🙏 శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవాల సందర్భంగా మల్కాజిగిరి పోలీసుల నుండి ప్రజలకు విజ్ఞప్తి.
భక్తులు పోలీసుల సూచనలను పాటించి, ట్రాఫిక్ నిబంధనలు అనుసరిస్తూ, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే Dial 100/112 కు సమాచారం ఇవ్వండి.
"ముందొచ్చింది"... "అసలైనది" అని కాదు!
సెర్చ్ ఇంజిన్‌లో మొదటి స్థానంలో కనిపించే నకిలీ వెబ్సైట్లు మీ వ్యక్తిగత వివరాలకే వల వేస్తున్నాయి.
ఒక్కసారి ఆలోచించండి... ఒక్కసారి ధృవీకరించండి...
మీ అప్రమత్తతే మీ డబ్బుకు రక్ష.
ఈ వీడియోను చివరి వరకు తప్పక చూడండి! అందరికీ షేర్ చేయండి.
పోలీస్ అధికారి కావాలన్న రాహుల్ కోరికను నెరవేర్చిన సీపీ శ్రీమతి సుమతి బడుగుల, IPS.
పుట్టుకతోనే దివ్యాంగుడైన రాహుల్‌కు పోలీస్ అధికారి కావాలన్నది చిరకాల కోరిక. ఒక్కరోజైనా పోలీస్ అధికారి కుర్చీలో కూర్చోవాలన్న అతని ఆకాంక్షను మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ శ్రీమతి సుమతి బడుగుల, IPS నెరవేర్చారు.
మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ప్రధాన కార్యాలయంలో రాహుల్‌ను తన కుర్చీలో కూర్చోబెట్టి, పోలీస్ క్యాప్ ధరింపజేసి ఆప్యాయంగా పలకరించారు. తన కల సాకారమైన ఆనందంలో రాహుల్ ముఖంలో వెల్లివిరిసిన చిరునవ్వు అందరినీ ఆకట్టుకుంది.
విధి నిర్వహణలో కర్తవ్యం... సమాజం పట్ల మానవత్వం... మల్కాజిగిరి పోలీసుల నిబద్ధత.
#MalkajgiriPoliceCommissionerate #SumathiIPS #Humanity #CommunityPolicing #Inspiration
నకిలీ పత్రాలతో గృహ రుణాల మోసం – కీసర పోలీసుల ఛేదన
నకిలీ స్థిరాస్తి పత్రాలతో వివిధ బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలను మోసం చేసి రూ.4.11 కోట్ల గృహ రుణాలు పొందిన కేసులో 8 మంది నిందితులను కీసర పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ డాక్యుమెంట్లు, మొబైల్ ఫోన్లు, బ్యాంకు రికార్డులు సహా కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన నిందితుల కోసం దర్యాప్తు కొనసాగుతోంది.
#MalkajgiriPoliceCommisionerate #SumathiIPS #KeesaraPolice #HomeLoanFraud #PropertyFraud
Vehicle checking conducted by the Keesara PS Malkajgiri Commissionerate to ensure road safety, verify documents, and promote compliance with traffic regulations.
In a significant breakthrough, Keesara Police arrested 2 accused women involved in a mobile phone theft gang and recovered 60 stolen mobile phones, including the complainant's device. The remaining accused are being traced, while verification of the recovered phones is underway through CEIR, CCTNS & IMEI records.
Prompt action. Professional investigation. Public safety.
#KeesaraPolice #MalkajgiriPoliceCommisionerate #TelanganaPolice
Directions of the Malkajgiri Commissioner of Police (CP) Madam, Keesara Police, in coordination with the Dog Squad, carried out preventive security checks at Suprabhat College, Cheeriyal, to prevent any untoward incidents and ensure the safety and security of the premises.
డ్రగ్స్ ఒక అలవాటు కాదుఅది జీవితాన్ని నాశనం చేసే ఉచ్చు.
మొదట అది సరదాగా కనిపిస్తుంది... తర్వాత స్వేచ్ఛ ఇస్తున్నట్టు అనిపిస్తుంది... చివరికి భవిష్యత్తును, కుటుంబాన్ని, జీవితాన్నే బంధిస్తుంది.మల్కాజిగిరి పోలీస్ డ్రగ్స్‌పై రాజీ లేని పోరాటాన్ని కొనసాగిస్తోంది. డ్రగ్స్‌కు దూరంగా ఉండండి