కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని శుక్రవారం సాయంత్రం ఉప సభాపతి శ్రీ రఘురామ కృష్ణం రాజు @KRaghuRaju గారు, పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు, నిర్మాతలు, న్యాయవాదులు, మీడియా సంస్థల నిర్వాహకులు కలిసి పరామర్శించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసిన వారిలో శాసనసభ విప్ శ్రీ బొమ్మిడి నాయకర్ @BNayakar_JSP , మాజీ మంత్రి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి , ఎమ్మెల్యేలు శ్రీ నిమ్మక జయకృష్ణ , శ్రీ గిడ్డి సత్యనారాయణ , శ్రీ అరవ శ్రీధర్, కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీ ముక్కా రూపానంద రెడ్డి, జనసేన నేతలు శ్రీ తాతంశెట్టి నాగేంద్ర, శ్రీ గంజి చిరంజీవి, ప్రముఖ నిర్మాత శ్రీ నవీన్ ఎర్నేని, ప్రముఖ న్యాయవాది శ్రీ అశ్విన్ కుమార్, మహా న్యూస్ సీఎండీ శ్రీ మారెళ్ల వంశీకృష్ణ, ప్రైమ్ 9 సీఎండీ శ్రీ బండి రఘువీర్ శ్రీనివాస్, సీఈఓ శ్రీ వెంకటేశ్వర రావు తదితరులు ఉన్నారు.
ముంబయిలో కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని పరామర్శించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు. కొద్దిసేపటి క్రితం శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆసుపత్రికి చేరుకుని శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు.
జానకమ్మ గారి మరణవార్త నా హృదయాన్ని ఎంతో కలచివేసింది.
నా సినీ ప్రయాణంలో ఎన్నో మరపురాని పాటలకు ఆమె తన అపురూపమైన గాత్రాన్ని అందించారు. మేము తెరపై పలికించిన ఎన్నో భావోద్వేగాలకు ప్రాణం పోసింది ఆమె స్వరమే.
నా కెరీర్లో ప్రేక్షకులు ప్రేమగా గుర్తుంచుకున్న ఎన్నో పాటల వెనుక జానకమ్మ గారి మధుర గాత్రం ఉంది. ఆ పాటలు వినిపించిన ప్రతిసారీ, ఆ రోజులు...
ఆ జ్ఞాపకాలు... మళ్లీ కళ్లముందు సజీవంగా నిలుస్తాయి.
జానకమ్మ గారు ఒక గాయని మాత్రమే కాదు... భావాన్ని స్వరంగా మార్చిన అసాధారణ కళాకారిణి. ఆమె పాడిన ప్రతి పాట ఒక జ్ఞాపకం... ఒక అనుభూతి... ఒక జీవితకాలపు అనుబంధం.
ఈ రోజు మనం సంగీత ప్రపంచంలోని ఓ మహోన్నత శిఖరాన్ని కోల్పోయాం. కానీ ఆమె గానం ఎన్నో తరాలకు స్ఫూర్తిగా, మన జీవితాలకు నేపథ్య సంగీతంగా చిరకాలం మార్మోగుతూనే ఉంటుంది.
శ్రీమతి ఎస్. జానకి గారి కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు, ఆమెను అభిమానించే కోట్లాది సంగీతాభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
జానకమ్మ గారు... మీ స్వరం ఎప్పటికీ అమరం.
ఓం శాంతి. 🙏
Went to the residence of Andhra Pradesh Deputy Chief Minister, Shri Pawan Kalyan Garu and met him as well as his family. Enquired about Pawan Kalyan Garu’s well being and wished him good health.
@PawanKalyan
#PawanKalyanTransformsAP
To make people aware of dividing waste into dry waste & wet waste is really a great initiative. Giving groceries & gifts for giving waste really inspires citizens to take up the #SwachaRatham initiative.
Best wishes to Kalyan garu, always rooting for you, one among crores ! - Indian Actor, Producer Nani garu @NameisNani
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు కొద్దిసేపటి క్రితం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి నివాసానికి చేరుకున్నారు. ఇటీవల శ్రీ పవన్ కళ్యాణ్ గారు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. పరామర్శించేందుకు హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ గారి నివాసానికి వెళ్లారు. శ్రీ చంద్రబాబు నాయుడు గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఆయన సతీమణి శ్రీమతి అనా కొణిదెల గారు స్వాగతం పలికారు.
ఇటీవలే శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు హైదరాబాద్ లో ఆయన స్వగృహంలో కలిసి పరామర్శించాను. క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకుని తగిన విశ్రాంతి తీసుకోవాలని సూచించాను.
@PawanKalyan
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాను. ఆయన ఎంతో ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు అతి త్వరలోనే కోలుకుంటారని నమ్ముతూ ఆయన సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాను.
@PawanKalyan
@AlwaysRamCharan doesn’t arrive. He rises!
For our April cover, the actor steps into a version of himself that feels sharper and more certain than ever before.
Tap to read the full cover story: https://t.co/wxleQlPgZl
జనసేనాని శ్రీ @PawanKalyan గారి ఉక్కు సంకల్పానికి నిదర్శనం ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని అమరావతి
• తొలిరోజు నుండి అమరావతి చట్టబద్ధత కోసం, భవిష్యత్తులో ప్రభుత్వాలు రాజధాని మార్చకుండా పార్లమెంట్ లో ఆమోదం పొందేలా చేయాలని గళమెత్తిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
• 2019–2024 కాలంలో రాష్ట్ర రాజధాని అంశంపై తీవ్ర గందరగోళం నెలకొని, రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు రోడ్డెక్కిన పరిస్థితుల్లో, అమరావతిని ఎవరూ మార్చలేరు అని శపథం చేసి, అమరావతి రైతులకు, రాష్ట్ర ప్రజలకు, పెట్టుబడిదారులకు భరోసా కల్పించారు.
• రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టేందుకు కూటమి ఏర్పాటు చేసి, ప్రజలకు ధైర్యాన్ని నింపి, నేడు పార్లమెంట్లో అమరావతిని రాజధానిగా ఆమోదం పొందేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు.
• ఇచ్చిన మాట కోసం రాజకీయంగా తాను తగ్గి… ప్రజలను గెలిపించి, నిజమైన నాయకత్వానికి నిదర్శనంగా నిలిచారు.
#PawanKalyanAneNenu
#HistoricAmaravatiResolution
అందరికీ హనుమజ్జయంతి శుభాకాంక్షలు.💐
మనకు నిత్యం కనిపించే ప్రత్యక్ష దైవం ఆ సూర్య భగవానుని కిరణాలు మా ఇలవేల్పు హనుమంతుని స్పృశిస్తున్న అద్భుతమైన సన్నివేశాన్ని ఈ సందర్భంగా మీతో పంచుకుంటున్నాను.
జై శ్రీరామ్🙏 జై హనుమాన్🙏
#HanumanJayanti
ఈ కొత్త సంవత్సరం ప్రతి ఇంటా సిరి సంపదలు కురిపించాలని, ఆనందోత్సాహాలతో రాష్ట్రం సుభిక్షంగా విలసిల్లాలని కోరుకుంటూ ప్రజలందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
#Ugadi#Ugadi2026
The Day. The Man. The Promise.
జనసేన లేకుండా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఉండవు.
అతనిది కోట!!! @PawanKalyan
Thanks to everyone for being a part of this incredible journey..
Jai Hind! 🇮🇳
#JSPFormationDay
రాజమండ్రి విమానాశ్రయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కలిశారు. వేట్లపాలెంలో సంభవించిన భారీ పేలుడు ఘటనపై చర్చించుకున్నారు. ఈ చర్చలో రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి శ్రీ నారాయణ గారు పాల్గొన్నారు.