పోలీసులు ఎదురెదురు గా నిలబడి ఎదురు కాల్పులు జరుపుకోండి. ఆదివాసి,అణగారిన వర్గాల మావోయిస్టులను,పోలీసులని వదిలిపెట్టండి ..అని "బీసీ,ఎస్సీ,ఎస్టీ JAC " డిమాండ్ చేస్తుంది.ఆదివాసీల సామాజిక వయసు చాలా చిన్నది..( ఆదివాసీల బయోలాజికల్ వయసు పెద్దదే కానీ వారి సామాజిక వయసు చిన్నది- they are socially minors ..)
భారతదేశ చరిత్ర లో జరిగిన ప్రతి యుద్ధం లో ఈ దేశ అణగారిన వర్గాల నెత్తురే ఏరులై పారుతుంది..వారి తలలే తెగి పడుతున్నాయి.
దీనికి ముగింపు ఎప్పుడు..?
#adivasi
#BCSCST
Who is battling in this crossfire?
🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔹
#Telangana#Chattisgarh Karregutta Border Counter-Firing
The exchange of fire between police forces is, like countless previous incidents, a tragic repetition of conflict predominantly involving Adivasis and other oppressed communities from both sides. This cycle of violence where 99.99% of those involved belong to socially and economically marginalized communities.
The world remains silent, failing to question why it is always the oppressed who are caught in the crossfire, why only one segment of society consistently bears the brunt of such injustice.
We BC, SC ,ST - JAC demand, Let the Maoists who operate under upper-caste leadership, and the police who embody and enforce upper-caste ideology, confront each other directly. Leave the Adivasis , the police and Maoists from oppressed backgrounds out of this battle.
The social age of Adivasis is minor (though biologically old, they are socially minor). In every war waged on this land, it is their blood that has soaked the soil, their heads that have rolled.
When will this torment end?
#Adivasi
#Telanganapolice
#BCSCST
రేపు..మీ #BRS ద్వారా ప్రభుత్వం ఏర్పడితే దాన్ని 90% అణగారిన వర్గాల ప్రజల చేతిలో #KCR పెడతారా..? 10% మంది లేని అగ్రకుల దొరల చేతి లో పెడతారా...? ఇది చెప్పి...మీరు ఎటు వైపు ఉంటారో తేల్చండి.. ఈ ప్రశ్న బీజేపీ,కాంగ్రెస్ ని కూడా అడుగుతున్నాం..రేపు తెలంగాణలో మీరు ఎక్కడకి తిరగాలన్నా...ఈ ప్రశ్న కి సమాధానం చెప్పే..అడుగు బయటకు వేయాలి. ఇదే "BC,SC,ST- JAC" చేయబోయే యుద్ధం
#Telangana
#BCSCSTJAC
కుల గణన - #అంబేడ్కర్ కల. ప్రజాస్వామ్యం, గణతంత్రం బతికి బట్టకట్టాలంటే.. కుల గణన జరిగి తీరాలని భావించింది మొదట అంబేడ్కర్. ఆయన ప్రతిపాదనలే ఇవి అన్ని..వీటన్నిటిని వ్యతిరేకించింది మొదట కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత రాజకీయ అనివార్యతతో రాహుల్ గాంధీ మత ఆధిపత్యానికి విరుగుడు గా కుల గణన దారిలోకి వచ్చాడు. దీన్ని చూసిన తర్వాత బీజేపీ, దారి లోకి వచ్చింది. ఐనా..కేవలం కుల గణన జరిగితే ఏమి రాదు...బూడిద తప్ప. కేంద్ర ప్రభుత్వం కులగణ న ద్వారా 90% మంది BC,SC,ST, మరియు మత మైనారిటీల లెక్క తేల్చి.. సంపద నీ,రాజ్యాన్ని పంచి పెడితే అప్పుడు ఒక విప్లవం వస్తుంది..దాన్ని "కుల గణన విప్లవం" అంటారు..ఏది ఏమైనా, కపట నాటక మైన..కథా కాలక్షేపమైనా కాంగ్రెస్,బీజేపీ లు అంబేడ్కర్ దారి లోకి రావటం..ఆహ్వానించ దగ్గ పరిణామం..ముక్కల,సుక్కల పంచాయితీ పక్కన పెట్టి ఇప్పుడు మన వర్గాలు అంతా అప్రమత్తంగా ఉండాలి. మన కులాల లెక్కల ,రెక్కల పంచాయితీ పట్ల.
#CasteCensus
#BCSCST
#Ambedkar
Caste Census: Ambedkar’s Dream
Caste census is not just an administrative tool — it is the lifeblood of both democracy and republicanism.
🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔸🔹
Dr. B.R. Ambedkar was the first to assert that unless caste enumeration takes place, democracy cannot truly survive or function meaningfully.
Every current demand in this direction finds its roots in his foundational proposals.
It was the Indian National Congress that initially opposed these ideas.
But driven by political necessity, Rahul Gandhi eventually adopted the caste census narrative — as a counter to rising religious majoritarianism.
Following this, even the BJP was compelled to enter the discourse.
Yet, mere enumeration alone will yield nothing — nothing but ash.
Only if the central government uses this data to equitably distribute wealth, resources, and power to the 90% — comprising BCs, SCs, STs, and religious minorities — will a real transformation occur.
That transformation deserves to be called “The Caste Census Revolution.”
Whatever the motive — whether political theatre or sincere reform — the fact that both Congress and BJP are now aligning, even partially, with Ambedkar’s path is a welcome shift.
#CasteCensus
#Ambedkar
#రేవంత్ రెడ్డి ని కోసి ఓట్ల ఉప్పు, కారం పెట్టండి
➖➖➖➖➖➖➖➖➖
నా దగ్గర అది ఉంది, ఇది ఉంది, గాడిద గుడ్డు ఉందని వెనుకటి కి ఎవడో చేతకానోడు పెళ్ళి చేసుకుని....చివరికి భార్య,పిల్లలకి తిండి పెట్టటానికి,గంజి నీళ్ల పోయటానికి పైసలు లేవు అన్న డాట..అట్లా ఉంది "రేవంత్ రెడ్డి 420 హామీల పాలన" అందుకే రేవంత్ రెడ్డి ని కోసి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఓట్ల ఉప్పు,కారం కలిపి పెట్టి ఒట్టి తునకలు చేయండి,అందుకని సంపద సృష్టించటం చేతకాని ముఖ్యమంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
#RevanthReddy
#Telangana
BC,SC,ST JAC & ధర్మ సమాజ్ పార్టీ "ఆపరేషన్ సింధూర " సమరాన్ని స్వాగతిస్తుంది.
🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹
భారత ప్రభుత్వం తలపెట్టిన "ఆపరేషన్ సింధూర" సమరాన్ని 100% సమర్థిస్తున్నాం, స్వాగతిస్తున్నాం.
మన దేశంలో.. మన మధ్య ఏ రూపంలో నైనా,ఎన్ని రకాల విభేదాలు ఉన్న సరే భారతదేశ సార్వభౌమాధికారానికి...పరాయి దేశాల నుండి ప్రమాదం పొంచి ఉన్నప్పుడు దాన్ని మనమంతా కలసి ఎదుర్కోవాల్సిందే..దేశంలోని వారందరం ఆ యుద్ధం లోకి దిగాల్సిందే. అదే బాబాసాహెబ్ అంబేద్కర్ కు,దేశ హితం కోరిన అమర వీరులకు ఇచ్చే ఘన నివాళి. ఇది మనందరి విధానమైవుండాలి. ఈ క్రమం లో పాకిస్తాన్ పై మన దేశం చేస్తున్న యుద్ధంలో.. బాధ్యతగల భారతీయ పౌరులుగా, బాధ్యత కలిగిన ఉద్యమంగా మా "BC,SC,ST JAC" & "ధర్మ సమాజ్ పార్టీ" నుండి పదివేల మంది కార్యకర్తల సైన్యాన్ని భారత ప్రభుత్వ మిలటరీకి అందజేస్తాం.
మా దేశభక్తి ని, భారత రాజ్యాంగం పట్ల ఉండే మా నిబద్ధతిని చాటుకుంటాం. భారత మిలిటరీలో ఏ రెజిమెంట్ కల్నల్ కు ఐనా మా కార్యకర్తల్ని అప్పజెప్తాం. అని వాగ్దానం ఇస్తున్నాం.
#OperationSindhoor
#IndianArmy
BC, SC, ST JAC and Dharma Samaj Party Extend Full Support to Government of India’s “Operation Sindoor”
The BC, SC, ST Joint Action Committee (JAC) and the Dharma Samaj Party wholeheartedly welcome and extend their unwavering support to the Government of India’s military initiative, “Operation Sindhoora.”
We believe that, irrespective of our internal social, regional, or ideological differences, when India’s sovereignty is under threat from foreign powers, it is our united duty as citizens to stand together in defense of the nation. Our collective response must transcend all divisions when national security is at stake.
This unity in purpose and action is the true homage we can offer to Dr. B.R. Ambedkar and the countless martyrs who sacrificed their lives for the integrity and progress of our country. Their legacy reminds us that national interest must always come first.
In this spirit, the BC, SC, ST JAC and Dharma Samaj Party are proud to announce our commitment to the national cause by pledging a volunteer force of 10,000 dedicated cadres to support the Indian Armed Forces in “Operation Sindhoora.” As responsible citizens and a patriotic movement, we stand ready to serve.
We express our deep sense of nationalism and unwavering dedication to the Constitution of India. We are prepared to place our volunteers under the command of any regiment or colonel designated by the Indian military, in service of our motherland.
#OperationSindoor
#IndianArmy
బుద్ధ లైఫ్ స్టైల్
🔹🔸🔹🔸🔹🔹
బుద్ధుడు దేవుడు కాదు,ఆయనది మతమూ కాదు,తనది ఆధ్యాత్మిక వాదం అంతకన్నా కాదు. బుద్ధుడు..ఒక సంపూర్ణ మానవుడు,మానవు ల దుఃఖ నిర్మూలన కోసం సంఘాన్ని కట్టి,అంధకారం లో వున్న మనందరి కోసం మార్గదాత గా,దీప స్థంభ మై నిలిచిన వైతాళికుడు. ఆయన మనకు ఒక హేతు బద్ధమైన జీవన విధానం అందించాడు. బుద్ధుడి మార్గం లో నడవడం అంటే బుద్ధుడిని సజీవంగా నిలిపి ఉంచడమే.
అసలు విషయం..!
1)బుద్ధుడి వాక్యం ద్వారా పరివర్తన చెందాల్సింది "నీతి, న్యాయం, ధర్మం తో" బ్రతికే కటిక పేదలా.. ?
బల హీనుల్ని..దోపిడీ చేసే అగ్రవర్ణ, అగ్రవర్గ పాలక సమాజమా.. ?
2) పంచశీల బాటలో నడవాల్సింది కేవలం పంచములేనా..? పాలక వర్గ సమాజము...కూడానా...!
3) కోరికలు లేని జీవితం గడపాల్సింది కోట్ల కు పడగలెత్తిన కులీన వర్గమా ?
రెక్కలు ముక్కలు చేసుకునే కూలీ వర్గమా.. ?
తెలిసో తెలియకో నాలో ఉదయిస్తున్న ఈ ప్రశ్నల కు .. బుద్ధుడి జయంతి సందర్భంగా తెలియ జేసి.. ఈరోజే ..నాకు బుద్ధి నేర్పండి.
(ప్రపంచం లో ఏ దేశం లో నైనా..సామాజిక,సాంస్కృతిక విప్లవ తాత్వికులు పుడితే..వారిని ఆ దేశం లోని ఉన్నత వర్గాలు,పాలక వర్గాలు అనుసరించి హృదయ పరివర్తన చెంది,వారి ప్రవర్తన లో మార్పు తెచ్చుకుంటారు,వారి దగ్గర పోగు పడ్డ సంపదని పంచుతారు..మన దేశం లో మాత్రం బుద్ధుడి లాంటి వారి మార్గం లో పంచములు,పేదలు,పీడిత వర్గాలు అనుసరిస్తారు కానీ... గుట్టలు,గుట్టలుగా పోగుపడ్డ సంపదని పంచాల్సిన ఉన్నత వర్గం,ఉన్నత వర్ణం మాత్రం బుద్ధుడి మార్గం లోకి రారు. అంతే కాక సమానత్వం బోధించిన..ఆధ్యాత్మిక ఏసు క్రీస్తు ..దారి లోకి కూడా పేదలే వెళతారు కానీ,పెద్దలు వెళ్లరు. సమాజం లో...పరివర్తకుల ఉద్యమం వెంట.. పేదలు నడిస్తే సమాజం మారే అవకాశం ఉండదు, పెద్దలుగా చలామణి అవుతున్న వారు కూడా ఆ దారిలో నడవాలని నా భావన..)
బుద్ధ జయంతి శుభాకాంక్షలు..!
#BuddhaJayanti
#buddhapurnima2025