ఇది గొడ్డలి పార్టీ సంస్కృతి..!
సొంత చెల్లి కట్టుకునే చీరల గురించి, మహిళలు వేసుకునే మేకప్ గురించి హేళనగా మాట్లాడటానికి సిగ్గుండాలి. మీ ఇంట్లో కూడా మహిళలు, ఆడపిల్లలు ఉన్నారు. మేకప్ వేసుకుంటే వారిని కూడా ఇలాగే హేళన చేస్తారా YS Jagan Mohan Reddy ? లేక దళిత మహిళలు అంటే మీకు చులకనా?
ఈ అహంకారానికే, ఈ గుడ్డు కథలకే ప్రజలు మీకు "గుడ్డు" పగలగొట్టారు. బుద్ధి తెచ్చుకుని మహిళలను గౌరవించడం నేర్చుకోండి. లేదంటే ఈసారి మరో "గుడ్డు" కూడా ప్రజల చేతుల్లోనే పగులుతుంది.
#YCPinsultsWomen
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh
అప్పట్లో రాజధాని పై, ఈ రోజు డీఎస్సీ పై కుల ముద్ర..
రాజధాని అమరావతి పై కేవలం ఒక్క కులం వారే ఉన్నారని గొడ్డలి పార్టీ విషం చిమ్మింది.. వాస్తవం చూస్తే, ఎక్కువ మంది దళితులు ఉన్నారు, రెడ్లు ఎక్కువ ఉన్నారు..
#DSCFakesByYCP#PsychoFekuJagan#AndhraPradesh
నేడు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం
పిల్లల నవ్వుల్లోనే దేశ ప్రగతి దాగి ఉంది. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం.. ప్రతి ఒక్క చిన్నారికి ఉజ్వల భవిష్యత్తును అందిద్దాం.
#WorldDayAgainstChildLabour#SaveChildhood
రెండేళ్ల కూటమి పాలనలో విధ్వంసం నుండి వికాసానికి ఆంధ్రప్రదేశ్. కూటమి పాలన అంటే అదుపు తప్పిన వ్యవస్థలను గాడిన పెట్టిన అంకుశం. రెండేళ్ల కూటమి పాలనలో సంక్షేమం సూపర్ హిట్... అభివృద్ధి మెగా హిట్. అన్నిటినీ మించి రెండేళ్ళలో ప్రజల నమ్మకాన్ని సంపాదించింది కూటమి పాలన. ఇదే అతిపెద్ద ఘనవిజయం.
#2YrsOfTrustDevelopmentWelfare
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
అద్భుతమైన సంక్షేమం, తిరుగులేని అభివృద్ధితో భారతదేశాన్ని ప్రగతి పథంలో అగ్రగామిగా నిలుపుతూ...
తిరుగులేని ప్రజామోదంతో, స్వతంత్ర భారత చరిత్రలో ఎన్నికల ద్వారా ఎన్నుకోబడి, అత్యధిక కాలం (4,399 రోజులకు పైగా) ప్రధానిగా సేవలందిస్తూ సరికొత్త రికార్డు సృష్టించిన గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక అభినందనలు.
మీ స్ఫూర్తివంతమైన నాయకత్వంలో భారతదేశం మరిన్ని విజయ శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. #NarendraModi
సత్తెనపల్లి పట్టణం కాకతీయ కల్యాణ మండపంలో నియోజకవర్గ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, క్లస్టర్ & యూనిట్ ఇన్చార్జిలు, బీఎల్ఏలతో నిర్వహించిన శిక్షణ సమావేశంలో పాల్గొన్నాను.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం, ఓటరు జాబితాల నవీకరణ, కొత్త ఓటర్ల నమోదు, స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశాము.
ప్రతి బూత్‌లో 100% కవరేజీతో పనిచేసి, కూటమి అభ్యర్థుల విజయానికి అంకితభావంతో కృషి చేయాలని పిలుపునిచ్చాము.
#SIR #KannaLakshminarayana #ChandrababuNaidu #Sattenapalle #AndhraPradesh
ఉద్యోగ నియామకాల్లో స్పోర్ట్స్ కోటాను పూర్తిగా ఎత్తేయాలని జగన్ చూస్తున్నాడా?
ఇదే స్పోర్ట్స్ కోటాలో జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో నాకు సచివాలయంలో ఉద్యోగం వచ్చింది. ఈ రోజు అదే స్పోర్ట్స్ కోటాలో డీఎస్సీలో ఉద్యోగం వచ్చింది. ఆ రోజు తప్పు కాని స్పోర్ట్స్ కోటా, ఈ రోజు తప్పు ఎలా అవుతుంది?
#DSCFakesByYCP
#YCPFakeBrathuku
#PsychoFekuJagan
#AndhraPradesh
సత్తెనపల్లి పట్టణంలోని రఘురామ్ నగర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రజల నుంచి గృహాలు, పెన్షన్లు, వైద్యం తదితర అంశాలకు సంబంధించిన వినతి పత్రాలను స్వీకరించాము.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకొని, ప్రతి వినతిని సానుకూలంగా పరిశీలించి తక్షణ పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా కల్పించాము. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారమే మా ప్రధాన లక్ష్యమని తెలియజేశాము.
#Sattenapalli #AndhraPradesh
#KannaLakshminarayana #TDP
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సత్తెనపల్లి పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్ కేజీబీవీ పాఠశాలలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నాను.
పర్యావరణ పరిరక్షణ మనందరి సామాజిక బాధ్యత. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు చెత్తను వేరు చేసి నిర్వహించడం, పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగస్వాములు కావాలి.
ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని స్వచ్ఛందంగా తగ్గించి కాలుష్య నివారణకు సహకరించాలి. ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి దాని సంరక్షణ బాధ్యత తీసుకోవాలి.
అదేవిధంగా కాల్వలు, చెరువులు, చెక్ డ్యాంలను పునరుద్ధరించి నీటి నిల్వకు సిద్ధం చేయడం, భూగర్భ జలాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించడం అత్యవసరం.
“ఒక్క మొక్క – భవిష్యత్ తరాలకు గొప్ప బహుమతి”
#WorldEnvironmentDay #GoGreen #SaveEnvironment #Sattenapalli #KannaLakshminarayana #AndhraPradesh #GreenAndhraPradesh
శ్రీ మత్స్యఅవతార వేంకటేశ్వర స్వామి ఆలయం నూతన కమిటీ అభినందన సభ కార్యక్రమంలో పాల్గొన్నాను.
నూతనంగా ఎన్నికైన కమిటీ చైర్మన్ గారికి, సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశాను.
ఆలయ ప్రతిష్టను మరింతగా పెంచేలా, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా సేవాభావంతో పనిచేయాలని సూచించాను. స్వామివారి సేవ చేసుకునే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని కోరాను.
కూటమి ప్రభుత్వంలో దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ, ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధి కోసం మరింతగా కృషి చేస్తాము.
నమో వేంకటేశ్వర స్వామి! 🙏
#Sattenapalle #AndhraPradesh
#DSCFakesByYCP
ఐదేళ్ళలో ఒక్క ఉద్యోగ నియామకం కూడా చేయని జగన్ కి నియామకాలు ఎలా జరుగుతాయో అన్న అవగాహన లేదు. సుప్రీం కోర్టు ఆదేశాల మీద ఈ హారిజాంటల్ రిజర్వేషన్ ఇవ్వాలని 2023 ఆగష్టు 2వ తేదీన జీవో నెం.77 ఇచ్చిందే జగన్ ప్రభుత్వం. కేవలం రాజకీయం చేయడానికి మెగా డీఎస్సీలో సెలక్ట్ కాని అభ్యర్థులను ముందు పెట్టి యువతను తప్పుదారి పట్టిస్తున్నాడు.
#YCPFakeBrathuku
#PsychoFekuJagan
#AndhraPradesh
జూన్ 4, 2024... ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు. విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని నడిపించాలని ప్రజలు అపూర్వమైన తీర్పు ఇచ్చిన చారిత్రాత్మక దినానికి నేటికి రెండేళ్లు. ఆ విజయం మాకు అధికారం కాదు... రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు అప్పగించిన మహోన్నత బాధ్యత. ఆ బాధ్యతను గౌరవిస్తూ ప్రతి క్షణం ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యంగా రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, కార్మికులు సహా ప్రతి వర్గ సంక్షేమం కోసం పనిచేస్తున్నాం. అసమానతలు లేని సమాజం, అన్ని ప్రాంతాల అభివృద్ధి మా లక్ష్యం. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రాన్ని హెల్తీ, వెల్తీ, హ్యాపీగా చేయాలనేది మా సంకల్పం. నాటి తీర్పును గౌరవించేలా, ప్రజలు గర్వపడేలా పాలన సాగిస్తున్నామని వినమ్రంగా ప్రకటిస్తూ... మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు.
జై ఆంధ్రప్రదేశ్!
సత్తెనపల్లి రూరల్ మండలంలోని పెద మక్కెన గ్రామంలో
₹36లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామీణ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించము.,
అలాగే రైతులకు 50% సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
గ్రామాల అభివృద్ధి, రైతుల సంక్షేమం, మెరుగైన వైద్య సేవలే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఐదేళ్ల నిర్లక్ష్యం తర్వాత గ్రామాలు మళ్లీ అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయి. ప్రజల అవసరాలను గుర్తించి, పారదర్శకంగా ప్రజాస్వామ్య పాలన అందించడమే కూటమి ప్రభుత్వ సంకల్పం.
#Sattenapalli #ChandrababuNaidu #KannaLakshminarayana #AndhraPradesh
"ప్రజలలో అభద్రతా భావాన్ని కలిగించడానికి, శాంతి భద్రతలను భగ్నం చేయడానికి జగన్ రకరకాల కుట్రలు చేస్తున్నాడు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మాది గొడ్డలి పార్టీయే అని చెప్పుకుంటున్నారు. కత్తులు, కటార్లతో వస్తారంట. ఇక్కడున్నది సీబీఎన్. గుర్తుపెట్టుకోండి."
- గొడ్డలి పార్టీ రౌడీగాళ్లకు చంద్రబాబు గారి స్ట్రాంగ్ వార్నింగ్.
#PsychoFekuJagan
#ChandrababuNaidu
#AndhraPradesh
సత్తెనపల్లి నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నాను.
కండ్లగుంట గ్రామంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవి కుమార్ గారు, పల్నాడు పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ లావు కృష్ణదేవరాయలు గారితో కలిసి ఇంటింటికీ వెళ్లి అర్హులైన లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందించాము.
పేదల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ద్వారా లక్షలాది మంది నిరుపేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాము. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, సంక్షేమం మరియు అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకెళ్తున్నాము.
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, గ్రామాభివృద్ధి కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి. “తల్లికి వందనం” సహా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా నెరవేర్చుతున్నాము.
ప్రజల ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాము.
#PensionsPandugalnAP
#NTRBharosaPension
#IdhiManchiPrabhutvam
#Sattenapalli
#AndhraPradesh
సత్తెనపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
సత్తెనపల్లి నియోజకవర్గంలోని గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాలకు విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, సంబంధిత చైర్మన్లు, జాయింట్ కలెక్టర్ శ్రీమతి సంజనా సింహ గారు, ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మొత్తం కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. వాటిలో:
* ₹44 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం
* ₹1.20 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 3-ఫేజ్ విద్యుత్ సరఫరా వ్యవస్థ
* ₹26.50 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామీణ ఆరోగ్య కేంద్రం
* ₹11 లక్షల వ్యయంతో నిర్మించిన డంపింగ్ యార్డ్
* ₹30 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రంథాలయ భవనం
* ₹14 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు మరియు రిటైనింగ్ వాల్
* ₹8 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు మరియు కల్వర్ట్
* ₹17 లక్షల వ్యయంతో నిర్మించిన అంగన్వాడీ భవనం
* ₹10.50 లక్షల వ్యయంతో చేపట్టిన పశువుల ఆసుపత్రి ఆధునికీకరణ పనులు
ఈ సందర్భంగా మాట్లాడుతూ, గ్రామాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపాను. ఎంపీ శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో విద్య, ఆరోగ్యం, విద్యుత్ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
#IdhiManchiPrabhutvam
#Sattenapalle #Palnadu
#ఆంధ్రప్రదేశ్
నిన్నే గొడ్డలి పార్టీ భాగోతాన్ని 20 నిమిషాల్లో పట్టుకున్నాం..
నంద్యాలలో రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసింది వైసీపీ కార్యకర్తే. అయినా మేం 20 నిమిషాల్లోనే నిందితుడిని పట్టుకున్నాం. వైసీపీ వాళ్లే చేశారు కాబట్టే సాక్షి పత్రికలో ఆ వార్తను రాయలేదు. కేవలం సానుభూతి పొందడానికే ఈ కుట్ర పన్నారు.
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#ChandrababuNaidu
#AndhraPradesh
గుంటూరులో మా స్వగృహంలో నిర్వహించిన ఆత్మీయ డిన్నర్ మీట్లో మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
జిల్లా ప్రజా సమస్యల పరిష్కారంపై చర్చించాము. ఇన్చార్జ్ మంత్రి సహకారంతో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపాము. శ్రీ నారా లోకేష్ గారి పిలుపు మేరకు ప్రజల సమస్యల పరిష్కారమే మా లక్ష్యమని పేర్కొన్నాము.
“ప్రజా సమస్యల పరిష్కారమే మా ధ్యేయం.. అభివృద్ధి, పారదర్శక పాలనకే మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.”
#IdhiManchiPrabhutvam #Sattenapalle #Palnadu #AndhraPradesh