*_"సహస్ర మోదక లక్ష్మీ గణపతి హోమం"లో పాల్గొన్న బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ గారు..._*
వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా కొంపల్లి లోని ఎన్సీఎల్ నార్త్ నోబెల్ ఎంక్లేవ్ లో ఏర్పాటుచేసిన వినాయక మండపం వద్ద అమ్మవారి ఉపాసకులు రాచర్ల రవిచంద్ర శర్మ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన "సహస్ర మోదక లక్ష్మీ గణపతి హోమం" కార్యక్రమానికి బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ గారు హాజరై స్వామి వారి విశేషమైన పూర్ణాహుతిలో పాల్గొని గణనాథుడి కృపతో లోకమంత సుభిక్షంగా, ప్రజలంతా సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆ గణనాధుడిని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
పోలీసుల మీద దాడి చేశాడని మాట్లాడుతున్న
కాంగ్రెస్ సన్నాసుల్లారా
దాడి చేయడం కాదు మీ దౌడలు పగులకొట్టాలి
మీరు చేసిన పనికి
మహిళ ఎమ్మెల్యేలను, మంత్రులుగా పని చేసిన ఇద్దరు ఆడబిడ్డలను మగపోలీసులను పెట్టి చీరలు లాగిస్తారా? గొంతు నులుముతారా?
ఇవన్నీ చూసిన కేటిఆర్ ఒక సోదరుడిగా,
పార్టీ నాయకుడిగా చూస్తూ మౌనంగా కూర్చోవాలా?
మీకు రేషం లేకపోవచ్చు, ఆయన ఉద్యమాల్లోంచి ఎదిగివచ్చిన పౌరుషంగల్ల తెలంగాణ బిడ్డ,
ఆడబిడ్డలను అంటే చూస్తూ ఊరుకోడు
#KTR #Fire #on #CongressParty
🔥 1000 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన! 🔥
1000 రోజులు గడిచినా… ప్రజల కష్టాలు తీరలేదు!
🍳 వంటింటి మంటలు ఆరిపోతున్నాయా?
ఇంట్లో వంట చేసుకునే పరిస్థితులు లేక
రోడ్డుపై వంట చేసుకునే దుస్థితి ఎందుకు వచ్చింది?
❓ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?
❓ ప్రజలకు ఇచ్చిన మాటలు ఎక్కడ?
❓ ధరల భారం, నిరుద్యోగం, ప్రజా సమస్యలకు పరిష్కారం ఎక్కడ?
✊ 1000 రోజుల పాలనపై ప్రజల ప్రశ్నలకు
కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి!
🔥 ప్రజల కోసం… ప్రజల పక్షాన…
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిద్దాం!
@KTRBRS@BRSparty@BRSHarish
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు స్టే విధిస్తూ ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని సూచించినా..
కాంగ్రెస్ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకుండా సంక్షేమ పథకాలకు స్వస్తి పలికేలా వ్యవహరిస్తున్న నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారి పిలుపు మేరకు కుత్బుల్లాపూర్ జోనల్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే @kp_vivekanand పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు.
మోడల్ గ్రేవ్ యార్డ్ గా కళావతి నగర్ వైకుంఠ ధామాన్ని తీర్చిదిద్దుతాం : బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ గారు...
ఈరోజు 129 - సూరారం డివిజన్ కళావతి నగర్ లోని వైకుంఠధామం సుందరీకరణ పనుల్లో భాగంగా వైకుంఠధామంలో బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ గారు చెట్లను నాటారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....
🪴 ప్రతి మనిషి జీవితంలోని చివరి మజిలీని గౌరవప్రదంగా నిర్వహించేందుకు అన్ని మౌలిక వసతులతో కూడిన మోడ్రన్ గ్రేవ్ యార్డ్ గా కళావతి నగర్ వైకుంఠధామాన్ని అభివృద్ధి పరుస్తున్నామని అన్నారు.
🪴 వైకుంఠధామాల సుందరీకరణలో భాగంగా ఈ వైకుంఠధామంలో చెట్లను నాటడంతో పాటు సీసీ రోడ్డు నిర్మాణము, అధునాతన దహన వాటికల నిర్మాణముతో పాటు రానున్న రోజుల్లో మరిన్ని సదుపాయాలను కల్పించి వైకుంఠధామాన్ని మోడ్రన్ గ్రేవ్ యార్డ్ గా తీర్చిదిద్దుతామన్నారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, కళావతి నగర్ వైకుంఠధామం అభివృద్ధి కమిటీ సభ్యులు ముద్దాపురం మధన్ గౌడ్, రజితా రత్నం, సీనియర్ నాయకులు సిద్దిక్, కోల శ్రీకాంత్ ముదిరాజ్, రవి తదితరులు పాల్గొన్నారు.
*_ప్రజలకు మెరుగైన మౌళిక వసతులు కల్పించడం లక్ష్యం : బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ గారు...._*
ఈరోజు 278 - గాజుల రామారం డివిజన్ పెద్దమ్మ నగర్ బస్తీ (1.12 కోట్ల రూపాయలు), అయ్యప్ప కాలనీ (90 లక్షల రూపాయలు) లలో సీసీ రోడ్ల నిర్మాణానికై నిధులు మంజూరైన సందర్బంగా ఆయా బస్తీలు, కాలనీలో బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ గారు అధికారులతో కలిసి పర్యటించారు.
ఈ సందర్బంగా బస్తీలో పర్యటించిన ఎమ్మెల్యే గారికి కాలనీ వాసులు గజమాల, డప్పుల దరువుల మధ్య ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ...
🪴 పెద్దమ్మ నగర్ బస్తి, అయ్యప్ప కాలనీలలో ఇప్పటికే భూగర్భ డ్రైనేజీ, త్రాగునీటి పైప్ లైన్, వీధి దీపాల వంటి మౌళిక వసతుల సదుపాయాలతో అభివృద్ధి పరిచామని, అతి త్వరలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు కూడా ప్రారంభించి పెద్దమ్మ నగర్, అయ్యప్ప కాలనీలను మరింత అభివృద్ధి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం ఏఈ కళ్యాణ్, జలమండలి డీజిఎం రవి నాయక్, మేనేజర్ రమ్య భారతి, పెద్దమ్మ నగర్ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ డి.నవీన్, జనరల్ సెక్రటరీ రమేష్, వైస్ ప్రెసిడెంట్ మనోహర్, కోశాధికారి ఆరిఫ్, పరశురాం, జాయింట్ సెక్రటరీ జీ.శ్రీనివాస్,సంక్షేమ సంఘం సభ్యులు గోపాల్ అలాగే స్థానిక నాయకులు పాక్స్ డైరెక్టర్ పరుశ శ్రీనివాస్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు విజయ్ రాంరెడ్డి, సీనియర్ నాయకులు కస్తూరి బాల్ రాజ్, అడ్వకేట్ కమలాకర్, నవాబ్ భాయ్, తెలంగాణ సాయి, నాయకులు, మహిళా నాయకురాల్లు రాధా భాయి తదితరులు పాల్గొన్నారు.
*_దేవాలయం ముఖద్వారం.... సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతిబింబం : బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ గారు..._*
ఈరోజు 125 - గాజుల రామారం డివిజన్ సుభాష్ చంద్ర బోస్ నగర్ - బి లోని పెద్దమ్మ తల్లి, పోచమ్మ తల్లి దేవాలయం నూతన ముఖద్వారంను బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ గారు ప్రారంభించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ...
🛕 దేవాలయ ముఖద్వారం.... సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతిబింబమని అన్నారు. అమ్మవారి కరుణా కటాక్షాలతో ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్టఐశ్వర్యాలతో జీవించాలన్నారు.
ఈ కార్యక్రమంలో పాక్స్ డైరెక్టర్ పరుశ శ్రీనివాస్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు విజయ్ రాంరెడ్డి, సీనియర్ నాయకులు కస్తూరి బాల్ రాజ్, అడ్వకేట్ కమలాకర్, నవాబ్ భాయ్, తెలంగాణ సాయి, మసూద్, చిన్నా చౌదరి, నగేష్, దూలప్ప, సుంకరి చందు, బోయిని మహేష్, సమ్మయ్య యాదవ్,సయ్యద్ రంజాన్, గౌస్, ప్రసాద్, శివ నాయక్, శ్రవణ్, కాలనీ వాసులు శేఖర్, అంజయ్య, ఆంజనేయులు, కొండప్ప, నజీర్ మియా, కనకయ్య, యాదగిరి, చందు, వెంకట్, శ్రీనివాస్, నవీన్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
VIDEO | Hyderabad: On the Suryapet farmers' blood packet protest, BRS MLA Vivekanand Goud says, "Farmers are expressing their distress in this manner. At least now, the government should think positively and make use of projects such as the Kaleshwaram Project. If the government is unable to provide water, it should offer alternatives and instil confidence among farmers. He (Chief Minister Revanth Reddy) is always playing a negative role because of his ineffectiveness, irresponsibility and unavailability. He has not been able to run the state properly. For the past two-and-a-half years, all sections of society in Telangana have suffered, with farmers bearing the brunt of the crisis. The state government must come forward and reassure the farming community."
(Full video available on PTI Videos - https://t.co/bIyFWTfmBd)
#WATCH | Hyderabad, Telangana | BRS MLA Vivekanand KP says, “Because of El Niño, there is no proper rain in Telangana state, and we have a very good project constructed by KCR when we, the BRS, were in power. The beauty of the project is that when we don't have proper rainfall, we can get water from Medigadda barrage… We advise the government to lift water from Medigadda barrage by switching on the Kannepalli pumps to distribute water to the entire Kaleshwaram project and the entire reservoirs which we have constructed. Despite advice from the BRS party and also advice from retired engineers that we can make use of the project at this time, CM Revanth Reddy is not taking our advice… He is trying to politicise the issues. He is never thinking in the lines of the interest of the farmers or the people of the state… He wants to damage KCR's image by showing that the Kaleshwaram project is a failed project... The CM gave the statement to feed the fields with blood… So such are the conditions in the state because of the irresponsibility of the CM… The farmers are putting the blood on the fields. The state has to give confidence to the farmers that they will be with them…”
*యువత ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవడంతో పాటు క్రీడల్లో రాణించేందుకు ఆటల పోటీలు మంచి వేదికగా నిలుస్తాయి : బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గారు..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కె.పి. వివేకానంద్ గారిని ఈ నెల 26వ తేదీ (ఆదివారం) కొంపల్లి లోని వెంకట సాయి కాలనీ లో గల టార్క్ అండ్ టోన్ ఫిట్నెస్ స్టూడియోలో నిర్వహించనున్న WPC తెలంగాణ ఓపెన్ డిస్ట్రిక్ట్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ – 2026 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిర్వాహకులు ఆహ్వానించారు.
టార్క్ & టోన్ ఫిట్నెస్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌కు ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను ప్రోత్సహించాలని నిర్వాహకులు ఎమ్మెల్యే గారిని కోరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గారు మాట్లాడుతూ...యువతలో ఫిట్‌నెస్‌పై అవగాహన పెంపొందించడంతో పాటు పవర్‌లిఫ్టింగ్ వంటి శక్తి క్రీడలను ప్రోత్సహించే ఇటువంటి కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని అన్నారు. యువత ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవడంతో పాటు క్రీడల్లో రాణించేందుకు ఇలాంటి పోటీలు మంచి వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ ఛాంపియన్షిప్ విజయవంతం కావాలని, రాష్ట్ర స్థాయిలో మరిన్ని ప్రతిభావంతులైన పవర్లిఫ్టర్లను తీర్చిదిద్దే దిశగా నిర్వాహకులు చేస్తున్న కృషిని అభినందించారు.
ఈ నెల 26న నిర్వహించనున్న ఈ ఛాంపియన్‌షిప్‌లో బెంచ్ ప్రెస్ మరియు డెడ్‌లిఫ్ట్ విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. జిల్లా నలుమూలల నుంచి పవర్‌లిఫ్టింగ్ క్రీడాకారులు పాల్గొననున్న ఈ పోటీల్లో విజేతలకు మొత్తం రూ.30,000 నగదు బహుమతులతో పాటు ట్రోఫీలు, మెడల్స్ ప్రదానం చేయనున్నారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు ఉదయ్ కిరణ్, వర్ష, కీర్తన మరియు ఆకాష్ పాల్గొన్నారు.