మీ ఆలోచన విధానం మాకు తెలుసు
మీ కష్టం మాకు తెలుసు
మీ ఆశయం చాలా గొప్పది రేవంతన్న
తప్పక విజయం సాధిస్తారు…
నాటి మీ విలువైన ఆలోచన విధానంలో
రేపటి తెలంగాణ భవిష్యత్ కనిపిస్తుంది.
మీ అభిమానిగా ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది @revanth_anumula అన్న ❤️✨
#TelanganaRising2047🚀🙏
“బండెనక బండి కట్టి… పదహారు బండ్లు కట్టి…”
A song that became the heartbeat of people’s movements.
On the death anniversary of Gaddar anna , remembering the poet, the balladeer, and the people’s voice whose songs inspired generations to question, dream, and stand up for justice.
Though the voice has fallen silent, the spirit lives on in every note he left behind.
Heartfelt tributes to Gaddar Anna.
#gaddarnna
Had an eventful meeting with His Excellence Ambassador of USA to India Sergio Gor, where we discussed a plethora of issues, from Visas to strengthening relations between America and #Telangana
Telugu is one of the fastest growing languages in America and Ambassador Gor has given us a categorical assurance on extending all support in augmenting the scope of our relationships on all fronts.
I thank him on behalf of people of Telangana for being such a special friend of our state, and people.
@USAmbIndia
భట్టి విక్రమార్క నియోజకవర్గంలో ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడంలేదని
ఆత్మహత్యయత్నం చేసిన నిరుద్యోగి వేణును ఫోన్ ద్వారా పరామర్శించిన కేటీఆర్
ఫోన్ ద్వారా నిరుద్యోగ యువకుడు వేణును పరామర్శించి ధైర్యం చెప్పి, అండగా ఉంటామని హామీ ఇచ్చిన కేటీఆర్
ఆత్మహత్యయత్నం చేసిన వేణుని ఆసుపత్రిలో పరామర్శించి కేటీఆర్ చేత ఫోన్ మాట్లాడించిన బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి
జాబ్ క్యాలెండర్, నోటిఫికేషన్ల కోసమే ఆత్మహత్యయత్నం చేసుకుంటే.. తాను వ్యక్తిగత ప్రేమ వ్యవహారంతో ఆత్మహత్యాయత్నం చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని ఆవేదన
తనకు సొంత ఇల్లు లేనప్పటికీ కక్ష పూరితంగానే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వలేదని వెల్లడి
మీ సూసైడ్ నోట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఛార్జ్ షీట్ అని, దాని ఆధారంగానే కాంగ్రెస్ ప్రభుత్వం పై పోరాటం చేస్తామని, బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే దాని ఆధారంగానే న్యాయం చేస్తామని భరోసానిచ్చిన కేటీఆర్
🌾 తెలంగాణ తల్లి ఆశీస్సులతో...
ప్రతి ఇంటా సుఖశాంతులు... ప్రతి పొలంలో పసిడి పంటలు...
ప్రతి హృదయంలో తెలంగాణ గర్వం... ✊
గోదావరి కృష్ణమ్మలు తల్లీ నిన్ను తడుపంగా
పచ్చని మా నేలల్లో పసిడిసిరులు పండంగా
సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి
ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి
జై తెలంగాణ ✊
జైజై తెలంగాణ ❤️
#JaiTelangana #JaiJaiTelangana #Telangana #RevanthReddy #MeruguRameshReddy
@TelanganaCMO@revanth_anumula@Vemnarenderredy@seethakkaMLA@IYCTelangana@INCTelangana@Bmaheshgoud6666
ఎల్నినో పరిస్థితుల ప్రభావం, వ్యవసాయ రంగానికి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై నిపుణుల కమిటీతో ఈరోజు సమీక్ష నిర్వహించాను.
రైతులు ఆర్గానిక్ విధానంలో కూరగాయలు, ఇతర ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా ప్రోత్సహించడంతో పాటు, అవసరమైన విత్తనాలను సబ్సిడీపై అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజన కార్యక్రమం కోసం ఏర్పాటు చేస్తున్న సెంట్రలైజ్డ్ కిచెన్లకు అవసరమైన కూరగాయలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా రైతుల నుంచే కొనుగోలు చేసే వ్యవస్థను రూపొందించాలని అధికారులకు సూచించాను.
దీనివల్ల రైతులకు గిట్టుబాటు ధర, విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందడంతో పాటు స్థానిక వ్యవసాయానికి కొత్త ఊతం లభిస్తుంది.
డ్రిప్, స్ప్రింక్లర్ సాగు, ప్రత్యామ్నాయ పంటలు, శాస్త్రీయ వ్యవసాయ పద్ధతుల ద్వారా వాతావరణ సవాళ్లను అధిగమిస్తూ రైతుకు భరోసాగా నిలిచే ప్రతి చర్యను మా ప్రభుత్వం కొనసాగిస్తుంది.
రాష్ట్ర రైతాంగం బలంగా ఉంటేనే ఆహార భద్రత, ప్రజల ఆరోగ్యం మరింత బలోపేతం అవుతాయి.
#OrganicFarming
#FarmersFirst
ప్రభుత్వ విద్యను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు తీసుకెళ్లాలన్నదే మా ప్రభుత్వ సంకల్పం. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యతో పాటు ప్రపంచంతో పోటీ పడే నైపుణ్యాలను అందించడం, ప్రతి ఉపాధ్యాయుడిని మార్పుకు మార్గదర్శిగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం.
"టీచర్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్చేంజ్" కార్యక్రమంలో భాగంగా ఫిన్లాండ్, జర్మనీ దేశాల్లో విద్యా విధానాలను అధ్యయనం చేసి వచ్చిన ఉపాధ్యాయుల బృందంతో ఈ రోజు సమావేశమయ్యాను. వారు అక్కడ పొందిన అనుభవాలు, నేర్చుకున్న ఉత్తమ విధానాలు తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో ఎలా అమలు చేయాలనే అంశంపై విస్తృతంగా చర్చించాం.
విద్య అంటే కేవలం పాఠాలు చెప్పడం కాదు... విద్యార్థిలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, నైపుణ్యం, ప్రపంచ దృష్టిని పెంపొందించడం. ఆ బాధ్యతను అత్యంత సమర్థంగా నిర్వర్తించగల శక్తి ఉపాధ్యాయులదే. అందుకే ఉపాధ్యాయుల అనుభవం, విజ్ఞానం తెలంగాణ విద్యా వ్యవస్థకు కొత్త దిశ చూపాలని కోరుతున్నాను.
వచ్చే విద్యా సంవత్సరానికి ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేసేందుకు డిసెంబర్లోగా సమగ్ర కార్యాచరణ నివేదిక సిద్ధం చేయాలని సూచించాను. విద్యార్థుల కోసం ఎంత ఖర్చు చేయడానికైనా మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రపంచ దేశాలు మన విద్యా వ్యవస్థను ఆదర్శంగా చూసేలా, తెలంగాణను నాణ్యమైన విద్యకు చిరునామాగా తీర్చిదిద్దేందుకు మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
#EducationReforms
#GovernmentSchools
కమలాకర్ అంటే గంగుల కమలాకరేనా...?
దయాకర్ అంటే ఎర్రబెల్లి దయాకరేనా...?
రికార్డ్ అయితది ఆపు అనుకుంటూ నవ్వుతున్నారంటే... ఆ పార్టీ సీనియర్ల మీద ఈ కేటీఆర్ కు, సంతుకు గింత చిన్న చూపా?
ఇది అహంకారం కాకుంటే ఇంకేంది?
@KTRBRS@SantoshKumarBRS@GangulaBRS@EDRBRS