క్రీడాకారులను కూడా మోసం చేస్తరా కాంగీస్ ??? మీ లాగే మీరిచ్చిన చెక్కులు కూడా బౌన్స్ అయినయి. చీటింగ్ కేసు పెట్టాలె మీ అందరి మీద.
పడిగ తేజేష్ అనే ఈ యువకుడు యువకుడు స్కేటింగ్ క్రీడలో అంతర్జాతీయ స్థాయిలో సుమారు 174 పథకాలు సాధించాడు. తెలంగాణ పేరును ప్రపంచ నలుదిశల వ్యాపించేలా చేశాడు. ఏషియన్ గేమ్స్ కావచ్చు, ఓషియానియా (Australia and NZ) ఛాంపియన్షిప్ గేమ్స్ కావచ్చు ఖేలో ఇండియా కావచ్చు ఇలా అనేక ఛాంపియన్షిప్ గేమ్స్ లో అతను ప్రతిభను కనబరిచి మన తెలంగాణకు బంగారు,సిల్వర్ బ్రాంజ్ మెడల్స్ సాధించి పెట్టాడు. కానీ మీరు ఇతనికి ఇచ్చిన ₹5,00,000 చెక్కు కూడా బౌన్స్ అయింది.
అయితే 2025 స్పోర్ట్స్ డే రోజు స్వయంగా రాష్ట్ర స్పోర్ట్స్ మినిస్టర్ వాకిటి శ్రీహరి గారు ఐదు లక్షల చెక్ ఇచ్చి,అతనితో ఫోటో దిగి, ఇప్పటికి పది నెలలు గడిచింది!!!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు తెలంగాణలో స్పోర్ట్స్ పాలసీ ప్రకటించి, క్రీడల్లో తెలంగాణ యువతను ఒలంపిక్స్ వరకు తీసుకెళ్లే విధంగా రూపకల్పన చేస్తామని చెప్పారు.
అవసరమైతే ప్రతి నియోజకవర్గానికి మినీ స్టేడియం కట్టించి యువతను క్రీడారంగం వైపు ఎక్కువ ఆసక్తి చూపేలా చేస్తామని కూడా చెప్పారు.
అంతర్జాతీయ ఫుట్ బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీని కూడా హైదరాబాద్ కు పిలిపించి, కోట్ల రూపాయలు ఖర్చు చేసి, మీరు కూడా అతనితో కలిసి ఫుట్ బాల్ ఆడారు.
మీరు ప్రకటించిన స్పోర్ట్స్ పాలసీ ప్రకారం తేజేష్ అనే క్రీడాకారునికి అక్షరాల కోటి 55 లక్షల రూపాయలు రావాల్సి ఉండే.
తెలంగాణ ప్రభుత్వం మరి ఏ విధంగా తెలంగాణలో ఉన్న యువతను ఒలంపిక్స్ వరకు పంపించగలుగుతారండి రేవంత్ రెడ్డి గారు.
మీరు మెస్సీతో ఆడటానికి మాత్రం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టొచ్చు కానీ, ఒక యువకుడు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్లకున్న పొలాన్ని తాకట్టు పెట్టి మరి ఆ యువకున్ని, అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్తే ప్రభుత్వము నుండి మీరు అందించాల్సిన సహకారం ప్రోత్సాహం ఇదేనా?
మీ స్పోర్ట్స్ పాలసీ ఇదేనా? మీకు మెస్సీ హైదరాబాద్ వచ్చి ఇలాగే క్రీడాకారులను మోసం చేయమని చెప్పారా?
వెంటనే తేజేష్ కు స్పోర్ట్స్ పాలసీ ప్రకారం రావలసినటువంటి డబ్బుల విడుదల చేయాలి.
తేజేష్ తో పాటు మిగతా తెలంగాణ క్రీడాకారులు ఎవరైతే నేషనల్ లెవెల్ లో గాని, ఇంటర్నేషనల్ లెవెల్ లో గాని ప్రతిభ కనబరిచి పథకాలు సాధించారో, వాళ్లందరికీ మీరు ప్రకటించిన స్పోర్ట్స్ పాలసీ ప్రకారం ఇవ్వాల్సిన పారితోషకం, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం వెంటనే ఇవ్వాలి.
లేదంటే క్రీడాకారులందరితో కలిసి మేము మీ మోసపూరిత ప్రభుత్వాన్ని ఫుట్ బాల్ ఆడవలసి వస్తుంది.👊👊👊⚽️⚽️⚽️
జై తెలంగాణ✊
@TelanganaCMO@AuthorityIndia@Vakiti_srihari@revanth_anumula
నాడు-నేడు:
ఈ అమ్మాయి పేరు, గద్దల లక్ష్మీ ప్రసన్న, పెద్దపల్లి జిల్లా. ఈమె కేసీఆర్ గారి హయాంలో గురుకులాల్లో చదివి ఉన్నత విద్యకోసం గుజరాత్-గాంధీనగర్ లోని ప్రతిష్ఠాత్మక రక్షా యూనివర్సిటీలో చేరి భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము గారి చేతుల మీదుగా బంగారు పతకం ఇటీవలే అందుకుంది.
💐💐💐
ఇలాంటి బిడ్డలను ఆనాడు వేల మందిని కేసీఆర్ గారి ఆదేశాల మేరకు Higher Education Camps పెట్టి దేశం నలుమూలల ఉన్న గొప్ప విశ్వవిద్యాలయాల్లో నికి పంపించే వాళ్లం.
నేడు కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో ఉన్నత విద్య క్యాంపుల(HEC) మాట దేవుడెరుగు, పిల్లలు శవాలై ఇంటికి వస్తున్నారు.
ప్రతి వారం ఒక బిడ్డ ప్రాణాలు కోల్పోతున్నది.😭
@TelanganaCMO@BRSparty@KTRBRS@BRSHarish
రేవంత్ రెడ్డిగారు చెప్పిన మాటలే విద్యా కమిషన్ రిపోర్ట్‌లో కాపీ-పేస్ట్ చేసి భారీ కుట్ర చేశారు.
ఇది విద్యా సంస్కరణ కాదు, కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేసి
తెలంగాణ బిడ్డల భవిష్యత్ అపహరణ.
కమీషన్ తెలంగాణ ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని భంగపరచి , జీతాలు తగ్గించి, ప్రమోషన్లు ఆపి, కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్తో గురువుల్ని మళ్లీ అభద్రతలో పెట్టాలనుకుంటున్నారు.
సిలబస్ మరియు పెడగోజీ ని మార్చకుండా విద్యను కాషాయీకరించే బీజేపీ-రేవంత్-కాంగ్రేసు కుట్రలో భాగమే ఈ విద్యా రిపోర్ట్ విడుదల.
లక్షలాది ఉపాధ్యాయులకు పిల్లల తల్లిదండ్రులకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి!
ఐఏఎస్, ఐపీఎస్‌లకు డైరెక్ట్ ప్రమోషన్లు ఇస్తారు, ఉపాధ్యాయులకు మాత్రం టెస్టులు పెడతారా? ఇదెక్కడి న్యాయం?
ఇది డబుల్ స్టాండర్డ్ కాదా మురళి గారు?
ఫీ రీయింబర్స్మెంట్ తీసేసి పేద విద్యార్థుల్ని ఇంజినీరింగ్, మెడికల్ సీట్ల నుంచి దూరం చేసే పెద్ద కుట్ర చేయడానికి చేతులెలా వచ్చినయి మీకు! EAPCET రద్దు చేస్తే లాభపడేది, చైతన్య నారాయణ లే అన్న విషయం తెలవదా?
గురుకుల పాఠశాలలు, డిగ్రీ కాలేజీలు క్రమంగా మూసేస్తే గ్రామీణ పేదల బిడ్డలు ఏం చేయాలి? బర్లు గొర్లు కాయాలా? బాల్యం లోనే తల్లులు కావాలా? ఇప్పటి దాకా 125 మంది బిడ్డలను బలిగొన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అయినా రక్త దాహం తీరలేదా?
కేసీఆర్ గారు టీచర్లకు పీఆర్సీ వేసి 42% ఫిట్మెంట్ ఇచ్చారు,
కాంట్రాక్ట్ పోస్టులను రెగ్యులరైజ్ చేశాడు, 29 మెడికల్ కాలేజీలు పెట్టారు , “మన ఊరు-మన బడితో” వేలాది స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించారు.
మరి మీరేం చేశారు? ఖమ్మం వెలుగుమట్లలో ఇళ్లు నేలమట్టం చేసి విద్యార్థులను రోడ్ల మీద పడేశారు. ఇప్పుు గాంధీ పేరుతో మళ్లీ హైదరాబాదు ను మరో గాజా లాగా మారుస్తాం అంటున్నారు. బెంచీల కుంభకోణం తో కాంట్రాక్టర్ల జేబులు నింపుతున్నారు.
ఆకుకూర మురళి గారూ, కేసీఆర్ గారి మీద గురుకులాల మీద కోపం ఉంటే, విద్యార్థుల గురువులు మీద రేవంత్ రెడ్డి తో కుమ్మక్కై రాజకీయ విషం చిమ్మకండి!
గురుకులాలు తీసేస్తే పేద బిడ్డలు ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లాలా? తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ తో ఖర్చు ఆదా అవుతుందా? తెలంగాణ పబ్లిక్ పాఠశాలు పెట్టి మిగతా వేల స్కూళ్లు మూసేస్తారా??
ఇది ఖర్చు కట్ కమిషన్ లా ఉంది, విద్యా కమిషన్ కాదు!
మీరు రిపోర్ట్ మొదటి పేజీలోనే “రేవంత్ విజన్” అని రాశారు ఆ విజన్ ను కనీసం తన కొడంగల్ లో అమలు చేసి చూపించమని చెప్పండి మీ సీయం గారికి.
ఇది తెలంగాణ విద్యా కమిషన్ కాదు, రేవంత్ విషపు కమీషన్.
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మీ ఈ రిపోర్ట్‌ను చెత్తబుట్టలో వేస్తాం! తెలంగాణ విద్యను, ఉపాధ్యాయుల గౌరవాన్ని, పేద బిడ్డల భవిష్యత్తును కాపాడుతాం!! 🔥💪
జై తెలంగాణ.
#CongressDestroyingTelangana
కోస్ని గ్రామంలోని ప్రాణహిత భవన్లొ న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సార్ గారు కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
@RSPraveenSwaero
నిరుద్యోగులకు, గ్రూప్ 1 అభ్యర్థులకు మద్దతుగా చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో పుస్తకాలు చదువుతున్న బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు.
@RSPraveenSwaero@KTRBRS@BRSHarish@BRSparty#tspscgroup1
కాంగ్రెస్ పాలనలో గురుకులాల విద్యార్థుల ప్రాణాలకు విలువ లేదు.
నడిగూడెం గురుకులంలో జ్వరంతో బాధపడుతూ 8 వ తరగతి విద్యార్థిని షేక్ సుహానా కన్నుమూసింది.
ఈ అమ్మాయి ప్రాణాలు ఎవరి తెచ్చిస్తారు?
గతంలో కేసిఆర్ పాలనలో గురుకులాల్లో ఒక్క విద్యార్థి కూడా అనారోగ్య కారణాలతో మరణించకుండా పనేషియా ఉండేది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనేషియా సర్వీస్ తొలగించి, విద్యార్థుల ప్రాణాలను గాలికొదిలేసింది.
విద్యాశాఖ మంత్రి-సీయం వెంటనే రాజీనామా చేయాలి.
ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 105 మంది విద్యార్థులు ఈ లోకాన్ని వదిలివెళ్లారు.
ఇంకెంత మంది విద్యార్థులు బలి కావాలి @revanth_anumula గారు?
@TelanganaCMO
వ్యూస్ పెంచుకోవడం కోసం మరీ ఇంత దిగజారుడు జర్నలిజమా, @RTVnewsnetwork ?
నేను చెప్పిందేంటి? మీరు పెడ్తున్న శీర్షికలు ఏంటివి??
I have consciously decided to follow KCR garu when I joined @BRSparty last year because Telangana can regain glory only under his leadership
వ్యూస్ పెంచుకోవడం కోసం మరీ ఇంత దిగజారుడు జర్నలిజమా, @RTVnewsnetwork ?
నేను చెప్పిందేంటి? మీరు పెడ్తున్న శీర్షికలు ఏంటివి??
I have consciously decided to follow KCR garu when I joined @BRSparty last year because Telangana can regain glory only under his leadership
బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సహా ఇతర BRS నాయకులను అక్రమంగా అరెస్ట్ ను ఖండించిన మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
పొడు భూముల పట్టాల కోసం పోరాడుతున్న కొమురం భీం అసిఫాబాద్ జిల్లా దిందా రైతులకు మద్దతుగా నిలబడిన BRS పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ మరియు ఇతర BRS నాయకులను కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేయడం కాంగ్రెస్ అప్రజాస్వామిక పాలనకు పరాకాష్ట
రేవంత్ రెడ్డి ని,కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తమ హక్కుల సాధన కోసం,ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజలు ప్రశ్నిస్తే జీర్ణించుకోలేక పోతున్నారు
ప్రశ్నించిన వారిపై కక్ష తో అక్రమ కేసులు పెట్టి లోపల వేస్తాం అన్న తీరుగా కాంగ్రెస్ పాలన కొనసాగుతుంది.
ఇది ప్రజాపాలన కాదు నిర్బందపు నిరంకుశ పాలన
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పొడు పట్టాలు ఇవ్వకుండా వేధిస్తోంది.
పట్టాలు ఇవ్వాలని నిరసన తెలుపుతున్న రైతుల చేతులకు సంకెళ్లు వేయడమే కాకుండా మద్దతుగా వచ్చిన ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ను ఇతర BRS నాయకులను కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది
ప్రజలు అన్ని గమనిస్తున్నారు.కాంగ్రెస్ సాగిస్తున్న ఈ నిర్బందపు రాక్షస పాలనకు అంతం పలికే రోజు వస్తుంది.
#newsupdate2025 #brspartynews #brspartysocialmedia #brspartyoffice #brspartyonline #newsbreakapp #KTR #BRSParty #KCR
So very kind of you @KTRBRS garu for standing by me, the underprivileged communities , and the constitutional values of justice, liberty, equality, and fraternity.
While other so called national leaders only talk of equality and fraternity with hatred in their heart, you on the other hand, always remained inclusive both in your words and deeds.
Nation needs truly empathetic leaders like you and I am waiting (and working relentlessly) for the opportunity to contribute in building the most innovative, inclusive, and invincible India under your visionary leadership.
Thank you casteist bigots for you have been making me stronger and more focused person every time.
@ndtv@IndianExpress@scroll_in@htTweets@the_hindu@ThePrintIndia@ambedkariteIND@NationalDastak@TimesNow@timesofindia@frontline_india@thecaravanindia@epw_in@PTI_News@ANI
Dr R S Praveen Kumar is one of the most humble and kind humans I have met. He works tirelessly towards a better world…every single day. He could’ve held on to his plush job and not care a damn for the society around, but his conscience didn’t allow him to
I am proud of being his colleague
To troll him in the name of caste is an indicator of how low we have fallen as a society
To those that are saying casteist nonsense, I hope you all become humans soon. Sending you love and sanity
Jai Bhim
Jai Hind
Jai Telangana
రేవంత్ రెడ్డి గారు,
మీరు గత @BRSparty@KCRBRSPresident గారి ప్రభుత్వంలో నేను గురుకుల అధికారిగా ఉన్నప్పటి కాలంలో అక్రమాలు జరిగాయన్న నెపంతో మీ ఆదేశాల మేరకు కొందరు అధికారులు ఇప్పుడు ఎన్ని ఆడిట్ పరిశోధనలు చేసి తవ్వకాలు జరిపినా మీకు కనిపించేవి పేద విద్యార్థుల విజయ గాథలు మాత్రమే. అంతకు మించి మీకేం దొరకదు. గాంధీ భవన్లో మీ లిల్లీపుట్ నాయకులు కొందరు మాట్లాడుతున్న చిల్లర మాటలు పేద వర్గాల పట్ల మీకున్న అక్కసును తెలియజేస్తున్నాయి.
తరతరాలుగా కొడవల్లు, చీపుర్లు తట్టలు పట్టిన చేతులు, కంప్యూటర్ చిప్ లతో ఆడుకోవడం, కోడింగ్ భాషను నేర్చుకోవడం అన్న గొప్ప కలను కని దాన్ని నిజం చేయాలంటే మొండి ధైర్యం కావాలి. ఈ వర్గాల పట్ల Empathy ఉండాలి. కేసీఆర్ గారికి ఇవన్నీ మెండుగా ఉన్నాయి కాబట్టే నేను ఈ కలను కాంతి వేగంతో నిజం చేసే ప్రయత్నం చేశాను.
మీ సంకుచిత కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మిమ్మల్ని గైడ్ చేస్తున్న కొందరు మనువాద అధికారులకు ఈ కలలు అర్థం కావాలంటే కనీసం కోటి సంవత్సరాలు పడుతుంది.
అందుకే మీరు మా పిల్లలకు వ్యక్తిత్వ వికాసం పేరుతో టాయిలెట్ల భాష నేర్పిస్తామంటున్నారు, మేము మరో ప్రపంచానికి అవసరమైన కంప్యూటర్ భాష నేర్పిస్తామంటున్నం.
మళ్లీ చెబుతున్నా, ఎన్ని కోట్లు ఖర్చయినా సరే రాబోయే రోజుల్లో మునుపటి కంటే బాగా ఈ భవిష్యత్ భాష లను నేర్పిస్తాం. 👊
మీరు నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా, మీ భాషలో- కోసుకొని తిన్నా, నేను నా పంథాను మార్చుకోను. మీరు పత్రికలకు ఇస్తున్న లీకులకు నిరాశపడను.
నేను చివరి వరకు అణచివేతకు గురైన వర్గాలను ఆకాశం అంచుల వైపు నడిపించే ప్రయత్నం చేస్తూనే ఉంటా.
Life is finite. Don’t waste it.
మీకొచ్చిన ఈ అరుదైన అవకాశాన్ని ఎట్లా వాడుకోవాలన్న విషయాన్ని మీకే వదిలేస్తున్నా.
ధన్యవాదాలు.
@revanth_anumula@TelanganaCMO@BRSparty@KTRBRS
ఇంత ఘోరమైన పరిస్థితులు మన దేశంలో అదీ మన రాష్ట్రం లో వస్తదని నేను కలలో కూడా ఊహించలేదు. సీయం @revanth_anumula మీరేం చేస్తున్నారో మీకు అర్థం అయితున్నట్లు లేదు. అర్జంటుగా మీరు మౌనం వీడి బెటాలియన్లకు పోండి. కానిస్టేబుళ్ల కుటుంబాలతో మాట్లాడండి. వాళ్లను అక్కున చేర్చుకోండి. వాళ్లూ తెలంగాణ బిడ్డలే. మీ అనాలోచిత చర్యల వల్ల పోలీసులకు తప్పుడు సంకేతాలు పోతున్నాయి. మీ ఈ నిర్ణయం ప్రభావం తరతరాల మీద పడబోతుంది. This is a serious issue of internal security. Hope you understand this at the earliest.
#EkPolice
#TGSP
గత 65 రోజులుగా అమర్ రాజా పరిశ్రమ వద్దని 4th వార్డ్ ఏదిరా మహబూబ్‌నగర్ ప్రజలంతా పార్లమెంటు ఎన్నికలను కూడా బహిష్కరించిన అధికారుల నుండి ఎలాంటి స్పందన లేదు. అమర్‌రాజ పరిశ్రమ పనులను ఆపివేయాలని కలెక్టర్ గారిని కోరుతున్నాం
@Collector_MBNR
ఈరోజు ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఓటరుకు ధన్యవాదాలు. నన్ను నమ్మి నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా ఖరారు చేసి శ్రమించిన భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి #KCR గారికి హృదయపూర్వక ధన్యవాదములు. ఎంతో ఒత్తిడి ఉన్నా నా కోసం విలువైన సమయాన్ని వెచ్చించిన భారాస వర్కింగ్ ప్రసిడెంట్ @KTRBRS గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
గత 50 రోజులు హోరాహోరీగా సాగిన పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ప్రతి గ్రామంలో అడుగడుగునా అఖండ స్వాగతం పలికి, పార్టీలకతీతంగా మద్దతుగా నిలిచి,
నా వెన్నంటి ఉండి,గెలుపు దిశగా నడిపించిన నాగర్ కర్నూల్ ప్రజలకు, #BRS పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలకు, నా అభిమానులకు వేల కోట్ల కృతజ్ఞతలు.
మీ త్యాగాన్ని కృషిని ఎప్పటికీ మరువలేను.
మీరు పడ్డ శ్రమ వృధా కాదు.
మీ అందరికీ జీవితాంతం రుణపడి ఉంటాను. 🙏
ఐదు నెలల కాంగ్రెస్ ప్రజా పాలనలో ప్రజలు
ఏం కోల్పోయారో స్పష్టంగా తెలుసుకున్నారు.
పదేళ్లు కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన రాష్ట్ర అభివృద్ధికే ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వనున్నారు.
మే 13 న జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూల్ లోక్‌సభ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని గెలిపించుకుందాం.
ఈవీఎంలో సీరియల్ నెంబర్ 1 పక్కన ఉన్న కారు గుర్తుపై ఓటు వేసి.. నాగర్ కర్నూల్ ప్రజల గొంతుక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని పార్లమెంటుకు పంపుదాం.. మన సమస్యలపై పోరాడే గళానికి బలాన్నిద్దాం.
🚗 కారు గుర్తుకే మన ఓటు!
✊ జై తెలంగాణ!!
@RSPraveenSwaero
#VoteForCar