Member - AP State Commission for Protection of Child Rights (2017-2020,2026-present), Govt of Andhra Pradesh || Educationalist || Lawyer || Fan of @ncbn
Honoured to attend World Day Against Child Labour programme at Guntur Collectorate as Chief Guest. Joined the Joint Collector in the flag hoisting ceremony. Glad to see active participation from departments, NGOs, and children raising their voices for a child labour-free society.
ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికై సుదీర్ఘ కాలం ప్రధాని కొనసాగుతున్న శ్రీ నరేంద్ర మోదీ ని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు అభినందించారు. రికార్డు స్థాయిలో ప్రధానిగా 12 ఏళ్ల ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న శ్రీ నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఢిల్లీలో ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశంలో పాల్గొన్నారు.
@ncbn@narendramodi@PMOIndia
#LongestServingElectedPMModi
Some leaders govern a nation. A few reshape its trajectory. Hon’ble Prime Minister Shri Narendra Modi ji’s 4,399 consecutive days in office have been defined by a singular effort to transform India at every level, from the everyday lives of its citizens to the nation’s standing in the world.
Today, as he becomes India’s longest-serving Prime Minister, we celebrate not merely a record, but a period of change that has touched every corner of the country.
From a water tap in a humble home to Chandrayaan reaching the Moon, from the aspirations of a farmer in the field to the courage of a soldier on the border, his leadership has sought to ensure that the benefits of progress reach every Indian while strengthening the nation’s confidence and capabilities.
A defining feature of this journey has been the balance between welfare and development. By combining support for the most vulnerable with reforms that have expanded opportunity, accelerated growth, and strengthened India’s economic foundations, he has shown that compassion and ambition can go hand in hand.
India today is more confident in its future, more ambitious in its goals, and more determined in its pursuit of excellence.
On behalf of my people of Andhra Pradesh, I extend my heartfelt congratulations to Hon’ble Prime Minister Shri Narendra Modi ji on this remarkable milestone. We remain committed to building Swarna Andhra and contributing to the realization of his vision of Viksit Bharat.
@narendramodi
#HappyBirthdayNBK
సినీ, రాజకీయ, సేవా రంగాలలో సరి కొత్త రికార్డులు సృష్టిస్తూ అజేయంగా ముందుకు వెళుతున్న పద్మభూషణుడు, హిందూపురం శాసనసభ్యుడు, నా ఆప్తుడు నటసింహం నందమూరి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు. ఐదు దశాబ్దాలుగా సినీ వినీలాకాశంలో ధ్రువతారగా వెలుగొందుతూ, మాతృమూర్తి పేరుతో నెలకొల్పిన బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా అశేష జనానికి ఆపన్నహస్తం అందిస్తూ, హిందూపురం ప్రజలకు అండగా నిలుస్తూ మీరు సాగిస్తున్న జీవనయానం నిరంతరంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. నవరస నటనా సార్వభౌముడు, తెలుగువారి అన్న నందమూరి తారక రామారావు గారి దివ్య ఆశీస్సులు మీపై కలకాలం ఉండాలని కోరుకుంటూ మరొక్క మారు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు దుర్మరణం పాలయ్యారని తెలిసి కలత చెందాను. సంబంధిత అధికారులతో మాట్లాడి, అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించాను.
విశాఖ కేజీహెచ్ లో స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించాను. వారికి ధైర్యం చెప్పాను. అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చాను. సెవెన్ హిల్స్, కిమ్స్ ఆసుపత్రిలో స్టీల్ ప్లాంట్ ప్రమాద క్షతగాత్రులను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించాను. అనంతరం స్టీల్ ప్లాంట్ ప్రమాద స్థలాన్ని పరిశీలించాను. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నాను. కార్మికులతో మాట్లాడి అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చాను.
ఎప్పటి నుంచో తనను చూడాలనుకుంటున్న ఓ అభిమాని కోరికను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు తీర్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం కామధేనువులంక గ్రామానికి చెందిన సత్యనారాయణ సీఎం చంద్రబాబుకు వీరాభిమాని. తమ నియోజకవర్గానికి చంద్రబాబు వస్తున్నారని, దూరం నుంచైనా ఆయన్ను చూడాలని మాట్లాడిన వీడియో వైరల్ అయ్యి సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లింది. సత్యనారాయణ గారూ సిద్ధాంతంలో కలుద్దాం అని సీఎం రిప్లై కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ (మీ భూమి – మీ హక్కు) కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్దాంతం వెళ్లిన సీఎం చంద్రబాబు కార్యక్రమం అనంతరం తన బస్సులోకి సత్యనారాయణను ప్రత్యేకంగా పిలిపించుకున్నారు. కాసేపు ఆత్మీయంగా మాట్లాడి కుటుంబ వివరాలు, ఆరోగ్యం గురించి ఆరా తీశారు. తన కుమారుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడని, అతనికి వైద్యసాయం అందించాలని సత్యనారాయణ కోరారు. తమ గ్రామానికి డ్రైనేజ్ సదుపాయం కల్పించాలని విన్నవించారు. ఆ సమస్యలపై భరోసా ఇచ్చి సత్యనారాయణకు ఇల్లు కూడా నిర్మించి ఇవ్వాలని కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు.
#AndhraPradesh
#InvestInAP#ChooseSpeedChooseAP
రష్యా పర్యటనలో భాగంగా ఐదో రోజు మాస్కోలోని స్బేర్ సిటీని సందర్శించాను. వ్యాధినిర్ధారణ, ఇతర ఆవిష్కరణలతో కూడిన స్బేర్ బ్యాంక్ ఎటిఎంను పరిశీలించి, పనితీరును అడిగి తెలుసుకున్నాను. స్బేర్ సిటీ ప్రతినిధులు అక్కడి ఆర్ & డీ, క్వాంటం టెక్నాలజీ సెంటర్, ఏఐ ఆధారిత సేవలు, డిజిటల్ హెల్త్ కేర్, సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్, డిజిటల్ ఎడ్యుకేషన్ సొల్యూషన్స్ ను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
It is a matter of great pride that the National Workshop on Seafood Exports is being held in Visakhapatnam, bringing together Hon'ble Union Ministers, policymakers, scientists, industry leaders, exporters, entrepreneurs, and representatives of fishing communities to shape the future of India's seafood sector.
As India's leading fisheries and aquaculture state, Andhra Pradesh is proud to contribute significantly to the country's seafood exports and to support the national vision of strengthening India's position as a leading global seafood export hub. The workshop reinforces our shared commitment to increasing exports, enhancing value addition, improving sustainability, and creating new opportunities for our fishermen, aquaculture farmers, and coastal communities.
రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అందరం కలిసి ఒక సంకల్పం చేద్దాం. భూమి మన ఇల్లు… ప్రకృతి మన జీవనాధారం. పర్యావరణాన్ని రక్షించుకోవడం మన బాధ్యత. సహజ వనరులను కాపాడుకుంటూ, గాలి, నీరు, నేలను కలుషితం కాకుండా అందరూ కృషి చేద్దాం. పచ్చదనం పెంపు, ఇంధన వనరులు పొదుపుగా వినియోగించడం అవసరం. అందులో భాగంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5న సైకిళ్లు, ఈ -సైకిళ్లపై ప్రయాణిద్దాం. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటుదాం. రేపటి నా విశాఖ పర్యటనలో నేను సైకిల్‌పై ప్రయాణించి పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాను. అంతా సహకరించాలని, మంచి కార్యక్రమానికి కలిసి రావాలని కోరుతున్నాను.
#WorldEnvironmentDay
Absolutely proud that our farmers of Andhra Pradesh are shining on the global stage.
Andhra Pradesh Community Managed Natural Farming (APCNF) has been awarded the 2026 Food Planet Prize, widely regarded as the world's largest environmental award. It has been recognised for leading one of the most ambitious transitions to agroecology ever undertaken.
I thank the Food Planet Prize for recognising APCNF, now a movement of 1.8 million farmers and the world's largest natural farming programme. This is a proud first for India.
We will not stop here. Our vision is to make Andhra Pradesh a 100% natural farming state by 2047, restoring our natural resources, rejuvenating our farmlands, strengthening farmers' well-being, and contributing to a healthier planet.
We are committed to sharing our learnings and supporting the spread of natural farming across India and beyond.
Heartiest congratulations to our farmers, women's self-help groups, field teams, scientists, and everyone associated with this remarkable achievement.
రష్యా ప్రభుత్వ నియంత్రిత ప్రముఖ రిటైల్ బ్యాంకింగ్ సంస్థ స్బేర్బ్యాంక్ (Sber bank) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్ యెఫిమోవ్‌తో మాస్కోలో భేటీ అయ్యాను. భారతదేశంలో బ్యాంకింగ్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రిటైల్ రంగాలకు స్బేర్ బ్యాంక్ గిగాచాట్ ఎల్ఎల్ఎం ను విస్తరించాలని కోరాను. యూపీఐ నెట్వర్క్ భద్రతను పటిష్టం చేస్తూ.. స్బేర్బ్యాంక్ అడ్వాన్స్ డ్ వాయిస్ రికగ్నిషన్ & బయోమెట్రిక్ యాంటీ-ఫ్రాడ్ నెట్వర్క్ కోసం సాంకేతిక సహకారం అందించాలని, ఏపీ ఫార్మా, అగ్రి ఎక్స్ పోర్టర్లకు వ్యవస్థీకృత రుణాలు అందించాలని విజ్ఞప్తి చేశాను.
#InvestInAP
#ChooseSpeedChooseAP
It’s a pleasure to land in Russia and be welcomed by the Indian community here. Over the next few days, I’m looking forward to engaging with Russian businesses and corporates and welcoming them to #AndhraPradesh!
#InvestInAP#ChooseSpeedChooseAP
During May, district reviews, inspections of Anganwadi Centres & CCIs, and stakeholder consultations were conducted focusing on child protection, child labour prevention, health, education, nutrition, and institutional care.
Working towards a child-friendly Andhra Pradesh.
రాష్ట్రంలోని పోర్టులు, ఎయిర్ పోర్టుల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇన్ఫ్రా ప్రాజెక్టుల పూర్తికి కాలపరిమితిని నిర్దేశించుకుని పని చేయాలని స్పష్టం చేశారు. పెట్టుబడులు, మౌలిక సదుపాయల కల్పన, ఆర్టీసీపై నేడు సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. మూలపేట, రామాయపట్నం, మచిలీపట్నం పోర్టుల నిర్మాణం, జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం, దగదర్తి, కుప్పం, శ్రీకాకుళం ఎయిర్ పోర్టుల నిర్మాణం, భూ సేకరణ, నిధుల సమీకరణ, కేంద్రం నుంచి అనుమతులు వంటి అంశాలపై అధికారులకు ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. ఈ సమీక్షలో మంత్రులు శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి, శ్రీ మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సాయిప్రసాద్, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
#AndhraPradesh
Conducted surprise visits to Gorantla Anganwadi Centre and Yetukur Road Anganwadi Centre in Guntur Urban. Interacted with children, shared food, reviewed hygiene practices, and suggested value-based learning activities to nurture empathy and good habits among young children.
Attended the International Menstrual Hygiene Day programme as Chief Guest at Asha Jyothi Mentally and Physically Challenged Home. Interacted with adolescent girls on the importance of menstrual hygiene and distributed sanitary pads to girls #MenstrualHygieneDay
#LegendaryNTRJayanthi
"కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు... మహాపురుషులౌతారు" అనే మాటకు నిలువెత్తు నిదర్శనం అన్న ఎన్టీఆర్. తెలుగు ప్రజల ఆరాధ్యుడు, విశ్వ విఖ్యాతుడు, మహామనిషి శ్రీ నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను.1923 మే 28న కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించిన ఆయన తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కారణజన్ముడు. సినీ వినీలాకాశంలో రాముడుగా, కృష్ణుడుగా చెరగని ముద్ర వేసిన ఆయన రాజకీయ రంగంలో ధృవతారగా వెలిగారు. తెలుగు ప్రజల జీవితాల్లో పెను మార్పులు తెచ్చిన ఆధునిక సంఘ సంస్కర్త ఆయన. ఆ యుగ పురుషుడికి మరొక్కమారు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.
On behalf of my people of Andhra Pradesh, I extend my heartfelt congratulations to Hon’ble Prime Minister Shri Narendra Modi Ji on the completion of 12 years of his historic tenure as Prime Minister of India.
I have always believed that he is the right leader, in the right place, at the right time for our country. Under his visionary leadership, India has scaled new heights in growth, governance, welfare, development, and public service. The nation’s global stature and reputation have risen remarkably during his tenure.
Prime Minister Modi Ji has also set a new benchmark in cooperative federalism through his unwavering commitment to the all-round development of every state.
Andhra Pradesh looks forward to its own journey of Swarna Andhra, contributing meaningfully to his larger vision of a Viksit Bharat.
@narendramodi
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు నేడు క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయ అనుబంధ రంగాలపై సమీక్ష నిర్వహించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లో భాగంగా ప్రాథమిక రంగంలోని 6 మిషన్ల పై సమీక్షలో చర్చించారు. వ్యవసాయం, హార్టికల్చర్, ఆక్వా కల్చర్, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖ, తదితర రంగాలపై తీసుకోవాల్సిన నిర్ణయాలను సమీక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్యశాఖ మంత్రి శ్రీ కే అచ్చెన్నాయుడు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సాయి ప్రసాద్ ఆయా శాఖల ఉన్నతాధికారులు, సంబంధిత పలు కార్పొరేషన్ ల చైర్మన్ లు సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.
#AndhraPradesh