మీ బ్రతుకు ఏందో అందరికీ తెలుసు. చిన్న కురుస మనుషులు. నీడను చూసి భయపడేవారు.
పదవుల కోసం జీవించే వారం కాదు. నాయకుని క్రెడిబిలిటీ లేకుండా పార్టీ నిలబడదు. గ్రామాల్లో ప్రజల నోట్లో నాలుక లెక్క ఉండండి. బిడ్డ పనిమంతుడు అని చూస్తారు తప్ప.. కులం డబ్బు చూ��రు.
గుర్తించి టికెట్ ఇస్తే సరే.. లేదంటే
వార్డు మెంబర్ నుండి సర్పంచ్.
ఎంపీటీసీ నుండి ఎంపీపీ వరకు, జడ్పీటీసీ నుండి జెడ్పీ చైర్మన్ వరకు అన్నీ ప్రజల ఆశీర్వదించి గెలిపిస్తారు అనే నమ్మకం ఉంది.
బెంగటిల్ల కండి..
నేను హుజురాబాద్ వస్తా మీ గెలుపుకోసం పని చేస్తా..
పేగులు తెగేదాకా శత్రువుతో కోట్లాడుతున్నాం.. వీళ్ళు ఏం చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు.
ఈ అడ్డా మీకోసం ఉంది. ఎప్పుడంటే అప్పుడు మీరు ఇక్కడకు రావచ్చు.
నెలకు నాలుగు రోజులు హుజురాబాద్ కి వస్తాను.
రాజకీయాల్లో ఉన్నంత వరకు కాలికి ముళ్ళు గుచ్చుకుంటే పన్నుతో పీకే సర్వీస్ హుజురాబాద్ ప్రజలకు చేస్తా.
నేను రాలేదని కన్నీరు పెడుతున్నారు.. అది మన బంధం.
నామీద నమ్మకం సత్తా ఉన్నోడు నాతో ఉండండి.
సముద్రం తుఫాను వచ్చే ముందు ప్రశాంతంగా ఉంటుంది.
మౌనంగా ఉండే వాన్ని బలహీనునిగా చూడవద్దు.
పిచ్చి వేషాలు వేస్తే నష్టం ఎవరికో మీకు తెలుస్తుంది.
జోలికి రావద్దు, అడ్డు రావద్దు. (2/2)
#BJP4Telangana
హుజురాబాద్ అంటే నా కుటుంబం. నాయకుడు ప్రజలు కుటుంబంలాగ కల్చర్ మనది.
సోషల్ మీడియా నమ్ముకొని, అబద్దాల పునాదుల మీద బ్రతికే కుట్రలు కుతంత్రాల మీద కొంతమంది బ్రతుకుతున్నారు.
నాది స్ట్రెయిట్ ఫైట్, స్ట్రీట్ ఫైట్ ఉండదు. ధీరుడుతో కోట్లాడతాం.. కుట్రదారులతో కాదు. ఈ కుట్రలు ఛేదించే సత్తా ప్రజలకే ఉంటుంది మనం చిన్నవాళ్ళం.
నేను బేజాప్తా కాదు బాజప్తా యుద్ధం చేసేవాడిని.
చరిత్ర లేకుండా వర్తమానం లేదు. వర్తమానం లేనిది భవిష్యత్తు లేదు.
స్వేచ్ఛ కోసం బానిస సంకెళ్లు బద్దలు కొట్టడం కోసం ఉరికంబాలు ఎక్కారు, తూటాలకు బలయ్యారు. వారు అందించిన ఫలాలలోనే మనం జీవిస్తున్నాం.
కొంతమంది వెకిలిగాళ్ళు ఇంకెక్కడ తెలంగాణ ఉద్యమం అంటున్నారు. కానీ హుజురాబాద్ నియోజకవర్గంలో మేము చేసిన ఉద్యమం ఇంకా మా గుండెల్లో ఉంది.
78 గంటల పాటు ఉత్తర దక్షిణ భారతదేశం మధ్య రైళ్లు నిలిపివేసినం.. ఫైరింగ్ చేస్తా అంటే ఛాతీ చూపిన సహసవంతులం మేము.
చైతన్యం, ముక్కుసూటి తనంతో బరిగీసి కోట్లాడిన గడ్డ హుజురాబాద్ గడ్డ. అక్కడ నేను ఎమ్మెల్యేగా ఉన్నా.
సాహసంతో ఉద్యమాల విజయం సాధించిన గడ్డ హుజురాబాద్. మానుకోట ఉద్యమం చేసింది హుజురాబాద్ ప్రజలు. భార్య భర్తలు గుర్తుకు వస్తె ఇంటికి పోండి అన్నా పోకుంటా ఉన్నారు.
మా శ్యామ్ కి బుల్లెట్ తగిలింది.
బ్రతికించండి బ్రతికిస్తే మళ్ళీ ఉద్యమం కోసం కోట్లాడతాం అని చెప్పిన వారు మా వాళ్ళు.
మేము అక్కడినుండి ��చ్చిన వాళ్ళం. ఏమనుకుంటున్నారు.
తెలంగాణ కోసం అనేక అవమానాలు దిగమింగుకున్నాం.
కానీ పదవుల కోసం పెదవులు మూయలేదు.
మంత్రిగా ఉండి కూడా GHMC RTC కార్మికులకు మద్దతు తెలిపిన వాడు ఈటల.
ఈ సిఎంతో కొట్లాడితే ఇక్కడ ఉండలేము అని తెలిసి కూడా కోట్లడిన. 2021లో తీసివేశారు..
వందల సంఖ్యలో నాయకులు అమ్ముడు పోయినా..దళిత బంధు, గోర్లకు డబ్బులు ఇచ్చినా.. ఆరు నెలల ఎన్నికల ప్రచారం చేసిన కొట్లాడిన. తెలంగాణ ఆత్మ గౌరవం గ��లిచింది. అప్పుడే యావత్ తెలంగాణలో ఒక ఆలోచన మొదలైంది.
నా మీద అప్పటి ముఖ్యమంత్రి కుట్ర చేశారు.
ఎమ్మెల్యేగా గెలిచాక కూడా ప్రోటోకాల్ ఇవ్వకుండా రెండున్నర ఏళ్ళు హింస పెట్టారు.
ప్రజలు ఎప్పుడూ మోసం చేయరు. నాయకత్వం వారికి మార్గం చూపించాలి. అది చేయలేక ఓడిపోయాం.. మల్కాజిగిరి కి వస్తె ఇక్కడ గెలిపించారు. 70 లక్షల మంది జనాభా ఉన్నారు. ఇక్కడే తిరుగుతూ తీరికలేక రాలేకపోయా.
నా ముఖం ప్రజల గుండెల్��ో ఉంది.
శామీర్ పేట భారతీయ జనతా పార్టీ అడ్డా. ఇక్కడ ఎంపీనీ నేను.
మోదీ గారు మొదట ప్రచారం గడ్డ ఇది. పార్టీకి ఊపిరి పోసే గడ్డ.
రేపటి గెలుపుకు సంకేతం ఇచ్చే అడ్డా. ఎవడో సైకో, శాడిస్ట్ ఏదో పెడుతున్నారు.. వాడు ఎవడు, ఏ పార్టీ వాడు, ఎవరి అండతో సోషల్ మీడియాలో పెడుతున్నారు. బీ కేర్ఫుల్ కొడక.
శత్రువుతో కోట్లాడేవాన్ని. కడుపులో కత్తులు పెట్టుకొని కోట్లాడే సంస్థుతి మాకు లేదు.
సోషల్ మీడియాలో విచ్చల���ిడిగా పోస్టులు పెట్టే సంస్కృతిని అరికట్టాలి. లేదంటే నష్టం మాకు కాదు.
మీరు ఎవరు.. మీ శక్తి ఏంది.. మా శక్తి ఏంది. 2002 లో కరీంనగర్ కి వచ్చిన.. నా అడుగు పడని ఊరు లేదు. నా ఇంట్లో పొయ్యి ఎప్పుడు ఆరలేదు.
తెలంగాణ ఏర్పాటు భౌగోళికం కాదు అణగారిన వర్గాలకు ఫలితాలు అందాలని కోట్లాడే వాడిని.
ధీరుడు వెనుదిరగడు. సందర్భం వచ్చినప్పుడు బయటపడతాడు. అన్నిటినీ భరిస్తున్న. దానికీ ఒక హద్దు ఉంటుంది.
హుజురాబాద��� గడ్డ మీద ప్రతి ఊర్లో మన సర్పంచ్ ఉంటారు. నన్ను నమ్ముకున్న గడ్డ. ప్రలోభాలకు లొంగకుండా నాకోసం నిలబడ్డారు. వారిపై సంపూర్ణ విశ్వాసం ఉన్న వాన్ని.
ఎంపీకి కూడా ఎమ్మెల్యేకి వచ్చిన దానికంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి తప్ప తక్కువ రాలేదు. నేను తెరాస లో ఉన్నప్పుడు 2019 లో మోదీ గారి ప్రభంజనంలో కూడా మిగతా చోట్ల బీజేపీ మెజారిటీ వస్తె ఒక్క హుజురాబాద్ లో మాత్రమే తెరాసకి 53 వేల మెజారిటీ వచ్చింది.
నేను బీ��ేపీకి వచ్చిన తరువాత బీజేపీ కి ఎంత మెజారిటీ వచ్చిందో మీకు తెలుసు. అయినా అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
గ్రామంలో క్రెడిబులిటీ ఉన్న లీడర్ లేకపోతే పార్టీ బ్రతకదు అని నమ్మిన వాన్ని నేను.
ఈ దేశానికి మోదీ గారే దిక్కు అని ఎందుకు అంటున్నారు.. ఆయన ప్రజల హృదయాలు గెలుచుకున్నారు కాబట్టి అంటున్నారు.
వ్యక్తి ఎదగకుండా... గ్లామర్ లేకుండా పార్టీలు ఎదగవు.
నాయకుడు అంటే మానవ సంబంధాలతో ఉండాలి.
మానవ సంబంధాలు మీకేం తెలుసు. మీద మీద ఉండే డ్రామా కంపెనీ కాదు మేము.
మీ ఆవేదన అర్థం అయ్యింది
ఆత్మగౌరవం కాపాడతా. మిమ్ముల్ని గెలిపించలేనంత నిస్సహాయుణ్ణి కాదు నేను. నేను మద్యం డబ్బు నమ్ముకోలే.. ప్రజలు ధర్మం కష్టం నమ్ముకున్న వాన్ని.
ఇక్కడ నేను పార్టీకోసం పనిచేస్తున్న. నాకొడుకు, బిడ్డ ఎప్పుడైనా కనిపించారా ? నా భార్య ఎన్నికలప్పుడు మాత్రమే వస్తుంది. నాకు కుటుంబం కాదు ముఖ్యం, పార్టీ ము���్యం. (1/2)
వివిధ పార్టీల నుండి బిజెపి పార్టీలోకి యువమోర్చ ఆధ్వర్యంలో చేరుతున్న కార్యకర్తలకు & బి.జె.పి. జెండ అవిష్కరణకు విచ్చేయుచున్న. జిల్లా అధ్యక్షులు BJYM అనుజ్ఞా రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం