రైతులకు నీళ్లు ఇవ్వమని అడిగితే
మా రక్తాన్ని పారిస్తానంటున్నాడు.
రేవంత్ రెడ్డికి మా రక్తమే అడ్డమైతే.. ఆ రక్తాన్ని అయినా ఇవ్వడానికి మేము సిద్ధం.
రేవంత్ వ్యాఖ్యలు ఆయనలోని 'రక్తపిపాసి' మనస్తత్వానికి నిదర్శనం.
– మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు🔥
నిన్న రేవంత్ రెడ్డి మాటలు చూస్తే, షాబాద్ హత్య కేసులో నిందితుడికి, రేవంత్ రెడ్డికి పెద్ద తేడా లేదనిపిస్తుంది.
షాబాద్ ఘటన మీద పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాడు కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి/హోంమంత్రి మాత్రం స్పందించలేదు.
ఇంత పెద్ద ఘటన జరిగితే, నిన్న మధ్యాహ్నం ఓ పోలీస్ ఉన్నతాధికారి గోల్ఫ్ ఆడుతూ టైమ్ పాస్ చేశాడు.
– మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు🔥
రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉందంటే..
ఢిల్లీకి నజరానా, రైతులకేమో జరిమానా అన్నట్టుగా తయారైంది.
69 సార్లు ఢిల్లీకి పోయి కప్పం కట్టే బదులు రైతులను పట్టించుకోండి.
తరుగు పెడితే తోలు తీస్తా అన్న సీఎం..
ఇప్పుడు ఎవరి తోలు తీస్తాడో చెప్పాలి.
- మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు 🔥
నాలుగు కోట్ల గొంతులను ఏకం చేసి విప్లవ శంఖం మోగించిన ధిక్కార వేదిక,
సమైక్య సంకెళ్లను తెంచి స్వరాష్ట్ర కాంక్షను సాకారం చేసిన యుద్ధ గీతిక,
పదేళ్ల పాలనతో ఉద్యమ తెలంగాణను ఉజ్వల తెలంగాణగా తీర్చిదిద్దిన అభివృద్ధి పతాక,
తెలంగాణ జాతి ఆత్మగౌరవ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గులాబీ దీపిక,
ప్రజల విశ్వాసానికి ప్రతీక, ప్రజా ఉద్యమ పతాక.. భారత రాష్ట్ర సమితి 26 వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
పాపపు పాలనలో ప్రజల జీవితాలు నలిగిపోతున్న వేళ, ప్రజల గుండెల్లో మార్మోగుతున్నది ఒక్కటే నినాదం..
సంక్షేమం అడుగంటి, అభివృద్ధి నిలిచిపోయి, అరాచకం తాండవం చేస్తున్న కాలంలో వినిపిస్తున్నది ఒక్కటే ఆవాజ్..
"రేవంత్ పోవాలి… కేసీఆర్ రావాలి”
ఉద్యమంలోనైనా, అధికారంలోనైనా, ప్రతిపక్షంలోనైనా
ఎప్పుడూ ప్రజల పక్షానే నిలబడి, తెలంగాణను కంటికి రెప్పలా కాపాడుకున్న పార్టీ మన బీఆర్ఎస్.
పోరాటాల పునాది మీద పుట్టి, ప్రజల విశ్వాసంతో ఎదిగి, ప్రతి గుండెలో నాటుకుపోయిన గులాబీ శక్తి మన బీఆర్ఎస్.
గులాబీ జెండా సగర్వంగా ఎగిరే రోజు ఎంతో దూరంలో లేదు,
నిలిచిపోయిన తెలంగాణ ప్రగతి రథం మళ్లీ పరుగులు తీసే రోజు ఎంతో దూరంలో లేదు.
జై తెలంగాణ
జై కేసీఆర్
జై బీఆర్ఎస్
సత్యమేవ జయతే..
ఎవరెన్ని కుట్రలు చేసినా న్యాయస్థానాల్లో అంతిమంగా ధర్మం జయిస్తుందని, సత్యం నినదిస్తుందని ఈరోజు మరోసారి నిరూపితమైంది.
ప్రాథమిక హక్కులు, సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ నడిపిన విచారణను ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా కమిషన్ చేసిన వ్యాఖ్యలు చెల్లవని, ఆ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోరాదని స్పష్టంగా తీర్పునిచ్చింది.
దీంతో కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ కుట్రలు బట్టబయలయ్యాయి. ప్రజా సమస్యలు పక్కనపెట్టి డ్రామాలు ఆడిన రేవంత్ రెడ్డి నిజస్వరూపం హైకోర్టు తీర్పుతో తేటతెల్లం అయ్యింది.
ఇప్పటికైనా కక్షసాధింపులు, రాజకీయ దుష్ప్రచారం మానేసి వెంటనే రెండు పిల్లర్ల మరమ్మతులు పూర్తి చేసి తెలంగాణ రైతుల ప్రయోజనాలు కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
ఎవరు ఔనన్నా కాదన్నా...
ముమ్మాటికీ కాళేశ్వరం తెలంగాణకు ప్రాణేశ్వరం..
జై తెలంగాణ..
జై కెసిఆర్..
బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించి, పూర్తైన వాటికి రిబ్బన్ కటింగ్ చేయడమే కాంగ్రెస్ చేస్తున్న పని.
సిద్దిపేటలో రేపు ప్రారంభించబోతున్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి, 2021లో జీఓ ఇచ్చి, రూ. 300 కోట్లతో ఈ ఫ్యాక్టరీ పనులు ప్రారంభించడం జరిగింది.
ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ రావడంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ చాలా కీలకం.
రేపు నర్మెటలో ప్రారంభించబోతున్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి కూడా ప్రతీ సంవత్సరం 20 కోట్ల లీటర్ల కాళేశ్వరం జలాలే ఆధారం.
కాళేశ్వరం మీద అబద్ధపు ప్రచారాలు చేసిన రేవంత్, ఇప్పటికైనా సోయి తెచ్చుకొని, చిల్లర మాటలు మానుకోవాలి.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
మాదేమో శ్రమ ఫలితం.. మీదేమో శిలా ఫలకమా ?
సిద్దిపేటలో రేపు ప్రారంభించబోతున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి 2021లో జీఓ ఇచ్చి, రూ. 300 కోట్లతో ఫ్యాక్టరీ పనులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించింది.
ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ రావడంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ చాలా కీలకం. ప్రతీ సంవత్సరం 20 కోట్ల లీటర్ల కాళేశ్వరం జలాలే ఈ ఫ్యాక్టరీకి ఆధారం.
ఇప్పటికైనా సోయి తెచ్చుకోని చిల్లర మాటలు మానుకో రేవంత్ రెడ్డి..
- మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు
కాంగ్రెస్ పాలన అట్టర్ ఫ్లాప్ అయ్యింది.
బీఆర్ఎస్ పాలనలో జీఎస్డీపీ వృద్ధి రేటు 12.5 శాతం ఉంటే,
కాంగ్రెస్ పాలనలో 10.7 శాతానికి తగ్గింది.
జీఎస్డీపీలో డౌన్, తలసరి ఆదాయం వృద్దిలో డౌన్
హైడ్రా కూల్చి వేతల వల్ల, మీ తుగ్లక్ చర్యల వల్ల అభివృద్ది ఆగిపోయింది.
- మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు 🔥
Live: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత @BRSHarish గారు
📍 క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ, రామకృష్ణాపూర్ https://t.co/LBBCqy8AZD
మన ముఖ్యమంత్రి ఒక్కసారైనా రైతుల గురించి మాట్లాడిండా?
గురుకులాల్లో పాముకాటులతో, కల్తీ ఆహారంతో పిల్లల ప్రాణాలు పోతుంటే.. ఏ రోజైనా రేవంత్ రెడ్డి మాట్లాడిండా?
20 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ ఊసు కూడా ఎత్తడం లేదు
నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ గురించి ప్రశ్నిస్తే ఒక్క మాట కూడా మాట్లాడడు
పెన్షన్ గురించి ఒక్క మాట మాట్లాడడు
మహిళలలు ఇస్తానన్న రూ.2500 గురించి మాట్లాడడు
రిటైర్డ్ ఉద్యోగుల బాధల గురించి మాట్లాడడు
ఉద్యోగుల డీఆర్సీ, పీఆర్సీ, డీఏల గురించి ఒక్కసారి మాట్లాడడు
కానీ కేసీఆర్ గారి మీద మాత్రం బూతులు మాట్లాడుతాడు
• మాజీ మంత్రి , ఎమ్మెల్యే @BRSHarish గారు
జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు హేట్ స్పీచ్ (Hate Speech) పై హితబోధ చేసిన కొద్ది నిమిషాలు కూడా గడవకముందే, అదే వేదికపై రేవంత్ రెడ్డి తన అసలు స్వభావాన్ని, తన మాటల ద్వారానే బయటపెట్టుకున్నారు.
హేట్ స్పీచ్‌పై ఉపన్యాసం ముగియకముందే, రేవంత్ రెడ్డి హేట్ స్పీచ్‌కు లైవ్ డెమో ఇచ్చారు.
కేసీఆర్ గారిపై కడుపులో కత్తులు,
నోటిలో విషం పెట్టుకున్న రేవంత్ రెడ్డి తన అజీర్తిని, అక్కసును మరోసారి బయటపెట్టారు.
హేట్ స్పీచ్ అంటే ఏమిటో చెప్పడానికి పుస్తకాలు అవసరం లేదు.. రేవంత్ రెడ్డి ప్రసంగాలు చాలు
అమెరికా వెళ్లి హార్వర్డ్ లో నాలుగు రోజులు చదువుకున్నా.. రేవంత్ రెడ్డి తన వెనకటి గుణం మాత్రం మార్చుకోలేదు.
కనీస సంస్కారం రాలేదు, చిల్లర మాటల్లో, వెకిలి చేతల్లో ఎలాంటి మార్పు రాలేదు.
ద్వేష రాజకీయాలకు, నరం లేని నాలుకతో విషం చిమ్మే కుసంస్కారానికి నిలువెత్తు నిదర్శనం రేవంత్ రెడ్డి.
దేశానికి గాంధీ గారు జాతిపిత అయినట్లే, తెలంగాణను సాధించిన కేసీఆర్ గారు జాతి పితనే రేవంత్ రెడ్డి
నాలుగు కోట్ల ప్రజలు ఏకమై స్వరాష్ట్రం కోసం కొట్లాడుతుంటే ఆంధ్రా పాలకుల బూట్లు తుడుస్తున్న నీకు కేసీఆర్ గారి గురించి, తెలంగాణ ఉద్యమం గురించి ఎలా తెలుస్తుంది?
ఉద్యమకారులపైకి తుపాకి ఎక్కుపెట్టిన నీకు ఉద్యమకారుల గురించి మాట్లాడే హక్కు ఉందా రేవంత్ రెడ్డి?
ప్రశ్నిస్తే, నిలదీస్తే అరెస్టులు, కేసులతో నిరంకుశంగా వ్యవహరిస్తున్న నీకు ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడే హక్కు ఉందా రేవంత్ రెడ్డి?
అధికారాన్ని ప్రజల బాగు కోసం కాకుండా, ప్రతిపక్షాలపై రాజకీయ కక్షల కోసం వినియోగిస్తున్న నీకు అధికార దుర్వినియోగం గురించి మాట్లాడే హక్కు ఉందా రేవంత్ రెడ్డి?
లక్కీ లాటరీలో ముఖ్యమంత్రి అయిన నీకు ఇవన్నీ ఎలా తెలుస్తాయి? ఎలా అర్థం అవుతాయి రేవంత్ రెడ్డి?
నువ్వు హార్వర్డ్ వెళ్ళినా, అంతరిక్షం వెళ్ళినా నీ చెత్త బుద్ధి మారదు, నోటి మురికి పోదు అన్నది సుస్పష్టం.
#CongressFailedTelangana
రాజకీయాల్లో నోరు పారేసుకుంటే మొదటికే మోసం వస్తుంది
నేను అన్ ఫిట్ ఫర్ పాలిటిక్స్ కాదు నువ్వే అన్‌ఫిట్ ఫర్ పాలిటిక్స్
సచివాలయంలో ఆర్థిక మంత్రి ఛాంబర్ ముందు కాంట్రాక్టర్లు ధర్నాలు చేయడం చరిత్రలో ఎన్నడైనా ఉందా? మరి అన్‌ఫిట్ నువ్వా నేనా?
నీ లాగా బిల్లులు చెల్లించడానికి 20–30% కమిషన్ తీసుకోలేదు అందులో నేను అన్‌ఫిట్ కావొచ్చు
• మాజీ మంత్రి @BRSHarish గారు
NTPC నుండి తక్కువ ధరకు విద్యుత్ తీసుకోకుండా కమిషన్ల కోసం రామగుండంలో ప్లాంట్ పెట్టి సొంతగా విద్యుత్ తయారు చేస్తామని అంటున్నారు
అలా ఒక యూనిట్ విద్యుత్ మీద అదనంగా రూ.3 ఖర్చు పెట్టాలని చూస్తున్నారు.. రోజుకు 3 కోట్ల యూనిట్ల విద్యుత్ ఉత్పతి అవుతుంది
అలా NTPC నుండి విద్యుత్ తీసుకోకుండా రామగుండ ప్లాంట్ నిర్మించి విద్యుత్ తీసుకుంటే రోజుకు తెలంగాణ ప్రజల మీద రూ.9 కోట్లు భారం పడుతుంది
సంవత్సరానికి రూ.3285 వేల కోట్లు అదనపు భారం అవుతుంది.. రామగుండం ప్లాంట్ 25 ఏళ్లు అగ్రిమెంట్ జరిగితే తెలంగాణ ప్రజల మీద రూ.82 వేల కోట్ల భారం వేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది
• మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish గారు
2026 నాటికి థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని 40 శాతం తగ్గిస్తామని శాసనసభలో పెట్టిన శ్వేత పత్రంలో పేర్కొన్నారు.
ఇప్పుడేమో 2400 ల మెగావాట్ల థర్మల్ ఉత్పత్తి ప్లాంట్లను పెడతామని మీరే అంటున్నారు.
ఏది కరెక్ట్ భట్టి విక్రమార్క గారు..?
ఒకవైపు తగ్గిస్తామని మరోవైపు కమీషన్ల కోసం ప్లాంట్లు పెడుతున్నారు.
• మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish గారు