నల్లగొండ జిల్లా : -
చిట్యాల పట్టణ శివారులో ఓ వ్యవసాయ క్షేత్రంలో అత్యవసర ల్యాండ్ అయిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్.
వారం క్రితం జైపూర్ నుంచి విజయవాడ లో వరద భాదితుల
కోసం సహాయ చర్యలకు వెళ్లిన ఆర్మీ హెలికాప్టర్.
సహాయక చర్యలు ముగించుకుని జైపూర్ వెళ్తుండగా సాంకేతిక లోపంతో అత్యవసర ల్యాండ్ అయిన ఆర్మీ హెలికాప్టర్..
#Nalgonda #Chityaala #AirForceHelicopter #Landed
@Collector_NLG@NalgondaCop@TelanganaCOPs
సూర్యాపేట జిల్లా :-
బైక్ చోరీలు, చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న ఇద్దరు దొంగల ముఠాను పట్టుకున్న తిరుమలగిరి పోలీసులు.
5.5 లక్షల విలువ గల 3.7 తులాల బంగారం, 13 బైకులు స్వాధీనం, రిమాండ్ కి తరలింపు. నిందితుల పై పలు నేరాల కింద ఇప్పటికే 28 కేసులు.
జిల్లా పోలిస్ కార్యాలయంలో వివరాలు వెల్లడించిన ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ips.
#Suryapet #Thieves #Gang #Caught #TirumalgiriPolice
@CollectorSRPT@spsuryapet@INCNalgonda
సూర్యాపేట జిల్లా :
కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పద్మావతి మీడియా సమావేశం.
భారీ వర్షాల ప్రభావంతో కలిగిన నష్టాన్ని అదికారులరో సర్వే చేయించి
ఎంత మేర నష్టం అనే ఆంచనా వేస్తున్నట్లు తెలిపారు.
దెబ్బ తిన్న ఇండ్లల్లో ఎవరు ఉండ వద్దు పునరావాస కేంద్రానికి రావాలని కోరారు.
వర్ష ప్రభావంతో నష్టపోయిన రైతులకు, దెబ్బతిన్న ఇండ్లకు నష్టపరిహారం కోసం
ముఖ్యమంత్రి దృష్టి కి తీసుకువెళ్ళి ఇప్పిస్తానన్నారు.
#Suryapet #Kodada #MLA #CampOffice #MediaConference
@CollectorSRPT@INCNalgonda@uttampadmavathi
నల్లగొండ జిల్లా :
బెల్ట్ షాపుల నిర్మూలనను పటిష్టంగా నిర్వహించిన గ్రామస్తులను సన్మానించిన గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారు.
మునుగోడులోని తన వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో మునుగోడు మండలం కచలాపురం గ్రామంలో గౌరవ ఎమ్మెల్యే సూచనల మేరకు బెల్ట్ షాపులను సంపూర్ణంగా నిర్మూలించి నందుకు ఆ గ్రామంలోని కమిటీ సభ్యులను
శాలువాలతో సన్మానించారు.
వెంటనే గ్రామాభివృద్ధికి 10 లక్షల రూపాయల నిధులను మంజూరు చేశారు. మునుగోడు మండలం జక్కలవారి గూడెం గ్రామస్తులను కూడా శాలువలతో సన్మానించి, వెంటనే అభివృద్ధి కోసం పది లక్షల రూపాయల నిధులను మంజూరు చేశారు.
బెల్టు షాపులను నిర్మూలించిన గ్రామాలకు మొదటి ప్రాధాన్యతగా అభివృద్ధి నిధులు కేటాయిస్తానని గతంలో చెప్పిన విధంగానే బెల్ట్ షాపులు నిర్మూలించిన
గ్రామస్తులను పిలిపించుకొని గౌరవంగా సన్మానించి అభివృద్ధి కి నిధులు కేటాయించారు.
బెల్ట్ షాపులు నిర్మూలించిన గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు.
#Nalgonda #MLA #Munugodu #Abolition #beltShops #Honored
@Collector_NLG@NalgondaCop@rajgopalreddy_K@INCNalgonda@INCTelangana
యాదాద్రి జిల్లా :
అడ్డగూడూరు మండలం మానాయికుంట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.
నిన్న రాత్రి కురిసిన వర్షానికి రోడ్లు, వీధులు జలమయం
కావడంతో కాలకృత్యాల కోసం బయటకు వెళ్లిన వృద్ధురాలు వర్షపు నీటిలో పడి చనిపోయింది.
బంధువులు కుటుంబ సభ్యులు గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
#Yadadri #AddagudurMandal #Manaikunta #Tragedy
@Collector_YDR@INCNalgonda@NalgondaCop
నల్గొండ జిల్లా:
నాగార్జునసాగర్ నెహ్రూ ఏరియా ఆసుపత్రి సమయపాలన పాటించని డాక్టర్లు.
జర్వంతో ప్రభుత్వ దవాఖానకు రోగులు వస్తే 12 గంటలకు రూమ్ కు తలుపులు వేసుకున్న సిబ్బంది, ఇంజక్షన్ రూమ్ దగ్గర రోగుల పడిగాపులు.
ఒపి చూసే సమయం ఉదయం 9 నుంచి 2 వరకు,
10 గంటలకు వచ్చి 12 గంటలకు వెళ్ళిపోతున్న డాక్టర్లు.
మధ్యాహ్నం 12 దాటితే పత్తా జాడ లేకుండా పోతున్న వైద్యసిబ్బంది.
రోగులు జిల్లా అధికారి DCH కు సమాచారం అందిచడంతో ఇంజక్షన్ రూమ్ కు చేరుకున్న డాక్టర్లు .
ఇంజక్షన్ కోసం రోగులు సూపరెంటెడ్కి ఫిర్యాదు.
నర్స్ పై విచారణ జరిపి చర్యలు తీసుకుంటానని హామీ.
#Nalgonda #Nagarjunasagar #NehruAreaHospital
@Collector_NLG@NalgondaCop@INCNalgonda@DamodarCilarapu
నల్గొండ జిల్లా :
చండూర్ మున్సిపల్ కేంద్రం లో నల్గొండ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి గారితో కలిసి పర్యటించిన గౌరవ మును గోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారు.
శితిలావస్థలో ఉన్న ప్రభుత్వం హాస్పటల్ బిల్డింగ్,
నిలిచిపోయిన డబుల్ రోడ్ పనులను పరిశీలించారు..
ప్రభుత్వ హాస్పటల్ సందర్శించి రికార్డు లను పరిశీలించి రోగులతో మాట్లాడిన గౌరవ ఎమ్మెల్యే...
ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ ల సంఖ్య పెంచాలి, ఆసుపత్రి ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలి.
ఇప్పటివరకు ఎన్ని డెలివరీలు అయ్యాయి ఎంతమంది ప్రెగ్నెన్సీ లేడీలు అడ్మిట్ అయ్యారు, ఎంతమంది ఇన్ పేషెంట్లు అవుట్ పేషెంట్ల వివరాలను అడిగి తెలుసు కున్నారు...
మున్సిపాలిటీ లోని బీసీ బాలుర వసతి గృహం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మౌలిక వసతులను, భవనాలను ను పరిశీలించారు.
రాబోయే 25 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని విద్యా లయాల నిర్మాణం జరగాలి,బాలికల ఇబ్బందులను గౌరవ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి ఎస్ ఢీ ఎఫ్ నిధుల ద్వారా ఐదు టాయిలెట్ లను నిర్మిస్తానని, రేపె పనులు మొదలు పెడతామని హామీ.
#Nalgonda #Munugodu #MLA #Toured #Municipality #GovtHospital #BCBoysHostel
@Collector_NLG@NalgondaCop@INCNalgonda@rajgopalreddy_K@INCTelangana@CilarapuDamodar
నల్లగొండ జిల్లా :
గత మూడు రోజులుగా నల్గొండ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు జరిగిన నష్టం పై మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తో కలిసి మునుగోడు, చండూరు మున్సిపాలిటీ కేంద్రాల్లో సీజనల్ వ్యాధులపై, వర్షానికి నియోజకవర్గంలో జరిగిన నష్టాలపై
సమీక్ష సమావేశం నిర్వహించారు .
ఈ కార్యక్రమంలో చండూరు ఆర్డీవో ఎమ్మార్వోలు వైద్య అధికారులు పాల్గొన్నారు.
#Nalgonda #Munugodu #MLA #Damages #Review #Meeting
@Collector_NLG@NalgondaCop@INCNalgonda@rajgopalreddy_K@INCTelangana@CilarapuDamodar
సూర్యాపేట జిల్లా..
నడిగూడెం మండలం రామచంద్రపురం గ్రామంలో భారీ వర్షాలకు సాగర్ ఎడమ కాలువను గండి పడి కొట్టుకు పోయిన పంట పొలాలను పరిశీలించి, పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించిన మాజీ మంత్రులు,హరీష్ రావు, జగదీష్ రెడ్డి, సబితా, ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే లు గాదరి కిషోర్ కుమార్, చిరుమూర్తి లింగయ్య, మల్లయ్య యాదవ్ , భూపాల్ రెడ్డి, మాజీ mp లింగయ్య యాదవ్.
మీడియాతో మాట్లాడిన.. జగదీశ్ రెడ్డి..
ఖమ్మం జిల్లా కు నీళ్లు తీసుకుపోయేందుకు ఏప్రిల్ నెలలో ఎక్కడికక్కడ మేకర్లకు సీల్ వేసి, లాక్ వేసింది ప్రభుత్వం, ఆ లాక్ లను సీల్ లను మళ్ళీ ఓపెన్ చేయలేదు. ఆ పాపం వల్లనే ఇవ్వాళ రామచంద్ర పురం వద్ద ఎడమవు కాల్వకు గండి పండింది. వేల ఎకరాలు మట్టి కొట్టుకుపోయాయి.
రైతులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ఇది ప్రభుత్వ పాపమే. భారీ వర్షాలకు రాష్ట్రం అతలాకుతలం అయింది.
ఇవ్వాళ నడిగుడం మం. రామచంద్ర పురం లో సాగర్ ఎడమవు కాల్వకు గండి పడ్డ స్థలాన్ని మేం పరిశీలించాము. సీఎం రేవంత్ అనాలోచితంగా అవగాహన రహితంగా వున్నాడు. brs పై ఆరోపణలు చేస్తూ కాలయాపన చేసిండు.
ఆయనకు పెండ్లి కి,సావుకి తేడా తెలియడం లేదు. నవ్వుతూ, ఫోటో షూట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు సీఎం. ఖమ్మంలో ప్రజలు చనిపోవడానికి కారణం కూడా ఈ మంత్రులే. కనీసం ఒక్క హెలికాప్టర్ ఏర్పాటు చేయలేని అసమర్థ ప్రభుత్వం ఇది. అంతా నష్టపోయాక ఇవ్వాళ ముసలి కన్నీరు కారుస్తున్నారు.
ప్రజలను గాలికి వదిలి, జల్సాలు చేస్తున్నారు. ఇక్కడ వందల ఎకరాలు పూర్తిగా మట్టి కొట్టుకుపోయాయి. ఇసుక రాళ్లు మేటలు వేసింది.మా BRS కార్యకర్తలు కార్యక్షేతంలో ఉండి అందరికి సాయం అందించారు.
ఇంత కంటే పెద్ద వరదలకు అనాడు కేసీఆర్ గారు పటిష్ట మైన చర్యలు తీసుకున్నారు.ఎక్కడ ప్రాణనష్టం కానివ్వలేదు. ఇప్పుడు ప్రభుత్వం విఫలం అయింది..
ఈ విలయానికి కారణం కాంగ్రెస్. నిర్లక్ష్యంగా ఆవాహన రహితంగా వ్యవహరిస్తోంది.చేతకాని ప్రభుత్వం ఇది.
రామచంద్ర పురం లో ఎకరాకు 50 వేలు పరిహారం ఇవ్వాలి.
రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోయిన పొలాలకు 30 వేలు ఇవ్వాలి అని మాజీ మంత్రి సూర్యాపేట MLA జగదీశ్ రెడ్డి గారు అన్నారు.
#Suryapet #NadigudemMandal #Ramachandrapuram #Sagar #LeftCanal #Gundi #Examined #FormerMinisters
@CollectorSRPT@NalgondaCop@revanth_anumula@INCNalgonda@BRSHarish@jagadishBRS@BrsSabithaIndra@BRSparty@INCTelangana@BollamMallaiah@KaushikReddyBRS@kp_vivekanand@RajuShambipur
నల్గొండ జిల్లా ...
నల్లమల అటవీ ప్రాంతంలో నిన్న రాత్రి చిక్కుకున్న డిండి మండలం దెయ్యం గుండ్లకు చెందిన 10 మందిని కాపాడిన నల్గొండ జిల్లా పోలీస్..
నిన్న సాయంత్రం 6 గంటలకు సమాచారం అందినే వెంటనే జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపిఎస్ ఆదేశాల మేరకు అప్రమత్తమైన జిల్లా పోలీస్...
రాత్రి నుంచి డ్రోన్ కెమెరా ద్వారా గాలింపు చర్యలు చేపట్టి రిస్క్యూ చేసి బాధితును కనిపెట్టిన జిల్లా పోలీసు..
బాధితులకు డ్రోన్ ద్వారా ఆహారం పదార్థాలు అందజేసి బాధితులకు భరోసానిచ్చిన పోలీస్..
రాత్రి సమయంలో ఎక్కువ వరద ఉధృతి ఉండటం వలన
ఈరోజు ఉదయం బాధితులను తాడు ద్వారా నాగర్ కర్నూల్ పోలీసుల సహాయంతో బయటికి తీసుకొచ్చిన జిల్లా పోలీసు..
#Nalgonda #NallamalaForestArea #Saved #NalgondaDistrictPolice
@NalgondaCop@Collector_NLG@revanth_anumula@INCNalgonda@INCTelangana@UttamINC@KomatireddyKVR
నల్గొండ జిల్లా..
మిర్యాలగూడ పట్టణం బృందావన గార్డెన్స్ లో సిపిఎం పార్టీ
ఆధ్వర్యంలో జిల్లా ప్లీనరీ సమావేశం.
ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి సభ్యులు వీరయ్య, రంగారెడ్డి,రాష్ట్ర కమిటీ సభ్యులు ఐలయ్య.
#Nalgonda#CPM#PlenaryMeeting@cpimspeak@Collector_NLG
సూర్యాపేట జిల్లా :
సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి.
జిల్లాలో జరిగిన పంట, ఆస్తి నష్టం వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం. సాగర్ ఎడమకాలువ తెగడం వల్ల జరిగిన పంట నష్టం పైన ఆరా తీసిన ముఖ్యమంత్రి.
సూర్యాపేట జిల్లా లో 30 సెంటిమీటర్ల అతి భారీ వర్షం పడింది. అధికారులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉన్నారు.పంట, ఆస్తి నష్టం పైన అధికారులు ప్రాథమిక నివేదిక ఇచ్చారు.
ప్రభుత్వం నిరంతరం మంత్రులు, ప్రజాప్రతినిధులను క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచాం. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఖమ్మం,నల్లగొండ పరిస్థితి పైన ప్రధాని మోదీ, అమిత్ షా, రాహుల్ గాంధీకి వివరించి సాయం కోరాను.
వర్షాల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల పరిహారం. పశువులు చనిపోతే 50 వేల సాయం. పంట నష్టం జరిగితే ప్రతి ఎకరానికి పదివేల సాయం. ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు.
సూర్యాపేట కలెక్టర్ కు తక్షణ సాయంగా ఐదు కోట్లు.
పాఠశాల సెలవులపైన జిల్లా కలెక్టర్ల కు నిర్ణయాధికారం.
వరద బాధితులకు సాయం చేయడానికి ముందుకు వచ్చిన
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి ధన్యవాదాలు.
అమెరికా లో ఉండి ఒకాయన ట్విట్టర్ లో పెడుతున్నాడు.
ఒకాయన ఫాంహౌస్ లో ఉన్నాడు. వరద సమయంలో బురద రాజకీయాలు వద్దు, రాజకీయాలకు ఇది సమయం కాదు.
బెయిల్ కోసం 20మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీ వెళ్తారు కానీ వరద బాధితులను పరామర్శించరు. మంత్రులంతా క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు.
మూడు రోజుల నుంచి నిద్ర లేకుండా నేను సమీక్ష చేస్తున్న.
వరదల సమయంలో కేంద్రం వైపు చూడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎస్ డి ఆర్ ఎఫ్ ను ప్రారంభించుకుంటున్నం.
జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి ప్రధాన మోదీని ఆహ్వానించాం. రాష్ట్రంలో ఐదు వేల కోట్ల నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వస్తున్నాయి.
తక్షణమే కేంద్రం రెండు వేల కోట్లు కేటాయించాలని కోరుతున్న.కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాష్ట్రానికి నిధులు తీసుకువచ్చేందుకు పని చేయాలి.
#Suryapet #CM #Trip #ReviewMeeting
@CollectorSRPT@revanth_anumula@KomatireddyKVR@UttamINC@NalgondaCop@TelanganaCOPs@BJP4Telangana@bandisanjay_bjp@kishanreddybjp
సూర్యాపేట జిల్లా :
కోదాడ విజయవాడ నుండి హైదరాబాద్ కు రాకపోకలు ప్రారంభం.
ఆంధ్ర నుంచి వచ్చే వాహానాలన్నిటిని ముందుగా అనుమతించిన తెలంగాణ పోలీస్.
NHAI రాష్ట్ర రీజనల్ ఆపీసర్ బ్రిడ్జిని పరిశీలించి ఎడమ ప్రక్కన ఉన్న కొత్త బ్రిడ్జి మీద నుండి వన్ వేలో వాహనాలను అనుమతించాలని ఆదేశం.
దీంతో ముందుగా విజయవాడ నుండి వస్తున్న వాహనాలను అనుమతించిన ఆంద్రా తెలంగాణ పోలీసులు.
#Nalgonda #Kodada #CommencementOfTraffic
@CollectorSRPT@NalgondaCop@TelanganaCOPs@KomatireddyKVR@INCNalgonda