Techie - Software Developer.
Anti Yellow/Godi/Political Media.
Follower of Eenadu, ABN from 2005-2025.
Focus on Issues rather Political Emotions!, avoid Hatred.
@eenadulivenews - What a great neutral journalism ethics. Realised after following 25 yrs!.
When allegations against MLA from YSRCP,thumbnail would be YSRCP MLA and it's Directed by his party chief whereas now,no relation to TDP
https://t.co/9keCz2uwQX vs https://t.co/yT0aNSxGMl
స్థానిక ఎన్నికలు వస్తున్నాయ్… “ఎన్ని సీట్లు ఇస్తున్నారు?” అని కొందరు అడుగుతుంటారు.
ఎన్ని సీట్లు అనేది కాదు. మన నాయకత్వం ఎక్కడ బలంగా ఉందో, అక్కడే పోటీ చేసే హక్కు మనకు వస్తుంది.
ఫ్లెక్సీలు వేసుకుంటే సరిపోదు కదా?
- @mnadendla#JSP
@Kadirodu_Offl పవన్ కళ్యాణ్ అనే ఆత్మాభిమానం కి మధ్య జరిగే ఎన్నికలు రాబోయే సార్వత్రిక ఎన్నికలు !! - does it meant TDP have no significant in next elections?. Is PK be the CM face in 2029 elections?.
Before commenting or judging someone's family matters,just check how is yours.
Don't degrade legendary leaders with filty politics personal benifits !.
The tallest legendary leader who couldn't compromised for personal or political gains!.
@Shiva4TDP@YSRCParty Shameless yellow fellows who involves in Mudragada Padmanabha garu, YSR garu and KCR family matters for political benifits,if some1 counter them back then plays victim role&campaigns every village while election campaign!.
Why political involvement in the difficult time of family
ముద్రగడ పద్మనాభం గారి మరణవార్త విని నాకు ఎంతో మనోవేదన కలిగింది.
మా మధ్య ఉన్న ఆప్యాయత, అనుబంధం, ఆయన స్నేహశీలి స్వభావం, కాపు ఉద్యమానికి ఆయన చేసిన సేవలు నాకు బాగా తెలుసు. నీతి, నిజాయితీకి మారుపేరుగా నిలిచిన అటువంటి గొప్ప వ్యక్తి ను కోల్పోవడం ఎంతో పెద్ద లోటు.
ఆయన ఆత్మకు శాంతి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
– మోహన్ బాబు
కాపు ఉద్యమ ధ్రువతారకు శ్రద్ధాంజలి..
కాపు ఉద్యమ ధ్రువతార, ప్రజాసేవకుడు, మాజీ మంత్రి, మాజీ శాసనసభ్యుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు శ్రీ ముద్రగడ పద్మనాభం గారి మరణవార్త తీవ్ర వ్యధను కలిగించింది.
ఆయన పవిత్ర ఆత్మకు సద్గతి కలగాలని, శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. 🙏
వారి కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు, అనుచరులకు, లక్షలాది మంది అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి.
ఓం శాంతి!
ఆయన మరణం సందర్భంగా, ఆయన జీవన ప్రయాణాన్ని, సమాజం కోసం చేసిన సేవలను, ముఖ్యంగా రేపటి తరానికి తెలియజేయడం బాధ్యతగా భావిస్తున్నాను
శ్రీ ముద్రగడ పద్మనాభం గారు తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి ప్రాంతానికి చెందిన ప్రముఖ ప్రజానాయకుడు. ఆయన రాజకీయ జీవితాన్ని భారత జాతీయ కాంగ్రెస్లో ప్రారంభించిన ఆయన, అనంతరం తెలుగు దేశం పార్టీలో కూడా కీలక పాత్ర పోషించారు.
శాసనసభ్యుడిగా, లోక్సభ సభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా ప్రజలకు సేవలందించారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు చేపట్టినా, చివరకు తన వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తు కంటే కాపు సమాజ హక్కుల కోసం పోరాటానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.
1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత, తొలి ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డి గారి హయాంలో ఎటువంటి అధికారిక సర్వేలు, కమిషన్ సిఫార్సులు లేకుండానే కాపు సామాజిక వర్గాన్ని బీసీ జాబితా నుండి తొలగించారు.
అంతకుముందు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రంలో అమలులో ఉన్న జాబితాల ప్రకారం కాపులు వెనుకబడిన తరగతుల జాబితాలో ఉండేవారు.
తరువాత 1961లో ముఖ్యమంత్రి శ్రీ దామోదరం సంజీవయ్య గారి హయాంలో కాపులను తిరిగి బీసీ జాబితాలో చేర్చినా, అనంతరం మళ్లీ శ్రీ నీలం సంజీవరెడ్డి గారి పాలనలో ఆ హోదా తొలగించబడింది, ఇది ముమ్మాటికీ అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గారు కాపు కులానికి ఉద్దేశ పూర్వకంగా చేసిన ద్రోహమే.
దీనిని సరిదిద్ది తిరిగి కాపులకు బీసీ గుర్తింపు తేవాలి అన్న లక్ష్యంతో శ్రీ ముద్రగడ పద్మనాభం గారు అన్ని కులాలను కలుపుకొని దశాబ్దాల పాటు రాజీలేని ఉద్యమాన్ని నడిపించారు. అనేక నిరాహార దీక్షలు, ప్రజా ఉద్యమాలు, అరెస్టులు, వ్యక్తిగత అవమానాలు ఎదురైనా ఆయన వెనక్కి తగ్గలేదు.
రాజకీయ పరిణామాల కారణంగా ఆయన వివిధ పార్టీలతో అనుబంధం కలిగి ఉన్నప్పటికీ, ముఖ్యంగా చివరి దశలో జరిగిన కొన్ని రాజకీయ పరిణామాలు ఆయన ప్రజాదరణపై ప్రభావం చూపినప్పటికీ, కాపు రిజర్వేషన్ల కోసం ఆయన చేసిన దీర్ఘకాల పోరాటం, త్యాగం, నిబద్ధతను చరిత్ర ఎప్పటికీ మాసిపోదు.
కాపు సామాజిక వర్గాన్ని తిరిగి బీసీ జాబితాలో చేర్చాలనే జీవితాశయం నెరవేరకముందే ఆయన మన మధ్య నుండి దూరం కావడం అత్యంత విషాదకరం.
ఆయన ఆశయ సాధనే ఆయనకు నిజమైన నివాళి. కాపు సమాజానికి జరిగిన చారిత్రక అన్యాయాన్ని శాస్త్రీయంగా, రాజ్యాంగబద్ధంగా పరిష్కరించే సంకల్పాన్ని ఏ ప్రభుత్వం ప్రదర్శిస్తే, ఆ సంకల్పమే ముద్రగడ పద్మనాభం గారి ఆత్మకు శాంతి చేకూర్చే నిజమైన నివాళిగా నిలుస్తుంది.
శ్రీ ముద్రగడ పద్మనాభం గారి సేవలు, పోరాట స్ఫూర్తి, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి.
ఆయనను మోసం చేసిన వాళ్ళు తెలుసుకోవలసింది ఆయన ఉద్యమం ఆయన మరణంతో ఆగదు అది మరింత బలపడి విజయం సాధిస్తుంది..
- బొలిశెట్టి సత్యనారాయణ
#కులాలను_కలిపే_ఆలోచన_విధానం
నిజాయితీకి, నిబద్ధతకు, రాజీలేని పోరాట స్ఫూర్తికి చిరునామాగా నిలిచిన సీనియర్ నాయకులు శ్రీ ముద్రగడ పద్మనాభం గారి మరణం వైయస్ఆర్సీపీ కుటుంబానికే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు తీరని లోటు.
ప్రజా జీవితంలో ఎన్నో పదవులు, అధికారాలు, సత్కారాలు, అవమానాలు, విజయాలు, పరాజయాలను సమానంగా స్వీకరిస్తూ… తన నమ్మకాల కోసం చివరి వరకు అచంచలంగా నిలబడ్డ ఆయన రాజకీయ ప్రస్థానం, ప్రజల పట్ల ఉన్న అంకితభావం ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతాయి.
వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు మరియు ఆప్తులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం.
ఓం శాంతి. 🙏💐
మా పార్టీ సీనియర్ నాయకులు, నాకు పితృసమానులైన ముద్రగడ పద్మనాభంగారి మరణవార్త నన్ను తీవ్రంగా కలచివేసింది.
ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన క్రమంగా కోలుకుంటున్నారనే వార్త మాకు ఎంతో ధైర్యాన్నిచ్చింది. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి మన మధ్యకు వస్తారని ఆశిస్తున్న సమయంలోనే ఆయన ఇలా శాశ్వతంగా దూరం కావడం అత్యంత బాధాకరం.
ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రజలకు చిరస్మరణీయమైన సేవలందించిన ముద్రగడగారు విలువలకు కట్టుబడి రాజకీయాలు చేశారు. పదవులకన్నా ప్రజలనే గొప్పగా భావించారు. తన జీవితాంతం పేదల బతుకుల్లో మార్పు కోసం తపించారు.
ముఖ్యంగా కాపు సామాజికవర్గానికి పెద్దదిక్కుగా నిలిచి, వారి సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేశారు. తాను నమ్మిన మాటకు కట్టుబడి నిలబడే తత్వం, మంచికోసం ఎంతదూరమైనా వెళ్లే ధైర్యం ఆయన సొంతం. ఆత్మగౌరవానికి, నిజాయితీకి, వ్యక్తిత్వానికి ఆయన నిలువెత్తు రూపం.
ముద్రగడగారి మరణం ఆయన కుటుంబానికే కాదు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఆయనను అభిమానించే లక్షలాది మందికి తీరని లోటు.
ఈ విషాద సమయంలో ఆయన కుటుంబసభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని, ముద్రగడగారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముద్రగడగారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను.
@CuriousSwaroop కరప్టెడ్ లేదా కంప్రమైజ్డ్ అయ్యే మైండ్ సెట్ ఉంటే 2014-19 or 2019-24 గొవెర్న్మెంట్స్ లో ఏదేనా మంచి మినిస్టర్ పదవి వచ్చి ఉండేది!!!
ఒక గవర్నమెంట్ మీద ప్రెషర్ చేసి GO తెప్పించిన హిస్టరీ అథాని సామర్థ్యం !!.
సమాజానికి ఎంతో ఇచ్చి,తనకంటూ ఏమీ మిగుల్చుకోని గొప్ప నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు.
ప్రజా జీవితంలో నిజాయతీ,నమ్మకం,గౌరవం, ఆత్మాభిమానం,అవమానాలకు తల ఒగ్గని ధీరత్వం,అపారమైన సహనం,పేదల పట్ల అంతులేని మమకారం వంటి పదాలకు– తమ జీవితంలో ఆచరణ ద్వారా అర్థం చెప్పిన ఆ మహనీయుడికి నా అశ్రు నివాళి.
మా పార్టీ సీనియర్ నాయకులు, నాకు పితృసమానులైన ముద్రగడ పద్మనాభంగారి మరణవార్త నన్ను తీవ్రంగా కలచివేసింది.
ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన క్రమంగా కోలుకుంటున్నారనే వార్త మాకు ఎంతో ధైర్యాన్నిచ్చింది. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి మన మధ్యకు వస్తారని ఆశిస్తున్న సమయంలోనే ఆయన ఇలా శాశ్వతంగా దూరం కావడం అత్యంత బాధాకరం.
ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రజలకు చిరస్మరణీయమైన సేవలందించిన ముద్రగడగారు విలువలకు కట్టుబడి రాజకీయాలు చేశారు. పదవులకన్నా ప్రజలనే గొప్పగా భావించారు. తన జీవితాంతం పేదల బతుకుల్లో మార్పు కోసం తపించారు.
ముఖ్యంగా కాపు సామాజికవర్గానికి పెద్దదిక్కుగా నిలిచి, వారి సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేశారు. తాను నమ్మిన మాటకు కట్టుబడి నిలబడే తత్వం, మంచికోసం ఎంతదూరమైనా వెళ్లే ధైర్యం ఆయన సొంతం. ఆత్మగౌరవానికి, నిజాయితీకి, వ్యక్తిత్వానికి ఆయన నిలువెత్తు రూపం.
ముద్రగడగారి మరణం ఆయన కుటుంబానికే కాదు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఆయనను అభిమానించే లక్షలాది మందికి తీరని లోటు.
ఈ విషాద సమయంలో ఆయన కుటుంబసభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని, ముద్రగడగారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముద్రగడగారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను.
సమాజానికి ఎంతో ఇచ్చి, తనకంటూ ఏమీ మిగుల్చుకోని గొప్ప నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు.
ప్రజా జీవితంలో నిజాయతీ, నమ్మకం, గౌరవం, ఆత్మాభిమానం, అవమానాలకు తల ఒగ్గని ధీరత్వం, అపారమైన సహనం, పేదల పట్ల అంతులేని మమకారం వంటి పదాలకు– తమ జీవితంలో ఆచరణ ద్వారా అర్థం చెప్పిన మన స్వాతంత్య్ర సమర యోధుల కోవకు చెందిన అరుదైన అగ్ర శ్రేణి నాయకుడు, మానవతా మూర్తి మన ముద్రగడ గారు.
ప్రజా జీవితంలో అత్యున్నత నైతిక విలువలకు ఆయనే పెద కాపు!
ఆ మహాయోధుడి మరణంతో విలువల రాజకీయాల్లో ఒక గొప్ప శకం ముగిసినట్టు అయింది.
ఆ మహనీయుడికి నా అశ్రు నివాళి.