మా తాత స్వర్గీయ శ్రీ నున్నా యానాదయ్య గారికి ఎడ్ల పందాలు అంటే ఎక్కువ మక్కువ, అందుకే ఆయన పేరు మీద కమిటీ వారు 4వ బహుమతి అడిగితే 20k ఇవ్వడం జరిగింది. అలాగే కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు కమిటీ వారిని శాలువా తో సత్కరించిన నియోజకవర్గ జనసేన నాయకులు బాలు గారు @JanaSenaParty
సురక్షిత ప్రాంతాలకు పంపించి వారికి కావాల్సినవి అందచేసారు. కానీ ఇప్పుడు అదే టీడీపీ నాయకులు గుండ్లకమ్మ కి ఆనుకొని ఉన్న గ్రామాల్లో ఇసుకను అమ్ముకోవడం చాలా బాధాకరంగా ఉంది. స్థానిక ప్రజలు నిస్సహాయులై ఏమి చేయలేక చూస్తుండి పోతున్నారు. దయచేసి న్యాయం చేయండి. 🙏🏻🙏🏻
@naralokesh గారు మీ పార్టీ అజయ్ సజ్జా గారు చెప్పారు X లో మీకు post చేస్తే మీరు చూసి న్యాయం చేస్తారు అని. ప్రకాశం జిల్లా, మద్దిపాడు మండలం గుండ్లకమ్మ పరిసర గ్రామాలలో అక్రమంగా టీడీపీ నాయకులు ఇసుక ఒక్కో ట్రాక్టర్ 5k వరకు అమ్ముకుంటున్నారు. ఇసుక ఫ్రీ అని చెప్పారు కదా. @ncbn గారు.
మొన్న 2025 లో మొంతా తుఫాన్ వచ్చినప్పుడు మద్దిపాడు మండల గుండ్లకమ్మ పరిసర ప్రాంతాల గ్రామాల్లో నీరు వచ్చి ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ సమయం లో స్థానిక MLA BN Vijay Kumar గారు, మండల ప్రభుత్వ అధికారులు మరియూ కూటమి నాయకులు రాత్రి సమయం లో నిద్ర పోకుండా గ్రామాల్లో ఉండి ప్రజలను
జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం
జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా 500 పైగా సభ్యత్వాలు నమోదు చేసిన సంతనూతలపాడు నియోజకవర్గానికి చెందిన జనసేన సాధక్ నున్నా బాలసుబ్రమణ్యం గారికి అభినందనలు.
#JanasenaUdyami
జనసేన అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు మరియు ఉమ్మడి ప్రకాశంజిల్లా జనసేన పార్టీ యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి గారు..
#janasenaparty#Pawankalyan#Balinenisrinivasareddy
జన సైన్యాధ్యక్షుడికి విజయోస్తు!
తమ్ముడు కల్యాణ్...
ప్రేమతో పంపిన పుట్టిన రోజు శుభాకాంక్షలు అందాయి. ప్రతీ మాట.. ప్రతీ అక్షరం నా హృదయాన్ని తాకింది. అన్నయ్యగా నన్ను చూసి నువ్వెంత గర్విస్తున్నావో.. ఓ తమ్ముడిగా నీ విజయాల్ని, నీ పోరాటాన్ని నేను అంతగా ఆస్వాదిస్తున్నాను. నీ కార్యదీక్షత, పట్టుదల చూసి ప్రతీ క్షణం గర్వపడుతూనే ఉన్నా. నిన్ను నమ్మినవాళ్లకు ఏదో చేయాలన్న తపనే నీకు ఎప్పటికప్పుడు కొత్త శక్తిని ఇస్తుంది.
ఈ రోజు నీ వెనుక కోట్లాదిమంది జనసైనికులు ఉన్నారు. ఆ సైన్యాన్ని ఓ రాజువై నడిపించు. వాళ్ల ఆశలకు, కలలకు కొత్త శక్తినివ్వు. అభిమానుల ఆశీర్వాదం, ప్రేమ నీకు మెండుగా లభిస్తూనే ఉండాలి. ఓ అన్నయ్యగా నా ఆశీర్వచనాలు ఎప్పుడూ నీతోనే ఉంటాయి. నీ ప్రతీ అడుగులోనూ విజయం నిన్ను వరించాలని ఆ భగవంతుడ్ని కోరుకొంటున్నాను.
@APDeputyCMO@PawanKalyan
ఇట్లు
నీ అన్నయ్య
ప్రపంచానికి వెలుగునిచ్చే ఆ సూర్యభగవానుడు కే అప్పుడప్పుడు మబ్బులు అడ్డు పడుతుంటాయి. అలా అని సూర్యుడు వెనుకడుగు వేయడు, ప్రతిరోజు ఉదయిస్తూనే ఉంటాడు. అలాగే మన జనసేన పార్టీ నాయకులు కూడా. కార్యకర్తలు నిరాశ పడవద్దు. మంచి రోజులు ముందు ఉన్నాయి. @JanaSenaParty@PawanKalyan@balineni_vasu