An event like never before… and it's been a year already!
Thank you to every fan for still celebrating the #GlobeTrotter event. Videos and moments keep showing up on our timelines every day.
When we do something, we want it to stay with everyone forever ❤️ #Varanasi
నాన్నగారికి మంచి స్నేహితుడు, మా పార్టీలో క్రియాశీలక సభ్యులైన ప్రముఖ నటుడు గిరిబాబు గారి మరణవార్త ఎంతో బాధించింది. ఆయన తనదైన నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోసి, తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తెలుగు చిత్రసీమకు గిరిబాబు గారు అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
Heartiest congratulations to the Indian Under-19 cricket team on winning the Asia Cup and making the nation proud.
In a thrilling final against Pakistan, India chased 338. Despite losing wickets at crucial stages, our young cricketers stayed composed and fought to the end. Manal Chauhan and Mohit Ulva made vital late contributions to secure a one-wicket victory. This win reflects the team’s talent, courage and determination. I congratulate the players and wish our young champions continued success and many more triumphs.
#MensU19AsiaCup
.@ncbn గారూ, చిత్తూరులోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి మీరు, ప్రస్తుత విద్యాశాఖ మంత్రి, మీ సుపుత్రుడు లోకేషే కారణం కాదా?. ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి మీరిద్దరూ మీచేతులతో ఉరితాడు బిగిస్తే, అదే ఉరితాడు ఇప్పుడు అమాయక విద్యార్థుల ప్రాణాల మీదకు వస్తోంది. ఈ దారుణమైన పరిస్థితికి ముమ్మాటికీ మీరే బాధ్యులు.
ప్రభుత్వం ఫీజులు కట్టకపోవడంతో తమకు ఈ దుస్థితి వచ్చిందని, ఇదే కాలేజీలో గతంలో కూడా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటూ విద్యార్థులు రోడ్డెక్కి తమ ఆవేదనను, ఆగ్రహాన్ని వెళ్లగక్కినా చంద్రబాబుగారూ, మీకు అసలు పట్టనట్టే ఉన్నారు. పైగా టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మీరు, మీ కుమారుడు బాధ్యతలను పూర్తిగా వదిలేయడం అత్యంత దారుణం. ఇంత దుర్మార్గమైన పాలన గతంలో ఎప్పుడూ చూడలేదు.
పేదవాళ్లకు గొప్ప చదువులే లక్ష్యంగా అమ్మ ఒడి నుంచి విద్యాదీవెన, వసతిదీవెన పథకాలతో దేశంలో ఎక్కడాలేని విధంగా గొప్పగా మేం ప్రారంభించి అమలు చేస్తే, మీరు అధికారంలోకి వచ్చిన తొలి క్షణం నుంచే పేదలను ఉన్నత చదువులకు దూరం చేసే కుట్రలో భాగంగా, ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన పథకాలను నిర్వీర్యం చేసి, బంగారం లాంటి పేద పిల్లల భవిష్యత్తును నాశనం చేసి, వారి చదువుల ఉసురు పోసుకుంటున్నారు.
ఈ విద్యాసంవత్సరం చివరి వరకూ చూసుకుంటే 13 త్రైమాసికాలకుగాను, ప్రతి త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున విద్యాదీవెన కింద ఇవ్వాల్సిన మొత్తం రూ.9,100 కోట్లు. ఇవి కాకుండా 2024 ఏప్రిల్, 2025 ఏప్రిల్, 2026 ఏప్రిల్‌కు గానూ ఒక్కో ఏడాది రూ.1,100 కోట్ల చొప్పున మూడేళ్లకు ఇవ్వాల్సిన వసతిదీవెన బకాయిలు రూ.3,300 కోట్లు. మొత్తంగా ఈ రెండు పథకాలకు ఖర్చు చేయాల్సింది రూ.12,400 కోట్లు అయితే ఇప్పటివరకూ ఇచ్చింది ఎంతని చూస్తే, ఒకసారి రూ.1,700, ఒకసారి రూ.1,100 కోట్లు. ఇంకా రూ.9,600 కోట్లకుపైగా బాకీ. ఇంత బకాయిలుపెడితే ఇక పేద పిల్లలకు భరోసా ఎక్కడిది? వాళ్లు ఎలా చదువుకోవాలి? వారి చదువులతో, భవిష్యత్తుతో, చివరకు వారి ప్రాణాలతో ఆడుకునే హక్కు మీకెవరిచ్చారు చంద్రబాబుగారూ?
ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు ఆ భారాన్ని పిల్లలు, వారి తల్లిదండ్రులమీద మోపుతున్నాయి. తమ ఫీజులను వసూలు చేయడానికి, విద్యార్థులపై ఒత్తిడితెచ్చి, ఫీజులు కట్టకపోతే పరీక్షలు రాయనివ్వమని, సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చదువులు కొనసాగించలేక కొందరు పనులకు వెళ్తుంటే, ఈ ఒత్తిళ్లు భరించలేక ఇలా ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నవారు ఇంకొందరు.
చంద్రబాబుగారూ.. విద్యాశాఖను సర్వం భ్రష్టుపట్టించిన మీ సుపుత్రుడిని వెంటనే బాధ్యతలనుంచి తప్పించండి. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలను తక్షణమే చెల్లించాలి. కాలేజీల్లో విద్యార్థులపై ఒత్తిళ్లను వెంటనే ఆపాలి. విద్యార్థి ఆత్మహత్యాయత్నాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మాని, విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలు వెంటనే చెల్లించాలి.
Every child deserves the right to dream, learn, live in a safe and supportive world. It’s our responsibility to invest in their education and well-being today, empower them to claim the future they deserve and they will be set to drive the progress of our nation. Warm wishes to all young minds on #ChildrensDay!
𝐂𝐁𝐍’𝐬 𝐆𝐥𝐢𝐭𝐳𝐲 𝐆𝐫𝐨𝐰𝐭𝐡 𝐍𝐚𝐫𝐫𝐚𝐭𝐢𝐯𝐞 𝐯𝐬 𝐀𝐧𝐝𝐡𝐫𝐚 𝐏𝐫𝐚𝐝𝐞𝐬𝐡’𝐬 𝐄𝐜𝐨𝐧𝐨𝐦𝐢𝐜 𝐑𝐞𝐚𝐥𝐢𝐭𝐲; 𝐅𝐚𝐥𝐥𝐢𝐧𝐠 𝐏𝐨𝐰𝐞𝐫 𝐃𝐞𝐦𝐚𝐧𝐝, 𝐒𝐭𝐚𝐠𝐧𝐚𝐧𝐭 𝐓𝐚𝐱 𝐑𝐞𝐯𝐞𝐧𝐮𝐞𝐬 𝐚𝐧𝐝 𝐑𝐢𝐬𝐢𝐧𝐠 𝐔𝐧𝐞𝐦𝐩𝐥𝐨𝐲𝐦𝐞𝐧𝐭
What we have been witnessing during the period of the TDP alliance Government are unprecedented levels of corruption and lawlessness, which the State Government attempts to conceal by putting forth a misleading narrative of rapid economic progress. However, the statistics present a very unambiguous picture of distress.
-One such example is with respect to energy demand. As per orders passed by the APERC, the 𝐩𝐨𝐰𝐞𝐫 𝐬𝐚𝐥𝐞 by DISCOMs during FY 2023-24 is 71,722 MU and 𝐞𝐧𝐞𝐫𝐠𝐲 𝐝𝐢𝐬𝐩𝐚𝐭𝐜𝐡 is 79,758 MU and the corresponding figures for FY 2025-26 are 70,885 MU and 78,546 MU. This clearly shows a reduction in power demand over the two year period.
-In any growing economy, the power demand is expected to increase at a healthy pace owing to power requirement of new industries added, increased capacity utilization of the existing industries and of higher consumption by households due to their enhanced purchasing power. But in Andhra Pradesh over the last two years we witnessed a reduction in power demand, clearly exposing the sluggishness in the economy.
-Further, figures concerning power demand are not the only statistics that reflect an economic slowdown. The State’s own tax revenues during FY 2023-24 were Rs. 85,922.36 crores and the provisional figures for FY 2025-26 released by the CAG also indicate the State’s own tax revenues to be Rs. 86,552.65 crores, indicating a CAGR over a two year period of only 0.15%, clearly evidencing fall in consumption and investment over the last two years.
-The economic slowdown is very adversely impacting the employment conditions as evidenced by AP ranking 4th in the Country amongst the States in terms of unemployment in the first quarter of FY 2026-27 and 3rd in the Country in the second quarter of FY 2026-27. These figures clearly indicate the worsening situation in Andhra Pradesh, yet Mr. @ncbn boasts of generating 23 lakh jobs.
.@ncbn గారూ.. పేదలకు ఉచిత వైద్యం అందించే దేవాలయాల్లాంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను, ప్రజల సంపదను PPP ముసుగులో కట్టబెట్టేందుకు మీరు చేస్తున్నది భారీ స్కాం.
మా ప్రభుత్వంలో 17 కొత్త మెడికల్ కాలేజీలను తీసుకొస్తే, అందులో 5 కాలేజీలను మేమే ప్రారంభించి, మరో 3 కాలేజీలను తరగతులకు సిద్ధం చేశాం. ఏడాదికి రూ.1000 కోట్లు పెడితే మిగిలిన 9 కాలేజీలు కూడా పూర్తవుతాయి. కాని, మీరెందుకు ఆ పనిచేయడంలేదు?
మీ PPP స్కెచ్ చూస్తేనే ఇది పక్కా స్కాం అని అర్థం అవుతోంది కదా?
▪️ కొన్ని కాలేజీలు పూర్తై, మిగిలినవి వివిధ దశల్లో ఉన్న ఈ కాలేజీలను తెగనమ్ముతున్నారు.
▪️వందల కోట్ల విలువైన భూములు ఎకరా రూ.100కే లీజు!
▪️ సగానికిపైగా మెడికల్ సీట్లను అమ్ముకునే అవకాశం!
▪️ ఈ కాలేజీలకు VGF పేరుతో ఏకంగా రూ.1,630 కోట్ల ప్రజాధనం దోపిడీ
▪️ అంతటితో ఆగకుండా డాక్టర్లు, ప్రొఫెసర్లు, సిబ్బందికి రెండేళ్లపాటు ప్రభుత్వమే జీతాలు ఇవ్వడం. మరి ఇది దోపిడీ కాక ఏమిటి? ఈ దోపిడీ ఖర్చు నెలకు రూ.5 కోట్లు, రెండేళ్లకు రూ.120 కోట్లు ఒక్కో కాలేజీకి.
భూములు ప్రభుత్వానివి! భవనాలన్నీ ప్రభుత్వ నిధులతో నిర్మించినవి! VGF రూపేణా ఇవ్వనున్న డబ్బుకూడా ప్రజాధనమే! సిబ్బందికి ఇచ్చే జీతాలు కూడా ప్రభుత్వం నుంచే. మరి ప్రైవేటు సంస్థల పేరిట ఇది స్కాం కాకపోతే మరి ఏంటి?
మేం తీసుకొచ్చిన ఈ కాలేజీలన్నీకూడా టీచింగ్ ఆస్పత్రులే. పేదలకు ఉచితంగా నాణ్యమైన మల్టీ స్పెషాల్టీ వైద్యం అందడమే కాదు, సగం సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ అవుతాయి, మిగిలిన సగం సీట్లు కూడా ప్రైవేటువారితో పోలిస్తే అతితక్కువ ఫీజుకే అందుబాటులోకి వస్తాయి. వచ్చే ఆ డబ్బుతో ఈ కాలేజీల నిర్వహణకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా పటిష్టమైన మోడల్‌ను మేము గతంలో రూపొందించాం. నిధులకోసం ఆ మేరకు బ్యాంకులతో లింకేజీకూడా చేశాం.
టీచింగ్ ఆస్పత్రులు కాబట్టి, ఇక్కడ పనిచేసే ప్రొఫెసర్లు, చదువుకునే వైద్య విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులే వైద్య సేవల్లో నిమగ్నం అవుతారు. టీచింగ్ ఆస్పత్రుల వల్ల, ఈ మెడికల్ కాలేజీల నిర్వహణలో వయబిలిటీ ఉంటుంది. అలాంటి ఏర్పాట్లు ఉండగా, పీపీపీ ముసుగులో అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది?
అంతేకాదు, ఈ మెడికల్ కాలేజీలు, ఆయా జిల్లా పరిధిలో ఉండే ఏరియా ఆస్పత్రులు, CHCలు, PHCలు, విలేజ్ క్లినిక్స్‌తో అనుసంధానమై, ఒక నెట్వర్క్ మాదిరిగా ఏర్పడి గ్రామస్థాయి వరకూ నాణ్యమైన మల్టీస్పెషాల్టీ వైద్యసేవలు అందించగలుగుతాయి. ప్రభుత్వ వైద్యసేవల క్వాలిటీ పెరగడంతో, తద్వారా ప్రైవేటు ఆస్పత్రులు కూడా సరసమైన ధరలకు వైద్యం అందించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇన్ని ప్రయోజనాలున్న ఈ కాలేజీలను తెగనమ్మడం దారుణం కాదా?
చంద్రబాబుగారూ.. ఇప్పటికే మీ పాలనలో ప్రభుత్వ వైద్యరంగాన్ని దెబ్బతీశారు.
▪️ రూ.25 లక్షల ఉచిత వైద్యం అందించే ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. నెట్వర్క్ ఆస్పత్రులకు వారికి ఇవ్వాల్సిన బకాయిలు చెల్లింపులు, బాండ్ల రూపంలో అప్పులుగా ఇస్తుండటంతో, ఆ తర్వాత కూడా రూ.3వేల కోట్ల బకాయిలు ఇంకా ఉండడంతో, ఆ నెట్వర్క్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలకు దూరమవుతున్నాయి.
▪️ మా హయాంలో GMP/WHO ప్రమాణాల మందులు అందిస్తే, ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు, దూది కూడా లేవు.
▪️ దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్టు డాక్టర్ల కొరత 61% ఉంటే, మా జీరో వేకెన్సీ పాలసీతో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆ ఖాళీలను 4%కి తగ్గించాం. ఇప్పుడు ఆ పాలసీకి మంగళంపాడి, గవర్నమెంటు ఆస్పత్రులను అదే పాతపరిస్థితికి తీసుకువచ్చి, మళ్లీ ఖాళీలు పెంచుతున్నారు.
▪️ ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాడు–నేడు పనులను పూర్తిగా నిలిపేశారు.
▪️విలేజ్ క్లినిక్స్‌ను నిర్వీర్యంచేశారు.
▪️108, 104 పరిస్థితి అగమ్యగోచరంగా తయారు చేశారు.
చంద్రబాబుగారూ…, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా, మా పార్టీ ఆధ్వర్యంలో కోటిమంది ప్రజలు సంతకాలు చేసి మీ నిర్ణయం పట్ల నిరసన తెలిపినా కూడా, మీరు ముందడుగు వేయడం దుర్మార్గం. అందుకే ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ వ్యవహారంలో, ఎవరు ఈ స్కాంలో భాగస్వాములైనా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, అరెస్టులకూ వెనుకాడం! మీరు స్కాంలు చేస్తూ ప్రజల ఆస్తులను లూటీ చేస్తామంటే ప్రజలు ఊరుకోరు. తగిన గుణపాఠం చెప్తారు.
#SaveMedicalCollegesInAP
Thank you so much, dear @urstrulyMahesh , for your kind words and appreciation.
So kind and gracious of you to take the time to watch our film and share your love.
On behalf of our entire team and myself, a heartfelt thank you for this beautiful gesture. Much love and respect! ❤️
The #Scene is seen and loved 😎😎😎 Cool, smart and so much fun… @Suriya_offl is fabulous as Inbaraj 🔥🔥🔥 Nazriya and Naslen are fantastic … @jithumadavan , brilliant writing and excellent execution… Impressive In every department … A must watch 👏🏻👏🏻👏🏻
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు.
చీకటి నుంచి వెలుగువైపు, అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపించే దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త వెలుగులు నింపాలని, మీ కృషి ఫలించి, మీ సంకల్పాలు నెరవేరి, ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
#HappyDiwali
Wishing Hon’ble Chief Minister of Telangana Shri @revanth_anumula garu a very Happy Birthday… May the coming year bring you good health and happiness and may Telangana continue to grow from strength to strength under your leadership….🤗🤗🤗
I strongly condemn the illegal arrest and detention of YSRCP MLC and party General Secretary Lella Appi Reddy. Filing false cases, making arbitrary arrests and detaining those who peacefully protested alongside our party candidates and the public against electoral irregularities is an outrageous abuse of power. This reprehensible rule is reminiscent of the Emergency.
After polling for the Parishad elections ended on Thursday in Vengalayapalem, Guntur Rural mandal, why were the ballot boxes, which should have been taken directly to Nagarjuna University, unloaded midway at Nallapadu? On whose orders were they unloaded? What happened to the security that should have been provided for the ballot boxes? When ballot boxes meant for the strong room were found in the middle of the road, our party workers, leaders and public caught the wrongdoing red-handed and protested peacefully. Do you respond by ordering a lathi charge against them? You commit irregularities, attempt to replace ballot boxes, and then file illegal cases against our people? Would you even go so far as to book an MLC for dacoity and theft? What could be more outrageous?
In these local elections, you manipulated nominations, manipulated the scrutiny of nominations, rigged polling booths, enabled repeated voting and manipulated polling percentages. Now, are you manipulating ballot boxes even after polling has ended? Mr. Chandrababu, while you murder democracy in these local elections, will you arrest and jail anyone who questions these wrongdoings? @ncbn garu, using your power and the police machinery to suppress people will not conceal your electoral malpractices. The entire country is watching your undemocratic methods. People will not remain silent spectators. They will not tolerate such atrocities and will teach you a fitting lesson.
#CBNJungleRaj
#SaveDemocracyInAP
వైయస్సార్సీపీ శాసనమండలి సభ్యుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి అక్రమ అరెస్టు, నిర్బంధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎన్నికల అక్రమాలను ప్రశ్నిస్తూ పార్టీ అభ్యర్థులతో, ప్రజలతో కలిసి శాంతియుతంగా ఆందోళన చేస్తే, దానిపై తప్పుడు కేసులు పెట్టి, అడ్డగోలుగా అరెస్టు చేసి, నిర్బంధానికి గురిచేయడం దుర్మార్గం. ఎమర్జెన్సీని తలపించే ఈ పాలన అత్యంత హేయం.
గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెంలో గురువారం పరిషత్ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత, నేరుగా నాగార్జున వర్శిటీకి చేరాల్సిన బ్యాలెట్ బాక్సులను మధ్యలో నల్లపాడు వద్ద ఎందుకు దింపారు? ఎవరి ఆదేశాలమేరకు ఆ బ్యాలెట్ బాక్సులను దింపారు? అసలు బ్యాలెట్ బాక్సులకు ఉండాల్సిన భద్రత ఏమైంది? స్ట్రాంగ్ రూంకు చేరాల్సిన బ్యాలెట్ బాక్సులు నడిరోడ్డుమీద కనిపిస్తే, కళ్లెదుటే వాటిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని, శాంతియుతంగా ఆందోళన చేస్తున్న మా పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు, ప్రజలమీద లాఠీఛార్జి చేస్తారా? తప్పులు మీరుచేసి, ఏకంగా బ్యాలెట్ బాక్సులు మార్చే ప్రయత్నంచేసి, మళ్లీ మావాళ్లపై అక్రమకేసులా? చివరకు ఒక ఎమ్మెల్సీమీద డెకాయిటీ, దొంగతనం కేసులుకూడా పెడతారా? ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది?
ఈ స్థానిక ఎన్నికల్లో… నామినేషన్లు రిగ్గింగ్, నామినేషన్ల స్క్రూట్నీ రిగ్గింగ్, పోలింగ్ బూత్‌ల రిగ్గింగ్, పోలింగ్ సైక్లింగ్, పోలింగ్ పర్సంటేజీల రిగ్గింగ్, చివరకు పోలింగ్ ముగిశాక ఇలా బ్యాలెట్ బాక్సులు కూడా రిగ్గింగ్? చంద్రబాబుగారూ ఈ స్థానిక ఎన్నికల్లో మీరు ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తుంటే, ఈ తప్పుల్ని ఎవరైనా ప్రశ్నిస్తే, వారిని అరెస్టు చేసి జైలుకు పంపుతారా? @ncbn గారూ మీ అధికార, పోలీసు బలాన్ని ప్రయోగించి కట్టడిచేయాలని అనుకున్నంత మాత్రాన, మీరు చేసిన ఎన్నికల అక్రమాలు దాచిపెట్టలేరు. మీ అప్రజాస్వామిక పద్ధతులను దేశమంతా చూస్తూనే ఉంది. ప్రజలు చూస్తూ ఊరుకోరు, ఇలాంటి దుర్మార్గాలను సహించరు, మీకు తగిన బుద్ధిచెప్తారు.
#CBNJungleRaj
#SaveDemocracyInAP
స్థానిక ఎన్నికల్లో @ncbn అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. నామినేషన్ల నుంచి పోలింగ్ వరకూ ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీచేశాడో చూశాం. అక్కడితో ఆగకుండా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ మాదిరిగానే, ఇవాళ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌లో అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి పలు జిల్లాల్లో అడ్డగోలుగా ఫలితాలను తారుమారుచేస్తూ, ప్రజాస్వామ్యాన్ని పదేపదే ఖూనీచేస్తున్నారు. అందుకే చంద్రబాబు గెలిచి, నైతికంగా ఓడిపోయారు. మేం ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం.
అధికార బలంతో ఎన్నికలను గెలవొచ్చు. కానీ ప్రజల విశ్వాసాన్ని గెలవలేరు. ప్రజాస్వామ్యాన్ని అణచివేయొచ్చు, కానీ ప్రజల ఆకాంక్షలను అణచివేయలేరు.
ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని నిర్బంధాలు విధించినా వెనుకడుగు వేయకుండా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడిన మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరీ ముఖ్యంగా మహిళలకు మరోసారి అభినందనలు. ఇదే స్ఫూర్తితో మా పోరాటాలు మరింత దృఢంగా కొనసాగుతాయి.
We Will Continue to Fight for Farmers!
We Will Continue to Fight for Women!
We Will Continue to Fight for Youth!
We Will Continue to Fight for Workers and Employees!
We Will Continue to Fight for Every Citizen!
We Will Continue to Fight for Democracy!
Ultimately, We Will Continue to Fight for a Better Andhra Pradesh!
Our Fight Continues. Our Spirit Remains Unbroken.
ప్రజల ఆశీస్సులతో దృఢమైన నమ్మకం, అచంచల విశ్వాసంతో ఈ ప్రయాణం ముందుకు సాగుతుంది.
కోట్ల మంది హృదయాలను స్పృశిస్తూ, ప్రజా సమస్యల్ని తెలుసుకునేందుకు వైయస్ జగన్ గారు వేసిన తొలి అడుగు.. దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది
ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు జననేత సాగించిన ఆ పాదయాత్రకు నేటితో సరిగ్గా 9 ఏళ్లు
#9YearsForPrajaSankalpaYatra#YSJaganPadayatra
#AndhraPradesh