సామాజిక ఉద్యమకారులు,మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు, సామ���జిక న్యాయం కోసం సుమారుగా 30 ఏళ్లుగా సుదీర్ఘ పోరాటం చేస్తూ, సబ్బండ వర్గాలకు సమ న్యాయం జరగాలని అహర్నిశలు కృషి చేస్తున్న పద్శ శ్రీ మంద కృష్ణ మాదిగ గారికి జన్మదిన శుభాకాంక్షలు. 💐💐💐
Happy Birthday, Anna garu🙏🏼
రేవంత్ ప్రభుత్వ కుంభకోణాలు, అవినీతి వ్యవహారాలపై నిర్విరామంగా పోరాటం చేస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి @RSPraveenSwaero గారి భద్రతను తగ్గించడం అత్యంత దుర్మార్గమైన చర్య.
26 ఏళ్లపాటు పోలీసు ఉన్నతాధికారిగా దేశానికి, సమాజానికి సేవలందించిన వ్యక్తిపై రాజకీయ కక్షతో ఇలాంటి చర్యలకు పాల్పడటం కాంగ్రెస్ ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిదర్శనం.
రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక ప్రశ్నించే గొంతులను అణచివేయాలని చూడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం.
ఎలాంటి అధికారిక హోదా లేని సీఎం @revanth_anumula సోదరులకు ప్రభుత్వ భద్రత, వాహనాలు కల్పిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ప్రభుత్వం.. ప్రజా సమస్యలపై పోరాడుతున్న, పలుమార్లు ప్రాణహాని హెచ్చరికలు ఎదుర్కొన్న ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ గారి భద్రతను తగ్గించడం అత్యంత అన్యాయం.
భద్రతను తగ్గించినంత మాత్రాన ప్రవీణ్‌కుమార్ గారి ఆత్మస్థైర్యాన్ని, పోరాటస్ఫూర్తిని దెబ్బతీయలేరు. ప్రతిపక��షాలను అణచివేసే కక్షపూరిత రాజకీయాలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి.
ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకుని, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ గారికి తగిన భద్రతను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాం.
@TelanganaCMO
@TelanganaDGP
25 సంవత్సరాల పాటు ఐపిఎస్ అధికారిగా దేశానికి, సుమారు దశాబ్దం పాటు గురుకుల విద్యా సంస్థల ద్వారా పేద విద్యార్ధుల విద్యకు ఎన్నో సేవలందించిన @RSPraveenSwaero గారి భద్రత తగ్గించడం పూర్తిగా కక్షసాధింపు చర్యే.
రేవంత్ రెడ్డి ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలను ప్రజల్ల�� ఎప్పటికప్పుడు ఎండగడుతున్నందుకే ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడింది.
ఇప్పటికే పలుమార్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై హత్యాయత్నాలు జరిగాయి. తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన స్వయంగా వె��్లడించినప్పటికీ కావాలనే భద్రతను తగ్గించడం వెనుక కుట్ర దాగి ఉంది.
ప్రశ్నించే గొంతుకలను అణచివేయాలనే ప్రయత్నంలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగుతోంది.
ఇప్పటికైనా ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలను మానుకుని, మా పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి వెంటనే భద్రతను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాను.
�� రోజు సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో,బిఆర్ఎస్ పార్టీ బిఎల్ఏలకు ఎస్ఐఆర్ మరియు సభ్యత్వ నమోదు అవగాహన కల్పించేందుకు మాజీ శాసనసభ్యులు శ్రీ మల్లయ్య యాదవ్ గారి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ప్రధాన వక్తగా హాజరయ్యాను.
ఎస్ఐఆర్ పేరుతో ఓట్లను తొలగించి, ప్రతిపక్ష పార్టీలను అధికారంలోకి రాకుండా,బిజేపి పార్టీ చేసే కుట్రను అడ్డుకోవడానికి, తిరిగి తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసి���ర్ గారిని గెలిపించుకోవడానికి ఎలా పని చేయాలో బిఆర్ఎస్ కార్యకర్తలకు తెలియజేశాను.
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపి పార్టీ,రాజ్యాంగ బద్ద సంస్థలను ఏ విధంగా ప్రభావితం చేసి, ప్రజల హక్కులను కాలరాయాలని చూస్తుందో చెపుతూ,
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ,బిజేపితో ఎలా అంటకాగుతుందో బిఆర్ఎస్ పార్టీ ఓట్లను తొలగించేందుకు ఎలా కుట్ర జరుగుతుందో బిఆర్ఎస్ సైనికులకు ఆధారాలతో సహా వి���రించాను.
రాజ్యాంగ బద్దంగా లభించిన హక్కులను కాపాడుకోవడం,తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం మన బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల తక్షణ కర్తవ్యం.
జై తెలంగాణ.
@BRSparty @KTRBRS @BollamMallaiah
కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా నిందితుడే:
(Pl watch the video completely to understand the agony of a mother)
మే 8న సాయంత్రం 6 గం.లకు ఫిర్యాదు చేయడానికి వెళ్తే సుమారు 5 గంటల పాటు ఫిర్యాదు తీసుకోలేదు.ఫిర్యాదు మార్చమన్నారు..ఆ కేసు వెనుక పెద్దలున్నారని చెప్పార���.
చివరికి రేపు ప్రధాని సభలో ఆత్మహత్య చేసుకుంటానని చెపితే తప్ప, అంగీకార పత్రం (Acknowledgement ) ఇవ్వలేదు పేట్ బషీరాబాద్ పోలీసులు! ఇది రేవంత్ రెడ్డి పాలనలో నాలుగు పాదాలపై నడుస్తున్న న్యాయం.
నిందితుడికి సహకరిస్తున్న కొందరు బాధ్యులైన పోలీసు అధికారులను (పేట్ బషీరాబాద్ సీఐ) సస్పెండ్ చేయాలి.
గౌరవ మోడీ గారు ఈ రోజు మీ సభలో వేలాది మహిళలు, కార్యకర్తలు కూర్చున్నారు .మీ పార్టీ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు సాయి భగీరథ్ పై పోక్సో కేసు కింద కేసు నమోదైతే అతడిని ఇప్పటికీ అరెస్ట్ చేయలేదు. తండ్రిని విచారించలేదు.
గతంలో మీరు కూడా నిందితుడితో ఫోటో కూడా దిగారు.
పోక్సో చట్టం ప్రకారం మైనర్ అమ్మాయి సెక్స్ కి సమ్మతి తెలిపినా,అది చెల్లదు. అయినా అతనిపై పోలీసులు కేసు పెట్టలేదు. పైగా బాధిత అమ్మాయి పైనే కరీంనగర్ లో కేసులు పెట్టారు. ఇది బాధితురాలి తల్లి పేట్ బషీరాబాద్ పోలీస్ స్ట��షన్ కు వచ్చిన వెంటనే జరిగింది. బండి సంజయ్, రేవంత్ రెడ్డి, పోలీసు ఉన్నతాధికారుల కాల్ డేటా ను విశ్లేషిస్తే ఈ కుట్ర బయట పడుతుంది.
ఎప్పుడైనా కరీంనగర్ పోలీసులు బాధిత కుటుంబాన్ని అరెస్ట్ చేయవచ్చని బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఇదే జరిగితే దీనికి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుంది.
ఇప్పటివరకు ఎందుకు పోలీసులు మెజిస్ట్రేట్ ముందు 164 Cr PC స్టేట్మెంట్ రికార్డు చేయలేదు? బాధిత కుటుంబా���ికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులదే.
తక్షణమే డిజిపి స్థాయి మహిళా అధికారి సమక్షంలో మెజిస్ట్రేట్ ముందు బాధిత అమ్మాయి,ఆమె తల్లి స్టేట్మెంట్ రికార్డు చేయాలి
రేవంత్ రెడ్డి రాష్ట్రంలో మహిళా అధికారులు డిజిపి హోదాలో ఉన్నారు,వారి ఆధ్వర్యంలో సిట్ (SIT) ఏర్పాటు చేయాలి. హైకోర్టు జడ్జి పర్యవేక్షణలో విచారణ జరగాలి. నిందితుడిని జైలుకు పంపాలి. POCSO sections ను Sec 8 కు మార్చాలి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బిజేపి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ను కాపాడాలని చూస్తున్నారు.
గతంలో V6 లో పనిచేసిన సంగప్ప ఏప్రిల్ నెలలో బాధిత కుటుంబాన్ని కలిశారు.ఇపుడు బిజేపి అధికార ప్రతినిధిగా ఉన్నారు. బాధిత కుటుంబాన్ని బండి సంజయ్ ��ో కలిపించారు. సంగప్పను పార్టీ నుండి బహిష్కరించి,ఆయన మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి.
అయితే బండి సంజయ్ నేను పెళ్లికి ఒప్పుకోను, మీ అమ్మాయి ఎంత మందితో తిరిగిందో అంటూ అవమానిస్తూ.. నా సంగతి మీకు తెల్వదు…ఏం చేసుకుంటరో చేసుకోండని బెదిరించాడు. ఆయన కూడా నిందితుడే.
రాష్ట్ర డిజిపి గారు మంత్రి బండి సంజయ్ గారి ఇంటి వద్ద ఉన్న సిసి ఫుటేజీని సేకరించాలి.
కాంగ్రెస్ నాయకులు మహిళా మంత్రులు ఎందుక��� మాట్లాడడంలేదు? సీతక్క,సురేఖ గార్లు ఎందుకు మాట్లాడడంలేదు.?
బండి సంజయ్ పిఆర్ఓ అన్ని మీడియా ప్రతినిధులకు ఫోన్ చేసి ‘హనీ ట్రాప్’ అంటూ రాయాలని, పోక్సో కేసు గురించి రాయవద్దని ఆదేశాలు ఇచ్చారు. ఒక్క పేపర్ కూడా ఈ వార్త రాయడం లేదు.
పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద ఉన్న ఈడీ కేసు నుండి రక్షణ కోసమే బండి సంజయ్ ను కాపాడాలని మీడియాకు హెచ్చరికలు జారీ చేశారు.
మీరెన్ని డ్���ామాలు చేసినా న్యాయం జరిగే వరకు పోరాడుతాం. ముందస్తు బెయిల్ ��ంటూ డ్రామాలు చేస్తే రాష్ట్రంలో ఉద్యమం చేపడుతం. సుప్రీం కోర్టు ను ఆశ్రయిస్తాం.
జై తెలంగాణ. జై హింద్
రేవంత్ రెడ్డి దగ్గర హోం శాఖ పెట్టుకోవడం, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రెవెన్యూ శాఖ ఇవ్వడం వెనుక అనేక కుట్రలు దాగి ఉన్నాయి.
వీళ్లు ఇద్దరూ కలిసి జర్నలిస్టుల మీద, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద 250కి పైగా క్రిమినల్ కేసులు పెట్టారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు సోషల్ మీడియా యాక్టివిస్ట్ కొణతం దిలీప్ మీద నిర్మల్ జిల్లాలోనే 30 కేసులు పెట్టారు.
తెలు���ు స్క్రైబ్ అనే సోషల్ మీడియా సంస్థ మీద 70 కేసులు పెట్టారు.
టెర్రరిస్టుల మీద మాత్రమే ప్రయోగించే చట్టం ప్రకారం పెట్టాల్సిన కేసును,
తెలుగు స్క్రైబ్ అనే సోషల్ మీడియా సంస్థకు సీఐ సెల్ అనే సంస్థ నుండి నోటీసులు ఇచ్చారు.
UAPA టెర్రరిస్ట్‌ల మీద పెట్టే కేసులు సోషల్ మీడియా సంస్థల మీద ఎలా పెడుతున్నారు?
- బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ @RSPraveenSwaero
నేను వ్యక్తిగత దూషణలు చేయను-చిల్లర భాషను వాడను - వాస్తవాలు దాచను - దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటం ఆపను.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లో మా @BRSparty సీనియర్ నాయకులు @KTRBRS@BRSHarish గార్లకు ఆ వ్యవహారంలో సంబంధం లేకున్నా నోటీసులు ఇచ్చి @CPHydCity@SajjanarVC గారి నేతృత్వంలో ఏర్పాటైన రెండవ సిట్ గంటల తరబడి దర్యాప్తు పేరిట వేధిస్తున్న ప్రహసనాన్ని నిన్న తెలంగాణ భవన్ లో పత్రికా సమావేశంలో ఖండించిన 12 గంటల లోపే రాత్రి 12 గంటలకు మా ఇంటికి వచ్చి సిట్ పోలీసులు నాకు నోటీసు ఇచ్చారు.
రెండు రోజుల్లో ఆధారాలతో సహా రిప్లై ఇవ్వకపోతే సివిల్-క్��ిమినల్ చర్యలకు సిద్దం కావాలని వార్నింగ్ కూడా ఇచ్చారు!!
ప్రజా సమస్యలపై, దౌర్జన్యాలపై గొంతెత్తడం నా హక్కు. నేను వార్నింగ్ లకు భయపడను.
నా దగ్గర ఉన్న సమాచారంతో జవాబు ఇస్తాను. తరువాత మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి.
నేను నిన్న మీడియా సమావేశంలో చెప్పిన కీలకమైన విషయాలు స్పష్టత కోసం కింద మళ్లీ ఇస్తున్నా:
1. దేశ రక్షణ కోసం, అంతర్గత భద్రత కోసం, వ్వవస్థీకృత నేరాల ��ివారణ కోసం టెలిఫోన్ ట్యాపింగ్ చేయడం నేరం కాదని చట్టమే చెప్పింది. దీనికి అనేక మార్గదర్శకాలు ఉన్నాయి. అనేక మంది అధికారులు రకరకాల స్థాయిల్లో దీన్ని పర్యవేక్షిస్తారు. ఇది ఒక్క ఆఫీసర్ వల్ల అయ్యే పని కాదు. ఈ విషయాన్నే దివంగత ప్రధాని డా. మన్మోహన్ సింగ్ గారు చెప్పారు. రేవంత్ రెడ్డి గారు ట్యాపింగ్ జరగడం మామూలే అని ఢిల్లీలో చెప్పినట్లుగా కూడా వార్తలున్నాయి. అలాంటప్పుడు సిట్ దర్యాప్తు ఎందుకు?
2. నేను సిట్ ఛీఫ్ సజ్జనార్ గారి మీద ఆంధ్ర ప్రదేశ్ లో నమోదైన కేసుల మీద మరో సిట్ వేయాలి అని డిమాండ్ చేసినట్లుగా నోటీసులో ఉంది. ఇది వాస్తవ విరుద్ధం.
3. నేను చెప్పింది: గతంలో ఓటుకు నోటు కేసులో లైవ్ కెమెరాలో నాటి టీడీపీ ఎమ్మెల్యే @revanth_anumula గారు(నేటి తెలంగాణ సీఎం!) అడ్డంగా దొరికిన తరువాత, ఆంధ్ర ప్రదేశ్ నాయకుల ఫోన్లు తెలంగాణ ప్రభుత్వం-ఇంటలిజెన్స్ అధికారులు ట్యాప్ చేశారని 2015 జూన్ నెలలో ఆం���్ర లో చాలా పోలీసు స్టేషన్లలో తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై కేసులు నమోదయ్యాయని పత్రికల్లో చాలా వార్తలొచ్చాయి. ఆ సమయంలో ఆంధ్ర లో కూడా ఒక సిట్ కూడా ఏర్పాటు అయ్యింది. ఆ కాలంలో నేటి సీపీ సజ్జనార్ గారు కూడా తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం లో అధికారిగా పనిచేశారు అన్న అవగాహన నాకుంది. అందుకే ఆయన ఇప్పుడు ట్యాపింగ్ వ్యవహారం పై వేసిన రెండో తెలంగాణ సిట్ కు ఛీఫ్ గా ఉండడం నైతికంగా కరక్టు కాదు అని నా అభిప్రాయం చెప్పాను.
ఇది రాజ్యాంగం నాకు కల్పించిన హక్కు. ప్రతిపక్ష పార్టీ ��ాయకుడిగా ప్రజల ముందుకు ఈ మరుగున పడిన విషయాలను ప్రజల ముందుకు తీసుకరావాల్సిన కనీస బాధ్యత నా పై ఉంది. మీకు ఇది నచ్చకపోతే వివరణ ఇవ్వండి.
4. అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న పలు కుంభకోణాల(బొగ్గు కుంభకోణం తో సహా) మీద సిట్ వేయాలని డిమాండ్ చేశాను.
5. పోలీస్ అధికారులు రేవంత్ రెడ్డి - కాంగ్రెస్ రాజకీయ క్రీడలో పావులుగా మారవద్దని సలహా ఇచ్చాను.
6. నాటి డీజీపి, హోం సెక్రెటరీ, ఛీఫ్ సెక్రటరీ లాంటి అధికారులను అందరినీ విడిచిపెట్టి సిట్ అధికారులు కేవలం డా. ప్రభాకర్ రావు, IPS (Retd) గారిని, వారి కుటుంబాన్ని , ఆయనతో పనిచేసిన కానిస్టేబు��్లను , బంధువులను వేధించడం అన్యాయం అని చెప్పాను.
7. కేవలం కొంత మంది పోలీసు అధికారుల కనుసన్నల్లోనే అత్యంత గోప్యంగా జరగాల్సిన ఈ ట్యాపింగ్ ప్రజల నోళ్లలో తరచుగా నానడం ప్రమాదకరం అని హెచ్చరించాను.
8. నేను సజ్జనార్ గారితో సహా ఏ అధికారి-ఏ రాజకీయ నాయకుడి వ్యక్తిత్వ హననానికి పాల్పడలేదు, పాల్పడను, నాకు ఆ సంస్కృతి లేదు.
నిజానికి కేటీఆర్, హరీష్ రావు, మరెందరో బీఆరెస్ నాయకులు గత రెండేళ్ల రేవంత్ రెడ్డి ప్రతీకార పాలనలో తీవ్రమైన వ్యక్తిత్వ హననానికి గురయ్యారు. ఆ విషయంలో నిందితులపై ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదు. ఎందుకని @TelanganaCOPs ?
ఈ వ్యవహారంలో మేము ముమ్మాటికీ బాధితులం. ప్రజల గొంతు గా నిలిచిన @BRSparty పై ప్రభుత్వ అణచివేత కు వ్యతిరేకంగా మా ఈ పోరాటం ఆగదు. మీ నోటీసులకు మేము అదరం, బెదరం.
9. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ట్యాపింగ్ పై చేసిన ఫిర్యాదు పై ఆయనకు పోలీసులు ఇంతవరకు నోటీసులు ఇవ్వలేదు. నాకు కనీసం అక్నాలెడ్జ్మెంటు కూడా ఇవ్వలేదు.
10. కేవలం బీఆరెస్ నాయకులకు మాత్రమే నోటీసుల మీద నోటీసులు ��ఘమేఘాల మీద రావడం, మీడియా లీకులు, జర్నలిస్టుల, సోషల్ మీడియా ఆక్టివిస్టుల విచ్చలవిడి అరెస్టులు, నాలుగు గోడల మధ్య జరగాల్సిన దర్యాప్తుపై గాంధీభవన్ లో కాంగ్రెస్ నాయకులు రోజూ లైవ్ కామెంటరీ ఇవ్వడం దేనికి సంకేతం? ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు.
జై తెలంగాణ.
.@revanth_anumula గారు,
మీరు ఒక రాష్ట్రానికి సీఎం అని మర్చిపోయారు. ఒక మాజీ సీఎం, ఒక రాష్ట్ర సాధకుడి గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.
చాలా బీఆరెస్ పార్టీ అంతర్గత మీటింగ్ ల్లో కూడా కేసీఆర్ గారు మీ గురించి ఎన్నడూ కించపరుస్తూ మాట్లాడలేదు. కేవలం ప్రజల గురించి, పథకాల గురించే మాట్లాడారు. చివరికి వరంగల్ రజతోత్సవ సభలో కూడా మీ ప్రస్తావన తీసుకురాలేదు.
మరీ మీరేమో స్థాయి దిగజారి మాట్లాడుతున్నారు. కొడంగల్ సభలో ఇది తారాస్థాయి కి చేరింది. మీరు బహిరంగ
సభల్లో పాలసీల మీద మాట్లాడండి కానీ పచ్చి బూతులు కాదు.
అమెరికాలో, జపాన్ లో బాత్రూంలు, ఎవరి ప్లేట్లు వాళ్లే కడుక్కోవడాన్ని చాలా పవిత్ర కార్యంగా భావిస్తారు. మీరేమో @KTRBRS గారిని ప్రస్తావిస్తూ ఆయన అమెరికాలో బహుళజాతి కంపెనీలో పనిచేస్తే దాన్ని బాత్రూంలు, ప్లేట్లు(మీ భాషలో చిప్పలు ) కడిగే కార్యక్రమంగా మార్చారు.
అయినా ఎవరి ప్లేట్లు వాళ్ళు కడుక్కుంటే తప్పేంటి? ఇతరుల ప్లేట్లు కడుగుతే తప్పేంటి??
@BRSparty
సమ సమాజ స్వాప్నికుడు, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు 💐
తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకోవడానికి రాజ్యాంగంలో బాబాసాహెబ్ చొరవతో ఏర్పాటుచేసిన ఆర్టికల్ 3 ఎంతగానో దోహదపడింది.
అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ గారు చూపిన బాటలోనే తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాల�� సాగింది.
హైదరాబాద్ నగరం నడిబొడ్డున 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడ��ే కాకుండా.. నూతన తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ గారి పేరు పెట్టి కేసీఆర్ గారు వారికి సమున్నత గౌరవం కల్పించారు.
బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా.. వారి ఆశయాల సాధనకు పునరంకితమవుదాం.
జోహార్ అంబేద్కర్! జై భీమ్!
#MahaparinirvanDiwas2025
రోహిన్ రెడ్డికి ఒక న్యాయం... రాజేష్,రాజశేఖర్ యువకులకు ఇంకో న్యాయమా?
రోహిన్ రెడ్డి గన్నులు పెట్టి బెదిరించినా కేసులు ఉండవు.
మమ్మల్ని కాపాడాలని పోలీసులను ఆశ్రయించిన ఎస్సీ యువకులను మాత్రం అకారణంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించి చంపుతారా.
ఇదెక్కడి న్యాయం? ఇదెక్కడి పాలన?
రాజేష్ కు న్యాయం జరగాలని మృతదేహంతో 48 గంటలుగా ధర్నా చేస్తున్నా హోం మంత్రి పట్టించుకోవడం లేదు?
అలాంటి మంత్రికి ఆ పదవి ఎందుకు ? రాజీనామా చేయండి @revanth_anumula గారు.
జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలో బిఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన @BRSparty నాయకులు,కార్యకర్తలందరికీ ప్రజలందరికీ అభినందనలు.
అధికార కాంగ్రెస్ పార్టీ అఘాయిత్యాలు చేసినా,ఎన్ని అవకతవకలకు పాల్పడినా,ఎన్ని ఘోరాలకు తెగించినా,తప్పుడు కేసులు బనాయించి,రౌడీలతో బెదిరించినా.. భయపడకుండా నిలబడిన ప్రతి కార్యకర్త �� ఎన్నికల్లో నైతికంగా విజేతే.
20 వేల దొంగ ఓట్లు ఉన్నాయని,కాంగ్రెస్ నాయకుల ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ఫిర్యాదు చేసినా,దొంగ ఓటర్లను దొరకపట్టి అప్పజెప్పినా... ఎన్నికల కమీషన్,పోలీసు యంత్రాంగం ఎలా పనిచేసిందో కళ్లారా చూశాం.
ఏదేమైనా ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం.
నవీన్ యాదవ్ కు అభినందనలు.
జై తెలంగాణ ✊✊✊
@KTRBRS @BRSHarish
ఫ్రస్ట్రేషన్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తన రౌడీ స్వరూపాన్ని బయటపెట్టుకుంటున్నడు.
జూబ్లీహిల్స్ పరిధిలో ప్రచారం చేస్తున్న ప్రతిపక్ష నాయకులకు ఈ బచ్చా
“జూబ్లీహిల్స్ నా అడ్డా..
ఎక్కడినుండో వచ్చిన మీరు గల్లీ దాటి బైటికిపోలేరు” అనీ చిల్లర దమ్కీ కూడా…🤣
మన @TelanganaCOPs@ECISVEEP కు ఇవి ఏ మాత్రం కనిపించవు.
నవంబర్ 11 న ఈ బచ్చా బాజీ గూండాగిరి రాజ్యాంగ బద్దంగా ప్రజల చేతిలో అంతం కాబోతున్నది. ✊👊
@BRSparty@KTRBRS
మాగంటి గోపినాథ్ గారు అకాల మరణం చెందడం,ఉప ఎన్నికలు రావడం బాధాకరం.
అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా తన భర్తను గుర్తుచేసుకొని బాధపడితే,కుటుంబం మొత్తం గోపీనాథ్ గారి పేరు చెప్తుంటే,ప్రజలు చూపుతున్న ప్రేమ,ఆప్యాయతలను చూ��ి గొప్ప మనిషిని కోల్పోయామనే బాధతో కన్నీళ్లు పెట్టుకుంటే..
ఏడుపు ఒక డ్రామా, సినిమాల్లో చూసినట్టుగా ఉందంటూ,ఒక మంత్రి స్థాయిలో @Ponnam_INC గారు మాట్లాడడం చాలా దారుణం.
రాజకీయాలు ఎన్నైనా చేసుకోవచ్చు,కానీ కుటుంబం ముఖ్యంగా భర్తను కోల్పోయిన భార్య భావోద్వేగాలను అవమానించడం సిగ్గుచేటు.
@INCTelangana కు గెలవడం చేతకాక,ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గెలవలేక పోతున్నామనే బాధ,ఫ్రస్ట్రేషన్ అర్థం అవుతుంది.
మంత్���ి పొన్నం ప్రభాకర్ గారు వెంటనే క్షమాపణ చెప్పాలి. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. @KTRBRS
#Scamgress #MagantiGopinath
ఆరు గ్యారెంటీల లాగే,
కాంగ్రెస్ 42% బీసీ రిజర్వేషన్ల డ్రామా..
55 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉండి కాంగ్రెస్ ఏనాడైనా బీసీ రిజర్వేషన్ల కోసం పాటు పడిందా..?
చిత్తశుద్ధి ఉంటే మీ @INCIndia జాతీయ నాయకులతో డిల్లీ వేదికగా కోట్లాట పెట్టండి..
కలిసి రావడానికి @BRSparty ఎల్లప్పుడూ సిద్ధం..
మాయ మాటలు చెప్పి గత ఎన్నికల్లో బీసీలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన @INCTelangana .. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ లబ్ది పొందాలని చేసిన కుట్రలు పటాపంచలయ్యాయి.
22 న���లలుగా బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కొట్లాడాల్సిన @revanth_anumula గల్లీలో కొట్లాడుతున్నట్లు డ్రామా క్రియేట్ చేసారు తప్ప, బీసీలకు 42శాతం రిజర్వేషన్ సాధించడం పట్ల ఏనాడూ చిత్తశుద్ది ప్రదర్శించలేదు.
కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం, 42శాతం రిజర్వేషన్ కల్పించేందుకు చట్ట బద్దత కోసం కేంద్రాన్ని పట్టుబట్టాల్సిన రేవంతు రెడ్డి, తెలివిగా దాన్ని పక్క దోవ పట్టించారు.
బీసీల పట్ల తమకు నిజంగానే ప్��ేమ ఉన్నట్లు చాటుకునేందుకు తూతూ మంత్రంగా జీవో ఇచ్చి కొత్త నాటకానికి తెరతీసారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేసారు.
రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మీ డ్రామాలు ఆపండి. మీకు, మీ పార్టీకి బీసీల పట్ల నిజంగా చిత్తశుద్ది ఉంటే 42శాతం పెంపు విషయమై ఢిల్లీలో కొట్లాడండి. పార్లమెంట్ లో చట్టం చేయించి, షెడ్యుల్ 9లో చేర్చండి.
బీసీలకు 42శాతం రిజర్వేషన్ పోరాటంలో అఖిల పక్షాలను భాగస్వామ్యం చేయండి. ఢిల్లీ వేదికగా యుద్ద భేరి మోగించండి. ఉద్యమ పార్టీగా బిఆర్ఎస్ ఎల్లప్పుడూ బీసీల కోసం గొంతెత్తుతుంది. ఢిల్లీని ��ిలదీస్తుంది.
#CongressFailedTelangana
#CongressBetrayedTelangana
సిర్పూర్ నియోజకవర్గంలోని కౌటాల మండలంలో స్వచ్ఛందంగా కాంగ్రెస్ బిజెపి పార్టీలను వదిలేసి,కేసిఆర్ పాలనలోనే మా బతుకులు మారుతాయని స్వచ్ఛందంగా గులాబీ కండువాలు కప్పుకొని పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్న ప్రజలు.
రానున్న స్థానిక ��న్నికల్లో ప్రతి గ్రామం గులాబీ మయం కాబోతున్నది.✊
జై తెలంగాణ.
@BRSparty @KTRBRS
#SirpurFirst
అయ్యా మంత్రిగారు,
ఇదంతా కాదు కానీ ఈ సబ్జెక్ట్ సంబంధించిన ‘నోట్ ఫైల్ ను’ దయచేసి ప్రజల ముందు ఉంచండి.
ఇంత కీలకమైన (ఆర్థిక పరమైన) నిర్ణయాలని ఐఏయస్ అధికారులు మంత్రులకు సర్కులేట్ చేయకుండా తీసు��ోరు.
సంబంధిత మంత్రి సంతకం లేకుండా జీవో (GO) బయటికి రాదన్న విషయం తమరికి తెల్వదా?