జనసేన పార్టీ మున్సిపల్ అభ్యర్ధుల తుది జాబితా
మున్సిపాలిటీలు, నగర పంచాయతీ ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేయనున్న అభ్యర్ధుల తుది జాబితాకు పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు ఆమోదం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.
1. తుని: శ్రీమతి సరకణం శ్రీలత
2. ముమ్మిడివరం : శ్రీమతి గుబ్బల రత్న భవాని
#VoteForGlass
#APLocalBodyElections
స్థానిక ఎన్నికల కమిటీల నియామకంలో కష్టపడిన ప్రతీ జనసేన నాయకుడికి అవకాశం కల్పించారు. అధికారిక పర్యటనలో భాగంగా స్పెయిన్ లో ఉన్నప్పటికీ, త్వరలోనే క్షేత్రస్థాయిలో నాకు అప్పగించిన బాధ్యతలు చిత్తశుద్ధితో నిర్వర్తిస్తాను - గౌ|| మంత్రి శ్రీ @kanduladurgesh గారు
బాపూజీ చూపిన సత్యం, అహింస, స్వచ్ఛత మార్గం సదా అనుసరణీయం.
ఆర్థికంగా, సామాజికంగా గ్రామాలను పటిష్ఠపరుచుకుంటూ, గ్రామ స్వరాజ్యం దిశగా ప్రతి పల్లెలో ప్రతిరోజూ పండుగ వాతావరణం నెలకొనేలా తీర్చిదిద్దుకుంటూ, దేశ అభివృద్ధిలో భాగస్వాములవుదాం.
#MahatmaGandhiJayanti
వైసీపీ ఐదేళ్ల కంటే.. ఈ రెండేళ్లలోనే పదింతల రోడ్ల నిర్మాణం
•పల్లె పండుగ 1.0, 2.0తో రూ.9 వేల కోట్ల అభివృద్ధి పనులు
•100 రెట్లు ఎక్కువగా మినీ గోకులాలు
•బ్లీచింగ్ పౌడర్ కొనలేని స్థితి నుంచి.. సొంతంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకునే స్థాయికి పంచాయతీలను తీసుకొచ్చాం
•ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో 6,500 కి.మీ. సీసీ రోడ్ల నిర్మాణం
•అడవి తల్లిబాటలో 1,500 కి.మీ.కు పైగా రహదారుల నిర్మాణం
•గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పల్లె పండుగ 3.0
•పల్లె పండుగ 3.0లో 6 వేల కి.మీ. సీసీ రోడ్లు, 9,500 కి.మీ. బీటీ రోడ్లు
•22,500 మినీ గోకులాలు.. 50 వేల ఎకరాల్లో పండ్ల తోటలు
•కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో గ్రామీణ అభివృద్ధికి భారీ కార్యాచరణ
•ప్రజల భాగస్వామ్యంతోనే పారదర్శక గ్రామీణ అభివృద్ధి
•అభివృద్ధి పనుల నాణ్యతపై ప్రజల పర్యవేక్షణ అవసరం
•ఉదయగిరి వేదికగా రూ.11,085 కోట్ల పల్లెపండుగ 3.0కు శ్రీకారం
•గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారితో కలిసి పనులు ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
#PallePanduga
#APTowardsGramaSwaraj #APRuralDevelopment
#PawanKalyanAneNenu
Under the special focus of Deputy Chief Minister Sri @PawanKalyan, around ₹280 crore has been allocated through Jal Jeevan Mission and Amarajeevi Jaladhara. Overall project works have reached 96% completion, with 1,106 of the planned 1,111 km pipeline completed.
Works are fully complete in Pulivendula Urban, Pulivendula Rural and Simhadripuram, while drinking water supply is being extended to 24 habitations in Lingala mandal. The remaining water treatment and storage infrastructure works are in their final stages.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @pawankalyan గారిని భారతీయ జనతా పార్టీ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి శ్రీ శివ్ ప్రకాష్ @shivprakashbjp గారు మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో ఇటీవల భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాసేవలో మరింత చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు. ఈ భేటీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి.వి.ఎన్. మాధవ్ @MadhavBJP గారు, రాష్ట్ర ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ శ్రీ మధుకర్ @BJPMadhukarAP గారు పాల్గొన్నారు.
దేశం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న మహా నాయకుడు గౌరవ భారత ప్రధాని శ్రీ @narendramodi గారు
నిరసనల ముసుగులో ఆయనను అసభ్య పదజాలంతో దూషించడం బాధాకరం. విపత్కర పరిస్థితుల్లోనూ భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మోదీ గారి వెంట మేమంతా బలంగా నిలబడతాం - గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
#BhogapuramAirport
#ModiHonoursAlluri
#AlluriSitaramaRajuAirport
మిమ్మల్ని రాజకీయంగా ఓడించే నాయకుడు ఈ భారతదేశంలో లేడు... రాబోడు... దేశం కోసం మీరు పడిన శ్రమ, చేసిన త్యాగం, చూపించిన అంకితభావానికి సాటి ఎవరూ లేరు....
మీరు స్వయంగా వద్దనుకుంటేనే అధికారం మీ చేతుల నుంచి వెళ్తుంది... కానీ మీరు దేశం కోసం పనిచేసేంత వరకు, మేమంతా మీ వెంటే ఉంటాం @narendramodi గారు - @PawanKalyan
#BhogapuramAirport
#ModiHonoursAlluri
#AlluriSitaramaRajuAirport
ఎర్ర బస్సు రాని చోటకు ఎయిర్ బస్సా అన్నవారికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సాకారమే సమాధానం
* కూటమిలో మూడు పార్టీలు ఉండడంతోనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి వేగవంతం
* ఈ అభివృద్ధి కోసమే 2024 ఎన్నికల్లో తపనపడ్డాను
* దేశం కోసం సెలవు తీసుకోకుండా కష్టపడుతున్న గౌరవ ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారి గురించి ఇష్టానుసారం మాట్లాడడం బాధించింది
* మూడవసారి ప్రధానిగా శ్రీ మోదీ గారు దేశాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకు వెళ్తున్నారు
* శ్రీ మోదీ గారికి వెనుక బలంగా నిలబడదాం
* భోగాపురంలోని శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు.
#BhogapuramAirport
#ModiHonoursAlluri
#AlluriSitaramaRajuAirport
ఈ గౌ" ప్రధానమంత్రి శ్రీ @narendramodi అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
‘పరిరక్షణ నిల్వ’ ప్రాంతంగా కొండకర్ల ఆవ
•చిత్తడి నేలల పరిరక్షణలో కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం
•పర్యావరణ పరిరక్షణ, ఎకో టూరిజం అభివృద్ధి అవకాశాలు పరిశీలించాలని ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు ఆదేశం
•ప్రజా ప్రయోజనాలు దెబ్బ తినకుండా చిత్తడి నేలల సంరక్షణ చర్యలు
•చిత్తడి నేలల గుర్తింపు ప్రక్రియ వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రివర్యుల ఆదేశం
•సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా పరిరక్షణ చర్యలు
రాష్ట్రవ్యాప్తంగా చిత్తడి నేలల గుర్తింపు, పరిరక్షణ చర్యలను వేగవంతం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ-పర్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా చిత్తడి నేలల సంరక్షణను బాధ్యతగా స్వీకరించి, వాటి పరిరక్షణకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు. అనకాపల్లి జిల్లాలోని కొండకర్ల ఆవను ‘పరిరక్షణ నిల్వ’ (కన్జర్వేషన్ రిజర్వ్) ప్రాంతంగా గుర్తించే ప్రక్రియలో ముందడుగు వేసినట్టు పేర్కొన్నారు. జీవ వైవిధ్యానికి నిలయమైన కొండకర్ల ఆవను సమగ్రంగా సర్వే చేసి, అక్కడ ఎకో-టూరిజం అభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972 ప్రకారం కొండకర్ల ఆవ చిత్తడి నేలను కన్జర్వేషన్ రిజర్వ్‌గా ప్రకటించేందుకు అవసరమైన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ( NOC) జారీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. అటవీశాఖ ప్రతిపాదనలకు జలవనరుల శాఖ కూడా ఆమోదం తెలిపింది. సాగునీరు, జలాశయ నిర్వహణ, హైడ్రాలిక్ వ్యవస్థలు మరియు ఇతర ప్రజాప్రయోజన కార్యక్రమాలకు ఎటువంటి భంగం కలగకుండా తగిన రక్షణ చర్యలతో ఈ అనుమతి మంజూరైంది.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “శాస్త్రీయ అధ్యయనాలు మరియు క్షేత్రస్థాయి పరిశీలనల ఆధారంగా రాష్ట్రంలో 950 చిత్తడి నేలలను గుర్తించాం. వాటిని నోటిపై చేయాల్సిన అవసరం ఉంది. తొలి దశలో 16 చిత్తడి నేలల నోటిఫికేషన్ అనుమతుల ప్రక్రియ తుది దశలో ఉంది. చిత్తడి నేలలు అద్భుతమైన జీవ వైవిధ్యానికి నిలయాలని, వాటి పరిరక్షణ ద్వారా భూగర్భ జలాల పునరుద్ధరణ, వరదల నియంత్రణ, జల భద్రత, వాతావరణ మార్పుల ప్రభావాల తగ్గింపు సాధ్యమవుతుంది. అలాగే స్థానిక ప్రజల జీవనోపాధుల మెరుగుదలకు కూడా ఇవి దోహదపడతాయి. అందువల్ల చిత్తడి నేలల పరిరక్షణను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత అంశంగా పరిగణిస్తోంది. అర్హత కలిగిన అన్ని చిత్తడి నేలలను నోటిఫై చేసే ప్రక్రియను సంబంధిత శాఖల సమన్వయంతో వేగవంతం చేయాలి. సంయుక్త సర్వేలు పూర్తి చేసి, చట్టపరమైన అనుమతులను నిర్దిష్ట కాలవ్యవధిలో పొందాలి. అదే సమయంలో ప్రజా ప్రయోజన కార్యకలాపాలకు ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలి.
చిత్తడి నేలలపై జరుగుతున్న ఆక్రమణలు, విధ్వంసక చర్యల పట్ల కఠినంగా వ్యవహరించాలి. కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో చిత్తడి నేలల పరిరక్షణ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తోంది. కొండకర్ల ఆవ అనేక రకాల వలస మరియు స్థానిక పక్షులకు ఆవాసంగా నిలుస్తోంది. జలవనరుల శాఖ సమన్వయంతో ఎకో-టూరిజం అభివృద్ధికి ఉన్న అవకాశాలను అధ్యయనం చేసి, స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందించాల”ని అటవీశాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు.