సిరిసిల్ల చేనేత వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ గారికి హృదయపూర్వక అభినందనలు! 💐
కేవలం రెండు గంటల 50 నిమిషాల వ్యవధిలోనే మగ్గంపై చీరను నేసి.. దాన్ని అగ్గిపెట్టెలో ఇమిడేలా చేసిన ఆయన కళా నైపుణ్యం అమోఘం. దాదాపు ఏడాది పాటు శ్రమించి...అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన తన పట్టుదల నన్ను అబ్బురపరిచింది.
హరిప్రసాద్ భవిష్యత్ లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
Congratulations @PrashantKishor.
This result reflects a broader shift in Indian politics. People across the country are increasingly looking for newer political alternatives rooted in fresh ideas, credible leadership, and accountable governance.
Wishing you the very best as you take on this new responsibility.
కాంగ్రెస్ పార్టీని నమ్మి గెలిపిస్తే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా వంచిస్తున్నారనే ఆందోళనతో డిప్యూటీ సీఎం నియోజకవర్గానికి చెందిన యువకుడు ఆత్మహత్యాయత్నం చేయడం అత్యంత విచారకరం
కాంగ్రెస్ పార్టీ యువతను ఎంతలా మోసం చేసిందో వేణు కుమార్ ఆత్మహత్యాయత్నం ఉదంతం మరోసారి చాటి చెప్తున్నది
వేణు కుమార్ కు మెరుగైన వైద్య చికిత్స అందించాలి.. యువత ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విధంగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు ఏటా భర్తీ చేయబోయే ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి
కృష్ణమ్మను చెరబట్టి దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చిన ఏపీ పాలకులు రాష్ట్ర విభజన తర్వాత గోదావరి నీళ్లు మనకు దక్కకుండా ఎత్తులు వేస్తున్నారు
తమకు కొమ్ముగాసే రేవంత్ రెడ్డి అండతో గోదావరి నీళ్లను కొళ్లగొట్టే కుట్రలు వేగవంతం చేశారు
బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులే చెల్లవన్నట్టుగా ఫిర్యాదుల పర్వానికి తెరలేపితే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) తందానా అంటోంది
గోదావరి నదిలో 964 టీఎంసీలు తెలంగాణ సొంతం.. ట్రిబ్యునల్ రక్షణ ఉన్న నీటి కేటాయింపులు చెల్లవని.. తెలంగాణ ప్రాజెక్టులకు సీడబ్ల్యూసీ ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని ఏపీ కోరడం ముమ్మాటికీ మన హక్కులను కాలరాయడమే
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇకనైనా సోయి తెచ్చుకోండి.. గోదావరి నీళ్లపై ఏపీ అడ్డగోలు కుట్రలకు అండగా నిలవకుండా నిన్ను గడ్డపై కూర్చోబెట్టిన తెలంగాణ ప్రజల హక్కులను రక్షించే ప్రయత్నం చేయండి.. లేనిపక్షంలో తెలంగాణ రక్షణ సేన మీ వెంట పడి ప్రజల హక్కుల పరిరక్షణకు పాటు పడుతుంది
20 వేల ఉద్యోగాలు అని చెప్పి 5 వేల ఉద్యోగాలే భర్తీ చేస్తారా??
మరోసారి నిరుద్యోగులను ముంచుతున్న కాంగ్రెస్
తెలంగాణలో కూడా ఢిల్లీని తలపించేలా Gen -Z ఉద్యమం రావాలి ,కాంగ్రెస్ గద్దె దిగాలి...
#Telangana#KalvakuntlaKavitha#TRSParty#RevanthReddy
అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితమ్మ గారు పరామర్శించారు
ఈ సందర్భంగా ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యులను ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు..
సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సహచర ఉద్యమకారుడు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని పరామర్శించాను
సుదర్శన్ రెడ్డి గారు త్వరగా పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా తిరిగి ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను.. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాను
గుండెపోటు కారణంగా తీవ్ర అస్వస్థతకు గురై సికింద్రాబాద్లోని యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షులు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు నేడు ఉదయం 11:30 గంటలకు పరామర్శించనున్నారు....
మోసం తన నైజం అని కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి నిరూపించుకున్నది
రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయి డ్యూటీ చేయలేని స్థితిలో మెడికల్ ఆన్ ఫిట్ కోసం దరఖాస్తు చేసుకున్న కార్మికుడికి సింగరేణి మెడికల్ బోర్డు డ్యూటీ ఫిట్ సర్టిఫికెట్ ఇచ్చింది
కాలు కోల్పోయిన కార్మికుడు ఏ విధంగా విధులు నిర్వహించగలడో సింగరేణి యాజమాన్యం సమాధానం చెప్పాలి
విధులు నిర్వహించలేని కార్మికుల వారసులకు ఉద్యోగాలు దక్కకుండా చేసి సింగరేణిని ప్రైవేటుకు కట్టబెట్టే కుట్రలో భాగంగానే నామమాత్రంగా మెడికల్ బోర్డు నిర్వహిస్తున్నారని ఈ ఉదంతంతో తేలిపోయింది
మెడికల్ అన్ ఫిట్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి కార్మికుడిని అన్ ఫిట్ చేసి వారి వారసులకు ఉద్యోగాలు కల్పించి న్యాయం చేయాలి. లేని పక్షంలో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో మరో పోరాటం తప్పదు
విద్యార్థుల విజయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటు. యువతకు ఇచ్చిన హామీలపై ఎక్కడ నిలదీస్తారోనని మీరే ఊరేగింపులు చేస్తారా?
తెలంగాణ యువతకు ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేసిన చరిత్ర మీది. ఇకనైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే తెలంగాణ యువత మిమ్మల్ని గద్దె దించటం ఖాయం.
కాకతీయ యూనివర్సిటీ కేంద్రం గా తెలంగాణ రక్షణ సేన జిల్లా నాయకులు డాక్టర్ పర్లపల్లి శ్రీశైలం ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్ లను బైకాట్ చేస్తూ ర్యాలీగా నీట్ విద్యార్థులపైన జరిగినా లాఠీ ఛార్జ్ కి నిరసనగా ర్యాలీ గా వచ్చి యూనివర్సిటీ SDLCE ప్రాంగణంలో నిరవధిక దీక్షకు దిగటం జరిగింది
కార్యక్రమం లో జిల్లా నాయకులు వెంకటేశ్వర రావు గారు, బోడ అనిల్ నాయక్, శ్రీశైలం, సుమన్, రమేష్ మరియు విద్యార్థి నాయకులు సుతేజ్, భరత్ తదితరులు పాల్గొన్నారు
#trsparty #trs #telanganarakshanasena #delhiprotest #neetpaperleak