రైతుగా నేను 20 ఏళ్లు బతికాను.. ఇక అంతా అయిపోయింది సార్..
ఇద్దరు పిల్లలని, మా అమ్మ, మా నాన్నని చూసుకుంటూ బ్రతికించుకున్నా.. ఇవాళ ఏమీ లేదు ఇక
ప్రతీ వాళ్ళూ ఇబ్బంది పడుతున్నారు! ఎక్కడ పోవాలి రేపు పొద్దున మేము?
పిల్లగాడు డబ్బులేస్తే తినడం... లేదంటే ఇట్టా కూర్చోవడమే సార్
- రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్‌కు వివరించిన పెనుమాక రైతు
కరోనా సంక్షోభం మధ్యలో కూడా అభివృద్ధి ఆగలేదు @ysjagan ♥️🙏🔥
GSDP వృద్ధిలో దేశంలో అగ్రస్థానంలో 11.43% లో నిలబెట్టావు.ఇప్పుడు 8% కే వీళ్లు సంకలు గుద్దుకుంటున్నారూ
నా తండ్రి పాడెను వైఎస్ జగన్ మోయడం ఎప్పటికీ మర్చిపోలేం
ఇది రాజకీయ లబ్ది కాదు.. కుమారుడు తండ్రికి ఇచ్చిన గౌరవం
జగన్ పట్ల మా కుటుంబంలో మరింత గౌరవం పెరిగింది
మా కుటుంబం ఎప్పటికీ మరచిపోలేని కృతజ్ఞతలు జగన్ గారి పాదాలు వద్ద సమర్పించుకుంటాము
నా తండ్రిని బతికించేందుకు YS జగన్ చాలా ప్రయత్నం చేశారు
ముద్రగడ ఆరోగ్యం గురించి జగన్ ఫోన్ చేసి తెలుసుకునేవారు
ముద్రగడను బతికించేందుకు వైద్యులతో ఎప్పటికప్పుడు మాట్లాడేవారు
-ముద్రగడ కుమారుడు గిరిబాబు
పెనమలూరులో నారా లోకేష్ పర్యటనలో అంగన్వాడీల నిరసన
పునాదిపాడు వద్ద తమ సమస్యలను తెలిపేందుకు వచ్చిన అంగన్వాడీలు
కాన్వాయ్ ఆపకుండా వెళ్లిపోయిన నారా లోకేష్.. అసహనం వ్యక్తం చేసిన అంగన్వాడీలు
ఎన్నికల్లో అంగన్వాడీలకు జీతాలు పెంచుతామని కూటమి ప్రభుత్వం హామీ.
జీతాలు పెంపు చేయాలని ఆడిగేందుకు వచ్చి.. నిరాశగా వెనుదిరిగిన అంగన్వాడీలు
ముద్రగడ పద్మనాభం చెప్పినట్టే నడుచుకున్నాం
మా సోదరి క్రాంతిని రానివ్వద్దని ముద్రగడ మాకు చెప్పారు
అంబటి రాంబాబు మీద కేసు పెట్టడం సరికాదు
అంత్యక్రియలకు అధికార లాంఛనాలు వద్దని మేమే చెప్పాం
- ముద్రగడ కుమారుడు గిరి
బ్రేకింగ్
ఏపీలో మరో జెన్ జీ ఉద్యమం మొదలుకాబోతోంది
డీఎస్సీ పేపర్ లీకేజీ, ఉద్యోగ నియామకాల్లో అవకతవకలపై... ఈనెల28న రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టబోతున్నాం
డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ..విద్యాశాఖామంత్రి లోకేష్ రాజీనామా చేయాలి
డీఎస్సీ ఒక్కో పోస్ట్ ను రూ.10లక్షల నుంచి రూ.15లక్షలకు అమ్ముకున్నారు
-మల్లాది విష్ణు
తాడిపత్రిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. రోడ్డుపై బైఠాయించి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు నిరసన
నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డికి పోలీసులు తొత్తులుగా మారి.. అతని అరాచకాలకు వంత పాడుతున్నారంటూ ఆగ్రహం
పెద్దారెడ్డి గారికి మద్దతుగా వస్తున్న వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల్ని అడ్డుకుంటున్న పోలీసులు
#YSJaganInPulivendula
ప్రజలతో మమేకమైన వైయస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ – జై జగన్ నినాదాలతో మార్మోగిన పులివెందుల
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ మంగళవారం పులివెందులలో ప్రజలతో మమేకమయ్యారు. సాయంత్రం పులివెందులకు చేరుకున్న ఆయన భాకరాపురంలోని క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించి అభిమానులు, పార్టీ శ్రేణులు, వివిధ వర్గాల ప్రజలు, బాధితులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు.
క్యాంపు కార్యాలయానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, నాయకులు, మహిళలు, యువత, వృద్ధులు, దివ్యాంగులు, అభిమానులను వైయస్ జగన్ ఆప్యాయంగా పలకరించారు. తెలిసిన ప్రతి కార్యకర్తను పేరు పేరునా పలకరిస్తూ వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ నేతల వేధింపులు, ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితుల సమస్యలను విని వారికి ధైర్యం చెప్పారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా పార్టీ అండగా ఉంటుందని, తాను అండగా నిలుస్తానని భరోసా కల్పించారు.
ప్రజాదర్బార్ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అభిమానుల కోరిక మేరకు పలువురితో సెల్ఫీలు దిగుతూ, ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడారు.
జై జగన్ నినాదాలతో హోరెత్తిన క్యాంపు కార్యాలయం
వైయస్ జగన్ పులివెందులకు వస్తున్నారనే సమాచారంతో పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. పార్టీ అభిమానులు, కార్యకర్తలు, యువత, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు భారీగా హాజరయ్యారు. క్యాంపు కార్యాలయ ప్రాంగణమంతా జనంతో కిక్కిరిసిపోయింది. వైయస్ జగన్‌ను చూడగానే అభిమానులు జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. క్యాంపు కార్యాలయం మొత్తం పార్టీ శ్రేణుల సందడితో మార్మోగింది.
ఆయేషాను పరామర్శించిన వైయస్ జగన్
పులివెందుల హెలీప్యాడ్ నుంచి భాకరాపురంలోని క్యాంపు కార్యాలయానికి వెళ్తున్న సమయంలో భాకరాపురానికి చెందిన ఆయేషాను వైయస్ జగన్ పరామర్శించారు. బ్రెయిన్ టీబీతో బాధపడుతున్న ఆయేషాకు మూడేళ్ల క్రితం వైద్య సహాయం అందించిన వైయస్ జగన్, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మళ్లీ క్షీణించిందని తెలుసుకుని కాన్వాయ్‌ను ఆపి స్వయంగా దిగివచ్చి ఆమెను పరామర్శించారు.
ఆయేషా ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న వైయస్ జగన్, అవసరమైన వైద్య సహాయాన్ని అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయేషా భర్త బాబా ఫక్రుద్దీన్ మాట్లాడుతూ, “వైయస్ జగన్ దయ వల్లే గతంలో మెరుగైన వైద్యం అందింది. ఆయన చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేం” అని కృతజ్ఞతలు తెలిపారు.
పలువురు ప్రజాప్రతినిధుల భేటీ
పులివెందుల పర్యటన సందర్భంగా వైయస్ జగన్‌ను ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి పార్టీ కార్యక్రమాలు, స్థానిక పరిస్థితులపై చర్చించారు. ప్రజల మధ్యకు వచ్చి వారి సమస్యలు తెలుసుకుంటున్న జననేతకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.