బాధిత బాలికకు సరైన వైద్యం అందించలేక,
పేదలకు వైద్యం అందించే నిమ్స్ ఆస్పత్రిలో
కనీసం మెడిసిన్ కూడా ఇవ్వకుండా బయట నుంచి తెచ్చుకోమన్నారు.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వైద్యం ఇప్పించే తెలివి లేదు కానీ,
మేం వస్తున్నామని తెలిసి వందల మంది పోలీసులను పెట్టారు.
బాధితులు తమ సొంత డబ్బులతో మెడిసిన్ బయట కొనుక్కునే పరిస్థితి వచ్చిందంటే..
రాష్ట్రంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్లు?
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
మెట్రో విషయంలో మరోసారి తెలంగాణపై బీజేపీ వివక్ష! 🚫🚇
అహ్మదాబాద్ మెట్రోకు వేల కోట్ల నిధులు కేటాయిస్తూ...
హైదరాబాద్‌కు మాత్రం "నిధులు లేవు" అంటూ చేతులెత్తేసిన మోదీ సర్కార్.
8 మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా...
తెలంగాణకు తెచ్చింది నిధులు కాదు, నిరాశ మాత్రమే!
పన్నులు తెలంగాణవి... పైసలు గుజరాత్‌కు!
ఇదేనా బీజేపీ "సబ్కా సాథ్, సబ్కా వికాస్"?
📢 పాలమూరుపై రేవంత్ పచ్చి అబద్ధాలు ⛔
💥 పాదయాత్ర చేస్తామన్న బీఆర్ఎస్ నాయకుల హెచ్చరికలతో కదిలొచ్చిన కాంగ్రెస్ సర్కార్ 🎯
🌊 కేసీఆర్ మహాయజ్ఞం కోసం.. పాలమూరు రైతుల త్యాగం
📣 కేసీఆర్ సర్కార్ సేకరించింది 26,950 ఎకరాలు. ఎత్తిపోతల కోసం ఖర్చు చేసింది రూ.27,000 కోట్లు
⚠️ సీఎంవి అసత్యాలని తేల్చిన అధికారిక లెక్కలు. పథకం ప్రకారమే సొంత జిల్లాపై రేవంత్ వివక్ష
🚨 అన్నీ మరచి భూ సేకరణ చేయకుండానే పనులు చేశారని రేవంత్ ఆరోపణ
🔸 పట్టణాల్లా రూపుదిద్దుకున్న నిర్వాసిత గ్రామాలు
❌ తప్పులు కప్పిపుచ్చుకొనేందుకు డాంబికాలు. 10 శాతం పనులు చేయలేక అసత్య ప్రచారం
కేసీఆర్ సర్కార్‌పై బట్టకాల్చి మీద వేసేందుకు సొంతగడ్డకే ద్రోహం తలపెట్టిన రేవంత్‌రెడ్డి.. ‘పాలమూరు-రంగారెడ్డి’పై చెప్పింది పచ్చి అబద్ధమని అధికారిక లెక్కలే స్పష్టం చేస్తున్నాయి.
ఎత్తిపోతల పథకంలో మొత్తం ఐదు స్టేజ్‌ల ద్వారా 90 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగించుకొని, 12.3 లక్షల ఎకరాలకు సాగునీరందించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు వెచ్చించి పంప్‌హౌస్‌లు, రిజర్వాయర్లు నిర్మించి 90 శాతం పనులు పూర్తి చేసింది. మొత్తం 27,081.95 ఎకరాలు అవసరమైతే,అక్షరాలా 26,950.97 ఎకరాలు సేకరించింది.
చాలాచోట్ల భూసేకరణ చట్టం-2013 ప్రకారం మెరుగైన పరిహారం అందించి నిర్వాసితుల జీవితాల్లో వెలుగులు నింపింది. ఆర్అండ్ఆర్ కాలనీలు మినీ పట్టణాల్లా కళకళలాడుతున్నాయి. పాలమూరు పథకంలో భాగంగా నిర్మించిన పంప్‌హౌస్‌లు, రిజర్వాయర్లను కేసీఆర్ హయాంలో భారీ ఎత్తున భూసేకరణ చేసి రైతులకు పరిహారం ఇచ్చిన తర్వాతే పనులు మొదలు పెట్టినట్టు తేటతెల్లమైంది.
ఈ ఎత్తిపోతల పథకాన్ని మహాయజ్ఞంగా భావించిన కేసీఆర్ 2016 జూన్ 11న ముఖ్యమంత్రి హోదాలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ నేతలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. కరోనా కష్టకాలాన్ని కూడా జయించి 2023న సెప్టెంబర్ 16న కృష్ణానది జలాలను ఉప్పొంగించి రైతుల కండ్లల్లో సంతోషాన్ని చూశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మిగిలిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులను త్వరితగతిన పూర్తిచేయాల్సింది పోయి నిరాశే మిగిల్చారు.
ఈ పథకం పూర్తిచేస్తే ఎక్కడ కేసీఆర్‌కు పేరొస్తుందోనని 30 నెలలుగా పట్టించుకోని రేవంత్ ప్రభుత్వం.. బీఆర్ఎస్ కార్యాచరణకు దిగడంతో హడావుడిగా ప్రాజెక్టుల బాట పట్టింది.
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి రేవంత్ రెడ్డి దగ్గర డబ్బులు లేవు కానీ..
తన సీటును కాపాడుకోవడం కోసం ఢిల్లీ బాసులకు మూటలు మోయడానికి డబ్బులున్నాయి.
అలవికాని హామీలతో గద్దెనెక్కి ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ దొంగలు!
#CongressFailedTelangana
నిరుద్యోగులను నమ్మించి.. నిలువునా ముంచుతున్న దగాకోరు కాంగ్రెస్!
ఎన్నికలప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లకు ఎలాంటి అప్లికేషన్ ఫీజులూ ఉండవని నమ్మబలికి,
తీరా అధికారంలోకి వచ్చాక రూ. 200 ఉన్న టీజీపీఎస్సీ ఉద్యోగ అప్లికేషన్ ఫీజును ఏకంగా రూ. 1,000కి పెంచిన కాంగ్రెస్ సర్కార్.
ఓట్ల కోసం నిరుద్యోగులను వాడుకుని నయవంచన చేసిన రేవంత్ సర్కార్!
ఎన్నికల ముందు ఎన్నో చెప్పి, ఓట్లేశాక మా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అసలు కనిపించడం లేదు.
మహిళా సంఘాలకు నెలకు రూ. 2,500 ఇస్తామన్నారు, గ్యాస్ ఫ్రీ అన్నారు ఇంతవరకు దిక్కే లేదు.
కేసీఆర్ ఉన్నప్పుడు సక్కగ వచ్చిన రైతుబంధు ఇప్పుడెందుకు రావడం లేదు?
- మహిళా రైతు
Dear Hyderabadis,
The national parties that won 8 seats each in Telangana have done zilch for you.
As soon as it came to power, the Congress-led government cancelled the Raidurg–Airport Metro, which was ready for construction.
The BJP-led Union government denied the BHEL–Lakdikapul Metro line to Hyderabad, citing low ridership, while approving metro projects for Lucknow, Indore, and other cities.
Both are a burden on Telangana!
గుర్తుంచుకో రేవంత్..
నువ్వు రోల్ మోడల్‌గా భావించే ఆ హిట్లర్ కూడా ప్రజల ఆగ్రహ జ్వాలల్లో బూడిదై, చరిత్ర హీనుడిగా మిగిలిపోయాడే తప్ప సాధించింది ఏమీ లేదు!
ఇది పోరాటాల పురిటిగడ్డ తెలంగాణ!
ఈ గడ్డ బిడ్డల తిరుగుబాటు ముందు నీ అహంకారం, నీ నియంతృత్వం తలవంచక తప్పదు. పేదల ఇండ్లను కూలుస్తూ నువ్వు చేస్తున్న విధ్వంసానికి.. నిన్ను, నీ హైడ్రాను జనం పాతరేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.
తెలంగాణ జన సముద్రం ముందు నువ్వు, నీ అహంకారం కొట్టుకుపోవడం ఖాయం! 🎯
జై తెలంగాణ ✊🏻
20,000 geo-tagged mangroves planted in the Sundarbans on KCR Garu’s birthday are thriving!
Just 4 months later, many have grown up to 3 feet tall. These before-and-after photos are proof that when people come together for nature, real change happens.
Planting is the beginning. Nurturing is the mission.
#GreenIndiaChallenge #Sundarbans #Mangroves #ClimateAction
దొంగ రేవంత్ పాలనలో ఒకటో తారీఖు జీతాలు దేవుడెరుగు...
అసలు జీతాలకే దిక్కులేదు!
సర్పంచులకు,
అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు,
ఉపాధి హామీ సిబ్బందికి...
నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా గోస పెడుతున్న కాంగ్రెస్ సర్కార్.
మీ విందులు, విలాసాలు, అబద్ధపు ప్రచారాలకు కోట్ల రూపాయలు ఉంటాయి..
కానీ ఈ చిరు ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి మాత్రం పైసలు లేవా రేవంతూ?
#CongressFailedTelangana
ఢిల్లీలోని జాతీయ విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ కె.జి. బాలకృష్ణన్‌తో బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల బృందం సమావేశం ముగిసింది.
దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించాలనే ప్రధాన డిమాండ్‌పై ఈ సమావేశం జరిగింది.
ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదికను కమిషన్ చైర్మన్‌కు బీఆర్ఎస్ ప్రతినిధులు అందజేశారు.
ఈ బృందంలో రాజ్యసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @vaddirajumprs, మాజీ మంత్రి @Koppulaeshwar1, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ @RSPraveenSwaero, కార్పొరేషన్ మాజీ చైర్మన్ @RajeevSagarM పాల్గొన్నారు