విద్యా సంవత్సరం ఇంకొక వారం రోజుల్లో మొదలు కాబోతున్నది. రాష్ట్రంలో టీచర్ల పదోన్నతులు,బదిలీలు ఇంకెప్పుడు? టీచర్లు ఇంకెన్నాళ్ళు వేచి చూడాలి? టీచర్లు తమ ప్రమోషన్ల విషయంలో చీటికి మాటికి కోర్టుల గడప తొక్కుతున్నారు? టీచర్ల సమస్యల పట్ల ప్రభుత్వానికి ఎందుకింత నిర్లక్ష్యం?
ఇదేనా కాంగ్రెస్ మార్కు "మార్పు" అంటే?
ప్రశ్నించే గొంతుకలం అంటూ గొప్పలు చెప్పుకునే వాళ్ళ ఆచూకీ ఎక్కడ? ఆ గొంతులు ఇప్పుడు ఎందుకు మూగబోయాయి? తక్షణమే ముఖ్యమంత్రి & విద్యా శాఖ మంత్రి @revanth_anumula గారు స్పందించి వచ్చే విద్యా సంవత్సరం (2024-25) ప్రారంభానికి ముందే ఎలాంటి కేసులు,న్యాయస్థానాల జోక్యం లేకుండా కౌన్సిలింగ్ కోసం ప్రత్యేక షెడ్యూల్ విడుదల చేసి వేగవంతంగా టీచర్ల ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని @BRSparty డిమాండ్ చేస్తున్నది.
@TelanganaCMO@TelanganaCS
డియర్ కోదండరాంరెడ్డి గారు,
తన గీతానికి మంచి సంగీతం రావాలన్న అందెశ్రీ కోరికను ఎవరూ కాదనరు. కాదనలేరు కూడా. కీరవాణి గారి సినీ సంగీత దర్శక ప్రతిభా పాటవాల మీద కూడా ఎవరికీ (తెలంగాణతో సహా) అనుమానం లేదు. ఆస్కార్ అవార్డు ఊరకనే రాదు కదా. వారు భవిష్యత్తులో కూడా మంచి సినీ సంగీతం అందించాలి అని కోరుకుంటున్న…
కానీ …
ఇక్కడ మనం గమనించాల్సింది అందెశ్రీ గారి జయజయహే పాట ను తెలంగాణ గీతంగా ఇక్కడి ముఖ్యమంత్రి గారు ఆమోదింపజేసినప్పుడు అది తెలంగాణ ప్రజల ఆస్తి ఐతది కాని అందెశ్రీ సొంత ఆస్తి ఎట్లయితది? అంటే అతని పాట జాతీయమైనట్లన్న మాట!
తెలంగాణ రాష్ట్రం డిమాండు ఎవరి పీడన వల్ల తెరమీది కొచ్చింది, ఎవరి త్యాగాల వల్ల రాష్ట్రం ఆవిర్భవించిందో, వాళ్లేం కోరుకున్నారో నా కన్నా మీకే బాగా తెలుసు.
ఈ రాష్ట్ర గీత స్వరకల్పన ఉద్యమ సమయంలోనే చేయబడ్డది. అయినా అందెశ్రీ గారి గీతాన్నే అధికారిక గీతంగా ఉంచాలనుకున్నపుడు,
దీనికి ఇంకా పదును పెట్టించాలని రచయిత నిర్ణయించినపుడు, సీయం గారు మొదలు ఈ విషయంపై విస్తృత స్థాయి చర్చ చేసుండాల్సింది. ఈ పాటను మరింత పదునెక్కించనీకె తెలంగాణ కవులను కళాకారులను కూడా సంప్రదిస్తే బాగుంటదని మీరైనా సీయం గారికి చెప్పేదుండె.
ఎందుకంటే తెలంగాణ అన్న ‘భావన’ ఉద్యమం, సంస్కృతి , భవిష్యత్ తో ముడిపడి ఉన్నది కనుక. ఈ గీతాన్ని పాఠశాలల్లో, కళాశాలల్లో ప్రతిరోజూ ప్రేయర్లో తరతరాలు ఆలాపించాలి కనుక…
మా గడ్డ మీద కూడ ప్రతిభ ఉంది కానీ అది కుట్రపూరితంగా అణచివేయబడ్డదనే భావన తోనే కదా తెలంగాణ ప్రజలు నాడు రోడ్డెక్కింది.
సుద్దాల అశోక్ తేజ, రవి కళ్యాణ్, వందేమాతరం శ్రీనివాస్, మిట్టపల్లి సురేందర్, సోమన్న , నల్గొండ నర్సిరెడ్డి, దేశపతి, ఆదేష్ రవి, రసమయి, మొగిలయ్య, పసునూరి, గిద్దె రాంనర్సయ్య ఇలా ఇంకెందరో…ఉన్నరు కదా…వాళ్లను కనీసం ఒక్క మాటైనా అడగలేదని చాల మంది అనుకుంటున్నరు… ఈ గడ్డ మట్టి బిడ్డలే కదా వీళ్లంతా..! వీళ్ల ప్రతిభను మన ప్రభుత్వం గుర్తించక పోతే ఎవరు గుర్తిస్తరు, చెప్పండి.
తెలంగాణ స్టేట్ ఎంబ్లం మీద కూడా ఎలాంటి చర్చ జరగకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నది ప్రస్తుత ప్రభుత్వం. కల్చరల్ విషయాల్లో విస్తృత స్థాయి చర్చ జరగాలి. ఇవి కబ్జా చేయడానికి సర్వే నంబర్లు కాదు…ఇవన్నీ మనో భావాలకు సంభందించిన విషయాలు..ఎందుకంటే అవి తరతరాలను ప్రభావితం చేస్తాయి కనుక. People seek solace and seek pride in their cultural symbols everyday everywhere.
ఎందుకో సిరిపురం యాదయ్య , వేణుగోపాల్ రెడ్డి, ఇషాంత్ రెడ్డి, భోజ్య, సాయి కుమార్, శ్రీకాంతచారి, కిష్టయ్యలు మరెందరో ఇయాల మళ్లీ బతికొస్తే బాగుండు అనిపిస్తున్నది….
This is my personal opinion.
I will leave this debate at that. Let people of Telangana decide what is good for them.
Another reason why BJP should be voted out. Still there is a chance to defeat it including PM @narendramodi in Varanasi. Let’s go into the details:
In Barodia Nonagir village of Sagar district of Madhya Pradesh, some goons, upset with the complaint of molestation by a girl Anjana Ahirwar, murdered the girl's brother Nitin Ahirwar in last year. Investigations revealed the involvement of local #BJP leaders.
After the murder last year, the victim's family was constantly being pressurized for a compromise. When the victim's family refused to budge, victim's uncle Rajendra Ahirwar was also murdered to teach her a lesson.
When the body of the victim's uncle was being taken back after the post-mortem, the victim Anjana Ahirwar fell from the ambulance under suspicious circumstances on the way and she also died.
I am shocked to hear how police and ruling @BJP4MP allowed this molestation and triple murder in Dalit family to happen over a period of 12 months!!
After the murder of the victim's brother, the administration had given many assurances to the victim, including job and security, none of which were fulfilled as usual. Anjana did not get the job, security was removed from the house, CCTV cables were cut. Repeated pressure was put on her to compromise. We all Indians must ask the following questions ourselves before we vote in the upcoming phase and after that…
1. Does #ModiGuarantee mean 100% protection to Dalit killers?
2. Does ModiKaParivaar truly include people from oppressed classes and women?
3. Was Modi’s visit to Dr Ambedkar’s Memorial a few days ago just a drama?
4. Is it to subjugate and silence the marginalised (including some of their prominent leaders) and abolish Indian Constitution, Modi ji seeking vote from Varanasi again?
@India_NHRC@MSJEGOI@PTI_News@BRSparty
#bjp_हटाओं_देश_बचाओ
#Justice4AnjanaAhirwar
#SayNo2BJP
#DalitLivesMatter
With all the experience of two and half decades in government, I can confidently say that no government corporation’s head will take the decision which has financial involvement(earning/expenditure) without circulating the file to principal secretary revenue and the concerned minister. See the secretariat’s business rules, if you have doubts.
Congress’s Excise Minister, JKRao is not only lying, but also scapegoating the head of govt beverages corporation.
@revanth_anumula garu, sack him urgently and if you have any scruples, cancel the license to Som Distillery and order for enquiry immediately.
Your learned minister is a habitual offender and deserves to be in jail. How can you have such notorious offenders in your cabinet, CM sir??? Please think.
#JupallyTheLiar
#SackJupalli
ఈరోజు మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా కొంపల్లిలోని సేవాలాల్ తండాలో గిరిజనుల ఆరాధ్యదైవం శ్రీశ్రీశ్రీ సంత్ సద్గురు సేవాలాల్ మహారాజ్, శ్రీశ్రీశ్రీ జగదాంబ భవాని మాత, రామ్ రావు మహారాజ్ ల దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నాను.
సమాజ శ్రేయస్సు కోసం సంత్ సేవాలాల్ మహారాజ్ చూపించిన మార్గం ఎందరికో ఆదర్శనీయం,స్ఫూర్తిదాయకం. దేవాలయంలో వందలాది మంది బంజార సోదరులతో కలిసి మాట్లాడే అవకాశం కలిగింది.
జై సేవాలాల్ మహారాజ్!
జై గోర్ బంజార!!
ఈరోజు రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కేంద్రంలోని శ్రీ శ్రీ శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి దేవాలయం మొదటి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొని,స్వామివారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను.
400 ఏళ్ల చరిత్ర కల్గిన పురాతన దేవాలయాన్ని తన స్వంత ఖర్చులతో అధునాతనంగా నిర్మించి,ఎంతో గొప్పగా బ్రహ్మోత్సవాలు నిర్వహించిన ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, స్థానిక జెడ్పీటీసీ, సమాజ సేవకుడు, సోదరులు, శ్రీ ఉప్పల వెంకటేష్ గుప్తతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. దేవుడి కృపతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామి వారిని వేడుకోవడం జరిగింది.
Our Warangal leaders protesting against the Government’s decision to remove the renowned “Kakatiya Kalathoranam” from the state logo
This is just the beginning
#CongressFailedTelangana
#WATCH | Hyderabad: On Telangana govt removing Kakatiya Arch and Charminar from the state’s official logo, BRS Working President KT Rama Rao says, "The decision of Telangana govt to remove Charminar and Kakatiya Arch from the state logo is the most foolish one... The rich cultural heritage and legacy of Telangana is something that we are all immensely proud of. This CM and government are clueless when it comes to protecting the heritage and culture... I demand the state govt to revoke this decision, rethink this..."
జూన్ 9వ తారీఖు నాడు జరగబోయే గ్రూప్-1 ఎగ్జామ్ ను కనీసం ఒక నెల (మాత్రమే) అయినా వాయిదా వేస్తే బాగుంటుంది. @TSPSCofficial ఒక్క సారి ఆలోచించగలరు.
ఎందుకంటే…
1. అదే రోజు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఇంటలిజెన్సు బ్యూరో (IB) Inspectors ఎగ్జామ్ కూడా ఉంది. దానికి చాలా మంది మన తెలంగాణ నిరుద్యోగులు అప్లై చేశారు.
2. చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు (రెవెన్యూ మరియు పోలీసులు ముఖ్యంగా) గత నాలుగు నెలల నుండి ఎన్నికల నిర్వహణలో తలమునకైనందు వల్ల వాళ్లకు బాగా ప్రిపేర్ అయ్యే అవకాశం లేదు కాబట్టి… వాళ్లకు ఒక నెలైనా టైం ఇస్తే.. కనీసం లాస్ ఆఫ్ పే(loss of pay) సెలవు మీద చదువుకోని పరీక్షకు వస్తరు..
ఈ విషయంలో సాధ్యాసాధ్యాలు పరిశీలించి గత 8 సం.లు గా గ్రూప్-1 కోసం ఎదురు చూస్తున్న అందరు నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకోవాలని, ‘అన్ని జాగ్రత్తలు’ తీసుకొని పరీక్షను పకడ్భందీగా నిర్వహించాలని @BRSparty కోరుతున్నది.
అదే విధంగా…
AEE పరీక్ష రాసిన అభ్యర్థులు ఎంతో కాలంగా నియామక పత్రాల కోసం చకోరపక్షుల్లా ఎదురుచూస్తున్నారు. వీరికి వెంటనే న్యాయం చేయండి.
అలాగే 2017 PET అభ్యర్థుల గోస మరో DSC-2008 క్షోభలాగా మారనివ్వరని ఆశిస్తున్నాం.
#BRS4Youth
#BRS4Jobs
@KTRBRS
గద్వాల, వనపర్తి. నాగర్ కర్నూల్ జిల్లాల్లో పని చేస్తున్న వేల మంది పోలీసులకు నేటికీ సరెండర్ లీవులు, టీఏలు రాలేదు. వీళ్లను కేవలం బానిసలుగా మాత్రమే వాడుకొంటున్నారు కాని, వీళ్ల సంక్షేమాన్ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు మన పాలకులు. ఇంత అసంతృప్తి తో రగిలిపోతున్న పోలీసన్నలతో ఏ విధంగా ఎన్నికలు నిర్వహిస్తారు @revanth_anumula@TelanganaDGP@TelanganaCS గారూ?
జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం దాసరిపల్లిలో సవరమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించాను. కే.టి.దొడ్డి మండలం పాగుంట లక్ష్మీ వెంకటేశ్వర దేవాలయంలో స్వామివారిని దర్శించుకుని,భారీ కాన్వాయ్ తో బయలుదేరి గట్టులో ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నాను.
#Vote4Car
#RSP4NGKL
#BRS4NagarkurnoolParliament
#GadwalConstituency
అశేష జనవాహిని సాక్షిగా నాగర్ కర్నూల్ లో నన్ను ఆశీర్వదించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, @BRSparty అధినేత శ్రీ కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నన్ను దీవించడానికి తరలి వచ్చిన వేలాది మంది ప్రజలకు, బీఆరెస్ శ్రేణులకు పాదాభివందనాలు. మీ రుణం తీర్చుకోవడానికి దొరికిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటానని ప్రమాణం చేస్తున్నాను.🙏
Enjoy the exciting visuals of today’s roadshow of Sri KCR ji in #NagarKurnool Parliamentary constituency. Some visuals do not need description. They just have to be experienced. And they are not only part of the history, but also change the destiny of people. These was some of those such transformative visuals. Thanks a million, KCR sir. We will win NagarKurnool at any cost.✊
आज नागरकुरनूल शहर में केसीआर जी का शानदार और इतिहासिक रोड शो।
@KTRBRS
#KCRPoruBaata
#RSP4NagarKurnool
ఈరోజు ఉదయం నాగర్ కర్నూల్ లో గ్రానైట్ హమాలీలతో కలిసి కొద్దిసేపు గ్రానైట్ బండలు మోశాను. ఇది నిజంగా చాలా కష్టమైన పని. హమాలీతో మాట్లాడి,వారి సమస్యలను అడిగి తెలుసుకున్నాను.వాళ్ల రోజూ జీవితాలు అత్యంత ప్రమాదంలో ఉన్నాయి. వీళ్ల చేతులపైన గాయాలను చూస్తే భయమేస్తున్నది.
ఈ కూలీలు రోజూ పెద్ద పెద్ద బండలు ఎత్తితే వారికి వచ్చే రోజు కూలీ కేవలం రూ.600 మాత్రమే. 50 ఏళ్లుపై బడిన కూలీలు శారీరక నొప్పుల బాధ నుంచి ఉపశమనం పొందడానికి ప్రతి రోజు రూ.300 మద్యానికి ఖర్చు చేస్తున్నారు! ఈ కూలీలందరూ 10 వ తరగతి, ఇంటర్మీడియట్ పూర్తిచేసిన వారే!
గ్రానైట్ యజమానులు మాత్రం ఒక్క బండ కూడా మోయడం లేదు. నేను ఎంపీగా గెలిచిన వెంటనే,ఇలాంటి హమాలీల కోసం స్థానిక నాయకువల సహకారంతో ఒక ప్రత్యేక కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసి,వాళ్లను గ్రానైట్ యజమానులుగా మార్చే ప్రయత్నం చేస్తా.
#RSP4NGKL
#LokSabha
#BRS2024Elections
#BRS4Nagarkurnool
ఈ బాడీ బ్యాగ్ లో ఉన్నది భువనగిరి సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చదుకోవాలని ఒక డాక్టరో ఇంజనీరో కావాలని వచ్చి అక్కడి విషాహారం తిని విగతజీవుడైన బాలుడు ప్రశాంత్. ఈ శాఖామంత్రి సాక్షాత్తు సీయం @revanth_anumula గారే. ఇదే భువనగిరిలో గత 2 నెలలక్రితం ఇద్దరు పేద అమ్మాయిలు సంక్షేమ హాస్టల్లో ఉరి వేసుకొని చనిపోయిండ్రు.
ఇట్ల స్పందించని గుండె లేని వ్యక్తి, పట్టపగలే అబద్దాలు చెప్పే వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉండాల్నా? మన బిడ్డల ప్రాణాలు ఇతని చేతిలో పెడదామా???
ఇది ప్రజాపాలనా? లేదా ప్రజలపై ప్రతీకార పాలనా?
ఒక్క సారి ఆలోచించండి.
The kid in the body bag is Mr Prashant(6th grade) who succumbed to food poisoning after struggling for life in various hospitals for five days.
Do you know when he reported diarrhoea (loose motions), on 10th April he was treated by his senior, 9th grader in the same school, not the health supervisor. He attended classes even in debilitating condition on 12th April!
Bhongir Govt SW School Principal hasn’t been coming to the school for the last 6 days. The reverse osmosis (RO) plant in social welfare school in Bhongir is broken!!!
This is the status of administration in Telangana!!
Do you know who is the minister responsible for welfare schools in Telangana?
It’s none other than Mr Revanth Reddy himself! So far he hasn’t visited a single welfare school..!
He hasn’t reviewed its functioning even once, being its minister and chairman of its management board.!!
Do we really need such leaders ruling us????
Doesn’t our lives matter???
Mr CM, You Must Step Down, Sir.
Congress Quit Telangana. You can’t give guarantee to our lives.
Immediately.
@RahulGandhi
#CongressCheatedTelangana
#CongressIsAntiPoor
మార్నింగ్ వాక్ లో పాల్గొన్న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
కెసిఆర్ పదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధిని,నాలుగు నెలల అబద్ధపు హామీల కాంగ్రెస్ పాలనను చూసి కారు గుర్తుకు ఓటు వేయాలని నాగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఓటర్లను అభ్యర్థించారు.కల్వకుర్తి పట్టణంలోని స్థానిక జిల్లా పరిషత్ బాలుర పాఠశాల మైదానం, ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాల మైదానంలో మార్నింగ్ వాక్ లో పాల్గొన్న ఆయన వాకర్స్ తో మాట్లాడుతూ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీలను పూర్తిగా విస్మరించి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
#IamRSP #BRS #kcr #RSP4NGKL @RSPraveenSwaero@BRSparty @BRSNagarkurnool @RSPSMOfficial