#HawalaKingBalineni నీ దాదాగిరీకి ఎక్స్ పైరీ డేట్ దగ్గర పడింది. నీ అవినీతిని ప్రశ్నిస్తే విద్యావంతులు, దళిత మేధావి, కొండెపి ఎమ్మెల్యే డాక్టర్ స్వామి గారి ఇంటిపైకి రౌడీ మూకల్ని పంపుతావా?(1/2)
Happy to see this. Naren, best wishes on this achievement and I look forward to your contributions as we build a state-of-the-art quantum valley in Amaravati.
I understand your distress and concern. I will take up the matter with the concerned authorities to ensure that all necessary assistance is provided for their safe return. @OfficeofNL will coordinate.
భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పీ వీ ఎన్ మాధవ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ప్రజా సేవే ధ్యేయంగా పని చేస్తున్న శ్రీ మాధవ్, రాబోయే రోజుల్లో మరింత ఉన్నత స్థితికి ఎదగాలని, రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను.
@MadhavBJP
Warm birthday wishes to Andhra Pradesh BJP President Shri @MadhavBJP garu. Wishing you good health, happiness and many more years of service. Happy Birthday, Madhav garu!
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజన సోదరసోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. అడవితో, ప్రకృతితో ముడిపడి ఉన్న గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు, వారి విశిష్టమైన జీవన విధానం మన సమాజానికి ఎంతో గర్వకారణం. అందుకే ఆదివాసీల విద్య, ఆరోగ్యం, ఉపాధి రంగాలు మెరుగుపరిచి వారి సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉండటం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. గిరిజనుల ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తూ, వారి స్వయంసమృద్ధి, ప్రగతే ధ్యేయంగా ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుంది. ఆదివాసీ సోదరసోదరీమణులందరికీ మరొకసారి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు.
#WorldTribalDay
Warm birthday greetings to Superstar Mahesh Babu. I wish him good health, happiness, and continued success in all his endeavours. May he have a wonderful year ahead.
@urstrulyMahesh
విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదారమ్మ పరవళ్లను, నిండు కుండలా కళకళలాడుతున్న బ్యారేజ్‌ను పరిశీలించడం ఎంతో సంతోషాన్నిచ్చింది. పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా ఈ సీజన్లో ఇప్పటివరకు 17.52 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు విజయవంతంగా తరలించాం. డెల్టాలోని తూర్పు, పశ్చిమ ప్రధాన కాలువలు, గుంటూరు ఛానల్ ద్వారా మొత్తం 7,158 క్యూసెక్కుల నీటిని పంటల సాగు కోసం విడుదల చేస్తున్నాం. ఎల్ నినో ప్రభావంతో తలెత్తిన వర్షాభావ పరిస్థితులను సమర్థవంతమైన నీటి నిర్వహణతో ఎదుర్కొంటూ, మన రైతన్నలకు సాగునీటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నాం.
రాజమండ్రిలో యువకులు తీవ్ర నిర్లక్ష్యంతో, మద్యం మత్తులో కారుతో ఢీ కొట్టిన ఘటనలో గాయపడిన వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి చెందిందనే వార్త తీవ్ర విచారం కలిగించింది. ఎంతో భవిష్యత్ ఉన్న ఒక వైద్య విద్యార్థిని ఇలా ప్రాణాలు కోల్పోవడం నన్ను కలిచివేస్తోంది. ఈ ఘటన అత్యంత బాధాకరం. ప్రియాంక మృతికి కారణమైన వారు ఇప్పటికే అరెస్టై జైల్లో ఉన్నారు. తమ నిర్లక్ష్యంతో నిండు ప్రాణం తీసిన వారికి కఠిన శిక్షలు పడేలా చూస్తాం. ఈ విషయంలో పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాము. కఠిన సెక్షన్లతో నిందితులకు శిక్షలు పడేలా చూస్తాం. బాధిత కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ... ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలియజేస్తున్నాను.
అడవితో, ప్రకృతితో ముడిపడి ఉన్న గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు గౌరవించుకునేలా నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్నాను. స్వచ్ఛమైన మనసుతో అభిమానం చూపే ఆదివాసీ బిడ్డలతో మమేకమయ్యాను. గిరిజన ప్రాంతాల్లో మౌళిక వసతులు, ఉపాధి, నైపుణ్యం పెంపు, విద్య, ఆరోగ్య రంగాల్లో అత్యుత్తమ ప్రమాణాలు నెలకొల్పేందుకు తీసుకున్న చర్యలను, ప్రభుత్వం ప్రణాళికలను వివరించాను. గిరిజన ప్రజల ఆత్మగౌరవాన్ని, హక్కులను పరిరక్షిస్తూ వారి జీవితాలు మార్చుతామని ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మరో సారి ప్రకటించాను.
#WorldTribalDay
రోడ్డు ప్రమాదంలో విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం కుమార్తె ఎండీ అఫిఫా మృతి చెందడం దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఎంతో భవిష్యత్ ఉన్న అఫిఫా 24 ఏళ్ల చిన్న వయస్సులో రోడ్ ప్రమాదం బారిన పడి అందరికీ దూరమవడం బాధాకరం. ఎండీ అఫిఫా ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. షరీన్ బేగం గారికి, కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను.
Mounika Yerramshetty Garu, I am deeply concerned to learn about Varamma's condition. @OfficeOfLN will closely follow up and ensure all necessary support is provided immediately.
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజన సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆదివాసీ సంస్కృతి అంటే ప్రకృతితో కలిసి జీవించే ఒక జీవన తత్వం. పరస్పర సహకారం, మంచితనం, మానవత్వ రూపాలు ఆదివాసీలు. ప్రజాప్రభుత్వం ఆదివాసీల సమగ్ర అభ్యున్నతితో పాటు వారి సంస్కృతి, హక్కులను పరిరక్షించడం మనందరి బాధ్యత.
#WorldTribalDay
అగ్నికుల క్షత్రియుల జాతిపిత పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించాను. గొప్ప సామాజిక సంస్కర్తగా, ఆయుర్వేద వైద్యునిగా, అగ్నికుల క్షత్రియ సమాజానికి గుర్తింపు, గౌరవం సాధించేందుకు వర్మ గారు చేసిన కృషి ప్రశంసనీయం. పొన్నమండ గారి ఆశయాలు, స్ఫూర్తిని కొనసాగించేందుకు ఆయన జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించుకుంటున్నాం. లక్ష్మణ స్వామి గారు సమాజానికి అందించిన విశిష్ట సేవలను స్మరించుకుంటూ జయంతి నివాళులు.
#NethannaSevalo
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ‘‘నేతన్నల సేవలో’’ పథకాన్ని ప్రారంభిచండం సంతోషం కలిగించింది. 71,536 చేనేత కుటుంబాలకు రూ.25 వేల చొప్పున ఆర్ధిక సాయాన్ని అందించాం. వస్త్ర తయారీ, వస్త్ర వ్యాపారంలో ప్రసిద్ది చెందిన చీరాల ప్రాంతంలో నేతన్నల సమక్షంలో రూ.179 కోట్లను విడుదల చేశాం. నేతన్నలతో ఆత్మీయ సమావేశాన్ని మరిచిపోలేను. నా చిత్రాన్ని మగ్గంపై నేసిన చేనేత దంపతులు నాగేశ్వరరావు, లక్ష్మీలతో మాట్లాడాను. ఎంతో నైపుణ్యంతో చిత్రపటాన్ని వస్త్రంపై నేసిన చేనేత దంపతులకు ధన్యవాదాలు తెలిపాను.
#AndhraCelebratesWeavers
#NationalHandloomDay