సంక్రాంతికి వచ్చిండ్రు!
ఇంత పొద్దున్నే అదీ పండగ పూట మా అపార్ట్మెంట్ ముందు మళ్లీ పోలీసులను మొహరించింది రేవంత్ రెడ్డి సర్కార్.
ఎందుకు వచ్చిండ్రు అంటే పాడి కౌశిక్ రెడ్డి కోసం మేమేమైనా పోరాటం చేస్తమని మా పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఉంది అని అంటున్నరు. అవును బరాబర్ చేస్తం కూడా. అది మా బాధ్యత .కానీ కాంగ్రెస్ గూండాల లాగా విధ్వంసం చేసే సంస్కృతి మాకు లేదు.
@revanth_anumula సీయం గారూ,
ఇప్పటికి మీరు ఎన్నో సార్లు నన్ను గృహనిర్బంధంలో ఉంచిండ్రు. నాకు హైదరాబాదు నగరంలో సొంత ఇల్లు కూడా లేదు…అద్దెకు ఒక చిన్న అపార్ట్మెంట్ లో ఉంటున్న. ప్రతి సారి మా ఇంటికి పోలీసులు వచ్చి హడావిడి చేయడం వల్ల ఈ కాంప్లెక్స్ లో మిగతా కుటుంబాలు చాలా ఆందోళనకు, తీవ్ర అసౌకర్యానికి గురైతున్నరు. వాళ్లు నా పై సానుభూతిని చూపిస్తున్నారు, మీ పాలనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నరు.
మేము పీడిత ప్రజల పక్షాన చివరి శ్వాస వరకు వారి గొంతుకగానే పోరాడుతూనే ఉంటాం. మేం మారం. మీరు మారుతరన్న నమ్మకం కూడా మాకు లేదు. ఈ యుద్ధానికి విరామం లేదు.
మిగతా అపార్ట్మెంట్ వాసుల స్వేచ్ఛ, జీవించే హక్కులను దృష్టిలో ఉంచుకుని నాకు మీ ప్రభుత్వమే ఒక ఇంటిని కేటాయించి కిరాయి మీరే కట్టుకోండి లేదా చీటికి మాటికి మీ పోలీసులను మా అపార్ట్మెంట్కు పంపించడం మానేయండి.
Seriously.
KTR WITHDRAWS PETITION & THE AFTER SHOCK!
KTR’s legal counsel senior advocate Sidharth Dave seeks the permission of the honorable Supreme Court to withdraw the quash petition.
KTR approached the Supreme Court after the High Court dismissed his quash petition. But the legal counsel later decided to withdraw the petition.
Justice Bela Trivedi and Justice PB Varale who were on the bench asked if the counsel explored the other legal options. KTR’s counsel decided to explore other available legal options.
Meanwhile, Telugu media started reporting it as final judgement and indictment.
ఎదురు దెబ్బ!
చుక్కెదురు!
షాక్ - the very standard phrases are being dished out and served.
A very good career option in Telugu will be legal reporting - because right now it oscillates between ‘భారీ ఊరట’ & ‘షాక్’! Of course, the media houses should be willing to put out actual facts that is.
Also! Mukul Rohatgi was roped in by the Telangana government to represent them in the Supreme court. He is one of the most expensive lawyers in the country today.
#FormulaE
#Politics&cases
ఫార్ములా-ఈ కేసు ఒక తుఫైల్ కేసు.
అసలు ఇక్కడ నేరమే లేదు. కేసు ఎట్ల పెడ్తరు?
ఇందులో అసలు నేరమెక్కడుందో తెలుసుకోవడానికి ACB & ED లు దాదాపుగా పది కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాయి.
ఈ అక్రమ కేసును మొదటి నుండి నిజాయితీగా, పారదర్శకంగా, మొక్కవోని ధైర్యంతో ఎదుర్కొంటూ, దర్యాప్తు సంస్థలకు సహకరిస్తూ, మరోవైపు కాంగ్రేసు మోసాలపై వీరోచిత పోరాటం చేస్తున్న @KTRBRS గారికి , @BRSparty కి అభినందనలు.
@revanth_anumula కు ఏ మాత్రం ధైర్యం ఉన్నా ఈ కేసులో కేటీఆర్ గారు విసిరిన లై డిటెక్టర్ చాలెంజ్ ను స్వీకరించాలె. లేదా రాజకీయ సన్యాసం చేసి జైలుకు పోవాలె.
#FormulaECarRace
కాళేశ్వరాన్ని కాటగలిపి.. ప్రాణహిత నీళ్లను ఎత్తుకుపోయే ఎత్తుగడ!
ఏపీ ప్రభుత్వం భారీ వ్యయంతో చేపట్టిన జీబీ (గోదావరి-బనకచర్ల) లింక్ వెనక భారీ కుట్ర దాగి ఉన్నదా? తెలంగాణకు ప్రాణాధారమైన ప్రాణహిత జలాలను కొల్లగొట్టేందుకే ఆ ప్రాజెక్టా? సంవత్సరంలో 300 రోజులపాటు సజీవంగా ఉండే ప్రాణహిత నీళ్లను ఎలాంటి అడ్డంకులు లేకుండా తరలించుకుపోవడానికి ఏపీ ప్రయత్నిస్తున్నదా? తెలంగాణకు సంబంధించిన కొందరు దాని ప్రయత్నాలకు సహకారం అందిస్తున్నారా? తనవంతుగా కేంద్రం కూడా వత్తాసు పలుకుతున్నదా?
సాగునీటి రంగ నిపుణులు ప్రస్తుతం ఈ అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రతిపాదనలపై కేంద్రం వేగంగా చర్యలు చేపట్టడం, మరోవైపు కాళేశ్వరం రిపోర్టులో, ఇతర ప్రాజెక్టులకు అనుమతుల మంజూరులో తాత్సారం చేయడమూ అందుకు బలాన్ని చేకూర్చుతున్నది. గోదావరి ప్రాజెక్టులపై ఉమ్మడి రాష్ట్రంలో నాటి పాలకులు చేసిన కుట్రలనే నేడు మరోసారి అమలుకు పూనుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ వేధింపులకు అంతం ఎన్నడు?
డీజీపి ర్యాంకులో ఉన్న ఆంధ్ర ఐపీయస్ అధికారి పీవీ సునీల్ కుమార్ చేసిన ఘోరమైన తప్పు ఆయన ఎస్సీ మాల కులంలో పుట్టడమేనా?
అయన పేరు చివరన రాజు / నాయుడు / చౌదరి/రెడ్డి /వర్మ/శర్మ లాంటి పేర్లు లేక పోవడమే ఆయన పాలిట శాపమైంది. ఇది ముమ్మాటికీ నిజం. బైదివే, నాకు పైన చెప్పిన అన్ని కులాలలో ఆత్మీయులు ఉన్నారు. అది వేరే విషయం.
లేకపోతే వందల కోట్లు బ్యాంకులను ముంచి, ఎమ్మెల్యే గా ఎన్నికై దర్జాగా తిరుగుతున్న రఘురామకృష్ణంరాజు గారు జైలు బయట ఉండటమేంట్, మూడు దశాబ్దాలుగా దేశానికి సేవలు చేసిన ఒక నికార్సయిన పోలీసు అధికారి పోస్టింగ్ లేకుండా మౌనంగా రోదిస్తూ, అక్రమ కేసుల చిత్ర హింసను గురవడం ఏంటి?
నేను పీవీ సునీల్ గారు బెల్లంపల్లి(ఆదిలాబాద్) 1998 నుండి కలసి పనిచేశాం. ఆయనకు ప్రతీ సారి ప్రభుత్వాలు అన్యాయమే చేసినవి. అందరి లాగా నాకూ ప్రాధాన్యత ఉన్న పోస్టులు ఇవ్వండి అని వేడుకున్నా అగ్రనాయకుల గుండెలు కరగలేదు.
ఈ వివక్ష ఏ మీడియాకు కనిపించదు ఎందుకంటే వాళ్లకు ఎవరిని బజారున పడేయాలి, ఎవరిని ఎప్పుడు కాపాడుకోవాలి అనేది బాగా తెలుసు. అణచివేయబడ్డ వర్గాలకు సొంత మీడియా ఉండే అవకాశం ఎన్నడూ రానివ్వరు.
ఇక 79% ఆధిపత్య వర్గాలతో నిండిన న్యాయవ్యవస్థ లో పీవీ సునీల్ కుమార్ లాంటి అణచివేతకు గురవుతున్న అధికారికి ఉపశమనం దొరుకుతుందన్న ఆశ కూడా నాకు లేదు.
అందుకే ఒకప్పుడు @ncbn గారు, @RojaSelvamaniRK గారు తెలిసి తెలిసి ఎస్సీ కులం లో పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని అన్నారేమో. I am not surprised at their observation.
పీవీ సునీల్ గారు,
ఇక ఈ మౌన రోదనలు చాలు బ్రదర్.
ప్రజా క్షేత్రంలో అడుగు పెట్టి పీవీ పులి కుమార్ లా గర్జించండి. ఈ తుఫైల్ మెమోలకు, ఎంక్వైరీ లను పట్టించుకోకండి.
అబ్ యే కదమ్ తాల్ బంద్ కరో, పీచే మత్ మూడో, హమేషా ఆగే బడో, హర్ జుర్మ్ కో ఖతమ్ కరో✊👊
జై భీం. జై హింద్.
#PVSunilKumar
We have noticed that some Social Media handles have been paid by Congress party to spread fake news against BRS Party and our leadership.
This is a warning to all such Social Media page/handle admins that police complaints and defamation suits will be filed if such fake news or misinformation is posted.
ప్రతిరోజు 24 గంటలు విధి నిర్వహణలో ఉండి శాంతి భద్రతలు కాపాడే పోలీసులకు కూడా తప్పని బకాయిల బాధలు.
నిరంతరం ట్రాఫిక్ లో విధులు నిర్వహించే పోలీసులు అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ఊపిరితిత్తులు,గుండె సంబంధిత వ్యాధుల బారిన పడినా సరే ఆరోగ్య భద్రత ఉన్నదనే భరోసాతో విధులు నిర్వర్తించేవారు. ఇపుడు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం,అనాలోచిత,నియంతృత్వ పోకడల వల్ల ఉద్యోగులకు కూడా బాధలు తప్పడం లేదు.
రేవంత్ రెడ్డి గారు పోలీసులవి కూడా ప్రాణాలేనని గుర్తించండి.
एक तरफ तेलंगाना के मुख्यमंत्री @revanth_anumula जी ने दिल्ली में किसानों की ऋण (farm loan) माफी की कहानियाँ सुना रहे हैं, वहीं तेलंगाना राज्य में किसानों की वास्तविक स्थिति यह है। कल एक किसान आईसीआईसीआई बैंक में ज़हर पीके ख़ुदख़ीशी करलिया ।
दिल्ली के लोगों को ध्यान देना चाहिए। हमारे तेलंगाना के लोग कांग्रेस के झूठे वादों पर विश्वास करके ठगे गए हैं और एक साल में ही उन्हें ओटे देने का अफसोस हो रहा है। आप भी उन परेशानियों को अपने ऊपर न लाएं।
@BRSparty@BRSHarish@KTRBRS@PTI_News
రేపు నల్గొండ లో BRS పార్టీ నిర్వహించబోయే రైతు ధర్నా కార్యక్రమానికి అనుమతి ఇవ్వకుండా అడ్డుకోవాలని చూడడం కాంగ్రెస్ ప్రభుత్వ పిరికిపంద చర్య.
ఒక పక్క రైతులు రోజుకొకరు ఆత్మహత్యకు పాల్పడుతుంటే,మీరు పట్టించుకోరు,వారి కుటుంబాలను పరామర్శించరు. కనీసం బాధిత కుటుంబానికి సహాయం చేయాలన్న మనస్తత్వం కూడా రావడం లేదు.
మీ సీయం సింగపూర్ నదిలో బోట్ రైడ్ చేసుకుంట,దావోస్ లో ఎంజాయ్ చేస్తున్నారు.ఇక్కడ మీ మంత్రులేమో కబ్జాలు, కమీషన్లలో బిజీగా వున్నరు.
మరి రైతులు ఏం కావాలె?
కనీసం @KTRBRS గారు మా BRS పార్టీ తరపున,రైతులు ఆత్మహత్య చేసుకోవద్దు,ధైర్యంగా ఉండండి అని చెప్పి భరోసా కల్పిద్దామని మీటింగ్ పెడితే కూడా అడ్డుకుంటరా! ఇదేనా మీకు రైతన్నల మీద మీకున్న ప్రేమ,అభిమానం.
ఎలాగూ మీరిచ్చిన 15000 హామీ నెయవేరుస్తలేరు,కౌలు రైతులకు 15 వేలు ముచ్చట మరిచిపోయిండ్లు. రుణమాఫీ పూర్తి కాకుండానే ఢిల్లీలో అబద్దాలు చెప్పుతున్నరు,రైతులకు మోసం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నరు.
ఈ మోసాలను మరి ఎవరు ప్రశ్నించాలె ?
రేవంత్ రెడ్డి... మరిచిపోకు బిఆర్ఎస్ పార్టీ పుట్టింది ఉద్యమాల నుంచి. యాదికి తెచ్చుకో,తెలంగాణ ఉద్యమాన్ని. రాష్ట్ర ప్రజలకు కానీ,రైతులకు కానీ అన్యాయం జరిగితే నిన్ను నిద్ర పోనియ్యం. కందిరీగ లోలె వెంబడిస్తం.
బరాబర్ రైతు ధర్నా పెట్టి తీరుతం.
So true, brother.
Cyber Crime Cells in Telangana have become modern day Gestapos of Nazi era. This is the time for people of Telangana to remember what Father Martin Niemoller once said during World War -II.
అసలు తెలంగాణలో ప్రభుత్వం ఉందా?
పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన ఇంజనీర్లకు గత నాలుగు నెలలుగా జీతాలు లేక ఆకలితో అలమటిస్తున్నరు! మంత్రులు మాత్రం ₹32000/- ప్లేటు మీల్స్ సుష్టుగా…
స్వయానా మంత్రి @UttamINC గారు ఫోన్ చేసి చెప్పినా అధికారులు ఖాతరు చేయడం లేదంటే పరిస్థితి ఎంతకు దిగజారిందో అర్థం చేసుకోవచ్చు.
కాంగ్రెస్ మార్క్ 10% కమీషన్లు సమర్పించి పనులు చేయించుకొనే స్థోమత ఈ చిరుద్యోగులకు లేదు.
కనీసం భయ్యాలు-భాబీల మాఫియాను కలిసి పని చేయించుకోవడానికి సరైన లింకు కూడా దొరకడం లేదని బాధ పడుతున్నారు ఈ తెలంగాణ బిడ్డలు!!
@TelanganaCS@TelanganaCMO మీకీ విషయం తెలుసా?
పూర్తి గా బరితెగించిన కాంగ్రెస్.
మీ కార్యకర్తలు చెప్పినట్లు గానే ప్రభుత్వ అధికారులు లబ్ది దారులను ఎంపిక చేయాల్నా?
మరి అట్లాంటప్పుడు రాజ్యాంగం ఎందుకు? చట్టాలు ఎందుకు??
ప్రభుత్వ కార్యాలయాలు ఎందుకు?
మీ సర్వేలు ఎందుకు?
అంతా ఒక డ్రామా!
ప్రభుత్వ అధికారులారా,
దయచేసి కాంగ్రేసు బెదిరింపులకు లొంగకండి. చట్ట ప్రకారమే పనిచేయండి.
ప్రజలు గుండెలో పెట్టుకుని కాపాడుకుంటారు.
@TelanganaCS
ప్రజాపాలన కాదు, మీది ముమ్మాటికీ ప్రజా వ్యతిరేక పాలన
మీ సోకాల్డ్ ప్రజాపాలన పట్ల ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో ఇప్పటికైనా అర్థమైందా?
మీరు ఎంతో ఆడంబరంగా నిర్వహిస్తున్న గ్రామ సభల సాక్షిగా మీ ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత తేటతెల్లమైంది.
ఊరూరా తిరగబడుతున్న జనం, ఎక్కడిక్కడ నిలదీస్తున్న ప్రజానీకాన్ని చూస్తే మీ ఏడాది పాలన పెద్ద ఫెయిల్యూర్ అని అర్థమవుతున్నది.
ముఖ్యమంత్రి @revanth_anumula విదేశాల్లో, మంత్రులందరూ పక్క రాష్ట్రాల్లో బిజీగా ఉంటే ప్రజలను ఎవరు పట్టించుకోవాలె.
ఇందిరమ్మ రాజ్యంలో పోలీసు పహారా నడుమ గ్రామ సభలు నిర్వహించాల్సిన దుస్థితి రావడం దారుణం.
పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం ఒకవైపు గ్రామ సభలు నిర్వహిస్తుంటే, మరోవైపు కార్యకర్తలకే పథకాలు ఇస్తామని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు చెప్పడం సిగ్గుచేటు.
అలాంటపుడు గ్రామ సభలు తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నట్లేనా.?
అర్హులైన వారికి పథకాలు ఎగ్గొడుతున్నట్లేనా?
ఎన్నికల ముందు హామీలిస్తం, అధికారంలోకి వచ్చాక ఎగ్గొడుతం అన్నట్లుగా వ్యవహరిస్తే, ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు.
రుణమాఫీ, రైతు భరోసా, పంట బోనస్, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు.. అర్హులైన అందరికి ఇస్తామని చెప్పి ఇప్పుడు భారీ కోతలు విధిస్తే ప్రజలు తిరగబడకుండా ఏం చేస్తారు.
కాంగ్రెస్ నాయకుల పాపం, అధికారులకు శాపంగా మారింది. సమాధానం చెప్పలేని పరిస్థితి.
మీరు నిర్వహిస్తున్న గ్రామ సభలు దగా..
ఆరు గ్యారెంటీలు అమలు దగా
రుణమాఫీ చేయడం దగా
పంట బోనస్ ఇవ్వడం దగా
రైతు భరోసా అమలు దగా
రేషన్ కార్డుల జారీ దగా
ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక దగా..
ఏడాది కాలంలో మీరు చేసిన దగాను ప్రజలు అర్థం చేసుకున్నరు.
మీరు చేసిన మోసాన్ని, నయవంచనను తెలుసుకున్నరు.
ప్రశ్నించే ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయిస్తరు. అరెస్టులు చేసి నోళ్లు మూయిస్తరు.
నేడు యావత్ తెలంగాణ ఏకమై మీ దుర్మార్గ పాలనను నిలదీస్తున్నది. అడుగడుగునా ప్రశ్నిస్తున్నది.
మరి ఇప్పుడు వారిపై ఎన్ని కేసులు పెడతరు. ఎంత మందిని అరెస్టులు చేస్తరు.
మీ రాక్షస పాలనలో విసిగి, వేసారి పోయిన తెలంగాణ ప్రజలు ఉప్పెనగా ఉద్యమించక ముందే కళ్లు తెరవండి.
ప్రతిపక్షాల మీద బురదజల్లడం మాని పరిపాలన మీద దృష్టి సారించండి.
ఎన్నికల హామీలో చెప్పినట్లుగా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను అందజేయాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.
#CongressFailedTelangana
#CongressBetrayedTelangana
పేరుకే ప్రజాపాలన కానీ దివ్యంగుడైన ఒక మాజీ ఎమ్మెల్యేకే రక్షణ లేదు!
బీఆర్ఎస్ పార్టీకి భయపడి నల్గొండ రైతు మహాధర్నాకు అనుమతి ఇవ్వకుండా, ఫ్లెక్సీలు చింపి, ఏకంగా ఒక ప్రభుత్వ ఆఫీసులో మాజీ ఎమ్మెల్యేను బూతులు తిడుతూ పోలీసుల ముందే దాడికి పాల్పడ్డ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గూండాలు.
పోలీసుల ముందే దాడి చేసింది మంత్రి గూండాలు అయితే ఉల్టా మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిని అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు. దాడి చేసిన వారి మీద మాత్రం ఎలాంటి చర్యలు లేవు. ఇదీ కాంగ్రెస్ అరాచక పాలన తీరు.
మా నాయకుడు కంచర్ల భూపాల్ రెడ్డిగారి మీద జరిగిన ఈ పాశవిక దాడిని ఖండిస్తున్నాను. బాధ్యులమీద సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేయవలసిందిగా డిజీపీ గారిని కోరుతున్నాను.
‘తెలంగాణ రైజింగ్’ అన్న నినాదాన్ని లోగోను రూపొందించిన వారికి హృదయపూర్వక అభినందనలు. కాంగ్రెస్ మూడు రంగుల కలర్, మీకు బాగా ఇష్టమైన 10% (కమీషన్) ను ఎవరికీ అర్థం కాకుండా మీ లోగోలో భలే ఇరికించారు :) దాన్ని మార్చకండి కాంగీస్. మిమ్ములను పొరపాటున స్వాతంత్ర సమరయోధులని ప్రజలు అమాయకంగా నమ్మే ప్రమాదం ఉంది.
ఇప్పుడు తెలంగాణ ఎట్ల రైజ్ అయితున్నదో, ఆ గుండె చప్పుడు కొంచెం వినండి.
రైతు భరోసా, రుణ మాఫీ మోసానికి వ్యతిరేకంగా రైతులందరూ రైజింగ్
రైతు కూలీల ఆత్మీయ భరోసా మోసానికి వ్యతిరేకంగా కూలీ తల్లుల రైజింగ్
గృహలక్ష్మి, రేషన్ కార్డులు, పెన్షన్ల మోసానికి వ్యతిరేకంగా పేద ప్రజల రైజింగ్
జీతాలు నాలుగు నెలలుగా రానందుకు కొత్త ఇంజనీర్ల రైజింగ్
ఫైనాన్స్ లో బిల్లుల చెల్లింపు లో కమీషన్ల కక్కుర్తికి వ్యతిరేకంగా కాంట్రాక్టర్ల రైజింగ్
పంచాయితీ రాజ్ లో చేసిన పనికి బిల్లులు ఇంకా రాలేదని సర్పంచుల రైజింగ్
గురుకులాల్లో విషాహార ఘటనలకు వ్యతిరేకంగా విద్యార్థుల రైజింగ్
లగచర్ల, వెల్మల భూములు మీ ఎనుముల-పొంగులేటిలు కబ్జాలు చేస్తున్నందుకు నిరసనగా గిరిజనుల రైజింగ్
జాబ్ కాలెండర్ రానందుకు నిరసనగా నిరుద్యోగుల రైజింగ్
పేస్కేల్ ఇవ్వనందుకు నిరసనగా సమగ్ర శిక్ష ఆశ్రమ పాఠశాల అంగన్వాడీ ఉపాధ్యాయుల రైజింగ్
మూసీ - హైడ్రా అక్రమ కూల్చివేతలకు నిరసనగా దిగువ మధ్యతరగతి ప్రజల రైజింగ్
ప్రతి చదరపు ఫీటుకు (sft) యాభై రూపాయల ఆర్-ఆర్ టాక్స్ కడితేనే ఫైళ్లు క్లియర్ చేస్తామన్న మీ అప్రకటిత హుకుం కు వ్యతిరేకంగా రియాల్టర్ల రైజింగ్
చీటికి మాటికి గృహనిర్బంధాలు, అక్రమ ప్రతీకార కేసులకు నిరసనగా ప్రతిపక్షాల రైజింగ్
సైబర్ క్రైం పోలీసులను ఉద్యమకారుల అణచివేతకు వాడుతున్నారని సోషల్ మీడియా రైజింగ్
రాజ్యాంగం ఇచ్చిన మానవ హక్కుల కాలరాతకు నిరసనగా పౌరహక్కుల సంఘాల రైజింగ్
ఏక్ పోలీస్ ఏమైందని స్పెషల్ పోలీసుల రైజింగ్
ఆరోగ్యశ్రీ బిల్లులు ఇప్పటికీ పూర్తిగా రాలేదని ఆసుపత్రుల రైజింగ్
కామారెడ్డి డిక్లరేషన్ జాడలేదని బీసీల రైజింగ్
ఖర్గే స్వయానా చేసిన చేవెళ్ల డిక్లరేషన్ చెదలు పట్టిందని దళితుల రైజింగ్
నేటికి ఆరుగురు మంత్రి పదవులు ఇవ్వకపోవడంతో మీ సొంత ఎమ్మెల్యేల రైజింగ్
రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని శిథిలం చేసే కుట్రలకు వ్యతిరేకంగా మేధావులు-ప్రజాసంఘాల రైజింగ్.
మా అసలైన తెలంగాణ తల్లిని అవమానించారని తెలంగాణ ఉద్యమకారుల రైజింగ్..
జైలులో ఉండాల్సిన ముఖ్యమంత్రి దావోస్-సింగపూర్లలో ఎట్ల షికార్లు కొడుతున్నారు అని జైలు శాఖ రైజింగ్..
అవును తెలంగాణ ముమ్మాటికీ రైజింగే.
నేడు తెలంగాణ కక్కుర్తి-కమీషన్ల-కాలయమ కాంగ్రెస్కు వ్యతిరేకంగా గరం గరంగా రైజు అయితున్నది.
జై తెలంగాణ ✊రైజ్ తెలంగాణ👊👊
#TelanganaRising
#TelanganaRisingAgainstCongress
@BRSparty
ఆసిఫాబాద్ జిల్లాలో టైగర్ కారిడార్ పేరిట దశాబ్దాలుగా అడవిని నమ్ముకొని జీవిస్తున్న గిరిజన గ్రామాలను వేరే ప్రాంతాలకు తరలించే ప్రయత్నం ఫాసిస్టు చర్య.
వన్యప్రాణులు-మానవులు ఇద్దరూ సమతుల్యంగా బతికే మార్గాలు అన్వేషించాలి కాని గిరిపుత్రుల జీవన విధానాన్ని అతలాకుతలం చేయకూడదు.
ఆసిఫాబాద్ జిల్లాలో మానిక్ పటార్ లాంటి గ్రామాలు ఎన్నో ఉన్నయి. అక్కడి ప్రజలకు ట్రైబల్ సబ్ ప్లాన్ లోని కోట్లాది రూపాయల బడ్జెట్ గురించి తెలవక పోవడం నిజంగా విస్తుపోవాల్సిన విషయం.
ఆసిఫాబాద్ జిల్లాలో- సిర్పూర్ ప్రాంతంలోని ఎన్నో గిరిజన గూడేలు వలసవాదుల-కలప దొంగల పడగ నీడలో బతికి ఇప్పుడిప్పుడే స్వేచ్చా వాయువులు పీలుస్తున్నాయి.
ఇంతటి ఎత్తయిన దట్టమైన అటవీప్రాంతంలో కూడా మిషన్ భగీరథ నీళ్లు రావడం గొప్ప విషయం. కాని రేషన్ షాపులు, అంగన్వాడీ కేంద్రాలు ఇక్కడ లేవు. రోడ్డు సౌకర్యం అధ్వానంగా ఉంది.
@POITDAUTNOOR@KAsifabad
కాగజ్ నగర్ నుండి రోడ్డు ప్రయాణం మూడు గంటలయితే, కాలి నడకన అడ్డంగా గంటలోపే కాగజ్ నగర్ చేరుకున్నాం. 😊
@BRSparty
జగిత్యాల జిల్లా, మల్లాపూర్ మండలం, మొగిలిపేట గ్రామసభలో మాజీ సర్పంచ్ నాగరాజు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం బాధాకరం.
ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తన పేరు లేదని ములుగు జిల్లా, బుట్టాయిగూడెంలో కుమ్మరి నాగయ్య అనే దళిత రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడటం మనస్సు కలిచివేసింది.
తన చావుతోనైనా అర్హులైన పేదలకు పథకాలు ఇవ్వాలని అధికారులకు చెబుతూ పురుగుల మందు తాగి, ఆసుపత్రి పాలైన ఆ రైతన్న దుస్థితికి ప్రభుత్వమే కారణం.
గ్రామ సభల్లో జరుగుతున్న ఇలాంటి వరుస ఘటనలు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నాయి.
పంచాయతీ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే యావతో, ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా, లబ్ధిదారుల ఎంపిక సరిగ్గా జరపకుండా, జాబితాను విడుదల చేయడంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది.
దీంతో పాటు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలకే పథకాలు అంటూ బాహాటంగా ప్రకటించడంతో గ్రామ సభల్లో లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పట్ల ప్రజల్లో ఆందళన మొదలైంది.
ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు ఈనెల 26వ తేదీన ప్రారంభిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటూ, మరోవైపు గ్రామ సభల్లో విడుదల చేసిన జాబితా ఫైనల్ కాదని సాక్షాత్తూ @Bhatti_Mallu , రెవెన్యూ మంత్రి @mpponguleti చెప్పడం హాస్యాస్పదం.
• అలాంటప్పుడు నాలుగు రోజుల పరిమితి పెట్టి గ్రామ సభలు నిర్వహించడంలో ఆంతర్యం ఏమిటి?
• గ్రామ సభల్లో విడుదల చేస్తున్న అర్హుల జాబితాకు ఉన్న విలువ ఏంది?
400 రోజుల పాటు అన్ని వర్గాల ప్రజలను విజయవంతంగా మోసం చేసిన @INCTelangana,
చారిత్రక గణతంత్ర్య దినోత్సవం అయిన జనవరి 26న మరో మోసానికి సిద్ధమైంది.
దరఖాస్తుల పేరిట ఇంకెన్ని సార్లు ప్రజలను మోసం చేస్తారు @revanth_anumula ?
మీ సేవలో దరఖాస్తులు చేసుకున్నరు.
ప్రజా పాలనలో దరఖాస్తులు చేసుకున్నరు.
కుల గణనలో వివరాలు తీసుకున్నరు.
ఇప్పుడు గ్రామ సభల పేరిట మరో కొత్త డ్రామా చేస్తున్నరు. మల్లా దరఖాస్తులు తీసుకుంటున్నరు.
Apply Apply But No Reply
అన్నట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వం తీరు.
సంక్షేమ పథకాలు పేదలకు అందించాలనే ఆలోచన కంటే, కోతలు పెట్టి ఎలా అందకుండా చేయలన్న దానిపైనే కాంగ్రెస్ దృష్టి ఉంది.
రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా పథకాలు పేదలకు అందించాలనే చిత్తశుద్ది ఉంటే, గ్రామ సభల పేరిట ఎందుకు ఇంత డ్రామా?
ఐటీలో మేటిగా ఉన్న తెలంగాణలో ప్రజలు పనులు వదులుకొని, రోజుల పాటు గ్రామ సభల్లో నిరీక్షించాల్సిన అవసరం ఏం వచ్చింది.
లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలనుకుంటే టెక్నాలజీని ఎందుకు వినియోగించడం లేదు.
దరఖాస్తుల పేరిట దగా చేయడం తప్ప, ఏడాది పాలనలో మీరు చేసిందేముంది.
గ్రామ సభల సాక్సిగా తిరగబడుతున్న జనం, ఎక్కడిక్కడ నిలదీస్తున్న దృశ్యాలు.. మీ పాలన వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నాయి.
వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి, ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పాలిట అభయహస్తం కాదు, భస్మాసుర హస్తం.
రాష్ట్ర ప్రజలారా.. ఆత్మహత్యలు పరిష్కారం కాదు. నమ్మి ఓటేసినందుకు నట్టేట ముంచుతున్న కాంగ్రెస్ పార్టీపై కొట్లాడుదాం. హక్కుగా రావాల్సిన పథకాలను సాధించుకుందాం. @BRSparty మీకు అండగా ఉంటుంది. ధైర్యం కోల్పోవద్దని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని రాష్ట్ర ప్రజలకు పిలుపునిస్తున్నాం.
#CongressFailedTelangana
#CongressBetrayedTelangana