Expecting understanding and respect from the certain part of public is
..... Cus it's never workout. It's just a topic for them to discuss and make fun. We can't blame one person. Unless respecting their decision.
Always stand by your values, respect individual choices, and recognise public service.
Judge a leader by his work for the people, not by headlines about his personal life. His dedication and commitment to public service deserve to be acknowledged. ❤️
Always proud to stand by @PawanKalyan garu. 🙏
His personal life
His Choice
There is nothing that's going to be collapse on the basis of his personal life. Someone say character &so on for that there is no need for him to adjust his life for others and live uncomfortable life.
NO ONE HAS A RIGHT TO CRITICIZE HIM.
పవన్ అన్న @PawanKalyan ఒక్కసారి మా ఆవేదన విను!
జనసేన భవిష్యత్తు గురించి ఒక సామాన్య జనసైనికుడి ఆవేదన, కొన్ని ప్రశ్నలు!
ప్రియమైన పవన్ కళ్యాణ్ అన్నయ్యకు,
అన్నా… నీ మీద అభిమానంతో కాదు, నమ్మకంతో ప్రయాణం చేస్తున్న జనసైనికుడిగా ఈ మాటలు రాస్తున్నాను.
అన్నా… నీకు కోపం వచ్చినా, చిరాకు కలిగినా పరవాలేదు… కానీ మా ఆవేదనను అర్థం చేసుకో. దయచేసి మౌనంగా మాత్రం ఉండకు!
నువ్వు తీసుకున్న ప్రతి నిర్ణయం వెనుక ఒక వ్యూహం ఉంటుందని నమ్ముతున్నాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం నువ్వు చేసిన త్యాగాలను గౌరవిస్తున్నాం. కానీ అన్నా, ఆ త్యాగాలు ఎప్పటికీ జనసేన పార్టీ భవిష్యత్తును పణంగా పెట్టేలా ఉండకూడదు కదా?
1. మూడు వంతుల హామీ… చివరకు మనకు మిగిలింది ఎంత అన్నా?
స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనకు మూడు వంతుల వాటా అని చెప్పుకున్నాం. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే, ఆ మూడు వంతుల్లో సగం కూడా మనకు దక్కిందా అనే అనుమానం కలుగుతోంది.
దక్కిన చోట్ల కూడా టీడీపీ బీ-ఫారాలు, టీడీపీ రెబల్స్, మన ఎమ్మెల్యేల కుటుంబ సభ్యుల పోటీ, స్థానిక నాయకత్వం మధ్య సమన్వయ లోపం… ఇవన్నీ జనసైనికులను అయోమయంలోకి నెడుతున్నాయి.
పొత్తులో మనకు కేటాయించిన స్థానాల్లో కూడా మన అభ్యర్థులు స్వేచ్ఛగా పోటీ చేయలేకపోతే, ఆ పొత్తు వల్ల క్షేత్రస్థాయిలో మన పార్టీకి కలిగే ప్రయోజనం ఏమిటన్నా?
2. ఈ నియోజకవర్గాల్లో జరుగుతున్న పరిణామాలకు సమాధానం ఎవరు చెబుతారు?
పోలవరం, తెనాలి, నెల్లిమర్ల, రైల్వేకోడూరు, రాజానగరం…
ఈ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక, బీ-ఫారాలు, రెబల్స్, కుటుంబ సభ్యుల పోటీ, స్థానిక ప్రచారం వంటి అంశాలపై కార్యకర్తల్లో అనేక ప్రశ్నలు ఉన్నాయి.
మన పార్టీ అభ్యర్థులకు మన ఎమ్మెల్యేలే పూర్తిస్థాయిలో అండగా నిలబడకపోతే, సాధారణ కార్యకర్త పరిస్థితి ఏమిటన్నా?
ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ నాగబాబు గారు సాలూరులో ప్రచారం కోసం సమయం కేటాయించగలిగినప్పుడు, మన ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల కోసం అంతే నిబద్ధతతో ఎందుకు పనిచేయకూడదు?
ఎమ్మెల్యే పదవి జనసేన వల్ల వచ్చినప్పుడు, జనసేనను గ్రామస్థాయిలో బలోపేతం చేయాల్సిన బాధ్యత కూడా వారిదే కదా అన్నా?
3. 2024లో 175 స్థానాల్లో కేవలం 21 తీసుకున్నప్పుడే బాధపడ్డాం!
అన్నా, 2024 ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్లో మనం కేవలం 21 స్థానాల్లో పోటీ చేసినప్పుడు చాలా బాధపడ్డాం.
కానీ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఓట్ల చీలికను నివారించడం కోసం, స్థిరమైన ప్రభుత్వం కోసం నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని గుండెల్లో బాధ పెట్టుకుని కూడా అంగీకరించాం.
రాష్ట్ర ప్రయోజనాల కోసం మన రాజకీయ ఆశలను తగ్గించుకున్నాం. సరే అన్నా… కానీ పార్టీని నిర్మించుకునే అవకాశాలను కూడా వదులుకోవాలా?
ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జనసేనకు ఒక సువర్ణావకాశం. గ్రామాల్లో నాయకత్వాన్ని తయారు చేసుకోవడానికి, మండలాల్లో పార్టీని బలోపేతం చేయడానికి, రేపటి ఎమ్మెల్యేలను, ఎంపీలను తయారు చేసుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం ఏముంటుంది?
అలాంటి అవకాశాన్ని కూడా పొత్తు లెక్కల్లో కోల్పోతే, జనసేన సొంతంగా ఎదిగేది ఎప్పుడు అన్నా?
4. 25 సంవత్సరాల రాజకీయ భవిష్యత్తు అన్నావు… ఇప్పటికే 12 సంవత్సరాలు గడిచిపోయాయి!
అన్నా, నువ్వు చెప్పిన 25 సంవత్సరాల రాజకీయ ప్రయాణం మాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ మాటను నమ్మే ఎంతోమంది యువకులు తమ సమయాన్ని, అవకాశాలను, రాజకీయ భవిష్యత్తును జనసేన కోసం వెచ్చించారు.
ఇప్పటికే దాదాపు 12 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు మా ప్రశ్న ఒక్కటే…
2029లో కూడా రాష్ట్ర ప్రయోజనాల పేరుతో 30–40 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైతే, జనసేన సొంత రాజకీయ శక్తిగా ఎదిగేది ఎప్పుడు?
2029 తర్వాత 2034 నాటికి ప్రభుత్వ వ్యతిరేకత, మారే రాజకీయ సమీకరణాలు, కొత్త నాయకత్వాలు, కొత్త సవాళ్లు ఎదురవచ్చు. అప్పుడు పరిస్థితులు మనకు అనుకూలంగా ఉంటాయనే హామీ ఎవరు ఇవ్వగలరు?
అన్నా, రాజకీయాల్లో అవకాశాలు ప్రతిసారీ రావు. వచ్చినప్పుడు వాటిని పార్టీ నిర్మాణానికి ఉపయోగించుకోవాలి.
రాష్ట్రాన్ని బాగు చేయాలనే నీ సంకల్పం గొప్పది. కానీ ఆ రాష్ట్రానికి రేపు నాయకత్వం వహించే స్థాయికి జనసేనను తీసుకెళ్లడం కూడా అంతే ముఖ్యమైన బాధ్యత కాదా?
5. PAC ఏం చేస్తోంది అన్నా? చర్చల్లో మన బలం ఎందుకు కనిపించడం లేదు?
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) మరింత క్రియాశీలకంగా పనిచేయాల్సిన సమయం వచ్చింది.
పొత్తు చర్చల్లో మన వాటా, అభ్యర్థుల ఎంపిక, స్థానిక నాయకత్వానికి అవకాశాలు, రెబల్స్ సమస్యలు… వీటన్నింటిపై ముందుగానే స్పష్టమైన నిర్ణయాలు ఉండాలి.
పొత్తు అంటే పరస్పర గౌరవం ఉండాలి. పరస్పర ప్రయోజనం ఉండాలి.
ప్రభుత్వంలో భాగస్వామ్యం ఎంత ముఖ్యమో, క్షేత్రస్థాయిలో జనసేన ఉనికిని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం అన్నా!
PACని పునర్వ్యవస్థీకరించాల్సి వస్తే చేయి. చర్చల బృందాన్ని బలోపేతం చేయాల్సి వస్తే చేయి. పార్టీకి దక్కాల్సిన రాజకీయ అవకాశాల విషయంలో మరింత గట్టిగ నిలబడాలి
In detailed video about YSR and @ysjagan
How they are strategically converted many Hindu's to Christians
Hey ప్రభు please save A.P from #AntiHinduPartyYCP
Let us stand together for Ratna Sai and his family!
Ratna Sai has been a true and committed Janasainik, standing by JanaSena since its inception and remaining dedicated to the party and its ideals through every phase of its journey.
Let's all come forward and contribute whatever we can towards supporting Ratna Sai and his family during their diffcult times. No contribution is too small. Every bit of support counts.
Alladi Ratna Sai
Account number: 024301011621
ICICI Bank
IFSC Code: ICIC0000243
MMID: 9229423
UPI: +918790292898
ఒక అగ్నికణం… దావానలమై ఎగిసిన వేళ! 🔥
కాలం ఎప్పుడూ విచిత్రమైనదే. నిన్నటి దాకా ఒంటరివాడివని వేలెత్తి చూపిన లోకమే, నేడు ఆ ఒక్కడి వెనుక కదిలొస్తున్న ప్రభంజనాన్ని చూసి సలాం చేస్తోంది.
జనసేన ప్రస్థానం కేవలం రాజకీయ చదరంగంలో సాధించిన గెలుపు కాదు… అదొక నిశ్శబ్ద విప్లవం. శూన్యం నుంచి మొదలై, అవమానాలను పునాదులుగా చేసుకొని, ఓటములను అనుభవాలుగా మలుచుకొని… నేడు ప్రజా పీఠంపై సగర్వంగా కొలువుదీరిన ఒక మహా కావ్యం!
పవన్ కల్యాణ్ అనే ఒకే ఒక్క వ్యక్తి ఆశయం, నేడు లక్షలాది మంది ఆశల సౌధంగా ఎలా రూపాంతరం చెందిందో చెప్పడానికి ఈ గణాంకాలే సజీవ సాక్ష్యాలు.
ఇది కేవలం ఒక రాజకీయ పార్టీ కాదు… అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నత స్థాయి వరకు విస్తరించిన ప్రజా సైన్యం!
• 21 మంది ఎమ్మెల్యేలు – శాసనసభలో ప్రజా గొంతుకగా!
• ముగ్గురు మంత్రులు – ప్రజా సంక్షేమ పాలనలో భాగస్వాములుగా!
• ముగ్గురు ఎంపీలు – పార్లమెంటులో తెలుగువాడి గొంతుకగా!
• ఇద్దరు ఎమ్మెల్సీలు – పెద్దల సభలో ప్రజావాణిగా!
• ఇద్దరు మేయర్లు, 19 మంది మున్సిపల్ చైర్పర్సన్లు – పట్టణ ప్రగతికి నాయకత్వంగా!
• 142 మంది కార్పొరేటర్లు, 362 మంది కౌన్సిలర్లు – వీధి వీధినా ప్రజల పక్షాన!
• 76 మంది జెడ్పీటీసీలు, 1,055 మంది ఎంపీటీసీలు – పల్లె ప్రగతికి ప్రతినిధులుగా!
• సుమారు 3,000 నామినేటెడ్ పదవులు – పార్టీ కోసం, సిద్ధాంతాల కోసం అలుపెరగని పోరాటం చేసిన కార్యకర్తలకు దక్కిన గుర్తింపుగా!
ఒకప్పుడు ఏమీ లేదు అనుకున్న చోట, నేడు వేలాది మంది ప్రజాప్రతినిధులు ఉద్భవించారు.
సిద్ధాంతాల కోసం పదవులను సైతం వదులుకున్న నాయకుడు ఉన్న చోట, అదే సిద్ధాంతం కోసం వేలాది మంది ఆయన అడుగుజాడల్లో నడిచేందుకు సిద్ధమయ్యారు.
ఇది ముగింపు కాదు… ఒక సువర్ణ అధ్యాయానికి తొలిపలుకు మాత్రమే!
ఈ ప్రయాణంలో ఇదొక కీలక మైలురాయి. ముందుముందు మరెన్నో అద్భుతాలు ఆవిష్కృతం కానున్నాయి!
ధర్మం గెలిచింది… ఆ ధర్మాన్ని నమ్మిన సైన్యం చరిత్ర సృష్టిస్తోంది!
జై జనసేన! జై హింద్! ✊