మాకు EHS వద్దు- ఆరోగ్య భద్రతే కావాలి:
తెలంగాణ కాంగ్రెస్ పాలనలో, 4 కోట్ల మంది ప్రజలను కాపాడుతూ, శాంతిభద్రతలను పరిరక్షించే పోలీసుల ఆరోగ్యానికి కూడా కనీస భరోసా లేదు.
ఈ రోజు కిమ్స్ సికింద్రాబాద్ హాస్పిటల్ లో దేవసోత్ శంకర్ అనే పోలీస్ కానిస్టేబుల్ కుటుంబాన్ని కలిశాను. కానిస్టేబుల్ సతీమణి నేను కనబడగానే కన్నీరు మున్నీరుగా విలపించింది. 😭
శంకర్ 2013 నుండి పోలీస్ హోం గార్డుగా పని చేసి, 2024 తర్వాత కానిస్టేబుల్ గా మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవల విధి నిర్వహణలో ఉండగానే ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు.
బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని చెప్పడంతో
వెంటనే కుటుంబ సభ్యులు వెల్ నెస్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ నుండి నిమ్స్ కు తీసుకెళ్తే బెడ్స్ ఖాళీ లెవన్నారు. అక్కడి నుండి యశోదకు తరలించగా అక్కడ EHS పనిచేయడం లేదన్నారు. వెంటనే కిమ్స్ సికింద్రాబాద్ కు తరలించారు.
అత్యంత నిరుపేద కుటుంబం. అయినా శంకర్ మిత్రులు, బంధువుల సహాయంతో రూ.1.5 లక్షలు చెల్లించి ఆపరేషన్ చేయించారు. ఇపుడు ఐసియులో చికిత్స పొందుతున్నాడు. మళ్లీ ఇపుడు ₹2 లక్షలు కావాలని హాస్పిటల్ యాజమాన్యం అడిగితే కానిస్టేబుల్ మిత్రులు ఒక్కొక్కరు వెయ్యి,
2 వేల చొప్పున తోచినంత సాయం చేసి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.
రోజుకు 24 గంటలు పని చేసే కానిస్టేబుల్ కి ఇలాంటి పరిస్థితి ఎదురవడానికి కారణం ఎవరు ? ముఖ్యమంత్రి మరియు హోం మంత్రి రేవంత్ రెడ్డి గారు కాదా?
గతంలో కేసిఆర్ గారి ప్రభుత్వంలో ఆరోగ్య భద్రత పథకం అమలైనపుడు ఎక్ఖడ ఏం ఆపద వచ్చినా ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉండేది.
కానీ రేవంత్ రెడ్డి వచ్చి, ఆరోగ్య భద్రత స్థానంలో EHS Employee Health Scheme ను అమలులోకి తెస్తామన్నారు.
కానీ ఇప్పటివరకు పోలీసు మిత్రులు ఏ దవాఖానకు వెళ్లినా EHS పెద్దగా చెల్లడం లేదని చెబుతున్నారు.
ఆసుపత్రులు కూడా తెలివిగా, పోలీసు-ఇతర ఉద్యోగ పేషంట్ల నుండి డైరెక్టుగా నగదు డబ్బులు గుంజడానికి తెలివిగా EHS ట్రస్టుకు సమాచారం అందించ కుండా పేషంట్ల కుటుంబాలను తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తున్నారు. వాళ్లకు ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుందని నమ్మకం లేదంట! ఇలాంటి తొండి హాస్పిటల్స్ ను గుర్తించి DMHO లైసెన్స్ రద్దు చేయాలి. కానీ వాళ్లలో చాలా మంది లంచాలు మింగడంలో సీయం గారిని మించిపోయారు.
ఉదా- ఈ రోజు ఏసీబీ ట్రాప్ అయిన రంగారెడ్డి DMHO. వీళ్ళు పైకి ఎంత మామూళ్లు పంపుతున్నారో?
సీయం రేవంత్ రెడ్డి గారు రోజుకు 18 గంటలు భోది ప్యాలెస్ లో MediCover లాంటి తన స్వంత బినామీ కార్పోరేట్ హాస్పిటల్ ప్రమోషన్ కే శ్రమిస్తున్నారు తప్ప లక్షలాది ఉద్యోగుల ఆరోగ్యం గురించి కానేకాదు. ఇది మన కర్మ.
ఇప్పుడు దేవసోత్ శంకర్ పరిస్థితి దయనీయంగా ఉంది.
నేను పై అధికారులతో మాట్లాడితే వెంటనే EHS వర్తింపచేస్తాం అని హామీ ఇచ్చారు.
వెంటనే అమలు చేసి శంకర్ ప్రాణాలు కాపాడాలి. ఒకవేళ శంకర్ కు ఎలాంటి అపాయం జరిగినా పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదే.
శంకర్ ను కాపాడకపోతే బిఆర్ఎస్ తరపున పోలీసులందరి పక్షాన పోరాడుతం.
అయ్యా డిజిపి గారు, తప్పు చేసిన కానిస్టేబుల్స్ ని సస్పెండ్ చేయడం మాత్రమే కాదు, ఆపదలో ఉన్నపుడు అప్పుడప్పుడు ఆదుకోవడం కూడా చేయండి.
@TelanganaCMO@revanth_anumula@TelanganaDGP@TelanganaACB@DamodarCilarapu@KTRBRS@BRSHarish@ANI@PTI_News
#TelanganaSinking #ElCongo
#Exclusive
ఇందిరమ్మ రాజ్యంలో వెల్లివిరుస్తున్న ❛ఎనుముల❜ కుటుంబ పాలన..
• 3 పువ్వులు 6 కాయలుగా సాగుతున్న వ్యాపార వ్యవహారాలు.
• విద్యారంగంలోకి నైమిష రెడ్డి.. 6000 కోట్ల పెట్టుబడితో 50 ప్రైవేట్ స్కూల్స్.
రేవంత్ రెడ్డి అల్లుడు సత్యనారాయణ, కూతురు నైమిషా రెడ్డి హైదరాబాద్ లో 5 గీతా హ్యుందాయ్ కార్ల షో రూమ్ లను ప్రారంభించేందుకు కొరియా ప్రతినిధులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసిందే..
ఇక ఇప్పుడు, విద్యా వ్యాపారం లోకి అడుగుపెడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు నైమిష రెడ్డి.. ఏకంగా 6000 కోట్ల పెట్టుబడి తో 50 ప్రైవేట్ స్కూల్స్ ఏర్పాటు చేయనున్నట్లు వారి సన్నిహితులు చెప్తున్నారు.
తెలంగాణ, ఆంధ్రపదేశ్, మహారాష్ట్ర లో వచ్చే విద్యా సంవత్సరం స్కూల్స్ ఓపెన్ చేయనున్నారు. హైదరాబాద్ శివారు లోని కొల్లూరు లో వైఎస్ షర్మిల కి సంబందించిన భూమి తో పాటు చుట్టూ ఉన్న భూములను సేకరించారు. ఒక్క కొల్లూరు క్యాంపస్ నే 60 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది.
ఇక, హైదరాబాద్ లోనే కొంపల్లి ప్రాంతంలో ఒక క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నారు. ఇవ్వన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూతురు నైమిషా రెడ్డి, అల్లుడు సత్యనారాయణ లు చూసుకుంటారు. కొల్లూరు, కొంపల్లి వద్ద ఏర్పాటు చేసే స్కూల్స్ ను వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభించనున్నారట.
దీనికి సంబంధించిన అనుమతులు ఇవ్వాలని విద్యా శాఖ అధికారులకు సీఎంఓ నుండి ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు అధికారులు అనుమతుల జారీ ప్రక్రియను ప్రారంభించారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గా కూడా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆయన కూతురు విద్యా వ్యాపారం ప్రారంభించడం గమనార్హం.
చెరిపేయలేని.. తుడిచేయలేని.. దాచేయలేని ఆనవాళ్లు కేసీఆర్వి! 🔥
డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం వద్ద ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర 🙏🚩 ✨
జై బోలో గణేష్ మహారాజ్కి జై! ✊
గోదావరిలో వరద పోతున్నా, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రిజర్వాయర్లు అడుగంటిపోతున్నాయి. ప్రాజెక్టుల మీద రాజకీయాలు చేస్తూ రైతుల పంటలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎండగొడుతోంది. గోదావరి జలాలను తక్షణమే లిఫ్ట్ చేసి రిజర్వాయర్లను నింపాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ @UttamINC గారికి లేఖ ద్వారా విజ్ఞప్తి.
💧ఎల్లంపల్లి వద్ద భారీ వరద ఉన్నా మోటార్లు ఆన్ చేసి నీటిని ఎత్తిపోయకపోవడం ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే.
📉 అన్నపూర్ణ, రంగనాయక సాగర్ డెడ్ స్టోరేజీకి చేరాయి. 50 టీఎంసీల సామర్థ్యం ఉన్న మల్లన్న సాగర్లో కేవలం 13 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఎల్.ఎం.డి లో 11 టీఎంసీలే ఉన్నాయి.
🌾రంగనాయక సాగర్లో నీళ్లు లేక సిద్దిపేట నర్మెట్టలోని పామాయిల్ ఫ్యాక్టరీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు కాకుండా, ఇప్పటికైనా ఎల్ నినో సాకులు పక్కనపెట్టాలి. తక్షణమే 24 గంటల పాటు అన్ని మోటార్లు నడిపించి మిడ్ మానేరు, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, గంధమల్ల, బస్వాపూర్ సహా అన్ని రిజర్వాయర్లను నింపాలి. రాజకీయాలు మాని రైతుల సాగు, ప్రజల తాగునీటి అవసరాలను తీర్చాలని డిమాండ్ చేస్తున్నాం.
రేవంత్ రెడ్డిని సూటిగా అడుగుతున్నా..
బీఆర్ఎస్ హయాంలో ధరణి విషయంలోగానీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో భూ భారతి విషయంలోగానీ జరిగిన వ్యవహారాలపై విచారణ జరిపిద్దాం.
సుప్రీంకోర్టు జడ్జితో అయినా, హైకోర్టు జడ్జితో అయినా విచారణకు మేం సిద్ధం..
నువ్వు సిద్ధమా ? @revanth_anumula
#CongressFailedTelangana
#CongressLootingTelangana
When @RahulGandhi said “Vote Chori ❗️
Telangana reality said :
“Wait, let me show you how it’s really done!” 😬
19,000 fake votes exposed by @KTRBRS
Watch the video 👇 for clear explanation ⁉️
జల్, జంగల్, జమీన్ అనే నినాదంతో ఆదివాసీ అస్తిత్వం కోసం, ప్రజల హక్కుల కోసం పాటుపడ్డ యోధుడు కుమ్రం (కొమురం) భీం.
వారిచ్చిన పోరాట స్ఫూర్తే తెలంగాణ ఉద్యమంలో కూడా ఇమిడి ఉంది.
బీఆర్ఎస్ హయాంలో ఆసిఫాబాద్ జిల్లాకు కుమ్రం భీం పేరు పెట్టుకున్నందుకు, జోడేఘాట్లో సుందరమైన స్మృతి వనాన్ని ఏర్పాటు చేసినందుకు, హైదరాబాద్ మహానగరంలో కుమ్రం భీం పేరిట ఆదివాసీ భవనాన్ని నిర్మించినందుకు గర్విస్తున్నాం.
విప్లవ వీరుడు, గోండు బెబ్బులి కుమ్రం భీం వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటితే, చేతలు గడప దాటవు అనడానికి వేతనాలు అందక టీవీవీపీ,
బస్తీ దవాఖానల వైద్య సిబ్బంది పడుతున్న నరకయాతనే నిదర్శనం.
ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలు ఇస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం తప్ప ఆచరించింది లేదు, అమలు చేసింది లేదు.
తెలంగాణ వైద్య విధాన పరిషత్ రెగ్యులర్ ఉద్యోగులకు ప్రతి నెలా రెండు, మూడు వారాలు దాటినా జీతాలు రాని పరిస్థితి. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకైతే నెలల తరబడి జీతాలు అందని దుస్థితి.
ఇక బస్తీ దవాఖాన వైద్య సిబ్బందికి అయితే ఆరు నెలలుగా వేతనాలు పెండింగ్ పెట్టి, చుక్కలు చూపిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం.
వైద్యులకు, ఇతర సిబ్బందికి బతుకమ్మ, దసరా పండుగ సంబురం లేకుండా చేసి, వారిని మానసిక క్షోభకు గురి చేయడం తగునా?
వేతనాలు ఇవ్వాలని ఎన్నిసార్లు అధికారులకు వినతులు ఇచ్చినా పట్టించుకోకపోవడం దుర్మార్గం.
అత్యవసర సేవలు అందించే వైద్య సిబ్బందికే జీతాలు ఇవ్వకుంటే, ఇక ఇతర శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగుల పరిస్థితి ఏమిటి?
పథకాల్లో కోతలు.. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించకుండా వాతలు
మాటల్లో ఫేకుడు.. ఢిల్లీకి వెళ్లి జోకుడు.. ఇదే కదా రేవంత్ రెడ్డి 22 నెలల్లో నువ్వు చేసింది.
నీ పాలన వైఫల్యం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు శాపంగా మారింది.
జీతాలు ఇవ్వకుండా 13వేల మంది వైద్య సిబ్బందికి దసరా పండుగ దూరం చేసావు.
కనీసం ఇప్పుడైనా జీతాలు ఇచ్చి వారికి దీపావళి సంబురాన్ని అందించు.
@revanth_anumula@Bhatti_Mallu
#CongressFailedTelangana
బిల్లులు ఇవ్వట్లేదని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ బందు ❌
ఫీజు రీయింబర్స్మెంట్ బిల్లులు ఆపేయడంతో కాలేజీలు బందు❌
విద్యార్థులకు నిరుద్యోగ భృతి బందు, జాబ్ క్యాలెండర్ బందు, ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు బందు❌
నిధుల లేక గ్రామాల్లో పారిశుద్ధ్యం బందు.. డీజిల్ పోయించేందుకు కూడా డబ్బులు లేక చెత్త ఎత్తే ట్రాక్టర్లు బందు❌
రైతులకు రుణ మాఫీ బందు, పంట బోనస్ బందు, వ్యవసాయ కూలీలకు ఆత్మీయ భరోసా బందు.. పంట పండిద్దామంటే చివరకు అన్నదాతకు యూరియా బందు❌
22 నెలల కాంగ్రెస్ పాలనలో సంక్షేమం బందు, అభివృద్ది బందు.. ఎక్కడ చూసినా బందు, బందు, బందు..
@revanth_anumula .. నీ చేతగాని, దద్దమ్మ పాలనను చూసి అన్ని వర్గాల ప్రజలు విసిగి వేసారి పోయారు.
ప్రజలు మీకు బుద్ధి చెప్పేందుకు సిద్దమయ్యారు. మీ డ్రామాలను బందు పెట్టే రోజులు ఇక దగ్గర్లోనే ఉన్నాయి.
#CongressFailedTelangana
స్వయంగా వొంటేరు ప్రతాప్ రెడ్డి గారు ఒప్పుకున్నారు,
ఆ మాటలు అన్ని అబద్ధాలు అని , రాజకీయ ఎత్తుగడ అని,
అలాంటి ఒక బేస్ లెస్ వీడియో పట్టుకొని మీరెలా నేషనల్ మీడియా ముందు మాట్లాడారు అక్క ?
మీకోసం ఫేకు వీడియోలు పెట్టే వారేమో స్వచ్ఛంద కార్యకర్తలు?
కెసిఆర్, కేటీఆర్ , హరీశ్ రావ్ కోసం పెట్టే వారు ఏమో పెయిడ్ ఆర్టిస్టులా ? ఇదేమి న్యాయం అక్క ?
కెసిఆర్ గారి ఓటమి కోసం హరీష్ రావు గారు ప్రయత్నించడం అనేది “తన కన్ను తాను పొడుచుకోవడం” లాంటిది,
ఆది ఆయన ఎప్పడు చెయ్యడు.. అంతకి వస్తే సిద్దిపేట ఎలక్షన్ పక్కన పెట్టి పొయ్యి గజ్వేల్ లో గల్లీ గల్లీ తిరిగి వచ్చిండు హరీషన్న !
ఏది ఏమైనా మీరు ఎత్తి పోసిన దుమ్ములో..దమ్ము లేదు అక్క !
@BRSHarish@BRSparty@KTRBRS
నువ్వు గద్దెనెక్కి
1 ఏడాది, 7 నెలలు దాటి 7 రోజులయ్యింది.
మొత్తం 585 రోజులు.
కానీ,
కేసీఆర్ పేరు తీయకుండా
నీకు ఒక్క పూట కూడా గడవడం లేదు!
పాలన చేయరాక
ప్రతిపక్ష నేతను
రోజూ తలచుకునే అర్భకుడివి నువ్వు అని
తెలంగాణలో ప్రతి ఒక్కరికీ అర్థమైంది!
Central Water Commission (CWC), GWDT పరిశీలించకుండా బనకచర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇచ్చేది లేదని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ తేల్చి చెప్పడాన్ని స్వాగతిస్తున్నాం.
ఇది @BRSparty పోరాటం విజయం. తెలంగాణ ప్రజల విజయం.
బనకచర్ల పేరిట తెలంగాణ గోదావరి జలాలను అక్రమంగా తరలించుకుపోయే ఏపీ కుట్రలకు ఇది చెంపపెట్టు.
తెలంగాణ నీటి హక్కులకు అన్యాయం చేసే విధంగా రూపొందించిన బనకచర్ల ప్రాజెక్టును పూర్తిస్థాయిలో నిలిపివేసే వరకు బిఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తున్నాం.
జై తెలంగాణ
#BRSWithTelangana