మోదీ ప్రసంగాలు ఖాళీ గ్యాస్ సిలిండర్లను నింపలేవు
————————————————
ఎల్పీజీ ధరల భారీ పెరుగుదలతో పాటు సరఫరా లోపాలు పెరుగుతున్న పరిస్థితిని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (CPI) తీవ్రంగా ఖండిస్తోంది. గృహ వినియోగ సిలిండర్‌పై ₹60 మరియు కమర్షియల్ సిలిండర్‌పై ₹115 పెంపు చేయడం, పైగా అనేక ప్రాంతాల్లో సరఫరా లేకపోవడం వల్ల లక్షలాది కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వంటగ్యాస్ కోసం మండుతున్న ఎండలో గంటల తరబడి క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి ప్రజలకు ఏర్పడింది.
పని చేసే కుటుంబాలకు L P G అత్యవసరమైన అవసరం అయినప్పటికీ, మోదీ ప్రభుత్వం కు ముందుచూపు లేని కారణంగా అది రోజువారీ పోరాటంగా మారింది. కమర్షియల్ సిలిండర్లపై ఆధారపడే చిన్న హోటళ్లు, టీ స్టాళ్లు, ఢాబాలు, రెస్టారెంట్లపై కూడా దీని ప్రభావం తీవ్రంగా పడుతోంది. పెరుగుతున్న ధరలు మరియు అసమాన సరఫరా కారణంగా అనేక వ్యాపారాలు తాత్కాలికంగా మూతపడే పరిస్థితి ఏర్పడుతోంది. దీనివల్ల చిన్న వ్యాపారులు, కార్మికుల ఉపాధి ప్రమాదంలో పడుతోంది.
ఈ సంక్షోభం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వపు దూరదృష్టి లేని విధానాలు మరియు తప్పు ప్రాధాన్యతల ఫలితమే. అమెరికా–ఇజ్రాయెల్‌తో విమర్శాత్మక విశ్లేషణ లేకుండా వారితో కలిసిపోతూ తీసుకున్న విదేశాంగ నిర్ణయాల ప్రభావం భారతదేశ ఇంధన భద్రత మరియు సరఫరా వ్యవస్థపై ఎలా పడుతుందో ప్రభుత్వం ముందుగా అంచనా వేయడంలో విఫలమైంది. వినియోగదారులను రక్షించాల్సిన ప్రభుత్వం ప్రజలపై భారాన్ని మోపింది.
ఈ వైఫల్యాల ఫలితాలను ఎదుర్కొనే బదులుగా, ప్రధానమంత్రి ప్రతిపక్షంపై దాడులు చేయడంలోనే బిజీగా ఉన్నారు. ఆయన ప్రసంగాలు మరియు రాజకీయ వాగ్దాటి భారతదేశంలోని పని చేసే ప్రజల వంటగదుల్లో ఇంధనంగా మారలేవు.
ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువగా ఉన్నప్పుడు, అలాగే రష్యా మరియు ఇరాన్ వంటి దేశాల నుండి తక్కువ ధరకు చమురు అందుతున్న సమయంలో, చమురు కంపెనీలు మరియు రిఫైనరీలు భారీ లాభాలు సంపాదించాయి. కానీ ఆ లాభాల ప్రయోజనం పెట్రోల్, డీజిల్, సిఎన్జీ మరియు ఎల్పీజీ వినియోగదారులకు ఇవ్వబడలేదు. బదులుగా 2014 తర్వాత బీజేపీ ప్రభుత్వం గృహ వినియోగ ఎల్పీజీ సబ్సిడీని క్రమంగా తగ్గిస్తూ ధరలను పెంచింది.
ఇప్పుడు ప్రభుత్వ విదేశాంగ పర్యటనలు మరియు ప్రచారార్బాట అవకాశవాద రాజకీయాలు ప్రజలకు కొత్త ఇబ్బందులను తెచ్చినప్పుడు, బాధ్యతను స్వీకరించే బదులుగా వినియోగదారులపై భారాన్ని మోపుతూ ప్రతిపక్షాన్ని నిరాధారంగా నిందిస్తోంది.
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా తన పార్టీ యూనిట్లు మరియు మాస్ సంస్థలను ప్రజలతో కలిసి నిలబడమని పిలుపునిస్తోంది. పెరుగుతున్న ఈ కష్టాలపై నిరసనలు నిర్వహించాలని కోరుతోంది. భారీ కార్యక్రమాలు, పాంప్లెట్లు, సామాజిక మాధ్యమ ప్రచారాల ద్వారా బీజేపీ ప్రభుత్వపు వైఫల్యాలు మరియు అసత్యాలను బయటపెట్టి, ప్రజలకు ఉపశమనం కల్పించాలనే డిమాండ్‌తో ప్రజలను సంఘటితం చేయాలని CPI ప్రకటిస్తోంది.