చీపురుపల్లిలోని నా కార్యాలయంలో ఈరోజు గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించి, ప్రజల నుండి వినతులను స్వీకరించడం జరిగింది. పింఛన్లు, తాగునీరు, సాగునీరు, ఆరోగ్య శ్రీ సమస్యలపై వచ్చిన అర్జీలపై తక్షణమే స్పందించి, వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించాను.
చీపురుపల్లిలోని మన పార్టీ కార్యాలయంలో ఈరోజు జరిగిన క్యాడర్ సమావేశంలో పాల్గొని, కార్యకర్తలతో ముఖాముఖి చర్చించాను. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి, ప్రజాసేవకు కార్యకర్తలు అందిస్తున్న సేవలను అభినందిస్తూ.. వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చాను.
చీపురుపల్లి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నాను. కార్యకర్తల సమస్యల పరిష్కారమే నా ప్రథమ ప్రాధాన్యత. మనమంతా ఒకే కుటుంబంలా కలిసికట్టుగా శ్రమించి, రాబోయే రోజుల్లో చీపురుపల్లిని అభివృద్ధి పథంలో నిలబెడదాం.
#Cheepurupalli#PartyMeeting
ఈరోజు చీపురుపల్లి పార్టీ కార్యాలయంలో *'ప్రజా దర్బార్'* నిర్వహించి, మన నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నాను. మౌలిక వసతులు, రెవెన్యూ, ఇళ్ల స్థలాలపై వచ్చిన వినతులను స్వీకరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అబ్జర్వర్ శ్రీ పుచ్చల విజయ్ కుమార్ గారు, కూటమి నేతలు పాల్గొన్నార
ప్రభుత్వ పాఠశాలల్లో సన్నబియ్యం భోజనం, ఉచిత బస్సు ప్రయాణం, నాణ్యమైన యూనిఫారాల పట్ల ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతోంది. ఈ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కష్టపడే ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటాం. సమావేశంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.
విజయనగరంలో జరిగిన టీడీపీ పార్లమెంట్ స్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొన్నాను. స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత, ఓటరు జాబితా సర్వే మరియు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై చర్చించాము.
చీపురుపల్లి నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు "ఇంటింటి ప్రచారం" కార్యక్రమంపై పార్టీ శ్రేణులతో సమీక్షా సమావేశం నిర్వహించాం. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అందించిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ఇంటింటికీ చేరవేయడమే మన లక్ష్యం.
చీపురుపల్లిలో నిర్వహించిన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనడం జరిగింది. పార్టీ కోసం శ్రమిస్తున్న క్షేత్రస్థాయి కార్యకర్తల సమస్యల పరిష్కారమే నా మొదటి ప్రాధాన్యత.
చీపురుపల్లి టౌన్లో ఆంధ్రప్రదేశ్ హోమ్ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారిపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తెలుగు మహిళల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.
విజయనగరం పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన జిల్లా స్థాయి "సిటిజన్ ఔట్రీచ్ & గవర్నమెంట్ రివ్యూ" కార్యక్రమంలో పాల్గొన్నాను.
రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు, కేంద్రంలో మోదీ గారి ప్రభుత్వం 12 ఏళ్ల ప్రగతిని పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సమీక్షా కార్యక్రమం జరిగింది.
చీపురుపల్లి తెదేపా కార్యాలయంలో ఘనంగా 'గ్రీవెన్స్ డే' నిర్వహించిన స్థానిక శాసనసభ్యులు శ్రీ కిమిడి కళావెంకటరావు గారు.ప్రజల నుండి వినతులను స్వీకరించి, సమస్యల తక్షణ పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడారు.
సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా నియమితులైన గరివిడి మండలం కోనూరు గ్రామానికి చెందిన శ్రీమతి వెంపటాపు అన్నపూర్ణ గారికి అభినందనలు. చీపురుపల్లి నియోజకవర్గానికి సింహాచలం బోర్డులో తొలిసారి ప్రాతినిధ్యం దక్కడం మనందరికీ గర్వకారణం. నేడు వారు నన్ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
చీపురుపల్లిలో ఈరోజు జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొని, పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశాను. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకుని, వారికి ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసా ఇచ్చాను. కార్యకర్తల క్రమశిక్షణ, సమన్వయమే మన పార్టీకి శ్రీరామరక్ష.
#Chipurupalli
స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర'లో భాగంగా నేడు చీపురుపల్లి హెడ్ క్వార్టర్స్‌లో ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించాం. ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలను గుర్తించి ప్రజలు స్వచ్ఛందంగా మార్పు చెందాలి. పేపర్, క్లాత్ బ్యాగులనే వినియోగిస్తూ పర్యావరణాన్ని కాపాడుకుందాం.
@ncbn
సీమ బిడ్డలం అని చెప్పుకున్న వాళ్ళు ఇన్నాళ్ళూ ఈ ప్రాంతాన్ని రాళ్ళసీమగానే చూసారు. కానీ ఆ సీమను పారిశ్రామిక రతనాల సీమను చేయాలని సంకల్పించిన మహర్షి చంద్రబాబుగారు...