అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్
ప్రజా సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్
ప్రజా నాయకుడు నారా చంద్రబాబునాయుడు గారి జన్మదిన వేడుకలను పుంగనూరు నియోజకవర్గం రొంపిచర్ల మండలం నందు అంగరంగ వైభవంగా జరిగాయి .
స్థానిక టిడిపి నాయకులు ఏర్పాటుచేసిన భారీ కేక్ కటింగ్ చేసి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి - మెగా వైద్యశిబిరం లో బ్లడ్ డొనేషన్ చేశాను ,చంద్రబాబు గారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని పరుగులు పెట్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
#HappyBirthdayCBN
#HBDLegendCBN
కార్యకర్త ఒంటరివాడు కాదని మరోసారి నిరూపించిన నాయకుడు... పుంగనూరు టీడీపీ ఇంచార్జ్ చల్లా రామచంద్రారెడ్డి గారు.
అర్ధరాత్రి అయినా... పోలీస్ స్టేషన్ అయినా...
తన కార్యకర్తలకు అండగా నిలబడి, వారి బెయిల్ కోసం నిరీక్షించడం నాయకుడి బాధ్యతను కాదు, కుటుంబ సభ్యుడి ప్రేమను గుర్తు చేసింది.
కూటమి ప్రభుత్వం ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబురెడ్డి) గారి ఆధ్వర్యంలో రొంపిచర్లలో భారీ బహిరంగ సభ నిర్వహించారు.
టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీతో సభకు తరలివచ్చారు.
చల్లా బాబురెడ్డి గారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూటమి ధర్మాన్ని పాటిస్తూ 'సూపర్ సిక్స్' పథకాలతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు.
ముఖ్యంగా మహిళల సాధికారతకు ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ప్రజలందరి ఆశీస్సులు కూటమి ప్రభుత్వానికి ఉండాలని కోరారు. .
#Punganur #Rompicherla #ChallaBabuReddy #NCBN #Super6 #AndhraPradesh
ప్రజల విశ్వాసం… అభివృద్ధికి బలమైన పునాది!
పుంగనూరు నియోజకవర్గం రొంపిచర్ల మండలంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన విజయవంతంగా పూర్తయిన సందర్భంగా “రెండేళ్ల నమ్మకం – సంక్షేమం & అభివృద్ధి” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాము.
ప్రజల సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించాము. ప్రజల విశ్వాసం, ఆశీర్వాదాలతో మరింత సేవాభావంతో ముందుకు సాగుతామని మరోసారి సంకల్పించాము.
రెండేళ్ల నమ్మకం… మరింత అభివృద్ధి వైపు అడుగులు!
#TwoYearsOfTrust
#ProgressForAndhra
#ViksitAndhra
#PunganurConstituency #RuralDevelopment #GrassrootsGovernance #StrongerTogether
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి NTR భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రొంపిచర్ల మండలం పెద్ద గొట్టిగల్లు గ్రామం శ్రీనాధపురం కాలనీలో ఉదయాన్నే లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పెన్షన్లను పంపిణీ చేయడం జరిగింది.
#IdhiManchiPrabhutvam
పుంగనూరు టౌన్ ట్రావెల్స్ బంగ్లాలో సర్ ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ కార్యక్రమంలో భాగంగా రూరల్ మరియు అర్బన్ క్లస్టర్, యూనిట్ ఇన్చార్జులు తెలుగుదేశం పార్టీ నాయకులతో ఓటర్ వెరిఫికేషన్ సమావేశంలో పాల్గొనడం జరిగింది.
రాబోవు 14 రోజులు అప్రమత్తంగా ఉండి ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమంలో పాల్గొనాలని ,
ప్రభుత్వం నియమించినటువంటి BLAలతో సమన్వయం చేసుకొని ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని,
BLAలు సక్రమమైన పద్ధతిలో వ్యవహరించకపోతే కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లి 24 గంటల్లో వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది .
అనంతరం అధికారులతో కలిసి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించాను .
#ఆవులపల్లి ప్రాజెక్టు బాధిత రైతులకు విముక్తి! 🌾
గత ప్రభుత్వ హయాంలో 22A నిషేధిత జాబితాలో చేరిన ఆవులపల్లి రైతుల భూములను, ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు గారి ప్రభుత్వం 22A నుంచి తొలగిస్తూ జీవో జారీ చేసింది.
ఈ సమస్య పరిష్కారానికి నిరంతరం కృషి చేసిన పుంగనూరు టీడీపీ ఇన్చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి గారికి రైతులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ సత్కరించారు..
@ncbn@Mee_Challababu
#Punganur #TDP #ChandrababuNaidu #ChallaRamachandraReddy #Farmers
పుంగనూరు నియోజకవర్గంలో SIRపై సమగ్ర సమీక్ష..
రొంపిచర్లలో పుంగనూరు నియోజకవర్గ ముఖ్య మండల స్థాయి నాయకులతో SIR ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించిన టీడీపీ ఇన్చార్జ్ చల్లా రామచంద్ర రెడ్డి గారు.
ప్రతి BLA – BLO సమన్వయంతో పని చేస్తూ, ఎన్యుమరేటర్ ఫారాలను ఓటర్ల నుంచి సకాలంలో BLOలకు చేరవేసి రసీదులు పొందాలని, నమోదు చేసిన వివరాలు క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా పరిశీలించాలని సూచించారు.
పార్టీ నిర్దేశించిన మార్గదర్శకాలను ప్రతి కార్యకర్త కట్టుబడి అమలు చేయాలని, మండల, క్లస్టర్, యూనిట్, గ్రామ, బూత్ స్థాయిల్లో సమన్వయంతో పనిచేసి పారదర్శకమైన, సమగ్ర ఓటరు జాబితా సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా మండలాల వారీగా నాయకులతో సమీక్ష నిర్వహించి పురోగతి వివరాలను తెలుసుకున్నారు.
#TDP #Punganur #SIR #ChallaRamachandraReddy #AndhraPradesh #Vote
స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించాను.
అక్కడ వసతులు, విద్యార్థులు మరియు గర్భిణీలకు అందుతున్న ఆహార నాణ్యతపై ఆరా తీసి, పరిసరాల పరిశుభ్రతపై టీచర్‌కు తగు సూచనలు జారీ చేయడం జరిగింది. ప్రజల సంక్షేమమే మా లక్ష్యం.
రూట్ క్లియర్.. పుంగనూరు 'చల్లా' వస్తోంది! 🚨🦁
చంద్రగిరి దామినేడు సభకు వందలాది కార్ల భారీ ర్యాలీతో తరలివెళ్లి, తన సత్తా ఏంటో రాష్ట్ర స్థాయికి చాటిచెప్పిన పుంగనూరు ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి గారు.
సీఎం చంద్రబాబు గారి ఆశయాలకు అండగా.. పుంగనూరును ప్రగతి పథంలో నిలబెట్టేందుకు చల్లా గారు వేస్తున్న ప్రతి అడుగు సూపర్ హిట్! ఈ జోష్, ఈ సంఘీభావం అమోఘం. 👌
#ChallaRamachandraReddy #PunganurMass #KuotamiJathara #APGovernment2Years
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలంలోని నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులను పుంగనూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబు రెడ్డి) గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
నిర్మాణ పురోగతిని పర్యవేక్షించి, వైద్య సిబ్బంది మరియు డాక్టర్లతో మౌలిక వసతులు, ప్రజలకు అందాల్సిన వైద్య సేవలు & సదుపాయాల గురించి సుదీర్ఘంగా చర్చించారు. పనుల నాణ్యతపై అధికారులకు కీలక సూచనలు చేశారు.
#ChallaRamachandraReddy #TDP #Punganur #Pulicherla #PHC #Healthcare #PublicService
ప్రతి ఓటును కాపాడుకోవడం మన బాధ్యత. చల్లాబాబు. 🫡👌🏻
ఓటరు అవగాహన సదస్సును విజయవంతం చేయాలని రొంపిచర్ల, పులిచర్ల, సదుం మండలాల క్లస్టర్ యూనిట్ బూత్ గ్రామ కమిటీ మండల కమిటీ సీనియర్ నాయకులతో నియోజకవర్గస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన పుంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి గారు.
#ChallaBabuReddy #VoterAwareness #AndhraPradesh #PunganurTDP
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, కల్లూరులో నియోజకవర్గ స్థాయి ఓటర్ అవగాహన సమీక్ష నిర్వహించడం జరిగింది.
కేంద్ర ఎన్నికల సంఘం Special Intensive Revision (SIR) కార్యక్రమంలో భాగంగా జూన్ 15 నుండి జూలై 15 వరకు BLAలు, BLOలతో కలిసి ఇంటింటికి తిరిగి ఓట్ల చేర్పులు & మార్పులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, టెక్నికల్ సమస్యలను క్లస్టర్ యూనిట్లు పర్యవేక్షించాలని రొంపిచెర్ల, పులిచెర్ల, సదుం మండలాల పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేశాను.
ప్రతి ఓటును కాపాడుకోవడం మనందరి బాధ్యత! 🇮🇳
పుంగనూరులో కదంతొక్కిన నారీశక్తి! 🔥
అన్నా క్యాంటీన్ నుండి గోకుల్ సర్కిల్ వరకు టీడీపీ ఆధ్వర్యంలో మహిళల భారీ ర్యాలీ.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ సీఎం చంద్రబాబు గారు తీసుకున్న 33% రిజర్వేషన్ నిర్ణయంపై హర్షాతిరేకాలు.
ఈ కార్యక్రమంలో పాల్గొని, మహిళల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ @Mee_Challababu చల్లా బాబు గారు స్పష్టం చేశారు. 🤝
#Punganur #TDP #ChandrababuNaidu #ChallaBabu #WomenEmpowerment #AndhraPradesh
పుంగనూరు నియోజకవర్గం రొంపిచర్ల నందు ముస్లిం సోదరుల పవిత్రమైన ఉరుసు కార్యక్రమంలో వారి ఆహ్వానం మేరకు పాల్గొనడం జరిగింది.
దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, నియోజకవర్గ ప్రజలందరికీ అల్లాహ్ ఆశీస్సులు లభించాలని, అందరి జీవితాల్లో సుఖసంతోషాలు నిండాలని కోరుకున్నాను.
ఇంతటి ఆదరాభిమానాలు చూపిన ముస్లిం సోదరులకు, పెద్దలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
మాట ఇస్తే తప్పని కూటమి ప్రభుత్వం! చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు చారిత్రాత్మకం! ✊🔥
పుంగనూరు పట్టణంలో ట్రావెల్స్ బంగ్లా నుండి ఎన్టీఆర్ సర్కిల్ వరకు మహిళల భారీ కృతజ్ఞతా ర్యాలీ లో పాల్గొన్నాను.
నాడు ఎన్టీఆర్ గారు ఆస్తి హక్కు ఇస్తే.. చంద్రబాబు గారు డ్వాక్రా తెచ్చారు. నేడు లోకేష్ బాబు గారు మహానాడులో ఇచ్చిన మాట ప్రకారం 33% రిజర్వేషన్లతో మహిళలను రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దుతున్నారు.
మహిళా పక్షపాతి అయిన చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి పుంగనూరు నారీశక్తి అండగా ఉంటుంది!
#TDP
#WomenEmpowerment #AndhraPradesh
ఘనంగా #మహానాడు.. పుంగనూరు నియోజకవర్గం మండలం లో పులిచెర్లలో చల్లా బాబురెడ్డి సందడి!
టీడీపీ అధినేత @ncbn చంద్రబాబు గారి పిలుపు మేరకు, పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి @ChallaBabuReddy (చల్లా బాబు రెడ్డి) గారి ఆధ్వర్యంలో పులిచెర్లలో మహానాడు వేడుకలు ఘనంగా జరిగాయి.
భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహించి, ఎన్టీఆర్ గారి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో కలిసి బాబురెడ్డి గారు డిజిటల్ మహానాడు కార్యక్రమంలో పాల్గొన్నారు.
#Mahanadu2026 #ChallaBabuReddy #Punganur #TDP
త్యాగం, విశ్వాసం, అల్లాహ్ ఆజ్ఞల పట్ల సంపూర్ణ విధేయతకు ప్రతీక అయిన బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరసోదరీమణులందరికీ శుభాకాంక్షలు. హజ్రత్ ఇబ్రహీం చూపిన త్యాగ భావం మానవాళికి ఆదర్శం. సమాజ శ్రేయస్సు, సోదరభావం, మానవతా విలువలు వెల్లివిరిసే బక్రీద్ పండుగను ఆ అల్లాహ్ దీవెనలతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.
యుగపురుషుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానాయకుడు, దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి నేడు. ఈ సందర్భంగా ఆ మహనీయునికి నా ఘన నివాళులు అర్పిస్తున్నాను. 🙏
#NTRLivesOn#NTRJayanthi
#LegendaryNTRJayanthi
పుంగనూరు నియోజకవర్గం, రాజంపేట పార్లమెంటుకు నూతన పార్లమెంట్ జోనల్ కోఆర్డినేటర్ గా నియమితులైన స్టేట్ మారిటైమ్ బోర్డ్ చైర్మన్ దామచర్ల సత్య గారితో మరియు పుంగనూరు నియోజకవర్గ అబ్జర్వర్ శాప్ చైర్మన్ రవి నాయుడు తో కలిసి పుంగనూరు నియోజకవర్గ కార్యకర్త తల సమీక్ష సమావేశం నిర్వహించిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ చల్లా రామచంద్రారెడ్డి గారు..
రాబోయే మహానాడు (మే 27, 28) కార్యక్రమ రూపకల్పనపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు పార్టీలో ఎల్లప్పుడూ సముచిత స్థానం ఉంటుందని, క్షేత్రస్థాయిలో మరింత ఉత్సాహంతో ముందుకు సాగాలని చల్లా రామచంద్రారెడ్డి ఆకాంక్షించారు.