ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగం కుప్పకూలిపోయింది. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేస్తున్నారు. స్థానిక ఎన్నికల నామినేషన్ల సందర్భంగా వరుసగా రెండోరోజూ @ncbn గారు శాంతిభద్రతలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. తన పార్టీ మూకలకు గూండా లైసెన్స్‌లు ఇచ్చి, వారికి అండగా పోలీసు యంత్రాంగాన్ని వాడుకుంటున్నారు. రాజకీయ హింసావాదిగా తన చరిత్రను మరోసారి చాటుకుంటూ రాష్ట్రంలో జంగిల్‌రాజ్‌ను నడిపిస్తున్నారు.
ప్రతిపక్ష అభ్యర్థులు కనీసం నామినేషన్లు కూడా వేయలేని దుస్థితి సృష్టించారు. వైయస్సార్సీపీ అభ్యర్థులను పోలీసుల సమక్షంలోనే, నామినేషన్ కేంద్రాల పరిధిలోనే, కత్తులు, కర్రలతో వెంటాడటం, నామినేషన్ కేంద్రాలను ముట్టడించడం, ఆర్వో కార్యాలయాల్లోకే చొరబడి నామినేషన్ పత్రాలను లాక్కుని చించేయడం, అర్ధరాత్రి అభ్యర్థులను పోలీసులు ఎత్తుకెళ్లడం.. ఇదీ చంద్రబాబు మార్కు ప్రజాస్వామ్యం! ఎన్నికలను ఏకపక్షంగా మార్చేందుకు అధికార బలంతో హింసను ప్రేరేపిస్తున్నారు.
దారుణమేమిటంటే, అభ్యర్థులకు ప్రపోజర్లుగా వెళ్లిన మా పార్టీ ఎంపీలను కూడా వదల్లేదు. వారి చేతుల్లోంచి నామినేషన్ పత్రాలను లాక్కుని చించేశారు. ముగ్గురు ఎంపీలపై పోలీసుల సమక్షంలోనే, పోలీసుల ద్వారానే దాడులు జరిగాయి. ఎంపీలకే రక్షణ లేని రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏమిటి?
కడప, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, రాజంపేట, రాయచోటి, పుంగనూరు, తిరుపతి, దర్శి, దాచేపల్లి, గురజాల సహా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఘటనలు చంద్రబాబు పాలనలో ప్రజాస్వామ్యం ఎంత దారుణంగా దిగజారిపోయిందో కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. పులివెందులలో పోలీసుల కాల్పులు ప్రజాస్వామ్యంపై పేల్చిన తూటాలే. దీని వెనుక ముమ్మాటికీ చంద్రబాబుగారి కుట్రే! నామినేషన్ వేయడానికి వచ్చిన అభ్యర్థులను, ప్రపోజెర్స్ పై పోలీసులు దాడి చేసి ఎందుకు కొట్టారు! ఎందుకు కాల్పులు జరిపారు!
చంద్రబాబుగారూ, నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకోవడం ఎన్నికలా? ప్రతిపక్ష అభ్యర్థులను పోలీసులతో ఎత్తుకెళ్లడం ప్రజాస్వామ్యమా? ఎంపీలపైనే దాడులు చేయించడం రాజ్యాంగ పాలనా?
రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేసి, ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్న ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నాను.
సూపర్ 6, సూపర్ 7ల మోసాలతో ప్రజలకు బాండ్లు ఇచ్చి మరీ మోసం చేసిన ఈ వెన్నుపోటు పార్టీ నుంచి ఇంతకన్న ఏమి ఆశించగలం!
#SaveDemocracyInAP
మా హయాంలో టీడీపీ నాయకుడు నామినేషన్ వేయగలిగాడు, పోటీ చేయగలిగాడు, గెలిచిన చోటే "హ్యాట్సాఫ్ టు జగన్" అన్నాడు.
ఎందుకంటే మేం ప్రజాస్వామ్యాన్ని గౌరవించాం.
మీ హయాంలో ప్రతిపక్ష అభ్యర్థులు నామినేషన్ వేయడానికి వెళ్తే రాళ్లు, పత్రాలు లాక్కోవడం, హింసాకాండ.
ఓటుకే కాదు, నామినేషన్‌కే భయపడే బతుకులు మీవి.
ఇదీ మీకూ మాకూ తేడా. ప్రజలు అన్నీ చూస్తున్నారు.
#Dharmavaram, #SaveDemocracy #APLocalBodyElections
పొత్తులో ఉంటూ వాళ్ల కొడుకు ఎదగాలి అనుకుంటారు కాని
Pawankalyan ఎదగాలి అని ఎలా అనుకుంటారు రా బాబు
Pawankalyan support కావాలి ఆ వోట్ transfer TDP కి జరగాలి అంతే 👍
పుంగనూరులో టీడీపీ మూకల హింసాకాండ
వైసీపీ లోక్ సభ లీడర్ మిథున్ రెడ్డి కాన్వాయ్ పై దాడి చేసిన టీడీపీ శ్రేణులు
వైసీపీ వాహనాలు ధ్వంసం చేసిన టీడీపీ శ్రేణులు
ప్రేక్షక పాత్ర పోషిస్తున్న పోలీసులు
@PawanKalyan ఏమంటావు అన్న ఇప్పుడు
రక్తం చిందింది, రాజీ పడలేదు.
మీరు రాళ్లు విసిరారు, పత్రాలు లాక్కున్నారు.
అయినా ప్రతి నామినేషన్ వేసి తీరతాం.
నా వాళ్లు గాయపడితే వెనక ఉండను, పక్కనే నడుస్తా.
గాయాలు మానుతాయి, ఈ దురాగతం ధర్మవరం మరువదు.
#Dharmavaram, #SaveDemocracy, #KutamiViolence, #YSRCP, #APMunicipalElections
Andhra Pradesh today witnessed a brutal attack on democracy under @ncbn's coalition government. On the first day of municipal nominations, YSRCP candidates faced attacks, death threats and attempts to stop them from filing nominations. Vehicles were burnt and nomination papers snatched and torn. Police remained mere spectators, in some cases party to the crime as well, dancing to Naidu's tunes instead of maintaining law and order and upholding the Constitution.
I strongly condemn the murder attempt on YSRCP Lok Sabha Floor Leader and Rajampet MP, P. V. Midhun Reddy in Punganur. TDP workers attacked his convoy, which had gone there to file the nominations, with stones, sticks and iron rods, injured his CRPF security staff, damaged vehicles and blocked our candidates from filing nominations while police watched all this in the premises of the nomination filing centre. Even after this, officials did not accept their nomination papers despite making them wait for over three hours. If our Lok Sabha Floor Leader is unsafe, what protection can ordinary people expect?
In Rayachoti, our candidates were threatened not to file nominations. When they proceeded despite these threats, TDP workers attacked former MLA Srikanth Reddy's office, set it and vehicles on fire, and injured our workers. Instead of registering cases against those responsible and protecting our candidates, police ordered our workers to leave our party office, where they had gathered to select candidates and prepare nomination papers, while it is our own party office that was set on fire while police remained mute spectators.
In Tirupati, a woman candidate's papers were snatched and torn, and our leaders were attacked. In Dharmavaram, candidates were attacked and their papers snatched in police presence. In Kadapa, our 30th Division candidate was
obstructed, and papers submitted to the Returning Officer were snatched and torn. Yet no case was registered and no action was taken against them. This shameful inaction gives TDP workers a free hand to obstruct elections in full public view. In Dachepalli, police planted liquor and forcibly detained our Nagar Panchayat chairman candidate to prevent him from filing his nomination.
Chandrababu Naidu must understand that government machinery is not his party's property. Violence cannot give the TDP the public confidence it has lost. Every attack strengthens our resolve to stand with the people and defend their democratic rights.
I stand firmly with every YSRCP worker. We will not surrender to threats or abandon our democratic fight. Every incident must be investigated, every attacker held accountable, and every officer who enabled this violence made answerable.
The SEC must intervene immediately, ensure that all affected candidates can file nominations, and secure the deployment of Central forces. Candidates must be able to contest without fear, and people must be free to choose their representatives.
Centralised or transparent and safe online nominations should be made available. Proper CCTV live footage should be put in place in polling stations. CCTV live footage should be placed in all strong rooms to prevent tampering of ballot boxes. CCTV live footage should be in place in all counting stations to ensure proper verification of the signatures on ballot paper account and to monitor the counting process in the counting stations. Central government forces (Paramilitary forces) should be brought in to ensure that free and fair elections are conducted.
#SaveDemocracyInAP
పుంగనూరులో టీడీపీ మూకల హింసాకాండ
వైసీపీ లోక్ సభ లీడర్ మిథున్ రెడ్డి కాన్వాయ్ పై దాడి చేసిన టీడీపీ శ్రేణులు
వైసీపీ వాహనాలు ధ్వంసం చేసిన టీడీపీ శ్రేణులు
ప్రేక్షక పాత్ర పోషిస్తున్న పోలీసులు
@PawanKalyan ఏమంటావు అన్న ఇప్పుడు
విజయవాడలో పోలీస్ లాకప్‌డెత్‌కు గురైన గాదె సాయికృష్ణ కేసును సీబీఐకి అప్పగించడంతో పాటు, నాలుగు వారాల్లోగా ఆయన తల్లికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును నేను స్వాగతిస్తున్నాను. ఈ తీర్పు చంద్రబాబు ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు. రాజధానిలో పోలీసులు అత్యంత హేయమైన నేరానికి పాల్పడ్డారు. పోలీసు కస్టడీలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయినా కనీస పశ్చాత్తాపం కూడా లేకపోవడం అత్యంత దారుణం!
ఈ కేసులో సీబీఐ విచారణ జరిపించాలని, డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్‌తో సహా ఉన్నతాధికారుల పాత్రపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని మేం మొదటి నుంచీ డిమాండ్ చేస్తూనే ఉన్నాం. ఎంత ఉన్నత పదవిలో ఉన్నా, ఎంతటి రాజకీయ అండదండలు ఉన్నా చట్టానికి ఎవరూ అతీతులు కారన్న విషయాన్ని గుర్తించాలి.
ఈ కేసులో స్వతంత్ర దర్యాప్తు జరిగేలా చూడాల్సిన చంద్రబాబు, అందుకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉండే ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసి, కేసును తొక్కి పెట్టేందుకు ప్రయత్నించారు. దర్యాప్తులో జరిగిన లోపాలకు, ఉన్నతాధికారుల పాత్రను సమగ్రంగా పరిశీలించడంలో విఫలమైనందుకు @ncbn ప్రభుత్వం వాటికి సమాధానం చెప్పాల్సిందే. ఈ వైఫల్యాల కారణంగానే ఇవాళ సీబీఐ విచారణ అవసరం ఏర్పడింది. విచారణ ఎదుర్కోవాల్సిన వారిని కాపాడేందుకు ‘సిట్’ ఏర్పాటు ఒక సాకుగా మారకూడదు.
ఈ కేసులో పూర్తి వాస్తవాలను సీబీఐ వెలికి తీయాలి. ఎవరి బాధ్యత ఏమిటో నిగ్గు తేల్చాలి. ఎంతటి ఉన్నత పదవిలో ఉన్నవారైనా సరే, ఈ నేరంలో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ చట్టం ముందు నిలబెట్టి న్యాయం జరిగేలా చూడాలి. తన ప్రభుత్వ బాధ్యత నుంచి చంద్రబాబు తప్పించుకోలేరు. సాయికృష్ణ తల్లికి తన కుమారుడి మరణం వెనుక ఉన్న పూర్తి వాస్తవాలు తెలియాలి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. ఆమెకు న్యాయం జరగాలి. సాయికృష్ణ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేం వారికి అండగా నిలబడతాం.
I welcome the Andhra Pradesh High Court's decision to transfer Gade Saikrishna's custodial death case to the CBI and also directing the State Government to pay 25 lakh to his mother within four weeks. This judgment is a slap on the face of the Chandrababu Naidu government. A heinous crime committed with no sense of remorse!
We have consistently demanded a CBI inquiry and a thorough investigation into the role of senior police officials, including the DGP and the Vijayawada Commissioner of Police. Rank and political protection must never place anyone above the law.
Chandrababu Naidu sought to bury this case through a State-controlled SIT instead of ensuring an independent investigation. His government must answer for the lapses in the probe and the failure to adequately examine the role of senior officials, which today highlighted the need for a CBI enquiry. Appointing a SIT cannot become an excuse to shield those who should face scrutiny.
The CBI must uncover the full truth, establish responsibility and bring everyone involved to justice, regardless of their position. @ncbn garu cannot wash his hands of his government's responsibility. Saikrishna's mother deserves answers, accountability and justice. We will stand firmly with his family until justice is delivered.