వరంగల్ ఎయిర్ పోర్టుకి సమ్మక్క - సారలమ్మ ఎయిర్ పోర్ట్ గా నామకరణం చేయండి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గార్కి..!
మీరు వరంగల్ ఎయిర్ పోర్ట్ కి పేరు సూచించమని పత్రికల ద్వారా అడిగారు. అందుకు మా ప్రతిపాదన..మేము మొట్టమొదటి రోజు నుండి చెబుతున్నట్టు గా.. 90% బహుజనుల ఆరాధ్య దైవ వీర నారీమణు లైన "సమ్మక్క - సారలమ్మ" ల పేరు తో వరంగల్ ఎయిర్ పోర్ట్ కి నామకరణం చేయమని విజ్ఞప్తి తో కూడిన డిమాండ్ మీ ముందు చేస్తున్నాం.
ఈ పేరు మీరు పెడతారని ఆశిస్తున్నాం.
కానీ.. కాకతీయ ,రుద్రమ పేరును మీరు ఆలోచిస్తున్నట్టు తెలిసింది.. కాకతీయ,రుద్రమా అంటే..10% లేని దొరలు,అగ్రకులాల నామ స్మరణ అవుతుంది.
కానీ ఆసియా ఖండం లోనే అతి పెద్ద యుద్ధ జాతర జరిగే..విశ్వవిఖ్యాత వీర నారీ మణులైనా సమ్మక్క - సారలమ్మ ల పేరు పెడితే అద్భుతం గా,గంభీరంగా ఉంటుంది. అందుకే వరంగల్ ఎయిర్పోర్ట్ కి ఈ పేరు ఖాయం చేయమని, తెలంగాణలోని 4కోట్ల మంది బహుజనుల నుండి కోరుతున్నాం. ఒక వేళ ఈ సమ్మక్క సారలమ్మ పేర్లు మీరు పెట్టలేదంటే ఖచ్చితం గా మీరు ఈ అణగారిన వర్గాలకు వ్యతిరేకమని నిరూపణ అవుతుందనీ మీము భావించాల్సివస్తుంది.
@TelanganaCMO@revanth_anumula
#SammakkaSaralammaAirport
#Warangal
#BCSCST
ఖమ్మం వెలుగుమట్ల బాధితులకు అండగా నిలిచేందుకు వెళ్లిన ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు @VisharadanDr గారిని అరెస్ట్ చేయడం దారుణం. పోలీసుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను.
వెంటనే విశారదన్ మహరాజ్ గారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాను.
"ఆత్మహత్య చేసుకొనే వారు ఎన్నటికీ అమర వీరులు కాదు"
ఆ విధంగా కీర్తించకండి.అట్లా కొనియాడే వారికి విజ్ఞప్తి చేస్తున్న.
🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷
ఆత్మహత్య చేసుకునే వారిని "అమరవీరులు" "తొలి అమరుడు" 'అమరత్వం' ...ఇలాంటి పదాలు అనవద్దు. ఆత్మహత్య చేసుకున్న వారిని పిరికివారు, మార్గం తెలియని అమాయకులు అనండి. అంతేగాని...వారిని పట్టుకుని అమరత్వం, అమరవీరుడు, BC తొలి అమరుడు అంటే అది గొప్పదిగా, గర్వంగా హుందా తో కూడిన గౌరవంగా, ఉద్యమ వీరుడుగా వారు భావించుకొని.. తెలంగాణలో మంచి మనసు ఉండి ,భావోద్వేగ BC,SC,ST అమాయకులంతా ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం ఉంది. సమస్య పరిష్కారం కొరకు శాంతియుత, ప్రజాస్వామ్య పోరాటం,యుద్ధం చేయాలి, ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవాలి,భావజాల వ్యాప్తి చేస్తూ, ప్రజలకు నాయకత్వం వహించి వారిని మనమే కన్నబిడ్డలుగా చూడాలీ. ఆ పోరాట జీవితంలోనే కాల ధర్మం చెందటం,లేదా పాలక వర్గాల చేతిలో నష్ట పోవడం అమరత్వం అవుతుంది తప్ప ఆత్మహత్యలు చేసుకొనే వార్ని అమరవీరులు గా కీర్తించవద్దు
ఆత్మహత్య చేసుకున్న వారిని అమర వీరులు అనడం అగ్రకులాల కుట్ర. ఎందుకంటే మన చావులు వారికి కావాలి దానితో వారు సింహాసనం ఎక్కాలి కాబట్టి. కానీ మనకి.. మన వారు బతకటం కావాలి." ఫూలే - అంబేడ్కర్ - కాన్షిరాం "ల మార్గమే మనకు ఆదర్శం.
మంచి మనసు ఉండి, జీవిత, పోరాట మార్గం తెలియకుండా ఈశ్వర చారి 42% బీసీ రిజర్వేషన్ల కోసం చనిపోతే... 1)ప్రభుత్వం కళ్ళు తెరిచి సమస్యను వెంటనే పరిష్కరించాలి , 9th షెడ్యూల్లో BC 42% రిజర్వేషన్లను చేర్చాలి.
2. ఈశ్వర చారి కుటుంబానికి ఒక కోటి రూపాయలు పరిహారం చెల్లించాలి .
3. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి.
4. ఈశ్వర చారి మృతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరపాలి. తన చావుకి కారణమైన ప్రేరేపిత శక్తుల్ని శిక్షించాలి.
#BCSCST
#Telangana
#Constitution
#reservations
ప్రపంచ చరిత్రలో ఇదొక విచిత్ర బంద్.
సైతాన్ భగవాన్ గా మారడం అంటే ఇదేనేమో..!
🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸
బీసీ ల 42% రిజర్వేషన్ లకు వ్యతిరేకంగా "కాంగ్రెస్, బీజేపీ, BRS పార్టీలు" నేడు తెలంగాణా అంతటా బంద్ ను విజయవంతం చేశాయి.
#BCReservations#Telangana#BCSCSTJAC#CongressBJPBRS
BC బంద్ కి మా మద్దతు
🔹🔸🔹🔸🔹🔹🔸🔹
రేపు శనివారం జరిగే 42% రిజర్వేషన్స్ పై జరిగే..BC బంద్ కార్యక్రమానికి మా బీసీ, ఎస్సీ , ఎస్టీ JAC ఉద్యమం.. సంపూర్ణ నైతిక మద్దతు ఇస్తున్నాం,మా శ్రేణులంతా బంద్ లో పాల్గనాలని కూడా పిలుపునిస్తున్నాం.బంద్ పిలుపు ఎవరిదైనా.. అది రెండు కోట్ల మంది బీసీ ల గుండె ఘోష ..ఆ ఘోష ను రగిలించిన వారిగా..ఆ నిరసన బంద్ లో మా భాగస్వామ్యం ఉంటుంది. ఇప్పటికైన రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం గా..పార్లమెంట్ 9th షెడ్యూల్ లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నాం.
#BCReservations
#Telangana
#BCSCSTJAC
BRS, కాంగ్రెస్, హైడ్రా లు ముగ్గురు,ఐకమత్యం తో కలిసి తొలి వెలుగు రఘు పై చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.
🔹🔸🔹🔸🔹🔸🔹
తెలంగాణ లో సామాజిక న్యాయపోరాటంలో భాగమవుతున్న తొలి వెలుగు ఛానల్ రఘు పై BRS, T న్యూస్, హైడ్రా, కాంగ్రెస్, ప్రభుత్వాలు కలసి నిరాధార ఆరోపణలు,నిందల తో చేస్తున్న దాడిని విరమించుకోవాలి అని డిమాండ్ చేస్తున్నాం.ఇది మంచి పద్ధతి కాదు అని హెచ్చరిస్తున్నాం.
#ManatoliveluguRaghu
#BC ల రిజర్వేషన్స్ కోసం.. #రేవంత్ రెడ్డి కేంద్రం పై భారీ యుద్ధానికి దిగాలి
🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹
తెలంగాణ లో వస్తున్న బీసీ చైతన్యాగ్ని ని నిశితంగా గమనిస్తున్న రేవంత్ రెడ్డి అనివార్య, దిక్కుతోచని పరిస్థితి లో.. రాష్ట్ర పరిధిలో 42 శాతం "థర్మకోల్ షీట్ రిజర్వేషన్ల ను" ప్రతిపాదిస్తున్నాడు. ఇది బీసీ ల రిజర్వేషన్ల కు శాశ్వత విముక్తి కాదు.అది ఈరోజు కాక పోయినా రేపై నా హైకోర్టు,సుప్రీంకోర్టు లలో ఎట్టి పరిస్థితులలో నిలబడలేదు. అయినా అగ్రవర్ణ, మాయా మాంత్రిక రాజకీయ వలలు బీసీల పై విసురుతున్నారు.
రేవంత్ రెడ్డి కి బీసీ ల పట్ల ప్రేమ ఉంటే 42% బీసీ రిజర్వేషన్లను పార్లమెంట్ ద్వారా 9th షెడ్యూల్లో పెట్టించడానికి కేంద్ర ప్రభుత్వం పై భారీ యుద్ధం చేయాలని బీసీ,ఎస్సీ,ఎస్టీ జేఏసీ గా డిమాండ్ చేస్తుంది. ఈ విషయంలో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షులు చిరంజీవి గారి అభిప్రాయాలతో బీసీ,ఎస్సీ,ఎస్టీ జేఏసీ సంపూర్ణంగా ఏకీభవిస్తుంది.
#BCReservations
#Telangana