కొన్నాళ్ళ క్రితం విదేశీ మారక ద్రవ్యం ఆదా చేయాలని, చాలా మంది రాజకీయనాయకులు తమ వాహనాల సంఖ్య ను తగ్గించి ఫోటో లు పెట్టారు. కొంతమంది సైకిళ్లపై , బస్సుల్లో శాసనసభలకు వెళ్ళారు. ఆ ఫోటోలు వీడియోలు మాధ్యమాల్లో తిప్పారు. కానీ శాసన సభల నుండి వెనక్కి ఇంటికి సైకిల్ పై , బస్సుల్లో వెళ్ళే వీడియోలు నేనైతే చూడలేదు.
ఇంతకీ ఆ రాజకీయ నాయకులు ఇంకా ఆ ఫోటో/వీడియోల్లో కనబర్చిన కమిట్మెంట్ తో పొదుపుగా,విదేశీ ద్రవ్యం ఆదా చేస్తూ, ఒకటి/రెండు,కార్లకు మించ కుండా , సైకిళ్లపై,బస్సుల్లో వెళ్తూ అందరికీ మార్గదర్శకం గా ఉంటున్నారా?
మీకేమైనా తెలిస్తే తెలుపగలరు.
పార్లమెంటు ను చూడాలి
లోక్ సభ లోకి వెళ్ళాలి
అని
మీ కోరికా?!
సెప్టెంబర్ 5 న
#న్యూఢిల్లీ#పార్లమెంట్ లో నాకు ఆహ్వానం ఉంది
నా తో..
4,5 మంది రావచ్చు
ఆసక్తి ఉన్న వాళ్లు
వస్తా..
అంటే
Flight లో వెళ్ళి వద్దాం
అక్కడ
Western court లో బస
If?!
Intrested
Please DM
బిజినెస్ మన్ మంత్రి పక్కన ఉంటే ముఖ్యమంత్రి కూడా దోచుకొనే వాడే అనే బ్రాండ్ ఇమేజ్ ప్రభుత్వానికి తప్పదు.
గత ప్రభుత్వం కన్నా ఎలా మెరుగు అనే ప్రశ్న అర్బన్ క్లాస్ లో వస్తుంది.
మా ఆఫీస్ కొలీగ్స్ అంతా కేబీఆర్ పార్క్ వన్ వే పట్ల హ్యాపీ గా ఉన్నారు. వాహనాలు ఆగకుండా వెళ్తున్నాయట. దీన్ని ఎప్పటికీ కొనసాగిస్తే బాగుండు అంటున్నారు.
దీనివల్ల హెటెక్ సిటీ టూ ఐకియా ప్రజర్ కూడా తగ్గిందంట.
ఈ గిరి ప్రదక్షిణ వల్ల రోడ్ నంబర్ 36 కన్నా ముందు రోడ్ నంబర్ 45 రావడంతో సిటీ నుంచి గచ్చీబౌలీ వెళ్లే వాహనాలన్నీ రోడ్ నంబర్ 45లోనే లెఫ్ట్ తీసుకుంటున్నాయి.
దాంతో మేజర్ ఫ్లోటింగ్ ఐకియా దాటిన తర్వాత జాయిన్ అవుతోంది.
రిజిస్ట్రేషన్ అధికారులు లంచాలు అడగడం లేదు. మీ సర్వే నెంబర్ 22ఏలో ఉంది. అంటే ఆ సర్వేలో కొన్ని భూములలో తేడా ఉంది. కాబట్టి జిల్లా కలెక్టర్ నుంచి ఎన్వోసీ తెమ్మని అంటున్నారు. తృణమో ఫణమో ఇచ్చిన వారికి కలెక్టర్ ఎన్వోసీతో సంబంధం లేకుండా సదరు ప్లాట్ కి లిటిగేషన్ ఉందో లేదో చూసి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. జూబ్లీహిల్స్ లో 22ఏ కేసులు చాలా ఉన్నాయట. వాటిని చూసి చేయడం లో కష్టం ఉంది. రిస్క్ ఉంది. అందుకోసమే తృణమో ఫణమో. మంత్రికి విషయం అర్ధం అయ్యింది కానీ కోపం నటిస్తున్నారు. 😂
Once you visit random cities in China and come back to Indian streets, you realize how much you’ve been scammed by your local MLAs, MPs, IAS and the whole system.
సైజు
మావెరిక్ ఒక మాటన్నాడు టాప్ గన్ సినిమాలో , “ ఇట్స్ నాట్ ది ప్లేన్ బట్ ది పైలట్” అని, అంటే యుద్ధవిమానం ఎంత అధునాతమైనది అని కాదు దాని చోదకుడు ఎంత తెగించిన వాడు అన్నదాని బట్టి విజయం ఉంటుందని, కానీ కొంతమంది అంటారు, మరి టెండూల్కర్ చాలా బరువైన, లావైన బ్యాటు వాడాడు కదా, అతనికంటే పరుగులు ఎవరూ ఎక్కువ కొట్టలేదు కదా, మరి నా బ్యాటు సైజు బాగుండాలి అంటే పెద్దగా ఉండాలి అని కోరుకోవడం తప్పా అని అడుగుతారు.
కరెక్టే, కానీ దేనికోసం అంత లావు, పొడవు!? ఏం చేసుకుంటావ్? ఇప్పుడు టెండూల్కర్ అంటే అతనికి 150 పైన స్వింగులో బంతులేసే వాళ్లున్నారు, వాళ్ళని అడ్డుకోగలిగి ఆ బంతికి అంత మోమెంటం ఇవ్వాలని ఆ బరువు బ్యాటు వాడాడు, నడుము నొప్పి తెచ్చుకున్నాడు పాపం, అంతేగానీ యావరేజీ బౌలర్లకి యావరేజీ బ్యాట్స్మెన్లు సరిపోతారు. అసలు బ్యాటు సైజు కాదు ముఖ్యం నీ ఫుట్ వర్క్, స్టాన్సు, షాట్ సెలక్షన్, ఫీల్డింగ్ అసెస్మెంట్ ఇవన్నీ ముఖ్యం. ఇవేవీ లేకుండా బ్యాటు పట్టుకుని దిగితే టెయిలెండర్ వెంకటేష్ ప్రసాద్ లాగా కనిపిస్తావు.
ఇప్పుడు బ్యాటు సైజు మార్చడానికి కుదరదు, నువ్వు దేంతో పుట్టి పెరిగావో నీకు అదే ఉంటది. బ్యాటు కాదు ఆట మీద దృష్టిపెడితే పోటుగాడివి అనిపించుకుంటావు. ఇకపోతే పిచ్చు పరిస్థితి కూడా చూడాలి. డ్రై పిచ్చులు వెట్ అయ్యేవరకూ ఆగాలి, లేదంటే ఒట్టి దుమ్ము రేగి కళ్ళల్లో మంటలు వస్తాయి. కాసేపు అలా నెట్ ప్రాక్టీసు, అలాగే టెండూల్కర్ ఊరికే బంతి బంతికి మధ్యలో పిచ్చు మీదకొచ్చి బ్యాటుతో అక్కడకూడా కొడుతూ ఉంటాడు, అలాంటివి చెయ్యాలి. రావడం రావడం సెహ్వాగ్ అంటే కష్టం.
ప్రతీసారి స్కేలు పట్టుకుని కొలుచుకోవడం వలన మనసులో బెంగ పెరుగుతుంది కానీ బ్యాటు పెరగదు. ఉన్న బ్యాటుకే కొంత నెట్ ప్రాక్టీసు అదీ చేయించాలి, అప్పుడు మెయిన్ మ్యాచులో బ్యాటు సహకరిస్తుంది. బెంగ కూడా బాగా తగ్గుతుంది.
టెండూల్కర్ కి రమాకాంత్ అచ్రేకర్ అనే గురువు ఉండేవాడు, కానీ నీ బ్యాటింగ్ కి ఎవడూ గురువు ఉండదు, అంతా ట్రయిల్ అండ్ ఎర్రరే. కానీ ఏదో బ్యాటింగ్ బిట్లు చూసి నేర్చుకుందామంటే నీకు వాళ్ళలాగా ఫిట్నెస్, కండలు లేకపోతే నీకు కాళ్ళు, పిక్కలు పట్టేస్తాయి. చాలా అరుదుగా బ్యాట్ విరిగిపోవచ్చు కూడా, కొండనాలుకకి మందు వేస్తే ఉన్నానాలుక ఊడిపోయినట్లు. కాబట్టి బిట్లు బిట్లే, బ్యాటు బ్యాటే.
మరిలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటది రాహుల్ ద్రావిడ్ ఇన్నింగ్సు లాగా. ఏదో పాతకాలం క్రికెట్ అభిమానిని, కొత్త ఆటగాళ్ల గురించి పెద్దగా తెలీదు. మీరే కొత్త బ్యాట్స్మెన్లు. కొంచెం చూసి ఆడండి.
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
కష్టపడి పనిచేసేవాళ్ళకి ఆవకాశాలివ్వక దేశం నుంచి తరిమి కొట్టడానికి,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
ప్రభుత్వాన్ని ప్రశ్నించేవాడిని పెల్లెట్ బుల్లెట్లతో కాల్చడానికి,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
అయ్యేయస్సు ప్రొబేషన్‌లోనే అవినీతి చెయ్యడానికి,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
వెలితి లేకుండా అన్నిటినీ కల్తీ చేసి తినేందుకు,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
ప్రజాస్వామ్యం అంటూనే పిల్లల పరంపరకి అధికారాన్ని ఇచ్చుకునేందుకు,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
దూకుడుగా వచ్చి పడిపోయిన లారీని దొమ్మీచేసి దోచుకెళ్లడానికి,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
చట్టాన్ని చట్రంలో బంధించి చుట్టాలకి వాడుకోవడానికి,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
శాస్త్రీయ దృక్పథాన్ని శవంలా పాడెక్కించడానికి,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
దేశాన్ని పాలిస్తూ, పిల్లలకి విదేశీ పాలు తాగేందుకు పంపించడానికి,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
మానసిక రుగ్మతలను అమానవీయం అని ముద్రవేసి వార్తలు ముద్రించటానికి,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
వివేకాన్ని వదిలి వ్యక్తి పూజ చేసేందుకు,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
ప్రజలందర్నీ మత్తులో ముంచి, ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసేందుకు,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
సూక్ష్మ పరిశీలనని చిదిమేసి సూత్రాల్ని బట్టీకొట్టే చదువు నేర్పేందుకు,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
సాధ్యాసాధ్యాలను వదిలేసి సాధ్యమైనంత త్వరగా ఒక అభిప్రాయానికి వచ్చేసేందుకు,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
పెచ్చులూడిన రహదారులపైన పెక్కు జనాభాని ప్రమాదాల్లో చంపేందుకు,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
అభిమానాన్ని సొమ్ముచేసుకుని అణాకానీ వినోదాన్ని విసిరేసేందుకు,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
ఆటస్థలాలన్నీ కబ్జా చేసి కాంక్రీటు కోటల్ని కట్టేందుకు,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
న్యాయస్థానాలన్నీ నత్తనడకగా నడిచి న్యాయం మరిచేందుకు,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
ఈజ్ ఆఫ్ బిజినెస్ వదిలి, ఈసురోమని ఆఫీసుల చుట్టూ తిరిగేందుకు,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
భారీ తప్పిదాలకి కూడా బాధ్యత తీసుకోకుండా బాదరబందీ లేకుండా బ్రతికేందుకు,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
అస్థికలు, సగం కాలిన శవాలు, కర్మాగారాల వ్యర్థాలు అన్నీ మననదుల్లో వదిలేయడానికి,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
ఇది పక్కోడు పీల్చే గాలిలే అని పొగ అంతా వదిలేయడానికి,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
మనకొచ్చింది స్వాతంత్ర్యం.
- డా శ్రీకాంత్ మిర్యాల
ఎస్ఐఆర్లో అసలు కథ ఇప్పుడే మొదలు.. 62 లక్షల మందికి నోటీసుల వేట ఫారాలు సమర్పించిన ప్రతి నలుగురిలో ఒకరు 'అనుమానితులే' నీ తండ్రి నీ తండ్రేనని నిరూపించుకో.. 2002 నాటి బంధాన్ని కాగితంతో చూపించు ఏ కాగితం చెల్లుతుందో చెప్పని ఈసీ.. తెచ్చుకున్న సర్టిఫికెట్ 'తుది రుజువు కాదు' అంటున్న సీఈవో
ఓటరు జాబితా నుంచి 73 లక్షల పేర్లు తొలగిపోనున్నాయన్న వార్త రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. కానీ ఆ సంఖ్య వెనుక దాగిన అసలు కథ వేరే ఉంది. బీఎల్వో ఇంటికొచ్చినప్పుడు ఫారం నింపి ఇచ్చి, రసీదు భద్రంగా దాచుకుని, 'మా పని అయిపోయింది' అనుకుంటున్న 2.64 కోట్ల మందిలో 62 లక్షలకు పైగా ఓటర్లకు త్వరలో నోటీసులు రానున్నాయి. అంటే ఫారం సమర్పించిన ప్రతి నలుగురిలో ఒకరు మళ్లీ అధికారుల ముందు నిలబడి, తమ ఉనికిని కాగితాలతో నిరూపించుకోవాల్సిందే. తొలగిపోయిన 73 లక్షల మందికి కనీసం తమ పేరు పోయిందని తెలుస్తుంది. కానీ ఈ 62 లక్షల మందికి ముసాయిదా జాబితాలో పేరు కనిపిస్తుంది. ఆ పేరు పక్కనే ఒక ప్రశ్నార్థకం వేలాడుతుంది.
'అనుమానం' ఎలా పుట్టింది?
ఈ 62 లక్షల మందిని అనుమానితులుగా తేల్చింది ఏ అధికారీ కాదు. ఈసీఐ సాఫ్ట్వేర్. ఎన్యుమరేషన్ ఫారంలో ఓటర్లు రాసిన వివరాలను 2002 నాటి ఎస్ఐఆర్ జాబితాతో సరిపోల్చి, తర్కానికి అందని ప్రతి తేడానూ యంత్రం 'అనామలీ'గా ముద్ర వేసింది. ఆ తర్కం ఏమిటో చూస్తే తల్లిదండ్రులకూ సంతానానికీ మధ్య వయసు తేడా 15 ఏళ్లలోపు ఉంటే అనుమానం. 50 ఏళ్లు దాటినా అనుమానం. తోబుట్టువుల మధ్య తొమ్మిది నెలలలోపు వ్యత్యాసం ఉంటే అనుమానం. 2002 జాబితాలోని ఒకే వ్యక్తికి ఆరుగురికి మించి ఓటర్లు ముడిపడితే అనుమానం. అప్పటి జాబితాలో, ఇప్పటి జాబితాలో తండ్రి పేరు స్పెల్లింగ్ వేరుగా ఉన్నా అనుమానమే.
ఇక్కడే అసలు చిక్కు. 2002 జాబితాలు రాసింది కూడా మనుషులే. అప్పట్లో వయసులు అంచనాతో రాశారు. పేర్లు వినికిడితో రాశారు. 'యల్లయ్య' కాస్తా 'ఎల్లయ్య' అయ్యాడు. ఆ నాటి తప్పులకు ఈ నాటి ఓటరు ఇప్పుడు జవాబుదారీ. పైగా అసలు ఏ డాక్యుమెంటూ జత చేయకపోవడం, ఆధార్ ఒక్కటే జత చేయడం కూడా అనామలీల జాబితాలోనే ఉన్నాయి. దేశంలో అత్యంత విస్తృతంగా ఉన్న గుర్తింపు కార్డు ఒక్కటే ఉంటే అది అర్హతకు రుజువు కాదు, అనుమానానికి కారణం.
ఎవరిపై పడుతుంది ఈ భారం?
జిల్లాల వారీ లెక్కలు సమాధానం చెబుతున్నాయి. అనామలీల శాతంలో రాష్ట్రంలో అగ్రస్థానం వనపర్తిది . 28 శాతం. తర్వాత నిజామాబాద్, మహబూబ్‌నగర్. చెరో 27 శాతం. పాలమూరు కూలీలు, నిజామాబాద్ గల్ఫ్ బతుకులు. తరాలుగా ఊరు మారిన కుటుంబాల వద్ద 2002 నాటి రికార్డులు ఎక్కడుంటాయి? చదువురాని తల్లిదండ్రుల పేర్లు ఏ జాబితాలో ఎలా ఎక్కాయో తెలియని బిడ్డలు ఆ బంధాన్ని ఏ కాగితంతో నిరూపిస్తారు? సాఫ్ట్వేర్ తర్కం అందరికీ ఒకటే అయినా, దాని దెబ్బ మాత్రం పాత కాగితాలు లేని పేదల పైనే గురి చూసి పడుతోంది.
కాగితాల కోసం క్యూ.. కానీ ఆ కాగితమే చెల్లదట!
నోటీసుల భయం జనాన్ని ఇప్పటికే మీసేవా కేంద్రాల ముందు నిలబెట్టింది. ప్రభుత్వం జూలై 25న జీవో 172 ద్వారా తెచ్చిన ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ (ఎఫ్ఆర్సీ) కోసం రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 5.97 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఎస్ఐఆర్ నోటీసులకు జవాబుగా ఈసీఐ గుర్తించిన 12 డాక్యుమెంట్ల జాబితాలో ఎఫ్ఆర్సీ చేరడంతో జనం దాన్నే ఆసరాగా భావిస్తున్నారు.
కానీ ఇక్కడొక చేదు నిజం. రేషన్ కార్డు డేటాబేస్ నుంచి పుట్టిన ఈ సర్టిఫికెట్‌ను ఒంటరిగా తుది రుజువుగా అంగీకరించబోమని సీఈవో సుదర్శన్‌రెడ్డి స్వయంగా స్పష్టం చేశారు. ఈఆర్వో దాన్ని ఇతర రికార్డులతో సరిపోల్చి, అవసరమైతే అదనపు డాక్యుమెంట్లు అడుగుతారన్నారు. అటు బీజేపీ ఏకంగా ఎఫ్ఆర్సీని అసలు అంగీకరించవద్దని ఈసీకి లేఖ రాసింది. అంటే పేదవాడు క్యూలో నిలబడి తెచ్చుకుంటున్న ఏకైక కాగితం చెల్లుతుందో లేదో ఈఆర్వో దయపై ఆధారపడిన కాగితం.
మరో పక్క ఉత్తరప్రదేశ్‌లో ఇదే దశలో ఈసీఐ జాబితాలోని డాక్యుమెంట్లే కాదు, బంధుత్వాన్ని నిరూపించే ఏ కాగితాన్నయినా అంగీకరించారు. ఒడిశాలో అసలు కాగితాల జోలికి పోకుండా స్థానికుల సంతకాలతో 'పంచనామా' పద్ధతిలో ధృవీకరించారు. తెలంగాణ ఏ దారి? నోటీసుల పర్వం ఆగస్టు 17 నుంచి మొదలవుతుండగా, ఐదు రోజుల ముందు కూడా ఈ ప్రశ్నకు అధికారిక సమాధానం లేదు. 62 లక్షల మంది భవితవ్యం తేల్చే ప్రమాణం ఇంకా ప్రకటనకు నోచుకోలేదు.
ఈఆర్వోకు రోజుకు వందల కేసులు. విచారణ సాధ్యమేనా?
ఇక ఆచరణ లెక్క. నోటీసుల పరిష్కారానికి ఉన్న వ్యవధి ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 15 వరకు. 60 రోజులు. రాష్ట్రంలో నియోజకవర్గానికి ఒకరు చొప్పున 119 మంది ఈఆర్వోలు. 62 లక్షల కేసులను వీరిపై సమానంగా పంచితే ఒక్కో ఈఆర్వోకు సగటున 52 వేల కేసులు. రోజుకు దాదాపు 870. సహాయ ఈఆర్వోలు రంగంలోకి దిగినా, సెలవులు పోను ఒక్కో కేసుకు దక్కే సమయం నిమిషాల్లోనే. నోటీసు ఇవ్వకుండా ఏ పేరూ తొలగించబోమని సీఈవో హామీ ఇచ్చారు. అది చట్టబద్ధ రక్షణే. కానీ రోజుకు వందల కేసుల ఒత్తిడిలో ఆ 'విచారణ' ఎంత లోతుగా జరుగుతుంది? నోటీసు అందిందో లేదో ధృవీకరించే వ్యవస్థ ఏమిటి? అద్దె ఇళ్లు మారిన వారికి, పనుల కోసం ఊరెళ్లిన వారికి నోటీసు అందకపోతే. వారి వాదన వినకుండానే పేరు తొలగిపోదా? బిహార్ అనుభవం మరో హెచ్చరిక: అక్కడ గుర్తింపు పొందిన 12 పార్టీల్లో 11 పార్టీల బూత్ ఏజెంట్లు ఒక్క క్లెయిమూ దాఖలు చేయలేదు. పార్టీల నిఘా లేకపోతే, ఓటరు ఒంటరి పోరాటమే.
నోటీసు వస్తే ఏం చేయాలి?
ఈ గందరగోళంలో ఓటర్లు గుర్తుంచుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఆగస్టు 17న విడుదలయ్యే ముసాయిదా జాబితాలో తమ పేరు, వివరాలు సరిచూసుకోవాలి. ఫారం సమర్పించినప్పుడు తీసుకున్న రసీదును భద్రపరచుకోవాలి. నోటీసు అందితే నిర్ణీత గడువులోగా 2002 జాబితాలోని ఓటరుతో బంధుత్వాన్ని నిరూపించే డాక్యుమెంట్లతో ఈఆర్వో ముందు హాజరుకావాలి. ఎఫ్ఆర్సీతో పాటు వీలైనన్ని అదనపు ఆధారాలు (పాత ఓటరు కార్డులు, విద్యా ధృవపత్రాలు, భూమి రికార్డులు) సిద్ధం చేసుకోవడం మేలు. ఈఆర్వో నిర్ణయం అన్యాయమనిపిస్తే ప్రజాప్రాతినిధ్య చట్టం-1950 సెక్షన్ 24 కింద జిల్లా స్థాయి అప్పిలేట్ అధికారికి, ఆపై సీఈవోకు అప్పీలు చేసుకునే హక్కు ఉంది. తుది జాబితా అక్టోబర్ 19న వస్తుంది. అప్పటివరకూ ఏ దశలోనూ మౌనం పనికిరాదు.
తొలగిన 73 లక్షల గురించి రాజకీయ పక్షాలు గొంతు చించుకుంటున్నాయి. కానీ ఫారం ఇచ్చి కూడా బోనులో నిలబడనున్న ఈ 62 లక్షల మంది గురించి మాట్లాడేవారేరీ? జాబితా ప్రక్షాళన పేరుతో మొదలైన ఈ ప్రక్రియలో, తప్పు చేయని ఓటరుపైనే నిరూపణ భారం మోపడం ఎంతవరకు సబబు.
ఆసుపత్రి బిల్లుకు కళ్లెం వేసే రూలు.. 14 ఏళ్లుగా కాగితాల్లోనే!
రేట్ల శ్రేణి నిర్ణయించాలన్న Rule 9(ii)ని సుప్రీంకోర్టులో సమర్థించిన కేంద్రం.. అమలుపై మాత్రం చేతులెత్తేసిన రాష్ట్రాలు
ఒకే ఆపరేషన్‌కు ఒక ఆసుపత్రిలో లక్ష రూపాయలు.. మరో ఆసుపత్రిలో మూడు లక్షలు. ఏ ప్రాతిపదికన ఈ తేడా అని అడిగే దిక్కులేదు. ఇలాంటి ఇష్టారాజ్యపు వసూళ్లకు అడ్డుకట్ట వేయడానికే 2012లోనే ఒక నిబంధన వచ్చింది. వైద్య procedureలకు, సేవలకు కేంద్రం నిర్ణయించిన రేట్ల శ్రేణి (range of rates) లోపే ఆసుపత్రులు charge చేయాలన్నది Clinical Establishments (Central Government) Rules, 2012 లోని Rule 9(ii) సారాంశం. కానీ 14 ఏళ్లు గడిచినా ఆ రేట్ల శ్రేణిని ఇప్పటివరకు ఎవరూ నిర్ణయించలేదు. సమావేశాల మీద సమావేశాలు జరిగాయి.. ఒక్క రాష్ట్రం నుంచి కూడా concrete proposal రాలేదని కేంద్రమే సుప్రీంకోర్టుకు తాజాగా నివేదించింది.
కేసు ఏమిటి?
Rule 9(ii)ని సవాలు చేస్తూ All India Ophthalmological Society సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం వైద్య సేవలకు రేట్లు ఎలా నిర్ణయిస్తుందని 2024 ఏప్రిల్‌లో కోర్టు కూడా ప్రశ్నించింది. అయితే 2012 Rules పై stay లేదని, అవి అమల్లో ఉన్న చట్టమేనని 2025 ఆగస్టులో కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ affidavit దాఖలు చేసి నిబంధనను గట్టిగా సమర్థించింది.
రేట్ల శ్రేణి నిర్ణయిస్తే అన్ని ఆసుపత్రుల్లో charges ప్రామాణీకరణ (standardisation) జరుగుతుందని, అసంబద్ధమైన, అధిక ధరలకు, price gougingకు, ఇష్టారాజ్యపు పెంపులకు అవకాశం ఉండదని, రోగులు దోపిడీకి గురికాకుండా రక్షణ లభిస్తుందని affidavit లో కేంద్రం పేర్కొంది.
'ఒకే రేటు కాదు.. శ్రేణి మాత్రమే'
ఇది uniform price కాదని, కేవలం ఒక శ్రేణి మాత్రమేనని కేంద్రం స్పష్టం చేసింది. ఆ శ్రేణి లోపల infrastructure, సేవల నాణ్యత, patient demographics వంటి అంశాల ఆధారంగా ఆసుపత్రులు తమ charges సర్దుబాటు చేసుకోవచ్చు. రోగులకు affordability, ఆసుపత్రులకు ఆర్థిక సుస్థిరత — రెండింటి మధ్య సమతుల్యత ఇందులో ఉందని కేంద్రం వాదన. రేట్లను ఏకపక్షంగా కాకుండా, వివిధ stakeholders సభ్యులుగా ఉండే National Council for Clinical Establishments ద్వారా, State Councils నుంచి వచ్చే data ఆధారంగా సంప్రదింపుల ప్రక్రియలో నిర్ణయిస్తామని తెలిపింది.
రాజ్యాంగపరమైన అభ్యంతరాలను కూడా కేంద్రం తోసిపుచ్చింది. ఆసుపత్రులను సాధారణ వ్యాపార సంస్థలతో సమానంగా చూడలేమని, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా charges నియంత్రణ Article 19(6) కింద reasonable restriction అవుతుందని వాదించింది. రేట్ల ప్రామాణీకరణ వల్ల సామాజిక, ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా అందరికీ వైద్యం అందుబాటులోకి వస్తుందని, ఇది Article 21 కింద ఆరోగ్య హక్కును, Article 47 కింద ప్రజారోగ్య బాధ్యతను ముందుకు తీసుకెళ్తుందని పేర్కొంది. ధరల నియంత్రణ భారత చట్టాలకు కొత్తేమీ కాదని — Union of India v. Cynamide India Ltd. (1987) తీర్పును, ఔషధ రంగంలో price controls ను, Legal Metrology కింద MRP విధానాన్ని ఉదాహరణలుగా చూపింది.
సమావేశాలు బోలెడు.. ఫలితం సున్నా
అసలు కథ affidavit లోని అమలు వివరాల్లో ఉంది. Rule 9(ii) అమలుకు concrete proposal తీసుకురావాలని 2024 ఫిబ్రవరి 27న సుప్రీంకోర్టు Health Secretaryని ఆదేశించింది. ఆ తర్వాత జరిగిందిదీ:
2024 మార్చి 19న అన్ని రాష్ట్రాలు, UTలతో సమావేశం. వైద్య procedureల standard cost లెక్కించాలని రాష్ట్రాలను కోరారు. మార్చి 28న costing template పంపారు — ప్రాంతం, చికిత్స రకం, వైద్య సిబ్బంది అర్హతలు, అనుభవం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని. 2025 జూలై 31న మరో సమావేశం. నవంబర్ 11న stakeholder workshop. 2026 జనవరి 23, 28, ఫిబ్రవరి 4, 11 తేదీల్లో నాలుగు zonal సమావేశాలు. మార్చి 12న ఏకంగా 'చింతన్ శివిర్' కూడా జరిగింది.
ఇన్ని చేసినా — రేట్ల శ్రేణి నిర్ణయంపై ఒక్క రాష్ట్రం నుంచి, ఒక్క UT నుంచి కూడా concrete proposal రాలేదని కేంద్రం కోర్టుకు నివేదించింది.
రాష్ట్రాల అభ్యంతరాలేమిటి?
కొన్ని రాష్ట్రాలు ప్రైవేటు ఆసుపత్రులతో మరింత విస్తృత సంప్రదింపులు కావాలన్నాయి. రేట్లు fix చేస్తే వైద్య సేవల నాణ్యత దెబ్బతింటుందని, ఆసుపత్రులు ఆర్థికంగా నిలదొక్కుకోలేవని మరికొన్ని ఆందోళన వ్యక్తం చేశాయి. వైద్య పరిశోధన, అభివృద్ధిపై, ప్రైవేటు రంగ వైద్య సేవలపై ప్రభావం పడుతుందన్న అభ్యంతరాలూ వచ్చాయి. దేశంలోని భౌగోళిక, సామాజిక-ఆర్థిక వైవిధ్యం, infrastructure తేడాలు, అర్హులైన సిబ్బంది లభ్యతలో వ్యత్యాసాల వల్ల ఒకే శ్రేణి నిర్ణయించడం కష్టమని కేంద్రమే అంగీకరించింది.
Affidavit ప్రకారం Clinical Establishments Act ను 19 రాష్ట్రాలు/UTలు adopt చేయగా, 17 రాష్ట్రాలకు సొంత చట్టాలున్నాయి. సొంత చట్టాలున్న దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ రేట్ల display తప్పనిసరే — కానీ రేట్ల శ్రేణి నిర్ణయానికి మాత్రం ఏ చట్టంలోనూ ఏర్పాటు లేదు. రేట్లు display చేయడానికి రెండు category ల రాష్ట్రాలూ సిద్ధమేనని చెబుతున్నా, శ్రేణి నిర్ణయంపై అభ్యంతరాలు కొనసాగిస్తూనే ఉన్నాయి.
సామాన్యుడికి మిగిలిందేమిటి?
ప్రస్తుతానికి రోగికి ఉన్న ఏకైక హక్కు — Rule 9(i) ప్రకారం ఆసుపత్రులు తమ రేట్లను స్థానిక భాషలో, ఇంగ్లిష్‌లో అందరికీ కనిపించే చోట display చేయాలి. అంతే. ఆ రేట్లు ఎంత ఉండాలన్నదానిపై మాత్రం ఎలాంటి పరిమితీ లేదు. బిల్లుకు కళ్లెం వేయాల్సిన Rule 9(ii) — కోర్టు గదుల్లో రాజ్యాంగబద్ధమైనదిగా సమర్థన పొందుతూ, క్షేత్రస్థాయిలో మాత్రం 14 ఏళ్లుగా అమలుకు నోచుకోని నిబంధనగా మిగిలిపోయింది. కేంద్రం-రాష్ట్రాల మధ్య ఈ దోబూచులాట కొనసాగినంత కాలం, ఆసుపత్రి బిల్లు చూసి గుండె జారే పరిస్థితి సామాన్యుడికి తప్పదు.
అమెరికాలో ఎక్కువమంది మనవాళ్లు వీసా మీద ఉంటారు కాబట్టి తిరిగి వచ్చేసే అవకాశాలున్నాయి కాబట్టి చేస్తున్నారు అనుకోవచ్చు కానీ ఆస్ట్రేలియాలో ఎక్కువమంది తెలుగువాళ్లు ఇక్కడి పౌరులే, మరి ఇంకా ఎందుకు తెలుగు రాష్టాల ప్రాంతీయ పార్టీల జెండాలు మోస్తుంటారు ఇక్కడ? అర్థంకాక అడుగుతున్నాను.
ఖమ్మం పట్టణానికి దక్షిణాన ఉన్న ధంసలాపురం దగ్గర ఈ ఆర్వోబీ పూర్తయితే రాజమండ్రి టు సూర్యాపేట ఝూమ్ అని వెళ్లిపోవచ్చు.
ఆర్వోబీ ఒక పక్క పూర్తయినా లాగించి వేద్దాం అని తుమ్మల ప్రయత్నం.
రూల్ ప్రకారమే అని అధికారుల బ్రేకులు.
జిల్లా అంతా దీని గురించే ఎదురుచూపులు.
మా మాజీ ఎమ్మెల్యే చచ్చిపోతే అంత్యక్రియలు ఫస్ట్ పేజీలో వేయలేదు.
ఇదెక్కడి గొడవ.
అర్థరాత్రి ఎడిషన్ అయిపోయాక చనిపోయారు. అతి కష్టమ్మీద మరణం వార్త కవర్ అయ్యింది.
మర్నాడు సొంత ఊరిలో అంత్యక్రియలకు ఇటీవలి కాలంలో ఎరగనంత మంది జనం వచ్చారు. దాంతో పావు పేజీకి ఎక్కువ అరపేజీకి తక్కువ సైజ్ లో మూడు ప్రధాన పత్రికలు ఫోటోలతో కవరేజ్ ఇచ్చాయి.
పార్టీ పత్రిక లో పార్టీ మౌర్నింగ్ కాబట్టి భారీగా మొదటి పేజీలో ఇచ్చుకుంటారు. వాళ్ళ నేతలు అటెండ్ అయిన ఫోటోలు వేసుకుంటారు. మిగతా పత్రికలు అదే ఎజెండా పాటించాలి అంటే?
యూట్యూబ్ లో దీనిపై రచ్చ..
ఇల్లు మనకి అద్దెకు వేసేటప్పుడు ఎలా ఇచ్చారో మనం తిరిగి వెళ్ళేటప్పుడు ఇక్కడ అదే స్థితిలో ఇవ్వాలి.
యధా స్థితికి తేవాలంటే బాగా పూలుస్తుంది.
ఇండియాలో ఇల్లు అద్దెకి ఇచ్చి, వాడు ఖాళీ చేసి వెళ్లినప్పుడు చేసిన బీభత్సం శుభ్రం చేయడానికి రెండు నెలల అద్దె ఖర్చు పెట్టాల్సి వచ్చింది..
Naa oopiri Narsampet.
Naa praanam Telangana. ❤️
@KCRBRSPresident
Jai Telangana!
Thank you everyone for your endless love and blessings. 🙏
—Mee Peddi Sudharshan Reddy Anna
@BRSHarish@KTRBRS@BRSparty
Actor Prabhu Deva arrives in Dallas, Texas, greeted by fans with flowers. DFW Airport is notorious for useless Telugu actors arriving and all Telugus jumping & clapping when suddenly a malnourished figure comes out of the gate. Dallas is now a personal playground for Telugu H1Bs.