Disgusting, Sick and Shameless.
In a land that worships women as mothers and goddesses, where "Matrudevo Bhava" is not just a phrase but a part of our culture, some people have fallen so low that they are using AI to disrespect a woman in the most degrading way possible. Using AI to create something this vile is shameful beyond words.
To the scumbags behind this morphed Chuttamalle video, I will not spare any of you. I will take every possible legal action against those who created it and those who are spreading it.
Please do not watch, share or engage with such content. Today it is someone else. Tomorrow, it could be your mother, sister, wife or daughter.
This is a serious issue, and I urge all the state governments and the Government of India to act strongly and bring in strict regulations against the misuse of AI.
ఆంధ్రప్రదేశ్‌లోని భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభించబడుతుంది. ఇది అనుసంధానం, వాణిజ్యం మరియు పర్యాటకాన్ని పెంపొందించే ఒక ఆధునిక, భవిష్యత్ తరహా విమానాశ్రయం. సుస్థిరత మరియు ఇంధన సామర్థ్య సూత్రాలను ఈ ప్రాజెక్టులో పొందుపరిచారు.
రాయలసీమను రతనాల సీమగా మలుస్తున్న విజనరీ చంద్రబాబు
కరువు, ఫ్యాక్షన్ ముద్రను చెరిపి... పెట్టుబడులు, పరిశ్రమలు, నీరు, ఉద్యోగాలతో కొత్త చరిత్ర రాస్తున్న నాయకత్వం
ఒకప్పుడు "రాయలసీమ అంటే రాళ్లసీమ... కరువు సీమ... ఫ్యాక్షన్ సీమ" అనే ముద్ర ఉండేది. వర్షాభావం, సాగునీటి కొరత, వలసలు, నిరుద్యోగం, రాజకీయ హింస... ఇవే సీమకు గుర్తింపుగా మారాయి.
కానీ ఈరోజు పరిస్థితి పూర్తిగా మారుతోంది.
రాయలసీమ గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్న మాటలు స్టీల్ ప్లాంట్లు, స్పేస్ సిటీలు, డ్రోన్ సిటీలు, డిఫెన్స్ కారిడార్లు, గ్రీన్ ఎనర్జీ, భారీ పరిశ్రమలు, నీటి భద్రత, హార్టికల్చర్ హబ్, లక్షల ఉద్యోగాలు.
ఈ మార్పు వెనుక ఉన్న దార్శనికత ఒకటే... ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
ఎన్టీఆర్ ప్రారంభించిన మార్పు... చంద్రబాబు పూర్తి చేస్తున్న విజన్
రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలకు బదులుగా అభివృద్ధి రాజకీయాలను తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ.
ఎన్టీఆర్ ఆలోచనలకు కొనసాగింపుగా చంద్రబాబు గారు రాయలసీమ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని తెలుగు గంగ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, సోమశిల, స్వర్ణముఖి, పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, అవుకు టన్నెల్, పట్టిసీమ వంటి అనేక నీటి ప్రాజెక్టులను నిర్మించారు.
కృష్ణా జలాలను శ్రీశైలం నుంచి సీమకు తీసుకొచ్చి... "కరువు సీమ" అనే ముద్రను చెరిపేయడానికి పునాది వేశారు.
రెండేళ్లలో సాగునీటి విప్లవం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ సాగునీటిపై ప్రత్యేక ��ృష్టి పెట్టింది.
రెండేళ్లలోనే సాగునీటి ప్రాజెక్టులకు ₹12,484 కోట్లు
2026-27 బడ్జెట్లో మరో ₹10,000 కోట్లు
హంద్రీ-నీవాకు ₹3,873 కోట్ల వ్యయం
ప్రభుత్వం వచ్చిన తొలి 100 రోజుల్లోనే హంద్రీ-నీవా ప్రధాన కాలువ విస్తరణ, కుప్పం, పుంగనూరు బ్రాంచ్ కాలువల లైనింగ్ పూర్తి
మల్యాల ఎత్తిపోతల ద్వారా రికార్డు స్థాయిలో 52 టీఎంసీల నీరు
రాయలసీమలో 530 జలాశయాలు నింపడం
మూలపల్లి, కళ్యాణి డ్యాంలకు నీరు అందించేందుకు ₹126 కోట్లు
మడకశిర బ్రాంచ్ కాలువ విస్తరణకు ₹790 కోట్లు
గోరుకల్లు, శ్రీశైలం, తుంగభద్ర తదితర ప్రాజెక్టుల మరమ్మతులకు ₹610 కోట్లు
దీంతో కర్నూలు, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 4 లక్షల ఎకరాలకు సాగునీటి భద్రత లభిస్తోంది.
'జలధార - జలహారతి'తో భూగర్భ జలాల పునర్జన్మ
నీటి నిర్వహణలో కూటమి ప్రభుత్వం చేపట్టిన జలధార - జలహారతి దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోంది.
అన్నమయ్య జిల్లాలోనే
భూగర్భ జలాలు 8.59 మీటర్లు పెరిగాయి
ఎండిపోయిన 20 వేల బోర్లు తిరిగి జీవం పొందాయి
వ్యవసాయ విద్యుత్ వినియోగంలో ₹96 కోట్ల ఆదా
ప్రతి చెరువులో 25-50% నీటి నిల్వ
ఉద్యాన పంటలు మరో 20 వేల హెక్టార్లకు విస్తరణ
ఐదు లక్షల ఎకరాల్లో పశుగ్రాసం
రోజుకు అదనంగా లక్ష లీటర్ల పాల ఉత్పత్తి
ఇదే నమూనాను రాయలసీమలోన��� 20 వేల చెరువులకు విస్తరించారు.
వ్యవసాయంలో కొత్త దిశ
రాయలసీమను దేశంలోనే అతిపెద్ద హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది.
"రాయలసీమ మిషన్"కు లక్ష కోట్ల రూపాయల ప్రణాళిక
90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్
63% పంటలు మైక్రో ఇరిగేషన్ కింద
దేశంలోనే నంబర్-1 మైక్రో ఇరిగేషన్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్
నీటి ఆదా... దిగుబడి పెరుగుదల... రైతు ఆదాయం పెంపు... ఇదే లక్ష్యం.
పరి���్రమలతో సీమ ముఖచిత్రం మారుతోంది
ఒకప్పుడు ఉద్యోగాల కోసం యువత హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలకు వెళ్లాల్సి వచ్చేది.
ఇప్పుడు పరిశ్రమలే రాయలసీమకు వస్తున్నాయి.
కూటమి ప్రభుత్వం
₹4.63 లక్షల కోట్ల పెట్టుబడులు
239 పరిశ్రమలు
4.11 లక్షల ఉద్యోగాలు
లక్ష్యంగా ముందుకెళ్తోంది.
స్పేస్ సిటీ... డ్రోన్ సిటీ... డిఫెన్స్ సిటీ
దేశంలోనే మొదటిసారిగా
స్పేస్ సిటీ
డ్రోన్ సిటీ
డిఫెన్స్ తయారీ కేంద్రాలు
రాయలసీమలో ఏర్పడుతున్నాయి.
డ్రోన్ సిటీ
కర్నూలు, అనంతపురంలో 600 ఎకరాల్లో
Algobotics
Drogo
Latrics
Sensel Maze
JDK Fly
Sarla Aviation
Spacefields
వంటి సంస్థలు ఇప్పటికే అడుగుపెట్టాయి.
సత్యసాయి జిల్లా... ఏరోస్పేస్ హబ్
రూ.15,800 కోట్లతో
Aircraft Integration & Flight Testing Centre
ఇక్కడే ఏర్పాటు అవుతోంది.
ఇక్కడే
AMCA యుద్ధ విమానాల తయారీ
డిఫెన్స్ ఎకోసిస్టమ్
డ్రోన్ పరిశ్రమలు
అభివృద్ధి చెందనున్నాయి.
దీని చుట్టూ మరో ₹1 లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.
అదే జిల్లాలో
భారత్ ఎలక్ట్రానిక్స్
HFCL
KSSL
JK Mini Aerospace
Astrobase Space
వంటి అనేక సంస్థలు వస్తున్నాయి.
���్పేస్ సిటీగా తిరుపతి
తిరుపతిలో
Ethereal Exploration
Skyroot Aerospace
వంటి సంస్థలు రాకెట్ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి.
సోలార్ శక్తికి కేంద్రంగా రాయలసీమ
మూడేళ్లలో 50 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది.
అందులో భాగంగా
Premier Energies
Websol
Voltsun Labs
Agastya Energy
Gridon
SAEL
వంటి సంస్థలు భారీ పెట్టుబడులు పెడుతున్నాయి.
స్టీల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో భారీ పెట్టుబడులు
రాయలసీ���లో ఇప్పటికే లేదా నిర్మాణంలో ఉన్న ముఖ్య ప్రాజెక్టులు:
JSW రాయలసీమ స్టీల్ ప్లాంట్ – ₹16,350 కోట్లు
JSW సోలార్ క్యాప్టివ్ పవర్ – ₹20,350 కోట్లు
Hero MotoCorp Global Parts Centre
Royal Enfield
Apollo Tyres విస్తరణ
Carrier Global
LG Electronics
Greenko
IndiChip Semiconductors
Chinta Green Energy
Adani Green Energy
వంటి ప్రాజెక్టులు వేలాది ఉద్యోగాలను తీసుకువస్తున్నాయి.
రోడ్లు... విమానాశ్రయాలు... కనెక్టివిటీ
రాయలసీమ అభివృద్ధికి మౌలిక వసతులే బలమని భావించిన ప్రభుత్వం
₹39,058 కోట్లతో 48 జాతీయ రహదారులు
1,441 కి.మ��. రహదారి నిర్మాణం
రెండేళ్లలోనే 504 కి.మీ. పూర్తి
అమరావతి–అనంతపురం గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే పునఃప్రారంభం
కడప, కర్నూలు విమానాశ్రయాల అభివృద్ధి
కుప్పం విమానాశ్రయానికి సన్నాహాలు
కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు వేగం
వంటి చర్యలు చేపట్టింది.
సంక్షేమం కూడా సమాన ప్రాధాన్యం
అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా కొనసాగుతోంది.
తల్లికి వందనం
16.46 లక్షల మంది విద్యార్థుల కోసం
₹2,867.54 కోట్లు
అన్నదాత సుఖీభవ
17.35 లక్షల మంది రైతులకు
₹3,241 కోట్లు
ఆటో డ్రైవర్ల సేవలో
74 వేల మంది డ్రైవర్లకు
₹111.3 కోట్లు
మత్స్యకారుల సేవలో
3,157 కుటుంబాలకు
₹12.01 కోట్లు
రాయలసీమ ఇక వలసల ప్రాంతం కాదు... అవకాశాల ప్రాంతం
ఒకప్పుడు
నీటి కోసం పోరాటం
ఉద్యోగాల కోసం వలసలు
పరిశ్రమల లేమి
కరువు
ఫ్యాక్షన్
అనే మాటలు వినిపించేవి.
ఈరోజు
స్పేస్ సిటీ
డ్రోన్ సిటీ
స్టీల్ ప్లాంట్
సెమీకండక్టర్
గ్రీన్ ఎ��ర్జీ
ఏరోస్పేస్
డిఫెన్స్
హార్టికల్చర్ హబ్
భారీ జాతీయ రహదారులు
నీటి భద్రత
లక్షల ఉద్యోగాలు
అనే పదాలు వినిపిస్తున్నాయి.
రాయలసీమ అభివృద్ధి ఒక్క ప్రాజెక్టుతో సాధ్యమయ్యేది కాదు. నీరు, వ్యవసాయం, మౌలిక వసతులు, పరిశ్రమలు, సాంకేతికత, విద్య, సంక్షేమం - ఈ అన్ని రంగాలను ఒకేసారి ముందుకు తీసుకెళ్లే సమగ్ర దృష్టి అవసరం. ఆ దిశగా కూటమి ప్రభుత్వం రాయలసీమను అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తోందని ఈ ప్రాజెక్టులు, పెట్టుబడులు, మౌలిక వసతుల కార్యక్రమాలు సూచిస్తున్నాయి.
"రాళ్లసీమ"గా ముద్రపడిన ప్రాంతాన్ని "రతనాల సీమ"గా, కరువు గుర్తింపును అవకాశాల గుర్తింపుగా మార్చాలనే విజన్‌తో సాగుతున్న ఈ ప్రయాణం, రా��లసీమ భవిష్యత్తును కొత్త దిశగా తీసుకెళ్లే ప్రయత్నంగా నిలుస్తోంది.
@ncbn @naralokesh
#RayalaseemaRising
#ChandrababuNaidu
#NaraLokesh
#Rayalaseema
#RayalaseemaRising#RayalaseemaSteelPlant
రాయలసీమ రైజింగ్ ... స్వర్ణయుగం ప్రారంభమైంది.
రాయలసీమ అంటే తిరుమల వెంకన్న, శ్రీశైలం మల్లన్న, ఒంటిమిట్ట రామన్న గుర్తుకు వచ్చేవారు. వీటితోపాటు ఇప్పుడు రాయలసీమ అంటే హార్టికల్చర్ అద్భుతాలు, అరుదైన ఖనిజాలు, స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్ కూడా గుర్తుకు వస్తున్నాయి.
#ChooseSpeedChooseAP
#ChandrababuNaidu
#AndhraPradesh
#RayalaseemaRising#RayalaseemaSteelPlant
రెండు దశాబ్దాల రాయలసీమ ప్రజల కల ఈరో���ు నెరవేరింది. సీమ ఖనిజ సంపద... సీమ అభివృద్ధికే వినియోగించాలన్న ప్రజా ప్రభుత్వ సంకల్పాన్ని సున్నపురాళ్లపల్లిలో 'జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్' పనులు ప్రారంభించి నిజం చేశాం. దీనికి అనుబంధంగా 'నియో ఎనర్జీ సోలార్ క్యాప్టివ్ పవర్ ప్రాజెక్టు'కు, అలాగే విజయనగరం జిల్లాలోని 'జేఎస్‌డబ్ల్యూ పారిశ్రామిక పార్కు'కు కూడా శంకుస్థాపన చేసుకున్నాం. గత ప్రభుత్వంలో కేవలం శంకుస్థాపనలతో స��ిపెట్టి ప్రజలను మభ్యపెడితే... మేం పనులు మొదలుపెట్టి రాయలసీమ స్టీల్ ప్లాంటుకు వాస్తవరూపం ఇస్తున్నాం. 2028 నాటికి ఉత్పత్తి లక్ష్యంగా ప్లాంట్ నిర్మాణం పనులు ఈరోజు నుంచి జరు��ుతాయి. స్టీల్ ప్లాంట్ రాకతో కడపజిల్లా వేగంగా అభివృద్ధి చెందడమే కాకుండా, వేలాది మంది యువతకు ఉద్యోగాలు దక్కుతాయి. అటు విశాఖ స్టీల్ ప్లాంట్, ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్... ఇటు జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్‌తో ఆంధ్రప్రదేశ్‌ను ఉక్కు రాష్ట్రంగా మారుస్తున్నాం.
@TheJSWGroup
కరవు కథలు రాసిన నేల... ఇప్పుడు కలల్ని సాకారం చే��్తున్న నేల...
నీటి ప్రతి చుక్కలో ఆశ ఉంది...
రైతు ప్రతి చెమట చుక్కలో భరోసా ఉంది...
రోడ్డు ప్రతి కిలోమీటరులో అభివృద్ధి ఉంది...
పరిశ్రమ ప్రతి అడుగులో యువత భవిష్యత్తు ఉంది...
పెట్టుబడి ప్రతి రూపాయిలో ఉపాధి ఉంది...
రాయలసీమ ప్రతి విజయగాథలో విజనరీ నాయకత్వం ఉంది...
'రాయల' నాటి వైభవాన్ని... 'రాయల్' సీమగా మలుస్తూ,
స్వర్ణాంధ్ర నిర్మాణంలో రాయలసీమను అభివృద్ధికి కొత్త చిరునామాగా తీర్చిదిద్దుతోంది కూటమి ప్రభుత్వం.
#RayalaseemaRising
#ChandrababuNaidu
#NaraLokesh
#Rayalaseema
రౌడీయిజాన్ని నమ్ముకున్న గొడ్డలి పార్టీ అనేక భూ వివాదాలకు తెరలేపింది. తరతరాలుగా ఉన్న భూములను కూడా గొడ్డలి పార్టీ నేతలు గుంజుకోవాలని చూశారు. ప్రజల భూములకు సంబంధించిన పట్టాదార్ పాస్ పుస్తకాలపై గొడ్డలి పార్టీ నేత ఫొటోలు ముద్రించారు. ఆ ఫొటోలను తొలగించి, రాజముద్రతో కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలను అందించాం.
#RayalaseemaRising
#CBNInKuppam
#ChandrababuNaidu
#PsychoFekuJagan
#AndhraPradesh
కుప్పంలో 3 రోజుల నా పర్యటన ఎంతో ఉత్సాహంగా, సంతృప్తికరంగా సాగింది. ప్రశాంతమైన, స్వచ్ఛమైన కుప్పంలో పర్యటన కొత్త శక్తినిచ్చింది. దశాబ్దాల తరబడి పెండింగులో ఉన్న కంగుంది భూ సమస్యలకు శాశ���వత పరిష్కారం చూపాం. వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే రూ.9322 కోట్ల విలువైన 30 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాం. వ్యవసాయం, ఫౌల్ట్రీ, తయారీ రంగంలో అవకాశాలకు నాంది పలికాం. స్వర్ణ కుప్పం సాకారం చేయడానికి... సరికొత్త కుప్పాన్ని ఆవిష్కరించడానికి సమగ్రమైన విజన్ సిద్ధం చేస్తున్నాం. ఒకప్పుడు మారుమూల ప్రాంతంగా ఉన్న కుప్పం... రానున్న రోజుల్లో దేశానికే మోడల్ నియోజకవర్గంగా నిలుస్తుంది.