2027 all zodiac signs
- for better year income and expense both should be more, income should be more than expenses like #TAURUS#cancer#Capricorn#Acquarius
(కుర్రాళ్ళకి మాత్రమే A )
నమస్తే డాక్టర్ గారూ,
ఆ నమస్తే, ఏంటి బాగా లేట్ గా వచ్చావు?
నా సమస్య కొంచెం ప్రత్యేకం, అంటే ఇంకెవరూ చూడకూడదని అందరూ ఓపీలోంచి వెళ్ళిపోయాక చూపిద్దామని వచ్చాను.
అవునా, ఏం పర్లేదు. నీది ఏ సమస్యైనా ధైర్యంగా చెప్పు, నాకు వీలైన సహాయం చేస్తాను. విషయం గోప్యంగా ఉంచుతాను.
అలాగే సార్, ఈ మధ్య జుట్టు ఊడిపోతోంది సార్…
అవునా, అది చాలా సాధారణ సమస్య, కానీ నా దగ్గరికొచ్చావ్, దానికి చర్మవైద్యుడిదగ్గరికెళ్తే బాగుణ్ణు కదా!
అంటే అది సార్, దాంతో పాటు నరాలు పీకటం, మబ్బుగా ఉండటం, నీరసం, ఏదీ గుర్తుండకపోవడం ఇలాంటి చాలా సమస్యలున్నాయి సార్.
అవునా, పెద్దలిస్టే కొంచెం వివరంగా పరీక్షించాలి.
అంత వివరంగా పరీక్షించక్కర్లేదు సార్!
మరి
అంటే కారణం నాకు తెలుసు,
ఏమనుకుంటున్నావు మరి?
అంటే నేను రోజూ అది చేస్తాను సార్,
అదంటే అదేగా!
అవున్సార్, చెయ్యకపోతే ఉండలేను.
చెయ్యటం తప్పేం కాదయ్యా, దానివలన నష్టాలేం లేవు.
రోజుకొకసారైతే పర్లేదు సార్, కానీ నేనలా కాదు.
పోనీ రెండుసార్లైనా పర్లేదయ్యా, అది కూడా ఆరోగ్యమే.
రెండు సార్లు కూడా కాద్సార్, దానికి లెక్కలేదు.
అంటే!
ఇంక పనులన్నీ పక్కన పెట్టి అదే పని, ఒక ఏడెనిమిది సార్లు.
అయితే ఎక్కువే, కానీ ఎందుకు, అంత ఇష్టమా?
ఇష్టమేం కాద్సార్, చెయ్యకపోతే ఉండలేను, కష్టమే.
అంటే చేస్తేగానీ మనసు కుదుటపడదా?
అవున్సార్, ఇలా చేసి వస్తానా, మళ్లీ చెయ్యాలని అనిపిస్తుంది, అది చెయ్యకపోతే మనసులో ఏదో గాభరా, చేసేంతవరకు కుదుటపడను. దాంతో ఏపని చేస్తున్నా పక్కనపెట్టి వెళ్లి చెయ్యాల్సిందే.
అయ్యో
అంతేకాదు సార్, అది కూడా త్వరగా రాదు, బాగా శ్రమ పడాలి. చేతులు పీకుతాయి. అక్కడ చర్మం రాపిడి అయ్యి మంట వస్తుంది. అలాగే నొప్పికూడా, అయినా తప్పదు.
ఓహో నిద్ర, ఆకలి ఎలా ఉన్నాయి?
ఇది చెయ్యందే నిద్ర రాదు సార్, ఇది చెయ్యడానికి కొన్నిసార్లు బిట్లు చూడాలి సార్, ఆ బిట్లు ఏమో ఈ మధ్య సినిమాల్లాగా గంటలు గంటలు తీస్తున్నారు, నేను నాక్కావాల్సిన బిట్టు కోసం చూస్తూ ఒక రెండు మూడు గంటలు ఎదురు చూడాలి. దాంతో చేసి లేటుగా పడుకోడం.
దానివలన ఏం జరుగుతుంది?
పనిమీద, చదువుమీద శ్రద్ధ ఉండదు, సరిగ్గా తినటం లేదు, అంటే మంచిగా వండుకోడానికి ఓపికలేదు. ఏదోకటి ఆర్డర్ చేసి తినేస్తున్నా. ఈమధ్య అటెండెన్స్ తగ్గింది. బరువు తగ్గాను. భవిష్యత్తు ఏమౌతుందో అని భయంగా ఉంది.
హ్మ్, అన్నీ మాట్లాడదాం, మరి స్నేహితులు?
వాళ్లకీ దూరమే సార్, వాళ్లతో బయటికెళ్తే ఇది చెయ్యడానికి టైమ్ ఉండదని వాళ్లని దూరం పెడుతున్నాను. ఎంతసేపూ ఫోను, బిట్లు, చెయ్యడం. ఇదే పని సార్.
ఇంకా ఒంట్లో సమస్యలేమన్నా ఉన్నాయా?
చెప్పాను కదా సార్, నీరసం, తిమ్మిర్లు, జుట్టు రాలటం, జ్ఞాపకశక్తి తగ్గటం ఇలాంటివి.
మనసెలా ఉంటుంది?
చికాగ్గా ఉంటుంది ఎప్పడు, చాలా భయం కూడా ఉంది ఏమౌతుంది అని. ఇలా చెయ్యడం వలన నా ఒంట్లోని ప్రోటీన్లు అన్నీ పోయి, నేను బలహీనం అయిపోతానని అందుకే జుట్టు ఊడిపోతోందని, త్వరలో చచ్చిపోతానని అని అనిపిస్తోంది.
సరే ఒకసారి పడుకో పరీక్ష చేస్తాను. నాలుక చూపించు, వేళ్లు చూపించు, ఆ అను, ఊపిరితీసుకో, వదులు, పొట్ట వదులుగా ఉంచు, తలవంచు జుట్టు చూస్తాను, స్పర్శ తెలుస్తోందా!!!
థాంక్స్ సార్, బాడీ మొత్తం చెక్ చేశారు.
అది నా పనయ్యా, సరేగానీ సమస్య గురించి నువ్వేమనుకుంటున్నావ్?
నేనైతే ఇది చెయ్యటం వలనే సమస్య అని, అసలు ఇది జీవితంలో చెయ్యకూడదని అనుకుంటున్నాను సార్.
నువ్వు కొంతవరకు కరక్టే కానీ, నీక్కొన్ని విషయాలు చెప్పాలి.
చెప్పండి సార్,
ముందుగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే రోజుకి ఒకట్రెండు సార్లు చెయ్యొచ్చు, ఏం పర్లేదు అది ఆరోగ్యం కూడా.ఇకపోతే నీ విషయానికొస్తే నువ్వు పోషకాహార లోపంతో బాధపడుతున్నావు.రోజుకి ఏడెనిమిది సార్లు చేసి ప్రోటీన్లు పోతున్నాయ్ అనుకుంటున్నావ్ కానీ అది కాదు, నువ్వసలు సరిగా తినటం లేదు, నువ్వు తినే తిండిలో విటమిన్లు, ప్రొటీన్లు లేవు అందువలన నీకు నీరసం, జుట్టురాలటం, తిమ్మిర్లు ఇవన్నీ కూడా. పైగా నిద్ర లేకపోవటం వలన జ్ఞాపకశక్తి కూడా తగ్గింది. దీంతోపాటు నీకు బిహేవియరల్ అడిక్షన్లు ఉన్నాయి, అవి బిట్లు చూడటం, చెయ్యటం.
మరేం చెయ్యాలి సార్?
నీకేం భయంలేదు, వీటన్నిటికీ చికిత్స ఉంది. ఆర్నెళ్ళలో మాములవుతావు. ముందు బాగా తినాలి. నిద్ర కోసం నేను కొన్ని చిట్కాలు చెప్తాను. మందులు కొన్ని రాస్తాను. తర్వాత నీకు కౌన్సిలింగ్ అవసరం, దాంతో ఎక్కువసార్లు చెయ్యడం తగ్గుతుంది.
చాలా థ్యాంక్స్ సార్, ధైర్యం ఇచ్చారు.
అదేం లేదోయ్, నా పని నేను చేశాను. మనకి తెలియనంతవరకే ఏదైనా పెద్ద సమస్య, తెలిసాక అంతా సులువే. ఈ మందులు వాడు. వచ్చేవారం కనపడు.
అలాగే సార్. ఉంటాను.
ఒకే ముందెళ్లి కొన్ని పాలు, పళ్లు, గుడ్లు కొని తిను.సరాసరి చెయ్యడానికి వెళ్ళిపోకు.
భలేవారు సార్ మీరు, ఇప్పుడే చేసి మీ దగ్గరికొచ్చా, నాకిక ఓపికలేదు. వెళ్ళొస్తాను.
@MukthiyarM0977 Antha maamul ganey saagipothundhi ane time ki oka rod exam ki rod question paper with out of syllabus questions ichadu.
Sarle edhokati ani raasa....poindhi
Na tho paatu ma cse lo 85 % paina fail ayyaru aa course
Inko course vachi nak telisi internals debba esesindhi anukunta...