@ncbnను రక్షించడమే మీ లక్ష్యమా @realyssharmila గారూ? జాతీయ స్థాయిలో కూటమి పార్టీలను కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంటే మీరు మాత్రం ఇక్కడ చేతులు కలిపారు. దేవుడి ఆశీస్సులు, ప్రజల మద్దతు ఉన్నంత కాలం మీలాంటి వారు ఎన్ని కుట్రలు చేసినా మా నాయకుడికి ఏమీ కాదు.
#జోహార్ YSR#
ఇవ్వాళ్టికి 23 ఏళ్ళు. ఏప్రిల్ 9, 2003 లో చేవెళ్ల నుంచి ఇచ్చాపురం దాక ప్రజాహితమే పరమావధిగా సాగిన 1457 కిలోమీటర్ల పాదయాత్ర.. కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనూ అధికారంలో తెచ్చిన ఒక శాశ్వత జ్ఞాపకం. కాంగ్రెస్ నాయకుడు, నాన్న YSR ప్రజాప్రస్థానం తెలుగు ప్రజల గుండెల్లో ఇవ్వాళ్టికి పదిలం. ప్రతిపక్ష నేతగా ఆనాటి పాదయాత్ర నేటి అభివృద్ధికి నిర్వచనం. 23 ఏళ్లుగా సంక్షేమానికి మహానేత పెట్టిన చెక్కుచెదరని సంతకం. ప్రజలకు నేనున్నాననే బరోసా కల్పించిన అభయహస్తం. రాష్ట్ర దుర్భర పరిస్థితులను అంతమొందించిన స్వర్ణయుగం.
వారసులం అని చెప్పుకునే @ysjagan జగన్ మోహన్ రెడ్డి గారు YSR పేరును వాడుకున్నారు తప్పిస్తే ఆయన ఆశయాలకు వారసులు కాలేదు. YCP లో నిజంగా YSR ఐడియాలజీ ఉంటే జగన్ గారు CM అయ్యి కూడా YSR జలయజ్ఞాన్ని ఎందుకు పూర్తి చేయలేదు ? మాట తప్పం మడమ తిప్పం అనే వైఎస్సార్ లైన్ వాడుకోవడం తప్పిస్తే, పూర్తి మద్యపాన నిషేధమని మాట ఇచ్చి, కల్తీ మద్యం అమ్మి “ఓన్లీ క్యాష్” మాఫియా ఎందుకు చేశారు ? YSR తన జీవిత కాలం వ్యతిరేకించిన BJP కి దత్తపుత్రుడుగా ఎలా మారారు ? YSR హయాంలో రాష్ట్రంలోనే ప్రారంభించిన ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తే మౌనంగా ఎందుకున్నారు ? దేశ వ్యాప్తంగా క్రిస్టియన్ మైనారిటీలపై RSS వాదులు దాడులు చేస్తుంటే YSR వారసుడుగా జగన్ గారు ఎందుకు ఖండించలేదు ? 3 రాజధానుల పేరుతో రుషికొండ మింగేసి సొంతానికి ప్యాలెస్ లు కట్టుకున్నారు. ఇప్పుడు “మావిగన్ జోకర్” గా మిగిలారు.
సంక్షేమానికి సారథి దివంగత నేత కాంగ్రెస్ ముఖ్యమంత్రి YSR. ఆయన ప్రతీ పథకం ప్రజల కష్టం కన్నీళ్ల నుంచి పుట్టిందే. ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ, రాజీవ్ ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, జలయజ్ఞం, ఇందిరమ్మ పక్కా ఇండ్లు, పావుల వడ్డీకే రుణాలు, 108/104 అంబులెన్స్ సేవలు ఇలా ప్రతీది ఒక చరిత్ర. మిగతా రాష్ట్రాలకు ఆనాడు YSR పథకాలు ఆదర్శం. YSR ఐడియాలజీ బ్రతికి ఉంది కేవలం కాంగ్రెస్ పార్టీలోనే. మహానేత ఆశయాలు మళ్లీ కాంగ్రెస్ తోనే సాధ్యం. ఈ సందర్భంగా ప్రతి YSR అభిమానికి చేతులెత్తి ఆహ్వానం పలుకుతున్నా. దివంగత నేత ఆశయ సాధనకు హస్తంతో జతకడతాం. ఆనాటి సంక్షేమ పాలనను మళ్లీ కాంగ్రెస్ తో తీసుకు వద్దాం.
YSR అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే YSR
@INCIndia@INC_Andhra@RahulGandhi@kharge@priyankagandhi@kcvenugopalmp@manickamtagore
గుణం లేని వాడు కులం గొడుగు పడతాడు.
మానవత్వం లేని వాడు మతం ముసుగు వేస్తాడు.
పసలేని వాడు ప్రాంతం ఊసెత్తుతాడు.
జనులంతా ఒక కుటుంబం. జగమంతా ఒక నిలయం.
-శ్రీ గుర్రం జాషువా
ఎన్టీఆర్ జిల్లా కస్తూర్బా పాఠశాలలో 11 మంది బాలికలను ఎలుకలు కరిచాయి. ఇదేమీ మొదటి సారి కాదు. ఏలూరు మెడికల్ కాలేజ్ హాస్టల్లో వైద్య విద్యార్థులను ఎలుకలు కరిచాయి.
పల్నాడు జిల్లా బోయపాలెంలో విడదల రజినీపై దాడి చేయడం ప్రజాస్వామ్యానికి మచ్చ. మాజీ మంత్రి, బీసీ మహిళకు కూడా రక్షణ ఇవ్వలేని పాలన ఇదేనా @ncbn? విడదల రజనీగారిపై జరిగిన దాడిని ఖండిస్తున్నా.
#NoAnimalFatInTTDLaddu#TirupatiLiesExposed#TDPAntiBC
ప్రజాస్వామ్యంలో నేరస్తులను శిక్షించాలి కానీ కాపాడకూడదు. అధికారంలో ఉన్నవాళ్లకు చట్టం వర్తించదని మీరు అధికారికంగా ప్రకటించారా @ncbn? జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వంపై చర్యలు ఎప్పుడు @pawankalyan?
At Davos, Gita Gopinath identified clean land titles as one of India’s biggest growth challenges—and acknowledged Andhra Pradesh’s innovative work. That recognition validates the vision YS Jagan executed on the ground. #YSJaganLandReforms
రెండేళ్లు గడవకముందే బడ్జెట్ లోపల–బడ్జెట్ బయల కలిపి దాదాపు రూ.3 లక్షల కోట్ల అప్పులు. @ncbn గారు, ఇంత భారీ అప్పులతో రాష్ట్రంలో కొత్తగా ఏం అభివృద్ధి చేశారో చెప్తారా?
గంజాయికి వ్యతిరేకంగా బ్రహ్మాండంగా ప్రచారాలు చేస్తారు. కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేస్తారు. కానీ గంజాయి విచ్చలవిడిగా దొరుకుతున్నా చర్యలు మాత్రం తీసుకోరు. ఇదేమీ పాలన @ncbn గారు? రాష్ట్ర యువతను గంజాయి మత్తులో ముంచాలన్నదే మీ ధ్యేయమా?
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై మరింత భారం పడుతుందని తెలిసి కూడా ఎందుకు ముందుకు వెళ్తున్నారు @ncbn గారూ? పేద విద్యార్థులు ఏమై పోయినా పర్వాలేదు. .
అధికారం కోసం, వేరే పార్టీపై నిందలు వేయడం కోసం ఇంతగా దిగిజారిపోవాలా @ncbn గారూ? భోలే బాబా డెయిరీకి అనుమతులు ఇస్తూ సంతకం మీరు చేసి, కల్తీ జరిగిందని అంటే దానికి బాధ్యత వహించాల్సింది మీరు కాదా? సమాధానం చెప్పండి బాబూ?
తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక ఆ పంటలను రోడ్డుపై పారబోయడం, పొలాల్లో అలాగే ఉంచి దున్నేయడం వంటి విషయాలు మీ దృష్టికి రాలేదా @ncbn గారూ? ఈ పరిస్థితి రావడానికి కారణం మీరు కాదా? ఇది రైతు ప్రభుత్వమా? రాక్షస ప్రభుత్వమా?
వీరబ్రహ్మేంద్ర స్వామి ఇల్లు కూలిపోయినా మీ ప్రభుత్వంలో చలనం లేకపోవడం చాలా బాధాకరం @ncbn గారు. భక్తుల విశ్వాసాలనూ కాపాడలేని ప్రభుత్వం ఉన్నా ఒకటే..లేకపోయినా ఒక్కటే.
రాజమండ్రి వెల్ఫేర్ హాస్టల్లో చదువుకుంటున్న పదో తరగతి బాలికకు అజేయ్ అనే యువకుడు మాయమాటలు చెప్పి లైంగిక దాడి చేశాడంటే రాష్ట్రంలో మహిళలకు రక్షణ అనేది ఉందా @ncbn గారూ? మహిళలకు రక్షణ కల్పిస్తున్నామని మాటల్లో చెప్పడం కాదు చర్యల్లో కనిపించాలి.
పార్వతీపురం మన్యం జిల్లా, గుంటూరు జిల్లా తురకపాలెం ప్రజలు ఏడాది నుంచి తాగునీరు మురికిగా వస్తోందని మొత్తుకుంటున్నా @ncbn ప్రభుత్వం స్పందించలేదు. ఫలితంగా ఆ నీటిని తాగి 46 మంది మరణించారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలు కావా బాబుగారూ?