ఢిల్లీ : సహచర తెలంగాణ బీజేపీ ఎంపీలతో కలిసి కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ & రైతు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ శివరాజ్ సింగ్ చౌహన్ (@ChouhanShivraj) గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన (#PMGSY) కింద తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని గ్రామీణ రహదారులను మంజూరు చేయాలని, అలాగే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (#PMAY) కింద అర్హులైన పేద కుటుంబాలకు అధిక సంఖ్యలో గృహాలను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశాము.
తెలంగాణ గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, పేదల సొంత ఇంటి కల సాకారం కోసం కేంద్ర ప్రభుత్వం మరింత సహకారం అందించాలని కోరాము.
ఈ సమావేశంలో నాతో పాటు ఎంపీలు శ్రీమతి @Aruna_DK గారు, శ్రీ @RaghunandanraoM గారు, శ్రీ @nageshgodam గారు, శ్రీ @KVishReddy గారు ఉన్నారు.
గౌతమ్ నగర్ RUB నిర్మాణానికి
రూ.34 కోట్ల కేంద్ర నిధులు మంజూరు!
🔸ఏళ్లుగా వేధిస్తున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం.
🔸రాష్ట్ర నిధులపై ఆధారపడకుండా పూర్తిగా కేంద్రం నుంచే నిధుల రాక.
🔸గౌరవ మల్కాజిగిరి ఎంపీ శ్రీ ఈటల రాజేందర్ గారి ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు.
🔸రోజువారీ వాహనదారులకు, స్థానిక ప్రజలకు తీరనున్న రవాణా కష్టాలు.
అభివృద్ధి వైపు అడుగులు వేయిస్తున్న ఎంపీ శ్రీ ఈటల రాజేందర్ గారికి గౌతమ్ నగర్ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు!
#EatalaRajender #MPMalkajgiri #ViksitMalkajgiri #ViksitBharat #RailwayDevelopment #GoutamNagarRUB #RUB #RailwayInfraDevelopment #NarendraModiJi #IndianRailways #SouthCentralRailways #AshwiniVaishnav
#AdminPost
Heartiest birthday greetings to the Hon’ble Chief Minister of Maharashtra, Shri Devendra Fadnavis (@Dev_Fadnavis) ji.💐💐
Your visionary leadership, dedication to progressive governance, and unwavering commitment to Maharashtra’s growth continue to inspire millions. Wishing you good health, long life, and continued success in serving the nation.
@CMOMaharashtra
కరోనా కష్టకాలంలో నేను తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య మంత్రిగా ఉన్నాను. ఆ విపత్కర పరిస్థితుల్లో అమెరికా, బ్రిటన్ లాంటి అగ్రరాజ్యాలే వణికిపోయి కన్నీళ్లు పెట్టుకున్నాయి. మన దేశంలో కూడా శవాల గుట్టలు చూస్తామని చాలామంది భయపడ్డారు. కానీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రతి వారం ముఖ్యమంత్రులు, ఆరోగ్య మంత్రులతో మాట్లాడుతూ అందరికీ కొండంత ధైర్యాన్ని ఇచ్చారు. స్వదేశీ వ్యాక్సిన్ తయారీ కోసం ఎన్నో ప్రోటోకాల్స్ పక్కనపెట్టి, కేంద్ర ప్రభుత్వం తరఫున నిధులు ఇచ్చి, స్వయంగా హైదరాబాద్ వచ్చి ఫార్మా కంపెనీలకు అండగా నిలిచారు. కేవలం మన దేశ ప్రజలకే కాకుండా ఇతర దేశాలకు కూడా వ్యాక్సిన్ అందించి భారతదేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు.
కరోనా లాక్డౌన్ సమయంలో ఏ ఒక్క పేదవాడు ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో దేశంలోని 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా రేషన్ అందించి ఆదుకున్న మానవతామూర్తి మన ప్రధాని. సంకీర్ణ రాజకీయాల అస్థిరతకు చెక్ పెట్టి, దేశానికి ఒక బలమైన, సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందిస్తూ ప్రపంచ పటంలో భారతదేశాన్ని సగర్వంగా నిలబెట్టిన ఏకైక నాయకుడు శ్రీ నరేంద్ర మోదీ గారు.
-శ్రీ @Eatala_Rajender గారు, మల్కాజిగిరి లోక్‌సభ సభ్యులు
#12YearsOfSeva
రంగారెడ్డి జిల్లా : భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ (@narendramodi) గారు దేశ స్వాతంత్ర్యానంతర కాలంలో అత్యధిక కాలం నిరవధికంగా దేశాన్ని పరిపాలించిన ప్రధానమంత్రిగా కొత్త చరిత్ర సృష్టించారు. ఆయన 4,399+ వరుస రోజుల పాలనతో జవహర్ లాల్ నెహ్రూ గారి పేరిట ఉన్న 4,398 రోజుల రికార్డును అధిగమించి భారత రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన శుభసందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఈ రోజు రంగారెడ్డి జిల్లా, ఎల్.బి. నగర్ అసెంబ్లీ నియోజకవర్గం, వనస్థలిపురం డివిజన్ లోని ఎల్లమ్మ తల్లి దేవాలయంలో పూజలు నిర్వహించి ప్రధాని నరేంద్ర మోదీ గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించి దేశ ప్రజలకు మరింత కాలం సేవలందించాలని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ పూజ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీ వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు, మాజీ అధ్యక్షులు శ్రీ సామ రంగారెడ్డి గారు, డివిజన్ అధ్యక్షులు శ్రీ క్రాంతి గౌడ్ గారు, బి. ఎన్. రెడ్డి నగర్ మాజీ కార్పొరేటర్ శ్రీ మొద్దు లచ్చి రెడ్డి గారు, మన్సూరాబాద్ మాజీ కార్పొరేటర్ శ్రీ కొప్పుల నర్సింహా రెడ్డి గారు, హయత్ నగర్ మాజీ కార్పొరేటర్ శ్రీ కళ్ళెం నవంజీవన్ రెడ్డి గారు, శ్రీమతి పద్మ రెడ్డి గారు, ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
#LongestServingElectedPMModi #12YearsOfSeva
జై తెలంగాణ ✊🏻
అమరవీరుల ఆశయసాధన కోసం ప్రతి ఒక్కరం పునరంకితమవుదాం..
జోహార్ తెలంగాణ అమరవీరులకు !!
ఎందరో అమరుల బలిదానం, సబ్బండ వర్ణాల యోగదానం, నాలుగు కోట్ల ప్రజల ఉద్యమ ఫలితమే.. ఈ మన తెలంగాణ.
రాష్ట్ర ప్రజలందరికీ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
#TelanganaFormationDay #TelanganaStatehoodDay
ధాన్యం కొనుగోలు చేయడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యింది.
- ఎంపీ శ్రీ ఈటల రాజేందర్.
రైతు గోస - బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా రైతులతో మాట్లాడిన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్.
ఇంత దుర్మార్గమైన బాధ్యతలేని ప్రభుత్వాన్ని నేను ఎక్కడా చూడలేదు. ఎప్పుడు చూడలేదు.
రైతులు శాపనార్థాలు పెడుతున్నారు.
పంటలు వేసిన తర్వాత ఏ పంట ఎన్ని ఎకరాల్లో వేశారని వ్యవసాయ శాఖ అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి అందిస్తుంది.
దానిని బట్టి ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ, గన్ని బ్యాగులు, గోదాములు, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి.
నేను కూడా మంత్రిగా పనిచేశాను ముందు జాగ్రత్తగా వ్యవహరించాము.. కానీ ఇంత బాధ్యతారాహిత్యంగా చిల్లరగా వ్యవహరించిన సందర్భంగా ఇప్పుడే చూస్తున్నాము.
మార్కెట్ యార్డులలో, ఐకెపి సెంటర్లలో, పిఎసిఎస్ సెంటర్లలో నెల.. నెలన్నర రోజులుగా మొక్కజొన్నలు, సన్‌ఫ్లవర్, వరిధాన్యం కుప్పలుగా పోసుకొని ఎదురుచూస్తున్న కూడా కొనుగోలు పూర్తికాలేదు.
ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
రక్తాన్ని చెమటగా మార్చి ఆరుగాలం పండించిన పంట వర్షం పాలు కాబోతుంది.. కంటి ముందే పంట నీళ్ల పాలు అయితే రైతు భరించలేడు.. కాబట్టి యుద్ధ ప్రాతిపదికన గన్ని బ్యాగులు, హమాలీలు, ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఏర్పాటు చేసుకొని రైతుల దగ్గర నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని హెచ్చరిస్తున్నాము.
లేనిపక్షంలో ఈ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది.
#RythuGosaBJPBharosa #AdminPost
మనకు ప్రాణం పోసి..
మన సంతోషంలో తన సంతోషాన్ని వెతుక్కుంటూ..
మనకు వెన్నంటి నిలిచి, వెలకట్టలేని ప్రేమకు నిదర్శనంగా
నిలిచేది అమ్మ..
మాతృ దినోత్సవం సందర్భంగా..
మాతృమూర్తులందరికీ శుభాకాంక్షలు
#HappyMothersDay
భారత చరిత్రలో ఒక చీకటి దినం:
మహిళా హక్కులపై ప్రతిపక్షాల గొడ్డలిపెట్టు..
మహిళా సాధికారత గురించి వేదికల మీద గంభీర ఉపన్యాసాలు ఇచ్చే కాంగ్రెస్ పార్టీ మరియు 'ఇండియా' కూటమి నాయకులారా.. మీ అసలు రంగు నేడు పార్లమెంటు సాక్షిగా బయటపడింది.
మహిళా శక్తి వందన అధినియం బిల్లు పట్ల మీ వైఖరి చూస్తుంటే, మీది 'ఇండియా' కూటమి కాదు, ఒక మహిళా వ్యతిరేక కూటమి అని స్పష్టమవుతోంది.
దేశ జనాభాలో సగభాగం ఉన్న మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ (@narendramodi) గారు తీసుకున్న చారిత్రక నిర్ణయాన్ని అడ్డుకోవడం అక్షరాలా మహిళలకు మీరు చేసిన ద్రోహం.
విపక్షాల మొండి వైఖరి వల్ల నేడు దేశ మహిళలు తమ హక్కులను కోల్పోయారు.
అడ్డుకుంది బిల్లును కాదు..
ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని.
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు, హోం శాఖ మంత్రివర్యులు శ్రీ అమిత్ షా (@AmitShah) గారు ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రతి కుంటి సాకుకు, ప్రతి ప్రశ్నకు నిండు సభలో అత్యంత స్పష్టతతో సమాధానమిచ్చారు. అయినా సరే, కేవలం రాజకీయ లబ్ధి కోసం, క్రెడిట్ రాకూడదనే అక్కస్సుతో ఈ బిల్లును అడ్డుకోవడం చూస్తుంటే, కాంగ్రెస్ నిజ స్వరూపం మరోసారి బయటపడింది.
గతం నుండి నేటి వరకు.. విచ్ఛిన్నకర రాజకీయాలే వీరికి ముఖ్యం:
అధికారంలో ఉన్నప్పుడు నిర్లక్ష్యం: దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్, మహిళా బిల్లును కేవలం ఎన్నికల మేనిఫెస్టోలకే పరిమితం చేసింది తప్ప, చిత్తశుద్ధితో అమలు చేయలేదు.
పదే పదే అదే కుట్ర: మహిళా హక్కులకు తూట్లు పొడవడం కాంగ్రెస్‌కు, వారి మిత్రపక్షాలకు ఇది మొదటిసారి కాదు.. ఇది వారు ప్లాన్ ప్రకారం రిపీటెడ్ గా చేస్తున్న కుట్ర.
నేడు అడుగడుగునా ఆటంకాలు: మోదీ ప్రభుత్వం ఒక సాహసోపేతమైన అడుగు వేస్తుంటే, మద్దతు ఇవ్వాల్సింది పోయి అడ్డుతగలడం వీరి ద్వంద్వ నీతికి నిదర్శనం.
కుట్రల కూటమి: 'ఇండియా' కూటమి నాయకులకు మహిళల అభివృద్ధి కంటే తమ రాజకీయ మనుగడే ముఖ్యమని నేటి ఘటనతో స్పష్టమైంది.
మహిళలకు ద్రోహం చేయడంలో వీరంతా ఏకమయ్యారు.
మహిళా శక్తికి అడ్డుకట్ట వేయాలని చూస్తున్న ప్రతిపక్షాలకు, కాంగ్రెస్ కూటమికి రాబోయే 2029 ఎన్నికల్లో దేశంలోని ప్రతి ఆడబిడ్డ తగిన గుణపాఠం చెప్పడం ఖాయం.
#NariShaktiVandanAdhiniyam #WomenReservationBill #DarkDayForDemocracy #AntiWomenCongress @BJP4Telangana@BJP4India
భారత రాజ్యాంగ నిర్మాతగా, భారతదేశ ఔన్నత్యాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత కీర్తి శిఖరం.. భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా.. వారి సేవలను స్మరించుకుంటూ.. ఆ మహనీయుడికి ఇవే మా ఘన నివాళులు.
#DrBRAmbedkarJayanti
కరీంనగర్ జిల్లా :
తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావాలని రామయ్యను కోరుకున్నాను.
హుజురాబాద్ నియోజకవర్గం, ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి వారి రథోత్సవంలో పాల్గొని, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నాను.
ఈ సందర్భంగా మాట్లాడుతూ :
🔸ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం శ్రీరాముడు నడయాడిన ప్రాంతంగా పేరుగాంచిన స్వయంభు దేవాలయం.
🔸వందల సంవత్సరాల క్రితం ఈ దేవాలయం కట్టబడింది.
🔸ఈ చుట్టుపక్క ప్రాంత ప్రజలందరూ వేలాది గా తరలివచ్చి సీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవం మొదలుపెట్టి రథోత్సవం వరకు గొప్పగా నిర్వహించుకుంటున్నారు.
🔸జైశ్రీరామ్ నినాదాలతో ఈ ప్రాంతమంతా దద్దరిల్లుతుంది.
🔸ఈ ఆలయాన్ని గొప్పగా నిర్మించుకోవాలని పాత ఆలయం కి సౌకర్యాలు పెంచి గ్రామస్తుల సహకారంతో గొప్ప రథాన్ని నిర్మాణం చేసుకున్నాము.
🔸ఈ ఆలయ ప్రాంగణమంతా కొన్ని కోట్ల రూపాయలతో బాగు చేయించాము.
🔸వేలాదిమంది ఇక్కడ పెళ్లిళ్లు చేసుకుంటారు, అనేక దైవిక కార్యక్రమాలు జరుపుకునేందుకు వీలుగా..ఈ ప్రాంత ప్రజలకు సౌకర్యాలు ఉండాలని రెండు పెద్ద షెడ్డులు నిర్మాణం చేయడం జరిగింది.
🔸ఒక మాటలో చెప్పాలంటే ఈ ఆలయంలో నేను ఇక్కడ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న కాలంలో గొప్పగా అభివృద్ధి చేశాము. రాబోయే కాలంలో మరింత అభివృద్ధి చేసుకుందాము.
🔸వేలమంది భక్తులు ఇక్కడికి వచ్చేలా చేయడంలో ఇక్కడ ఉన్న యాజమాన్యం తోడ్పాటు అందించాలని కోరుతున్నాము.
🔸రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ప్రజలకు మంచి జరగాలని మనస్పూర్తిగా కోరుకున్నాను.
జై శ్రీరామ్..
ఢిల్లీ : మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి, "ఖేలో ఇండియా" పథకం కింద నిధులు మంజూరు చేయాలని ఈరోజు పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని కోరాను.
🔸మేడ్చల్, రామంతపూర్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సుమారు 1500 మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
🔸విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి, శారీరక దృఢత్వానికి క్రీడలు ఎంతో దోహదపడతాయి.
🔸విద్యార్థుల సౌకర్యార్థం సదరు కళాశాల ఆవరణలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ మరియు టెన్నిస్ క్రీడల కోసం అధునాతన సింథటిక్ కోర్టులను నిర్మించాలని, అందుకు అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాను.
#KheloIndia #MalkajgiriParliament #LokSabha @LokSabhaSectt
ఈ ఏడాది సకాలంలో వర్షాలు పడాలని, పాడి పంటలతో రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..
ప్రజలందరికీ.. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు.
#HappyUgadi
History has been written in Ahmedabad! 🇮🇳
A massive congratulations to #TeamIndia for becoming the first-ever side to defend their #T20WorldCup title and lifting the trophy for the third time! From the absolute batting masterclass to a clinical, world class bowling performance, you guys owned the night.
We are so proud to be the first host nation to win this tournament!
#TeamIndia #T20WorldCup2026 @BCCI
మున్సిపల్ ఎన్నికలపై ఎంపీ శ్రీ ఈటల రాజేందర్ గారు సుదీర్ఘ కసరత్తు.
"ఈ గడ్డపై ఎగిరేది కాషాయ జెండానే"
- ఎంపీ శ్రీ ఈటల రాజేందర్.
మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీల్లో జరగనున్న ఎన్నికలపై ఎంపీ శ్రీ ఈటల రాజేందర్ గారు శ్రేణులతో కలిసి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.
🔸సుమారు 8 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో అభ్యర్థుల ఎంపిక, గెలుపు వ్యూహాలపై లోతుగా చర్చించారు.
కీలక ముఖ్యాంశాలు:
🔸మల్కాజిగిరి పరిధిలోని అలియాబాద్, మూడుచింతలపల్లి, శామీర్‌పేట (ఎల్లంపేట) మున్సిపాలిటీల్లో కౌన్సిలర్ల ఎంపికపై స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు జిల్లా అధ్యక్షులతో చర్చించారు.
🔸 గెలుపు గుర్రాలపై దృష్టి పెట్టారు..
🔸ఎంపీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పట్టారని, ప్రధాని మోదీ నాయకత్వంలోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు బలంగా నమ్ముతున్నారని ఆయన పేర్కొన్నారు.
🔸కాంగ్రెస్ పాలనలో భూకబ్జాలు, పేదల ఇళ్ల కూల్చివేతలు పెరిగాయి. భూమాఫియాకు కొమ్ముకాస్తున్న ఈ ప్రభుత్వంలో సామాన్యుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. అటు ఉనికి కోల్పోతున్న బీఆర్ఎస్కు ఓటు వేసినా ప్రయోజనం లేదని ప్రజలకు అర్థమైంది.
🔸ప్రస్తుతం ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారని, కార్యకర్తలు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి మూడు మున్సిపాలిటీలపై కాషాయ జెండా ఎగురవేయాలని ఎంపీ శ్రీ ఈటల రాజేందర్ గారు పిలుపునిచ్చారు.
#AdminPost #BJP4Telangana #BJP4India #BJP4Muncipalities
నేడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి.
స్వాతంత్ర్య సమరవీరులలో అగ్రగణ్యుడు..
అలుపెరుగని ఓటమి లేని పోరాటయోధుడు..
నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా.. ఆ మహనీయుడికి ఘనంగా నివాళులు అర్పిస్తూ..
దేశ ప్రజలందరికీ.. పరాక్రమ దివస్ శుభాకాంక్షలు.
#NetajiSubhashChandraBose #ParakramDiwas2026
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో.. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న మున్సిపాలిటీలలో ఉన్న నాయకులతో "మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని" నిర్వహించడం జరిగింది.
డివిజన్, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు.
రాజకీయ నాయకుడికి గెలవడమే అంతిమ గీటురాయి. సుపరిపాలన, ప్రజలు మెచ్చే పాలన అందించడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం. మన పరివార క్షేత్రాలు అనేక సమస్యల మీద కొట్లాడుతాయి. కానీ వాటిని పరిష్కరించే సత్తా అధికారంలోకి వస్తేనే ఉంటుంది.
అనేక సంవత్సరాల స్వప్నం 370 ఆర్టికల్ రద్దు కేంద్రంలో ప్రభుత్వం ఉండటంవల్లనే సాధ్యమైంది. రామాలయం కోసం అనేకమంది ప్రాణ త్యాగాలు చేశారు, వేలమంది జైల్లో మగ్గారు. చివరికి అది ఫుల్ ఫిల్ అయింది అంటే కేంద్రంలో మన ప్రభుత్వం ఉండటం వల్లనే.
అధికారం రాకపోతే.. మనం గెలిచిన వారి ఇంటి ముందు కాపలకాయాల్సిందే. మస్కా కొట్టి పని చేయించుకునే పరిస్థితి పోవాలంటే మనం గెలవాలి. దుర్మార్గన్ని ఆపగలిగే శక్తి అధికారానికే ఉంటుంది.
నేను ఎంపీగా గెలిచానంటే అది మీ అందరి అండతోనే.
నా 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో.. హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్క ఎంపీపీ కానీ.. ఒక్క జడ్పిటిసి కానీ.. ఒక మున్సిపల్ చైర్మన్ కానీ... నీటి సంఘాల చైర్మన్లు సింగిల్ విండో చైర్మన్లు ఏదీ ఓడిపోలేదు.
వయసు, రాజకీయ జీవితం చిన్నదే అయినా.. తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా కొట్లాడాను.. ఒక 40 ఎలక్షన్స్ కు ఇంచార్జిగా పనిచేశాను.
గెలవాలంటే మొట్టమొదటిగా.. మంచి అభ్యర్థిని ఎంపిక చేయండి. సామాజిక వర్గాల సమీకరణ మర్చిపోవద్దు. వాతావరణ కల్పన జరగాలి. ఎదుటివారికి చెమటలు పట్టించాలి. గట్టి లీడర్లను పార్టీలో చేర్చుకోవాలి.
భారతీయ జనతా పార్టీ 2 ఎంపీ సీట్లు గెలిస్తే అది ఒకటి గుజరాత్ నుంచి ఇంకోటి తెలంగాణ నుంచి.. ఇప్పుడు గుజరాత్ ఎక్కడ ఉంది తెలంగాణ ఎక్కడ ఉంది ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఒక పెద్ద మనిషి మమ్మల్ని హెచ్చరించారు.
27 ఏళ్ల తర్వాత కూడా గుజరాత్ లో మళ్లీ అధికారంలోకి వస్తే.. 45 ఏళ్ల తర్వాత కూడా తెలంగాణలో అధికారం వస్తుందో రాదో అనే సంశయంలో ఉన్నారు అని అన్నారు.
పార్టీలో చేరిన లీడర్లను గౌరవించండి అక్కున చేర్చుకోండి కాకులు గద్దల లెక్క పొడవకండి.
రాజకీయాల్లో విశాల హృదయంతో ఉండాలి, గొప్పగా ఆలోచించాలి.
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు.
బీజేపీ నేతలు కూడా అలా ఆలోచన చేయాలి.
పరిపక్వత పెరగాలి కలిసి పనిచేయాలి.
స్థానికంగా గ్రూపులు మంచివి కావు. గ్రూపులు బువ్వ పెట్టవు.
ఉన్న శక్తే తక్కువ ఇందులో గ్రూప్స్ అవసరమా ?
తెలంగాణ ఉద్యమం కోసం కాళ్ళ మీద పడి నాయకులను కాపాడుకున్నాం. వేరే పార్టీ వారిని తెచ్చుకున్నాం, ఎన్నికల్లో గెలిపించుకున్నాం.
మల్కాజిగిరి పార్లమెంట్ లో 1992 నుండి ఉంటున్న నన్ను నాన్ లోకల్ అని ప్రచారం చేస్తున్న వారిని పట్టించుకోవద్దు.
25 ఏళ్ల నుండి పార్టీని నమ్ముకునే పని చేసే నిజమైన కార్యకర్తకు పిల్లల ఫీజు కట్టే డబ్బులు కూడా ఉండవు.
పార్టీ బలంగా ఉంటే గెలవడానికి పైసలు అక్కర్లేదు.
కేవలం డబ్బుతోనే రాజకీయాలు నడవవు.
నేను పొత్తుల సద్దిని.
మోదీ (@narendramodi) గారు ప్రధానమంత్రి అయితేనే దేశం సుభిక్షంగా ఉంటుందని దేశవ్యాప్తంగా ఒక వేవ్ వచ్చింది. ఈటల రాజేందర్ వల్ల కొంచెం ఎక్కువ ఓట్లు రావచ్చు కానీ గెలిచింది మాత్రం మోదీ గారి వల్లనే. ఆ వేవ్ ను మనకు అనుకూలంగా మార్చుకోవడం వల్లనే నాలుగు లక్షల మెజారిటీ వచ్చింది.
గౌరవం పరస్పరంగా ఉండాలి. నువ్వు లీడర్లను గౌరవిస్తేనే.. నిన్ను కార్యకర్తలు గౌరవిస్తారు.
బీజేపీ అజేయమైన శక్తిగా ఎదగాలి.
నన్ను మీరు గెలిపించారు. మీ గెలుపులో ఉడత భక్తిగా సాయం చేస్తా. నా చేతులు దండం పెట్టడానికి అలవాటు పడ్డాయి. నాకు ప్రజలే దేవుళ్ళు. మీకోసం ఎన్నిసార్లయినా దండం పెడతా.
మంచికి ఎప్పుడూ గొప్ప స్థానం ఉంటుంది.
మన కొట్లాట వల్ల GHMC లో మన కార్పొరేటర్స్ కి 300 కోట్ల నిధులు వచ్చాయి. బీజేపీ లెటర్ ప్యాడ్ మీద లెటర్ పెడితే కోట్ల నిధులు వచ్చాయి.
మోదీ గారు ఎప్పుడూ నేను ఇచ్చిన అనరు, నేను సేవకుడిని మాత్రమే.. ప్రజలే యజమానులు అని అంటారు. ఇక్కడున్న సంకుచిత వాదులు మాత్రం నేను ఇచ్చిన అంటారు.
గెలుపే లక్ష్యంగా పనిచేయడం నుండి నేను మీకు అండగా ఉంటాను.
ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు శ్రీ బుద్ధి శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు శ్రీ విక్రమ్ రెడ్డి, సీనియర్ నాయకులు శ్రీ సుదర్శన్ రెడ్డి, శ్రీ నందా రెడ్డి, శ్రీ చంద్రారెడ్డి, శ్రీమతి శోభమ్మ, శ్రీ రామోజీ సురేష్, శ్రీ మోహన్ రెడ్డి, శ్రీ సుధాకర్, శ్రీమతి లక్ష్మమ్మ, శ్రీమతి శైలజ, శ్రీ వెంకటరెడ్డి, శ్రీ శ్రీనివాస్, శ్రీమతి పావని గార్లు తదితరులు పాల్గొన్నారు.
#MunicipalElections #GHMC #BJP4Telangana #BJP4LocalBodies #BJP