I have seen all your reactions and responses. I’ve received all your love and equally enjoyed your hilarious trolls. I’m heartwarmed by the way audience have owned the film, and also learnt from the flaws that critics and reviewers have pointed out.
Thank you for everything is all I can say.
We have made #TheParadise with a lot of blood and sweat to give you a unique experience, and it’s all yours to celebrate or judge.
With the excitement you had for the film and the affection you showed on me, I am filled with gratitude ♥️
Nani
వేగం పుంజుకున్న పల్నాడు–ప్రకాశం ‘జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధార’ మెగా తాగు నీటి పథకాల పనులు
•40 శాతానికి పైగా పూర్తయిన ఇన్ టేక్ వెల్స్ – 200 కి.మీ. పైప్లైన్ నిర్మాణం పూర్తి
•పనుల్లో మరింత వేగం పెంచాలి
ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయి… తాగు నీటి ఎద్దడి ఎదుర్కొనే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
- ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు ఆదేశం
•పనుల నాణ్యతను క్షేత్ర స్థాయిలో స్వయంగా పరిశీలిస్తానన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు
•నిర్ణీత గడువులోపు ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించే లక్ష్యంతో పని చేయాలని సూచన
•జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టుల పురోగతిపై ఆర్.డబ్య్లూ.ఎస్. అధికారులతో సమీక్ష
ఎల్ నినో ప్రభావంతో ఏర్పడిన తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో ఈసారి రాష్ట్రవ్యాప్తంగా అధిక ప్రాంతాలు తాగునీటి ఎద్దడి సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉందని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులను ఆదేశించారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉండే పల్నాడు–ప్రకాశం లాంటి ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని దిశా నిర్దేశం చేశారు. జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధార పథకంలో భాగంగా పల్నాడు–ప్రకాశం ప్రాంతాల్లో చేపట్టిన మెగా వాటర్ గ్రిడ్ పథకాల పనులు నిర్ణీత గడువులోపు పూర్తి కావాలని ఆదేశించారు. బుధవారం పల్నాడు–ప్రకాశం మెగా వాటర్ గ్రిడ్ పథకాల పనుల పురోగతిపై గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా పనుల పురోగతిని ఆర్.డబ్ల్యూ.ఎస్. అధికారులు వివరించారు. రెండు మెగా ప్రాజెక్టుల అంచనా వ్యయం దాదాపు రూ. 2,500 కోట్లు కాగా, అందులో రూ. 1,290 కోట్ల అంచనా వ్యయంతో ప్రకాశం జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో, 593 ఆవాసాలకు తాగునీరు అందించే లక్ష్యంతో ప్రారంభించిన ప్రకాశం మెగా వాటర్ గ్రిడ్ పథకానికి సంబంధించి ఇంటేక్ వెల్ నిర్మాణం పనులు 40 శాతానికి పైగా పూర్తయ్యాయి. 119 మిలియన్ లీటర్ల నీటి శుద్ధి ప్లాంట్ పనులు, సంపులు, గ్రౌండ్ లెవల్ బ్యాలెన్స్డ్ రిజర్వాయర్ పనులు పురోగతిలో ఉన్నాయి. ప్రకాశం వాటర్ గ్రిడ్ పథకం కింద ఇప్పటి వరకు 53 కిలోమీటర్ల మేర పైపు లైన్ల నిర్మాణం పూర్తి చేసినట్టు వివరించారు.రూ. 1,200 కోట్లతో చేపట్టిన పల్నాడు వాటర్ గ్రిడ్ పథకాన్ని 235 ఆవాసాలకు తాగునీరు అందించే లక్ష్యంతో ప్రారంభించగా, ఇప్పటికే 152 కిలోమీటర్ల మేర పైపు లైన్ నెట్వర్క్ పూర్తయ్యింది. ఇన్ టేక్ వెల్స్, రిజర్వాయర్లు, ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం పనులు కూడా పురోగతిలో ఉన్నట్టు తెలిపారు. ఇప్పటికే రూ. 95 కోట్లు విలువ చేసే పనులు పూర్తి చేసినట్టు తాగునీటి సరఫరా విభాగం అధికారులు వివరించారు.
అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “తాగు నీటి సమస్యతో ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులుపడుతున్న పల్నాడు, ప్రకాశం ప్రాంతాల ప్రజలకు ఈ ప్రాజెక్టులు జీవనాధారంగా మారనున్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో జల్ జీవన్ మిషన్ కింద చేపట్టిన అమరజీవి జలధార మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులు చాలా కీలకమైనవి. వీటి నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నిర్ణీత గడువులోపు ఈ రెండు ప్రాజెక్టులను పూర్తి చేసి, లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి ఇంటికీ తాగు నీటి సౌకర్యం అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టాలి. గ్రామాల మధ్య పైపు లైన్ల నిర్మాణం, అటవీ అనుమతులు లాంటి సమస్యలు ఉంటే తక్షణం పరిష్కరించుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయండి.
పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా నిర్మాణ కార్యకలాపాలను సాధ్యమైనంత వేగంగా ముందుకు తీసుకువెళ్లాలి. భుజం శస్త్ర చికిత్స నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత పనుల పురోగతిని పరిశీలించేందుకు క్షేత్ర స్థాయి పర్యటనలు చేపడతాను. స్వయంగా పనుల నాణ్యతను పరిశీలిస్తా. జల్ జీవన్ మిషన్ పనుల్లో అలసత్వానికి తావివ్వొద్దు. పల్నాడు, ప్రకాశం మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులు పూర్తయితే ఈ రెండు ప్రాంతాల పరిధిలోని సుమారు 10 నియోజకవర్గాల పరిధిలో 16 లక్షల మందికి పైగా ప్రజలకు శాశ్వత తాగునీటి భద్రత ఏర్పడుతుంద”న్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లా పశ్చిమ ప్రాంతానికి తాగునీటి భరోసా
ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ప్రత్యేక పర్యవేక్షణలో రూ.2,370 కోట్ల జేజేఎం - అమరజీవి జలధారల చిత్తూరు మెగా వాటర్ ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
🔸 18 మండలాలు • 3,163 ఆవాసాలు • 25 లక్షల మంది ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు
🔸 130 కి.మీ. పైప్లైన్ నిర్మాణం పూర్తి
🔸 167 పనులు వివిధ దశల్లో పురోగతిలో
🔸 ఇంటేక్ వెల్, నీటి శుద్ధి కేంద్రాలు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నిర్మాణం కొనసాగుతోంది
తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం… ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన తాగునీటి భరోసా.
Panchayat Raj & Deputy Cheif Minister Shri @PawanKalyan garu initiative
• 6.50 crore foundation laid for a bridge and road across the Champavathi River at Marivalsa, Vizianagaram.
• New Panchayat Bhavan at Marivalsa inaugurated. Minister @SKondapalliOffl
దశాబ్దాలుగా కలుషిత నీటి వల్ల దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధుల (క్రానిక్ కిడ్నీ డిసీజ్) బారిన పడుతున్న ఎన్టీఆర్ జిల్లా, ఏ. కొండూరు మండల ప్రజల కష్టాలను తీర్చిన గౌరవ ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
గిరిజన తండాలతో కలిపి 21 గ్రామ పంచాయతీల పరిధిలోని 38 ఆవాసాలకు చెందిన సుమారు 75,000 మంది ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడానికి రూ. 49.94 కోట్ల వ్యయంతో జల్ జీవన్ మిషన్ - అమరజీవి జలధార తాగునీటి ప్రాజెక్టును పూర్తి చేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు.
#PawanKalyanMarkGovernance
భూగర్భ జలాల కలుషితం వల్ల దశాబ్దాలుగా తాగు నీటి సమస్యలు ఎదుర్కొంటున్న ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలానికి జల్ జీవన్ మిషన్ ద్వారా రూ. 49.94 కోట్లతో ప్రాజెక్టు పూర్తి చేసి ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించిన గౌ|| ఉపముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ @PawanKalyan గారు.
#PawanKalyanMarkGovernance
The one leader for ages.
The one man who listens people' unseen problems.
The one power who act on problems with efficient usage of people's money.
#HBDJanaSenaniPawankalyan
Birthday greetings to Shri Pawan Kalyan Garu. He is widely respected among the people and is at the forefront of adding momentum to the good governance agenda of the NDA in Andhra Pradesh. May he be blessed with a long and healthy life in service of society.
@PawanKalyan
Birthday wishes to the Hon'ble Deputy Chief Minister of Andhra Pradesh and JanaSena Party Chief Sri @PawanKalyan garu.
We pray God to bless him with health and longevity for the welfare and development of the Telugu people.
#HBDJanaSenaniPawanKalyan
#HBDJanaSenaniPawanKalyan#Kerala#GenZ
Kerala Gen-Z stands with JanaSena & Pawan Kalyan!
కేరళలోని NIT కాలికట్కు చెందిన 300 మందికి పైగా విద్యార్థులు జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలను ముందస్తుగా ఘనంగా నిర్వహించారు.
యువతలో ఆయనపై ఉన్న అభిమానానికి, ప్రజాసేవ పట్ల ఆయనకున్న అంకితభావానికి ఇది నిదర్శనం. నిజాయితీ, ధైర్యం, సామాజిక బాధ్యతతో ప్రజల కోసం నిరంతరం పోరాడుతున్న నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు దేశవ్యాప్తంగా యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.