వేలాదిగా తరలి రండి, సరూర్ నగర్ వేదికగా సమరశంఖం పూరిద్దాం.
ఈ నెల 18న సరూర్ నగర్ వేదికగా @BRSparty తలపెట్టిన యువ సంగ్రామ సదస్సుకు తరలి రావాలని పిలుపునివ్వడం జరిగింది.
ఈ సందర్భంగా అప్సిగూడలో నిరుద్యోగ జేఏసీ నాయకులు, వివిధ యూనివర్సిటీల విద్యార్థి నేతలతో కలిసి సమావేశం నిర్వహించి యువ సంగ్రామ సదస్సు పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది.
@INCTelangana ప్రభుత్వం డిక్లరేషన్ ల పేరిట నిరుద్యోగులను, యువతను, విద్యార్థులను మోసగించిన తీరును ఎండగట్టడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నాతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర యువజన నేత మంతెన అమ్రీష్ గారు, నిరుద్యోగ జేఏసీ నేతలు, తదితరులు ఉన్నారు.
#YuvaSangramaSadassu
❌కేంద్ర EPFO డేటాతో బట్టబయలైన తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత - ఉద్యోగకల్పనలో వైఫల్యం - నిరుద్యోగుల పాలిటి శాపం…
🩸2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు హుష్ కాకి..
🩸 ప్రైవేట్ రంగ ఉద్యోగాలు హుష్ కాకి..
🩸 జాబ్ క్యాలెండర్ హుష్ కాకి..
🩸 నిరుద్యోగభృతి హుష్ కాకి..
🩸 యూత్ డిక్లరేషన్ హుష్ కాకి.
💥హైదరాబాద్ లాంటి గ్లోబల్ ఐటీ, ఫార్మా పారిశ్రామిక హబ్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా రివర్స్ గేర్ వేయించిందో, ఉద్యోగాల కల్పనలో ఎంత ఘోరంగా వైఫల్యం అయ్యిందో చెప్పడానికి కేంద్ర కార్మిక శాఖ అధికారిక EPFO (2023-24 vs 2024-25) నివేదికే సజీవ సాక్ష్యం.
💥ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన పూర్తిగా స్తంభించిపోయిందని ఈ డేటా తెలియచేస్తోంది:
📊 ప్రైవేట్ రంగ వినాశనం (Source: Union Ministry of Labour EPFO Data):
తెలంగాణలో ఏడాది కాలంలో కొత్తగా యాడ్ అయిన నికర EPF ఖాతాలు: కేవలం 6,749 (7.66 లక్షల నుండి 7.72 లక్షలకు).
💥తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ వృద్ధి రేటు: కేవలం 0.88% పాతాళానికి పడిపోయింది!
దేశ సగటు వృద్ధి రేటు: 2.64% అంటే తెలంగాణ రాష్ట్రం, దేశ జాతీయ నిష్పత్తి కంటే, 3 రెట్లు వెనుకబడ్డది!!
❌ఏడాది పొడవునా రాష్ట్రమంతా కలిపి కేవలం 6,749 నికర ఫార్మల్ ఉద్యోగాలను మాత్రమే రేవంత్ ప్రభుత్వం సృష్టించగలిగింది.
❓ఇది ముమ్మాటికి ఆర్థిక సంక్షోభం కాదా?
🏛️ ప్రభుత్వరంగ ఉద్యోగాల ప్లేగరిజం:
ఈ ప్రైవేట్ రంగ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో "50,000 - 60,000 ఉద్యోగాలు ఇచ్చాం" అంటూ ప్రెస్ మీట్లలో అబద్ధపు ప్రచారానికి తెరలేపారు.
కానీ, అసెంబ్లీ వేదికగా సొంత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్పీకర్ర్ కు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంతో ఆ బెలూన్ పేలిపోయింది.
❌కాంగ్రెస్ ప్రభుత్వం స్వయంగా నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసినవి: కేవలం 16,978 పోస్టులు
మాత్రమే!❌
✌️గత @BRSparty ప్రభుత్వం నోటిఫికేషన్స్ ఇచ్చి, భర్తీ ప్రక్రియ చేసినవి: 50,785 పోస్టులు.
దాదాపు 75% పైగా మునుపటి BRS హయాం నాటి నోటిఫికేషన్లు, పరీక్షల ప్రక్రియ ద్వారా భర్తీ అయినవి.
😜ఏ దొడ్లో కడితేనేమి, మా దొడ్లో ఈనితే చాలు అన్నట్లు, గత ప్రభుత్వం వండి వార్చిన అన్నాన్ని కొత్త పాత్రలో వడ్డించి, నియామక పత్రాల పంపిణీ సభలు పెట్టి నిరుద్యోగులను మభ్యపెట్టి, వంద శాతం క్రెడిట్ కొట్టేయడం ఏ రకమైన పరిపాలన?
👎కేంద్ర డేటాలో తెలంగాణ ఉద్యోగ మార్కెట్ నిశ్చలంగా పడిపోయింది, అసెంబ్లీ ఫ్లోర్ మీద ప్రభుత్వ అబద్ధాలు అడ్డంగా దొరికిపోయాయి.
తెలంగాణ నిరుద్యోగ యువతకు రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చింది ఉద్యోగాలు కావు... కేవలం బండ్ల కొద్దీ ప్రెస్ రిలీజ్లు, కలర్‌ఫుల్ ఫ్లెక్సీలు మాత్రమే! బూతు తిట్ల ప్రసంగాలు, తొక్కుడు రాజకీయాలు..
ఇదేమి న్యాయం అని ప్రశ్నిస్తే లాఠీలు, అక్రమ అరెస్టులు,
పోలీసు కేసులు…
📍డీజీపీ కార్యాలయం, హైదరాబాద్
🔹తెలంగాణ డిజీపీ @TelanganaDGP సీవి ఆనంద్ గారిని కలిసి పోలీస్ అస్పిరెంట్ ల డిమాండ్ లను మెమొరాండంగా అందించడం జరిగింది.
🔹నాతోపాటు నిరుద్యోగ జేఏసీ పోలీస్ అస్పిరెంట్ ల బృందాన్ని తీసుకెళ్లడం జరిగింది.
🔹తక్షణమే ఖాళీగా ఉన్న 19వేల పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.
🔹పోలీస్ ఉద్యోగార్థుల వయోపరిమితి పెంచాలని, పోలీస్ కానిస్టేబుల్ కు 36 ఏళ్లు, ఎస్సై 38 ఏళ్ల వరకు పెంచాలని సూచించడం జరిగింది.
🔹జీవో 46 రద్దు చేసి గ్రామీణ ఉద్యోగార్ధులకు తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.
🔹సానుకూలంగా స్పందించిన డీజీపీ సీవి ఆనంద్ గారు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సానుకూల నిర్ణయం జరిగేలా ప్రయత్నం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
🔹పోలీస్ అభ్యర్థుల కళ్లల్లో ఆశలు ఉన్నాయి, గుండెల్లో దేశభక్తి ఉంది, చేతుల్లో శాంతిభద్రతలను కాపాడే సత్తా ఉంది.
🔹అలాంటి పోలీస్ అభ్యర్థులు ఈ రోజు ట్రైనింగ్ గ్రౌండ్లో పరుగు తీస్తూ ఉండాలి. కానీ, దౌర్భాగ్యం ఏంటంటే, తమ హక్కుల కోసం రోడ్లెక్కి నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది.
🔹గత ప్రభుత్వం కనీసం గ్రామీణ ప్రాంతాల ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ నిరుద్యోగుల బాధలను అర్థం చేసుకుని వయోపరిమితిని 32 ఏళ్లకు పెంచింది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జీవో నెంబర్ 31 తీసుకువచ్చి వయోపరిమితిని 34 ఏళ్లకు పెంచారు.
🔹కానీ, ఏం లాభం? ఈ మధ్యలో ఒక్కటంటే ఒక్క పోలీస్ నోటిఫికేషన్ అయినా ఇచ్చారా? లేదు.
🔹అంటే నోటిఫికేషన్ లేని సమయంలో ఏజ్ పెంచి, ఎవరికీ ఉపయోగం లేకుండా తుంగలో తొక్కారు. వీళ్ల వ్యవహారం ఎలా ఉందంటే చేతిలో బెల్లం పెట్టి, నోట్లో మట్టి కొట్టినట్టు ఉంది.
🔹తీరా చూస్తే 2026 ఫిబ్రవరి నాటికి ఆ జీవో గడువు ముగిసిపోయింది. గడిచిన ఈ కాలంలో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వని కారణంగా వయోపరిమితిని 36 ఏళ్లకు పెంచాల్సింది పోయి, దారుణంగా 32 ఏళ్లకు కుదించారు. ఇది ముమ్మాటికీ నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం చేస్తున్న ఘోరమైన దుర్మార్గం.
🔹ఈ నాలుగేళ్ల సుదీర్ఘ కాలంలో నోటిఫికేషన్ రాక, ఎంతమంది నిరుద్యోగులు వయసు దాటిపోయి, ఇంట్లో ముఖం చూపించలేక నరకం అనుభవిస్తున్నారో ఈ ప్రభుత్వానికి తెలుసా?
🔹పల్లెటూళ్ల నుంచి వచ్చి, తల్లిదండ్రులు పంపే రూపాయి రూపాయిని పొదుపుగా కాపాడుకుంటూ, కోచింగ్ ఫీజులు కట్టలేక కేవలం ఖాకీ యూనిఫామ్ వేసుకోవాలనే ఒకే ఒక్క ఆశతో తపస్సు చేస్తున్న మన అభ్యర్థులు, ఈ రోజు మళ్లీ ఊళ్లకు తిరిగి వెళ్లాల్సిన దారుణమైన పరిస్థితి వచ్చింది.
🔹పైగా డిపార్ట్మెంట్లో 20 వేల ఖాళీలు ఉంటే, కేవలం 5 ఖాళీలకే నోటిఫికేషన్ వేస్తామంటున్నారు. కుర్చీలో కూర్చునే వరకు కాళ్లు మొక్కుతా అన్నారు. ఇప్పుడు కాళ్లు కడుపులో తన్నుతున్నారు. ఈ నిరుద్యోగుల ఉసురు మీకు కచ్చితంగా తగులుతుంది.
🔹వెంటనే జీవో నెంబర్ 87ను రద్దు చేసి, కానిస్టేబుల్స్ వయోపరిమితిని 34 ఏళ్లకు గానీ, 36 ఏళ్లకు గానీ పెంచాలి.
🔹పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న 20 వేల ఖాళీలను భర్తీ చేయడానికి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలి.
🔹లేదంటే ఈ నిరుద్యోగుల సత్తా ఏంటో ఈ ప్రభుత్వం చూడాల్సి వస్తుంది. నిరుద్యోగులు చేసే ఈ న్యాయమైన పోలీస్ పోరాటానికి @BRSparty అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది.
🔹 చిట్టచివరకు అసెంబ్లీ సాక్షిగా దొంగలు దొరికిండ్లు.
🔹 నీళ్లలో నూనెను దాస్తే దాగుతదా?
🔹 అట్లనే మేము ఇన్ని రోజులు చెప్పినవి దొంగ ముచ్చట్లు అని, తమ ప్రభుత్వం ఇచ్చింది 16,978 ఉద్యోగాలు మాత్రమే అని అసెంబ్లీ సాక్షిగా @INCTelangana ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.
🔹 మరి ఇన్ని రోజులు లక్ష ఉద్యోగాలు, లక్షా యాభై వేల ఉద్యోగాలు అంటూ వేలం పాట పాడినట్లు పాడి దొంగ ముచ్చట్లు చెప్పి ప్రజల్ని తప్పుదోవపట్టించినందుకు ప్రజలకు, నిరుద్యోగులకు @revanth_anumula రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి.
🔹 దొంగల్ని రెడ్ హ్యాండెడ్ గా దొరకపెట్టించిన మాజీ మంత్రివర్యులు కేటీఆర్ @KTRBRS గారికి, సబితా ఇంద్ర రెడ్డి @BrsSabithaIndra గారికి, పల్లా రాజేశ్వర్ రెడ్డి @PRR_BRS గారికి, వివేకానంద్ @kp_vivekanand గారికి, అనిల్ జాదవ్ @AnilJadhav_brs గారికి ధన్యవాదాలు.
🔸డైరెక్షన్ లేని యూత్ డిక్లరేషన్!
🔸వికసించకుండానే వాడిపోయిన రాజీవ్ యువ వికాసం.
🔹10 ఏళ్లు అధికారానికి దూరంగా ఉన్న @INCTelangana కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారం పోతుందో అన్న భయంతో అంగంట్లో అర్రాసు పాటపడినట్టు హామీల పాట పాడి అధికారంలోకి వచ్చింది.
🔹నిరుద్యోగ యువత, వాళ్ళ కుటుంబ సభ్యులే లక్ష్యంగా అనేక హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైంది.
🔹ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ వంటి అనేక హామీలను గద్దెనెక్కి తుంగలో తొక్కింది.
🔹తాము అధికారంలోకి రాగానే జీవో 46 ను రద్దు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి మాట తప్పిన కాంగ్రెస్, ఇప్పుడు వాళ్లకే వ్యతిరేఖంగా సుప్రీం కోర్టులో కోట్ల రూపాయలు కుమ్మరించి అధర్మ పోరాటం చేస్తుంది.
🔹భారత రాష్ట్ర సమితి @BRSparty అధినాయకత్వం ఆదేశాల మేరకు మొదటి నుండి వారికి అండగా ఉంటున్న నేపథ్యంలో త్వరగా న్యాయ ప్రక్రియలో చలనం వచ్చేలా కృషి చేయాలని ఈ రోజు జీవో 46 బాధిత ఉద్యోగార్థులు విన్నవించడం జరిగింది.
🔹ఇచ్చిన మాట ప్రకారం జీవో 46 రద్దు అయ్యేవరకు పార్టీ పరంగా అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది.
🔹అలాగే కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేదాక రాజీలేని పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని, ఈ ఉద్యమానికి నిరుద్యోగ యువత అండగా ఉండాలని పిలుపునివ్వడం జరిగింది.
నాయకుడికి కార్యకర్తకు ఉండే అనుబంధం ఎంతో గొప్పది. అది కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల బంధం కంటే కూడా గొప్పగా ఉంటది.
ఎందుకంటే అది ఎటువంటి షరతులు లేని బంధం.
Its an unconditional Relationship.
Thats the Beauty of a Relationship between a Leader and a Karyakartha.
🔹పదే పదే ముఖ్యమంత్రి చీఫ్ జస్టిస్ ని ఎందుకు కలుస్తున్నాడు.?
🔹గ్రూప్-1 లో గోల్ మాల్ జరిగిందని హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది.
🔹రేవంత్ రెడ్డి చీఫ్ జస్టిస్ ని కలిశారు. తదనంతరం, డివిజన్ బెంచ్ లో సర్కార్ వాదనకు అనుకూలంగా తీర్పు వచ్చింది.
🔹సీఎం కలిశాక పరిణామాలు మారడం స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి, దీనిపై సమాజంలో చర్చ జరగాల్సిందే.
🔹స్వయం ప్రతిపత్తిగల రాజ్యాంగ బద్ధ వ్యవస్థలను రాజకీయ వ్యవస్థలు ప్రభావితం చేయొచ్చా అనేదానిపై విస్తృతంగా చర్చ జరగాల్సిందే.
గ్రూప్ 1, జీవో 46 బాధితులకు న్యాయం చేయాలి..
గ్రూప్ 1 పరీక్ష సరిగా జరగకపోవడం వల్ల విద్యార్థులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.
గ్రూప్ 1 పరీక్షలో జరిగిన లోపాలపై ప్రభుత్వం వైట్ పేపర్ రిలీజ్ చేయాలి..
JNTU లో మెయిన్స్ మూల్యాంకనం జరిగిందని RTI ద్వార తెలిసింది
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు
ఎన్నికల సమయంలో లక్షల మంది విద్యార్ధులను ప్రభుత్వం వాడుకుంది అధికారంలోకి వచ్చాక వారిని పట్టించుకోవడం లేదు
మన పిల్లలు కోర్టుల చుట్టూ తిరగకుండా ప్రభుత్వం ఆదుకోవాలి.
#Group1 #GO46
@TelanganaCMO@KCRBRSPresident@TelanganaCS@TSPSCofficial@AspirantsTspsc
ఆనాడు GO 46 బాధితులు గాంధీ భవన్ కి వెళ్తే మస్తు రిసీవింగ్. ఈ రోజు అదే GO 46 బాధితులు గాంధీ భవన్ కి వెళ్తే పట్టించుకున్నోడు కూడా లేడు.
వాడుకొని వదిలేయడం కాంగ్రెస్ నైజం అంటే ఏందో అనుకున్నాం. కానీ ఇదే అని ఇప్పుడు అర్ధమైంది!
#GO46
వ్యవస్థల పోరులో చివరికి నష్టపోయేది ఎవ్వరు. .?
దేశంలోనే అతి పురాతన పార్టీ కాంగ్రెస్ ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా పొందిన స్వాతంత్య్రాన్ని గత 78 ఏండ్లుగా తన ఇష్టానుసారం దుర్వినియోగం చేస్తున్నది. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నది. ప్రజాస్వామ్య స్ఫూర్తిని మంటగలుపుతున్నది.
తెలంగాణలో రేవంత్ రెడ్డి గద్దెనెక్కిన తర్వాత ఈ చట్టవ్యతిరేక, రాజ్యాంగ విరుద్ధ చర్యలు మరింత పెరిగాయి.
ఇదే సాక్ష్యంగా కేవలం రెండు వారాల్లోనే సుప్రీం కోర్టు @revanth_anumula సర్కారుకు రెండు గట్టి దెబ్బలు⚖️
👉 ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు తీర్పు
👉 గవర్నర్ కోటా ఎమ్మెల్సీల రద్దు.
@TelanganaCMO@KCRBRSPresident
🔹కడియం అంటే కమిట్మెంట్ కాదు కట్లపామని రుజువైంది.
🔹ఆ కట్లపాము ఇన్నాళ్లు కాంగ్రెస్ @INCTelangana గూట్లో జొర్రి దాక్కుంది. కానీ, ఎక్కడున్నావమ్మా అంటే ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్న అనీ తలతిక్క సమాధానం చెప్పింది.
🔹కానీ, ఆ బొక్కలో పచ్చిగడ్డితో పొగవేసి అష్టదిగ్బంధనం చేస్తే వేరేదారి లేక నేను కాంగ్రెస్ లో చేరాను ఇందులో చేరి ఏడాది అవుతుందని కూని రాగం తీస్తుంది.
🔹నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ లో చేరాను అంటున్న కడియం శ్రీహరి గారు ఈ ముక్క మరి చేరిన రోజే ఎందుకు చెప్పలేకపోయారు.
🔹మీ 40 ఏళ్ల ప్రజా జీవితంలో మీ అనుభవాన్ని అంతా రంగరించి సమాజానికి ఇచ్చే సందేశం ఏంటంటే ‘అభివృద్ధి కోసం అధికార పార్టీలో చేరాలి. అడ్డదారులు తొక్కాలి. నమ్మిన వాళ్లను నట్టేట ముంచాలి’ అన్నమాట.
🔹రాజకీయంగా ఒక మలుపు తీసుకోవాలి అని నేను ఆలోచిస్తున్న సమయంలో మీరొచ్చి @BRSparty లోకి ఆహ్వానించినప్పుడు నేను గౌరవంగా ఫీలయ్యాను.
🔹ఒక ఉప ముఖ్యమంత్రి గా చేసిన నాయకుడు, జిల్లాలో సీనియర్ నాయకుడు వచ్చాడని తప్పనిసరి అనుకూల నిర్ణయం వైపే మొగ్గు చూపాను.
🔹 కానీ, ఆఖరికి మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించుకుని, మీ వారసురాలు కడియం కావ్య గారికి ఎంపీ టికెట్ ఇచ్చి, అన్ని రకాలుగా అండగా నిలిచిన తర్వాత కూడా అత్యంత కుట్రపూరితంగా, అనైతికంగా మీకు రాజకీయ పునర్జన్మ ఇచ్చిన పార్టీని కాదని మీరు ఊసరవెల్లిలా రంగులు మార్చిన తీరు విస్మయానికి గురిచేసింది.
🔹క్రియాశీలక రాజకీయాల్లో, ప్రజా జీవితంలో రాణించాలి అనుకునే నాలాంటి యువనాయకులు మీలాంటి వాళ్లను ఆదర్శంగా తీసునే స్థితిలో ఉండాల్సిన మీరు. చీ ఆయన లెక్క మాత్రం అసలే చెయ్యొద్దు అనే దుస్థితికి దిగజారిపోయారు. దీనికి మీ పట్ల నా ప్రగాఢ సానుభూతినీ, జాలిని ప్రకటిస్తున్నాను.
🔹మీ సుదీర్ఘ నయవంచక రాజకీయ క్రీడలో రిటైర్మెంట్ వయస్సు వచ్చేనాటికి ప్రజలు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు సార్? అంటే, "ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలోనే ఉన్నాను." అని తప్పించుకునే దుస్థితి దిగజారిపోయారు.
🔹ఇంతకంటే ఇజ్జత్ తక్కువ పరిస్థితి ఇంకేమైనా ఉంటుందా? ఇది మీ రాజకీయ జీవితానికి కళంకం కాదా? ఒంటరిగా ఉన్నప్పుడు ఒక్కసారి మీకు మీరే ఆత్మవిమర్శ చేసుకోండి కడియం గారు!
🔹 దేశంలోనే మన ఓరుగల్లుకు ఒక గొప్ప చారిత్రాత్మక, చైతన్యవంతమైన, ఉద్యమ ప్రాంతమని పేరుంది. కానీ, మీలాంటి వాళ్ళ వల్ల ఓరుగల్లు పరువుపోయే దుస్థితి దాపురించి.
🔹దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక కుటుంబంలో తండ్రిని ఉప ముఖ్యమంత్రిని చేసి, మళ్ళీ ఎన్నికల్లో ఎమ్మెల్యేను చేసి, నెల రోజుల్లోనే కూతురికి ఎంపీ టికెట్ ఇచ్చి అన్ని రకాలుగా అండగా నిలిచిన తర్వాత కూడా తల్లిలాంటి BRS పార్టీని, కేసీఆర్ @KCRBRSPresident గారి నాయకత్వాన్ని వదిలి, తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన చందాన మోసం చేసి నమ్మిన వాళ్లను నట్టేట ముంచిన ఘనుడు మీరే..ఆ ఘనత మీకే దక్కుతుంది. ఈ రకంగా మీరు చరిత్రకెక్కారు
🔹మీలాంటి వాళ్లను చూసి మన ఓరుగల్లు తల దించుకుంటుంది. నోటికాడి ముద్దను దానం చేసే మన ఓరుగల్లు ప్రజలు ఈ నయవంచనను సహించరు.
🔹భవిష్యత్ లో నీలాంటి కట్లపాములు మళ్ళీ పురుడు పోసుకోకుండా ఈ పోరాటాల పురిటిగడ్డ ఓరుగల్లు గట్టి సందేశాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.
🔹ఖబడ్దార్ కడియం గారు! ఓటనే పోటుతో మీ రాజకీయ దుర్బుద్ధికి సమాధి కట్టడానికి ఓరుగల్లు సిద్ధంగా ఉంది.
🔹ఉద్యమానికి ఊపిరూదిన స్టేషన్ ఘనపూర్ గడ్డమీద ఎగిరేది గులాభి జెండానే.
మహా టీవీ ఘటనలో 14 రోజులపాటు పోలీసుల అక్రమ నిర్బంధానికి గురై అనంతరం విడుదలైన తెరాస విద్యార్థి విభాగం నాయకుడు నర్సింగ్ ను, వారి తల్లితండ్రులను వారి నివాసంలో కలుసుకొని పరామర్శించడం జరిగింది.
@KCRBRSPresident@KTRBRS@BRSHarish
Proud of our Indian Army 🇮🇳
In just hours time, our soldiers attacked Lahore, Islamabad and completely destroyed Karachi Port. Entire port is in ashes now.
3 Pakistani fighter jets are brought down and almost all the Pakisthani missiles are neutralised by our Indian forces.
Thanks to S-400 and INS Vikrant which are fighting on our Indian side.
#OperationSindhoor #IndiaPakistanWar2025 #IndianArmy #Lahore #Karachi #IndianArmedForces #IndianArmy #OperationSindoor2
పరీక్ష రాసినప్పటికి ఫలితాలు వెల్లడించే వరకు 10 మంది పెరగడం ఎలా సర్వసాధారణమే, సమర్ధనీయమో గ్రహాంతర వాసులకు కూడా అంతుచిక్కని రహస్యం.
ఈ మధ్య ఫోన్ ల ఒకటే రింగ్ టోన్ వస్తుంది. అలానే, బహుశా ఇది కూడా సైబర్ నేరగాళ్ల పన్నాగం కావచ్చు.
#group1
🔹అంతిమ విజయం ధర్మానిదే అని మరోసారి నిరూపితం అయింది.
🔹హైకోర్టు ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటివి.
🔹ఇది గ్రూప్ 1 అభ్యర్థులు, విద్యార్థుల పోరాట ఫలితానికి వచ్చిన ఫలితం.
🔹విద్యార్థులకు అండగా నిలిచిన @BRSparty నైతిక విజయం.
🔹గ్రూప్ 1 లో అవకతవకలు జరిగాయి అని పార్టీ మేరకు నేను చర్చ పెడితే టీజీ పీఎస్సీ లో కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి నాపై తప్పుడు ఆరోపణలు చేశారు. నోటీసులు ఇచ్చారు. బ్లాక్ మెయిల్ చేస్తూ క్షమాపణలు చెప్పాలన్నారు.
🔹ఇప్పుడు హైకోర్టు ఆదేశాలతో దిమ్మతిరిగింది. బండారం అంతా బయటపడే సమయం ఆసన్నమైంది.
🔹15 నెలల కాంగ్రెస్ పాలనలో నిరుద్యోగులకు చేస్తున్న అన్యాయాన్ని ఎదిరించడం లో బీఆర్ఎస్ పార్టీ ప్రతీసారి పై చేయి సాధిస్తుంది.
🔹ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధి పొందటం కోసమే ఆగమేఘాల మీద తీవ్ర అవతవలలకు పాల్పడ్డారు.
🔹ఫలితాలతో పాటు, పరీక్షల నిర్వహణలో కూడా అనేక అనుమానాలు ఉన్నాయ్.
🔹అన్నింటిని హైకోర్టు సునిశితంగా పరిశీలించి నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేస్తుందని,
🔹 అవకతవకలకు పాల్పడ్డ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులపై చర్యలు తీసుకుంటుందన్న నమ్మకం ఉంది.
🔹ఇది ఆరంభం మాత్రమే, ముందుంది ముసళ్ల పండగ ఒక్కొక్కటి అన్నీ బయటకి వస్తాయ్.
🔹కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులే మైకుల ముందు తనవాళ్లకు ఉద్యోగాలు ఇప్పించుకోవడం పై చర్చించుకుంటున్నారు.
🔹@INCTelangana లో ఈ సంస్కృతికి సర్వ సాధారణం.
🔹మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు @Min_SridharBabu , కొండా సురేఖల @iamkondasurekha మాటామంతీ నిరుద్యోగుల్లో, గ్రూప్ 1 అభ్యర్థుల్లో ఇంకెక్కువ అనుమానాలు రేకెత్తుతుంది.
🔹అదే పద్ధతితో గ్రూప్ 1 లో కూడా ఫలితాలు వెల్లడి అయినట్టు అనుమానాలు ఉన్నాయ్.
🔹BRS పార్టీ పక్షాన గ్రూప్ 1 అభ్యర్థుల పక్షాన నిలపడి బలంగా కోట్లాడుతం. అంతిమ విజయం సాధించే వరకు విశ్రమించే ప్రసక్తే లేదు.
#Group1
@TeluguScribe పరీక్షలు నిరహించుటలో పరదర్శకలేదు కానీ ప్రశ్నిస్తే పరువునష్టం కేసులా
ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ వుంది ప్రజాస్వామ్యంలో నోటీసులిచ్చి నోరు ముపించగలరా @RakeshReddyBRS