నేను ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో...
ఒక్కరోజు కూడా అసెంబ్లీకి గైర్హాజరు కాలేదు...
ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సిందే
వ్యక్తుల స్థాయి పుట్టుకతో రాదు...
ప్రజాజీవితంలో వారు పోషించే పాత్ర...
ప్రజల కోసం చేసే సేవతోనే వస్తుంది..
As Leader of the Opposition, I never missed a single day of the Assembly. Accountability to the people begins with respecting the House.
The present Leader of the Opposition, Shri K. Chandrashekar Rao must attend the Assembly.
True stature is not inherited it is earned through public service and commitment to the people.
Dear @revanth_anumula anna,
20 years in public life. Watching you go back to Midjil today, to the exact place where it all started, honestly it got me thinking about #Jersy . Not the cricket part. The part where a man everyone had written off, told he was too old, too late, too finished, just refused to accept that as the final answer. That film didn't just move Telangana, it moved crores of people across India, because deep down everyone's fought that same battle with self doubt at some point.
There's a line in that film that stuck with so many of us: someone who gives up has truly lost, but someone who's still trying has never really lost at all. That's your story anna, in one sentence.
A ZPTC member from Midjil, no political legacy, no godfather, no shortcuts, just conviction. So many defeats that should've ended it right there. Years of being called an outsider, doubted even inside your own party. And through all of it, one thing never moved an inch, your belief in yourself and your belief in the people who trusted you first.
Honestly that's the part that inspires me the most. Not just the courage or the grit, a lot of people have that. It's the self confidence to keep backing yourself when everything around you says you shouldn't. That same self belief which took a boy from Midjil to the Secretariat is what you hand down today to every young karyakarta who thinks their dream is too big or their beginning too small.
Here's to 20 years anna, and to many more decades of you proving that the only real defeat is quitting, and you never did.
@INCTelangana@TelanganaCMO
🙏🇮🇳 #20YearsOfRevanthReddy
From ZPTC to Chief Minister:
Revanth Reddy Political Journey
మిడ్జిల్ నుంచి ముఖ్యమంత్రి వరకు...
పోరాటం, పట్టుదల, ప్రజల విశ్వాసంతో నిర్మితమైన రేవంత్ రెడ్డి 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం
ప్రతి నాయకుడి జీవితంలో విజయాలు కనిపిస్తాయి. కానీ ప్రతి విజయానికి వెనుక ఉన్న కష్టం, అవమానాలు, పోరాటాలు, త్యాగాలు అందరికీ కనిపించవు. కొందరు రాజకీయాల్లో అధికారాన్ని వారసత్వంగా పొందుతారు.
మరికొందరు అపారమైన ఆర్థిక బలం, రాజకీయ అండతో ఎదుగుతారు. కానీ ఇంకొందరు మాత్రం ప్రజల ప్రేమ, విశ్వాసం, తమ కష్టాన్ని మాత్రమే మూలధనంగా చేసుకుని చరిత్ర సృష్టిస్తారు. అలాంటి అరుదైన నాయకుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి ఒకరు.
ఆర్థికంగా సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఒక యువకుడు... పెద్ద రాజకీయ కుటుంబం లేదు... కోట్లాది రూపాయల ఆస్తులు లేవు... రాజకీయ వారసత్వం లేదు... ఉన్నదల్లా తనపై తనకు ఉన్న నమ్మకం, ప్రజల కోసం ఏదో చేయాలనే తపన మాత్రమే.
తన జీవిత భాగస్వామి శ్రీమతి గీతా గారి అండతో కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూ, ప్రజాసేవనే జీవిత లక్ష్యంగా ఎంచుకున్నారు. అధికారం కోసం కాదు... ప్రజల కోసం రాజకీయాలను ఎంచుకున్నారు.
2006లో మిడ్జిల్ జెడ్పీటీసీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగినప్పుడు ఆయన వెనుక పెద్ద పార్టీ లేదు. అధికార యంత్రాంగం లేదు. ఎన్నికలను ప్రభావితం చేసే బలమైన వ్యవస్థ లేదు. అయినా ప్రజలు ఒక యువ నాయకుడిపై నమ్మకం ఉంచారు. ఆ నమ్మకమే ఆయనకు తొలి విజయాన్ని అందించింది. అదే రోజు తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది.
ఆ తర్వాత 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించడం సాధారణ విషయం కాదు. వరుసగా రెండు ఎన్నికల్లో పార్టీ గుర్తు లేకుండానే గెలవడం అంటే ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకోవడం ఎంత గొప్పదో చెప్పే సంఘటన.
2009లో కొడంగల్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఎదురుగా దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నాయకుడు ఉన్నాడు. కానీ ప్రజలు అనుభవం కంటే నిజాయితీని ఎంచుకున్నారు. వాగ్దానాల కంటే పోరాడే నాయకుడిని ఎంచుకున్నారు. ప్రజల ఆశీర్వాదంతో రేవంత్ రెడ్డి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో కూడా ప్రజలు మరోసారి ఆయనపై విశ్వాసం ఉంచారు. అధికారంలో లేకపోయినా... ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకగా నిలిచారు. రైతుల సమస్యలపై, నిరుద్యోగుల సమస్యలపై, విద్యార్థుల సమస్యలపై, ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడారు.
ఆ పోరాటానికి మూల్యం కూడా చెల్లించారు. రాజకీయ కక్షలు ఎదుర్కొన్నారు. అనేక కేసులు ఎదుర్కొన్నారు. జైలు జీవితం కూడా చూశారు. అధికారాన్ని ప్రశ్నించినందుకు ఇబ్బందులు ఎదురైనా, వెనక్కి తగ్గలేదు. భయపడలేదు. రాజీ పడలేదు. పదవులు కోల్పోవచ్చు... కానీ ప్రజల నమ్మకాన్ని కోల్పోవద్దనే సిద్ధాంతంతో ముందుకు సాగారు.
2018లో కొడంగల్‌లో ఓటమి ఎదురైంది. చాలామంది ఆయన రాజకీయ జీవితం ముగిసిపోయిందని భావించారు. విమర్శలు వచ్చాయి. ఎద్దేవా చేశారు. కానీ ఓటమిని ఆయన తన జీవితానికి ముగింపుగా కాదు... కొత్త ప్రారంభంగా మార్చుకున్నారు. అదే నాయకత్వం. అదే పట్టుదల.
2019లో దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజిగిరి నుంచి లోక్‌సభకు ఎన్నికై, ప్రజలు తనపై ఉంచిన విశ్వాసానికి మరోసారి న్యాయం చేశారు.
2021లో తెలంగాణ కాంగ్రెస్‌లో ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ, కాంగ్రెస్ అధిష్ఠానం రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేసింది. అది ఒక పదవి మాత్రమే కాదు... కాంగ్రెస్ పార్టీని మళ్లీ ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఎన్నో పోరాటాలు చేశారు. ప్రజా సమస్యలను జాతీయ స్థాయిలో వినిపించారు. కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ప్రత్యామ్నాయ శక్తిగా గుర్తింపు తీసుకొచ్చారు.
చివరకు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పదేళ్లుగా అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో ఓడించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఆ విజయం ఒక్క నాయకుడిది కాదు... ప్రజల విశ్వాసం గెలిచిన విజయం.
2023 డిసెంబర్ 7న తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అది ఒక వ్యక్తి ప్రమాణ స్వీకారం మాత్రమే కాదు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు తన కృషితో రాష్ట్ర అత్యున్నత పదవిని చేరుకోవచ్చని నిరూపించిన చరిత్ర.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత "ప్రజాపాలన" అనే భావనను కేవలం నినాదంగా కాకుండా కార్యాచరణగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, భారీ ఉద్యోగ నియామకాలు, పెట్టుబడుల ఆకర్షణ, పారదర్శక పాలన, సంక్షేమం–అభివృద్ధి సమతుల్యత వంటి అనేక కార్యక్రమాలతో ప్రజల ప్రభుత్వాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు.
20 ఏళ్ల ప్రస్థానం చెప్పే సందేశం
మిడ్జిల్‌లో జెడ్పీటీసీగా ప్రారంభమైన ప్రయాణం...
స్వతంత్ర ఎమ్మెల్సీ...
మూడు సార్లు ఎమ్మెల్యే...
లోక్‌సభ సభ్యుడు...
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు...
చివరకు తెలంగాణ ముఖ్యమంత్రి...
ఈ ప్రయాణం పదవుల కథ కాదు. ఇది పోరాటాల చరిత్ర. ఓటములను అవకాశాలుగా మలచుకున్న నాయకత్వం. కేసులు, జైలు, రాజకీయ కుట్రలు, విమర్శలు... ఏదీ ఆయనను ఆపలేకపోయింది.
ప్రజల విశ్వాసాన్ని సంపాదించడం కష్టమే... కానీ ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం అంతకంటే కష్టం. ఆ రెండింటినీ సాధించిన నాయకుడే రేవంత్ రెడ్డి.
మిడ్జిల్‌లో మొదలైన ఆ అడుగు... నేడు తెలంగాణ ప్రజల ఆశయాలను నెరవేర్చే ప్రజాపాలనగా మారింది.
పదవులు మనిషిని గొప్పవాడిని చేయవు...
ప్రజల విశ్వాసమే నాయకుడిని చరిత్రలో నిలబెడుతుంది. రేవంత్ రెడ్డి 20 ఏళ్ల ప్రస్థానం ఆ సత్యాన్ని మరోసారి గుర్తు చేస్తోంది.
--- ఉజ్వల్ కుమార్ రెడ్డి,
తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా & డిజిటల్ కమ్యూనికేషన్స్ కోఆర్డినేటర్
#RevanthReddy #Telangana
నేను ఉన్నది ఉన్నట్లు చెప్తా...
కాకపోతే కాదని చెప్తా...
పదవి ఎవరికి శాశ్వతం కాదు.
ఇందిరమ్మ, వైఎస్, ఎన్టీఆర్ కు ఎవరికీ పదవి శాశ్వతం కాదు. నాకు కూడా శాశ్వతం కాదు.
ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ముఖ్యం.
మేం అబద్దాల పునాదుల మీద ప్రభుత్వాన్ని నడపం.
ఇచ్చిన మాట కోసం ఎంతకైనా నిలబడతాడు అనే పేరుకోసమే ఈ ప్రయత్నమంతా
#RevanthReddy #RythuBharosa
హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో “రైతు భరోసా సదస్సు”లో పాల్గొన్నాను. వానాకాలం పంట సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో తెలంగాణ రైతాంగానికి పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించాను.
తొలి విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో 2,482.02 కోట్లు రూపాయల రైతు భరోసా నిధులను జమచేశాం.
#RythuBharosa
#TelanganaFarmers
#FarmerWelfare
#TelanganaGovernment
#PrajaPalana
#Kharif2026
మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో పదేళ్ల అరాచక పాలనతో గత పాలకులు ఆర్థిక విధ్వంసం సృష్టించారు. ప్రజా ఆశీర్వాద బలంతో అధికారం చేపట్టిన ప్రజా ప్రభుత్వం రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి సంక్షేమం వైపు నడిపిస్తుంది. అన్నదాతలకు అగ్ర తాంబూలం ఇస్తూ.. సాగుకు భరోసా కల్పిస్తోంది. నాడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు చేసిన రుణమాఫీ తప్ప.. దేశంలో ఏ ఇతర రాష్ట్రం రైతు రుణమాఫీ చేయలేదు. ఆర్థిక సంక్షోభంలో ఉన్నా.. ఏక కాలంలో రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత మన ప్రభుత్వానికే దక్కుతుంది.
శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు
వ్యవసాయ శాఖ మంత్రివర్యులు.
@Tummala_INC
#RevanthReddy
#TelanganaGovernment
#CongressForTelangana
#FarmerFirst
#FarmerWelfare
#RythuRunaMafi
#FarmLoanWaiver
#Agriculture
Rythu Bharosa for Farmers Owning Up to 2 Acres Begins Today; ₹2,482.02 Crore to Be Credited on Day One
నేడు 2 ఎకరాల వరకు “రైతు భరోసా”
💰 మొదటి రోజే ₹2,482.02 కోట్లు
👉 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ
1️⃣ ఎకరం వరకు భూమి కలిగిన
14.65 లక్షల మంది రైతులకు ₹878.94 కోట్లు
2️⃣ ఎకరాల వరకు భూమి కలిగిన
26.72 లక్షల మంది రైతులకు ₹1,603.08 కోట్లు
🌱 ఈ వానాకాలం సీజన్లో మొత్తం 73.32 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు దశలవారీగా జమ కానున్నాయి.
#RevanthReddy #RythuBharosa
“రైతు భరోసా సదస్సు”
తొమ్మిది రోజుల్లో 9 వేల కొట్ల పంపిణీ
రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం
ప్రతి రైతుకు ఎకరానికి రూ.12,000 పెట్టుబడి సాయం
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్న ప్రజా ప్రభుత్వం
తేదీ: 30-06-2026
సమయం: సాయంత్రం 4 గంటలకు
స్థలం: శిల్పకళా వేదిక, హైదరాబాద్
ప్రగతి పథం.. సకలజన హితం..
మన ప్రజా ప్రభుత్వం...
#RythuBharosa #RevanthReddy
Tomorrow at 4 PM: Revanth Reddy to Chair “Rythu Bharosa Distribution” Meeting
రేపు సాయంత్రం 4 గంటలకు: రైతు భరోసా పంపిణీ
రేపు మధిర నియోజకవర్గంలో జరగాల్సిన రైతు ఆశీర్వాద సభ వర్షాల కారణంగా రద్దయింది.
ఈ సభను రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పంపిణీ సదస్సుగా హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు సూచించారు. వెంటనే సంబంధిత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశం రేపు సాయంత్రం 4 గంటలకు జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి రైతులు తమ తమ రైతు వేదికల నుంచి ఈ సమావేశంలో పాల్గొంటారు.
CM Revanth Reddy has directed officials to organize the Rythu Bharosa distribution meeting at Shilpakala Vedika, Hyderabad, tomorrow at 4 PM. Farmers from across Telangana will participate through their respective Rythu Vedikas.
#RevanthReddy #Telangana
నా సొంత గడ్డ నల్గొండ సాక్షిగా... నా మనసుకు ఎంతో సంతృప్తినిచ్చిన రోజు ఇది.
రూ.13,006 కోట్లతో 6,092.37 కిలోమీటర్ల మేర 441 హ్యామ్ (HAM) రోడ్లకు శ్రీకారం చుట్టడం రాష్ట్ర రవాణా రంగంలో నూతన అధ్యాయానికి నాంది.
ఈ రోడ్లు కేవలం ప్రయాణ మార్గాలు మాత్రమే కాదు... మన పల్లెలను ప్రగతి వైపు నడిపించి, మన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే అభివృద్ధి బాటలు. ప్రతి గ్రామాన్ని జిల్లా కేంద్రంతో అనుసంధానం చేసి తెలంగాణను మరింత బలమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే మా ప్రభుత్వ సంకల్పం.
ఒక కుటుంబ పెద్దలా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం వంటి సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో భరోసా నింపుతూనే, మరోవైపు మౌలిక సదుపాయాల అభివృద్ధితో తెలంగాణను ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తున్నాం.
నల్గొండ బిడ్డగా నా గుండెను తొలిచే బాధ ఫ్లోరైడ్ సమస్య. దానికి శాశ్వత పరిష్కారం చూపే మన చిరకాల స్వప్నమైన ఎస్.ఎల్.బి.సి (SLBC) ప్రాజెక్టును వేగవంతం చేశాం. 2028 ఆగస్టు నాటికి సొరంగం ద్వారా నాలుగు లక్షల ఎకరాలకు కృష్ణా జలాలు అందించి ఆ లక్ష్యాన్ని సాకారం చేస్తాం. అలాగే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారి నాయకత్వంలో మూసీ నదిని ప్రక్షాళన చేసి ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాం.
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా ముందుకు సాగుతున్నాం. ప్రతి గ్రామం, ప్రతి పట్టణం అభివృద్ధి ఫలాలు అందుకునే తెలంగాణను నిర్మించడం మా బాధ్యత, మా కర్తవ్యం.
ఇది కాంగ్రెస్ ప్రభుత్వం... ఇది మీ ప్రజా ప్రభుత్వం. పారదర్శక పాలన, ప్రజా సంక్షేమమే మా ధ్యేయం.
Unable to attend today's HAM Roads foundation ceremony in Nalgonda due to a key meeting in Delhi on VB-G RAM G on behalf of the State Govt.
Regret missing the event despite my brother & colleague Minister @KomatireddyKVR Anna garu personally inviting me.
Wishing grand success to the thousands of kms of road works being launched by Hon’ble CM @Revanth_Anumula garu from Nalgonda.
With CM’s vision & Minister Komatireddy garu’s initiative, a new era for Telangana’s road development begins.
పారదర్శకతే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరిపాలన విధానం.
ప్రజా ప్రభుత్వంలో ప్రజల సొమ్ములో ఒక్క రూపాయి కూడా అవినీతికి తావులేకుండా ప్రతి వివరాన్ని పబ్లిక్ డొమైన్లో ఉంచాం. 15 ఏళ్ల నిర్వహణ బాధ్యత కూడా కాంట్రాక్టర్‌కే అప్పగించేలా ఒప్పందాలు కుదుర్చాం.
ఈ సారి బుల్లెట్ దిగుద్ది....
ఇక సూర్యాపేట మిస్ కాదు...
దామన్న మాదిరిగానే కమిట్మెంట్ ఉన్న నాయకుడు సర్వోత్తమ్ రెడ్డి
సర్వోత్తమ్ రెడ్డి కి మంత్రుల అండదండలు మెండుగా ఉన్నాయి.
మా అవసరం వస్తే మేం కూడా సహకారం అందిస్తాం.
దామన్న తనయుడు సర్వోత్తమ్ రెడ్డి గారిపై నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు
గత ఎన్నికల్లో మా దామన్న తనయుడు సర్వోత్తమ్ రెడ్డి ఇంత చురుకుగా ఉంటే సూర్యాపేట మిస్ అయ్యేది కాదని ఈసారి బుల్లెట్ దిగుద్దని ఇక సూర్యాపేట మిస్ కాదని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు.
సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దామన్న తనయుడు సర్వోత్తమ్ రెడ్డి గురించి మాట్లాడారు. దామన్న అమరత్వం పొందే వరకు ఆయన వ్యక్తిత్వాన్ని దగ్గర నుంచి చూసిన నాయకుల్లో నేను ఒకడినని దామన్నను దూరం నుంచి చూసి పులి అని భయపడేదని కానీ దగ్గర నుంచి చూస్తేనే దామన్నకు ప్రజల పట్ల ఉన్న అంకితబావం తెలిసిందన్నారు.
తనను నమ్మిన ప్రజల కోసం వందలాది ఎకరాల భూమిని, ఆస్థులను దారపోసిన ఏకైక కాంగ్రెస్ నాయకుడు దామోదర్ రెడ్డి అన్నారు. దామన్న బాటలోనే ఆయన తనయుడు సర్వోత్తమ్ రెడ్డి ప్రజలకు సేవ చేస్తానని నాన్న ఆశయాలను ముందుకు తీసుకుపోతానని ప్రజలకు అండగా ఉంటానని మీ ముందుకు వస్తున్నాడన్నారు.
విజ్ఞానవంతుడు మీ కోసం నిలబడే కమిట్ మెంట్ ఉన్న వ్యక్తి సర్వోత్తమ్ రెడ్డి అని అవినీతి రహిత పాలన అందించాలనే ఆలోచనతో వస్తున్న ఇలాంటి నాయకుడికి మనమంతా అండగా ఉండాలన్నారు.
ఉడత భక్తిగా నా నుంచి మా నకిరెకల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ 100శాతం అండగా ఉంటుందన్నారు. సర్వోత్తమ్ రెడ్డికి ఇప్పటికే ఉత్తమన్న అండ దండ మెండుగా ఉందని ఉత్తమన్న నాయకత్వంలో ముందుకు పోతుండని మా అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి చాలా చక్కగా పని చేసుకుంటూ పోతుండనే అభిప్రాయం ఉందన్నారు.
మంత్రుల అండదండలు సర్వోత్తమ్ రెడ్డి కి ఉన్నాయని ప్రజలంతా సర్వోత్తమరెడ్డిని ఆదరించి వెంట నడువాలని పిలుపునిచ్చారు.
మా స్వగ్రామం ఉరుమడ్లలోని మా నివాసంలో శ్రీ గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత పది రోజులుగా నిర్వహించిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరం ముగింపు కార్యక్రమంలో మా కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలతో కలిసి పాల్గొనడం జరిగింది.
మనిషి అవయవాలన్నింటిలో కళ్లు ఎంతో ప్రధానమైనవి. పేద ప్రజల కళ్లల్లో వెలుగులు నింపాలనే ఆశయంతో, గతంలో ఇచ్చిన హామీ మేరకు ఏర్పాటు చేసిన ఈ శిబిరం ద్వారా సుమారు 2500 మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించి, 1350 మందికి కంటి అద్దాలు, 150 మందికి ఉచిత ఆపరేషన్లు మరియు వివిధ అనారోగ్య కారణాల వల్ల మరో 118 మందికి చెన్నై శంకర్ నేత్రాలయంలో ఆపరేషన్ చేయించే ఏర్పాట్లు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అహర్నిశలు శ్రమించిన శంకర్ నేత్రాలయ వైద్య బృందానికి, వాలంటీర్లందరిక.. ఉరుమడ్ల గ్రామ మరియు చిట్యాల మండల ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు..
#SocialService