పొంగులేటి గారూ,
ఎల్లంపల్లి వేరుకాదు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే.. ఇది మీ ప్రభుత్వ ఇంజనీర్లను అడిగినా చెబుతారు!
ఎల్లంపల్లి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం 38 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందించే ప్రాజెక్టే అయితే, అంతా సామర్థ్యం ఎల్లంపల్లికి ఉంటే..
#తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజీ కడతామని ఎందుకు అంటున్నారు?
ప్రజల సోమ్ము దోచుకోవడం కోసమా?
ఎల్లంపల్లి కాళేశ్వరంలో భాగం అని చెప్పింది @CWCOfficial_GoI
కాళేశ్వరం ప్రాజెక్టుకు సెంట్రల్ వాటర్ కమిషన్, ఇరిగేషన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ 240 టీఎంసీలకు హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చినప్పుడే,
190 టీఎంసీలు మేడిగడ్డ దగ్గర,
"20 టీఎంసీలు ఎల్లంపల్లిలో" అందుబాటులో ఉన్నాయి అని చెప్పింది.
నిన్న ఎత్తి పోసింది అదే శ్రీనివాస్ గారు.
ఈ మాత్రం అవగాహన లేకుండా,
మీరు మరియు పచ్చజ్యోతి కలిసి చేస్తున్న దుష్ప్రచారాన్ని చూసి చింతిస్తున్నాం.
కాళేశ్వరం ప్రాజెక్టు అనేది బహుళ దశల ఎత్తిపోతల పథకం దాంట్లో అనేక బ్యారేజీలు, పంప్ హౌస్లు, రిజర్వాయర్లు ఉన్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టుకు నీటి సోర్స్ మేడిగడ్డ బరాజ్ ఒక్కటే కాదు.
శ్రీరాంసాగర్,ఎల్లంపల్లి, మానేరు నీటి సోర్స్ లతో ప్రాజెక్టు నిర్మాణం జరిగింది, తెలంగాణ భౌగోళిక స్వరూపం తెలిస్తే ప్రాజెక్టు ప్రాముఖ్యత అర్థం అవుతుంది.
మీ కోసం వివరించి చెప్పాలి అంటే..
🔹శ్రీరాంసాగర్ కు వరద వచ్చినప్పుడు కాళేశ్వరం లింక్-1 మేడిగడ్డ, అన్నారం,సుందిళ్ల లింక్ -2 లోఉన్న ఎల్లంపల్లి నుంచి నంది మేడారం, గాయత్రి పంపులు తిప్పే అవసరం లేకుండానే వరద కాలువ ద్వారా మిడ్ మానేరుకు నీళ్లు చేరుతాయి.
🔹ఇక రెండో స్థితి శ్రీరాంసాగర్ కు వరద రాకున్నా ఎల్లంపల్లికి కడెం నది నుంచి, శ్రీరాంసాగర్ ఎల్లంపల్లికి మధ్యన ఉన్న పరివాహక ప్రాంతం నుంచి వరద వచ్చే అవకాశం ఉన్నది నిన్న ఈరోజు ఉన్న పరిస్థితి లాగా.
ఈ స్థితిని వర్షాకాలంలో ప్రతీ ఏటా చూస్తాము. ఈ స్థితిలో కాళేశ్వరం లింక్ 1 పంపులు తిప్పే అవసరం రాదు.
ఎల్లంపల్లి నుంచే లింక్ 2 పంపులు తిప్పి నీటిని మిడ్ మానేరుకు చేరవేయడం, అక్కడి నుంచి ఎగువకు కొండ పోచమ్మ సాగర్ దాకా ఎత్తిపోయడం, దిగువ మానేరుకు, అక్కడి నుండి కాకతీయ కాలువ ద్వారా శ్రీరాంసాగర్ మొదటి దశ, రెండో దశ ఆయకట్టుకు నీటి సరఫరా, పునరుజ్జీవన పథకం ద్వారా శ్రీరాంసాగర్ జలాశయానికి నీటిని ఎత్తిపోయడం జరుగుతుంది.
🔹మూడోది ముఖ్యమైనది పై రెండు చోట్ల నీటి లభ్యత లేని సందర్భాల్లో మాత్రమే మేడిగడ్డ నుండి నీటిని ఎల్లంపల్లికి
లింక్ 1 పంపులను తిప్పవలసిన అవసరం ఏర్పడుతుంది.
ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన నంది, గాయత్రి పంప్ హౌస్ లో నుండి నీళ్లు వస్తున్నాయి మీరు దుష్ప్రచారం చేస్తున్నా లక్ష కొట్లలో ఈ పంప్ హౌస్ లో వాటా సుమారు రూ. 12,500 కోట్లు.
మేడిగడ్డకు అయిన ఖర్చు కేవలం 4,000 కోట్లు మాత్రమే, మంత్రి హోదాలో ఉండి తెలంగాణపై మీరు చేస్తున్న విషప్రచారాన్ని చూసి సిగ్గుగా ఉంది @INC_Ponguleti
#KaleshwaramProject
@KTRBRS@BRSHarish
ఫలించిన బీఆర్ఎస్ పోరాటం!
కాళేశ్వరం ప్రాజెక్ట్ పంపులు ఆన్.
ఈ రోజు నంది మేడారం, గాయత్రి పంప్ హౌస్ ల మోటార్లు ఆన్ చేసి నీరు ఎత్తిపోస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.