పెద్దపల్లి మాజీ ఎమ్మెల్ల్యే శ్రీ బిరుదు రాజమల్లు గారు అనారోగ్యంతో కన్నుమూసినట్లుగా తెలిసింది. పెద్దపల్లి ప్రాంతానికి వారి సేవలు మరవలేనివి. బీయస్పీ యువ అభ్యర్థి దాసరి ఉషకు వారి ప్రోత్సాహం వెలకట్టలేనిది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.
పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అందరూ కలిసి ఏనుగు గుర్తును ప్రతి గడపకు తీసుకెళ్లాలని ఈ రోజు జరిగిన హుజురాబాద్ అసెంబ్లీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడటం జరిగింది..
@RSPraveenSwaero#BSP
@BSP4Telangana
ఈ రోజు శ్రీమతి సుమలత గారు కరీంనగర్ బార్ అసోసియేషన్ లో సభ్యత్వం తీసుకున్న సందర్బంగా అసోసియేషన్ అధ్యక్షులు రఘునందన్ రావు గారు, ప్రధాన కార్యదర్శి లింగంపల్లి నాగరాజు గారు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది గులాబీల మల్లారెడ్డి గారు తదితరులు ఉన్నారు #Karimnagar_Court
స్వేరోస్-ఫిట్ ఇండియా ఫౌండేషన్ (FIF) మారథాన్ రన్నర్ చినపాక స్వామి స్వేరో క్రమం తప్పకుండా ప్రతి రోజు తప్పనిసరిగా 5 కి.మీ పరుగు చేస్తూ నేటితో 1,000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చారిత్రాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన 5 కి.మీ పరుగుపందెం, అభినందన సభలో పాల్గొన్నాను.
ఒకప్పుడు 88 kgs భారీ కాయంతో కనీసం 30 నిమిషాలు కూడా నడవలేని స్థాయి నుండి క్రమం తప్పకుండా వర్షం వచ్చినా,వరదలు ముంచెత్తినా తప్పనిసరిగా ప్రతిరోజు 5 కి.మీ రన్ చేస్తూ, సునాయాసంగా ఎన్నో 'మారథాన్లు పూర్తి చేసి, ఇప్పుడు 66 kgల వరకు తగ్గి, అప్పుడపుడు ఉపవాసం #IntermittentFasting ఉంటూ ఆరోగ్యవంతమైన జీవితం గడుపుతూ యువతలో కొత్త ఉత్సహాన్ని నింపుతున్న ఇంజనీరు స్వామి నేటి యువతకు ఆదర్శనీయం.
నేను కూడా స్వామి గారితో ఈ రోజు 41 నిముషాల 21 సెకన్లలో 6km ను పూర్తి చేశాను.
Joined Mr Swamy for 5Km run in Osmania University to honour him on 1000th day of his 5K Run/Day. Thanks everyone who joined Mr Swamy today.💐
#Swaero
#Obesity
#Fitness
#FitIndia
నిజామాబాద్ జిల్లా సాలూర మండల కేంద్రంలో స్వేరోస్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విజ్ఞాన మందిరం (గ్రంథాలయం) ను ప్రారంభించాను. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు. పుస్తకం పఠనం ద్వారానే వ్యక్తులు విజ్ఞానవంతులవుతారు. అంబేద్కర్ గారు అవిశ్రాంత పుస్తక పఠనం చేసినందునే మనకు రాజ్యాంగంతో సహా ఎన్నో గొప్ప గ్రంధాలను అందించారు.
అంబేద్కర్ లేదా మరెవ్వరైనా మహనీయుల విగ్రహాలకన్నా వారి పేరుతో అదే ఖర్చుతో చక్కటి గ్రంథాలయాలను నిర్మిస్తే సమాజంలో మరెందరో ఆవిష్కర్తలు, జ్ఞానులు పుట్టుకొస్తారు.
Inaugurated Ambedkar Vigyan Mandir (Public Library) established with the donations of villagers under the guidance of Swaeroes Network in Salura of Nizamabad District of Telangana. Truly impressed with the collection of books in such an interior and border village! Hope every village goes Salura way.
#Aksharam #Aarogyam #Arthikam
#Swaeroes
#Ambedkar
ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి (PJTSAU) చెందిన 100 ఎకరాల భూమిని ప్రభుత్వం కొత్త హైకోర్టు నిర్మాణానికి కేటాయించడాన్ని నిరసిస్తూ 12 రోజులుగా శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం తెలిపాము.
ప్రపంచానికి అన్నం పెట్టే రైతాంగానికి నూతన వంగడాలను సృష్టిస్తూ,ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యవసాయ శాస్త్రవేత్తలను అందించిన వర్సిటీ భూముల్లో హైకోర్టు నిర్మాణం చేపడితే అక్కడ బయోడైవర్సిటీ దెబ్బతిని అరుదైన వృక్ష జాతులు, పక్షులు,జంతువుల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది. ఖజానాలో ఇంకా డబ్బులుంటే కొత్త హైకోర్టును వేరే ప్రదేశంలో కట్టండి. హైదరాబాదు చుట్టుపక్కల చాలా ఖాళీ భూములు గుట్టలల్ల ఉన్నయి.
హైకోర్టు నిర్మాణానికి #BSP ఏమాత్రం వ్యతిరేకం కాదు. కానీ ముఖ్యమంత్రి @revanth_anumula గారు రాష్ట్ర మంత్రివర్గంతో సహా అగ్రివర్సిటీలో పర్యటించి, విద్యార్థులతో ప్రొఫెసర్ల తో చర్చలు జరిపితే తప్ప అక్కడి సమస్యలు అర్దం కావు.
అందుకే తక్షణమే ప్రభుత్వం https://t.co/artLfmUBzf.55 ను రద్దు చేసి, వర్సిటీ భూముల్లో కాకుండా ఇతర ప్రభుత్వ భూముల్లో హైకోర్టును నిర్మించాలని #BSP డిమాండ్ చేస్తున్నది.
Stood by Telangana Agriversity Students in solidarity who have been fighting to save precious flora and fauna in their university lands from the Government. Nobody objects to the government’s decision to build a new high court, if it is done on a barren land (with minimum destruction) which is close to Hyderabad. But why only the lands of biodiversity parks and botanical gardens which were painstakingly nurtured for decades by the students and scientists?
Is it because you want to slowly make this area a real estate hub close to Shamshabad Airport? Already some land is given to Prestige Group!
Is it because the voice of students here can be silenced easily as they are from Bahujan communities surviving on government scholarships?
If public purpose is the only cause for acquisition of university lands, why can’t the government acquire govt lands which are aplenty close to airport. Govt doesn’t want to explore such possibility because it wants to hand over such lands to sharks aka real estate companies who build ultra-luxurious villas for the high and mighty.
I request hon’ble high court to strike down GO 55 and ask the government to come up with a fresh proposal for land acquisition for new high court building, if it still has money in its coffers.
@TelanganaCS@TelanganaCMO@PjtsauIndia
Got engaged to the love of my life Kodidala Suresh @SKodidhela
who is also my colleague in BSP on Jan 5th , in a very small family function.
We have been waiting and working relentlessly (for 2.5yrs) for RSP sir’s win in Telangana. We are postponing our wedding and have it after MP elections.
Both of our ultimate goal is to make RSP win 🏆🙏
Thank you
Jai bhim
కొండలను పగలేసి, బండలను పిండి చేసి, తమ నెత్తురునే కంకరగా ఆకాశ హర్మ్యాలను, ప్రాజెక్టులను కట్టి నాగరికతకు పునాది వేసిన వడ్డెరల ముద్దు బిడ్డ వడ్డె ఓబన్న జయంతి నేడు. బీయస్పీ గత అసెంబ్లీ ఎన్నికల్లో వడ్డెరలకు రెండు సీట్లు కేటాయించింది.
🙏
Hearty congratulations @PallaviSwaero3 and @SKodidhela on being engaged (after a prolonged, responsible, and mutually respectful waiting) to start a new and exciting phase of life together in the mission for social justice in India.
Your sacrifice and unwavering commitment, at a very young age, to the #BSP and the Mission are beyond description. I am sure that you both will take @BITCELL_BSP to new heights to spread the truth and fight fakery with renewed vigour.
Feeling proud to have warriors like you in our indefatigable team✊
Jai Bhim and Jai Bharat.
💐💐💐
Felt honoured to have met @NMRPTC Neelam Madhu Mudhiraj anna Garu at the airport yesterday. He was heading to Guruvayur, in the land of Shri Narayan Guru to seek the blessings of Lord Gurvayappan. May he succeed in all his endeavours, for people like him are the future of India!
రాజ్యాంగబద్దంగా ఎస్టీలకు రిజర్వ్ చేయబడ్డ ఆసిఫాబాద్ (ST-W),కొత్తగూడెం (ST-General) జిల్లా పరిషత్ చైర్మన్ల స్థానాల్లో జనరల్ కేటగిరీకి చెందిన జెడ్పీ వైస్ చైర్మన్ లు కోనేరు కృష్ణారావు, కంచర్ల చంద్రశేఖర్ రావులను ప్రభుత్వం తాత్కాలిక చైర్మన్లుగా నియమించి, కొనసాగించడమంటే ఎస్టీలకు డా.బి.ఆర్.అంబేడ్కర్ ఆదివాసీలకు కల్పించిన రాజకీయ హక్కులను కాలరాయడమే.
గిరిజనులకు జరిగిన అన్యాయానికి నిరసనగా ఈ రోజు ఆసిఫాబాద్ కలెక్టరేట్ ఎదురుగా జరిగిన మహా ధర్నా లో పాల్గొన్నాను.
ఆసిఫాబాద్,కొత్తగూడెం జిల్లాల జెడ్పీ చైర్మన్ల ఎంపిక కోసం జనవరి 10 లోపు ఎన్నికలు నిర్వహించి ఎస్టీలను ఎంపిక చేయని పక్షంలో ఆదివాసీల హక్కులను కాపాడటం కోసం బీఎస్పీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతాం
#SavetheConstution
@CEO_Telangana@TelanganaCS@TelanganaCMO@revanth_anumula@seethakkaMLA
అగ్రవర్ణాలకు కొమ్ముకాసిన పాలకులు (పార్టీలు) మాట ఇచ్చేది కేవలం వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే. అమాయకులుగా ఉంటె బలి అవ్వడం తప్పదు మన బహుజన బిడ్డలకి. దయచేసి రాజకీయ పోరాటం చేద్దాం అధికారం చేజిక్కించుకుందాం. అసెంబ్లీ, పార్లమెంట్ లో మనోళ్లు ఉంటేనే చర్చ.