"నవీన్ యాదవ్ శరీరం మాత్రమే BC ది.. అతని మెదడు అంతా రేవంత్ రెడ్డి ది"
🔷🔸🔷🔸🔷🔸🔷🔸🔷
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో "https://t.co/XrOXoWD2SF -JAC" గా, "42% BC రిజర్వేషన్ల సాధన సమితి" గా DSP గా..మేము ఎవరికి మద్దతు ఇవ్వడం లేదు ఎవరైనా ఇచ్చుకున్న అది వారి వ్యక్తిగత,వారి సొంత సంఘాల తరపు నుండి మాత్రమే.
అక్కడ పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి "నవీన్ యాదవ్ శరీరం BC సామాజిక వర్గానిదే కానీ అతని మెదడు మాత్రం రేవంత్ రెడ్డిది. (నవీన్ యాదవ్ మనోడే కానీ అతని ధమాక్ దుష్మన్ చేతి లో ఉంది)
అలాంటప్పుడు అతని ద్వారా BC ప్రయోజనాలు నెరవేరడం అసాధ్యం కదా. నవీన్ ఒక యాదవ తోలు బొమ్మ..అతడిని ఆడించేదీ మొత్తం రేవంత్ రెడ్డి.
అందుకే అగ్రకులాల మూడు పార్టీలైన కాంగ్రెస్,BRS,BJP పార్టీలను మూడు కిలోమీటర్ల లోతులో బొంద పెడదాం.
మమ్మల్ని మా నాయకత్వాన్ని గౌరవించి, అనుసరించి అభిమానించే వారు ఎవరైనా ఉంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోటీలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులైన BC,SC,ST మరియు ముస్లిం అభ్యర్థుల లో మీకిష్టమైన వారికి మీ అమూల్యమైన ఓటు వేయగలరని విజ్ఞప్తి. లేదా నోటా కి వేయండి. ఇక జూబ్లీ హిల్స్ ఎన్నికలలో వందల కోట్ల రూపాయలు పంచుతుంటే..నిరోధించకుండా ప్రేక్షక పాత్ర వహిస్తున్న ఎలెక్షన్ కమిషన్ మొదటి నేరస్థుడి గా భావించాల్సి వస్తుంది.
#JubileeHillsByElection
#BCSCST
#ElectionCommissionOfIndia
అందరికీ..76 వ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు.
ఈ సందర్భం గా రాజ్యాంగ స్ఫూర్తి ని స్మరించుకుని ,రాజ్యాంగ సూత్రాన్ని,దాని గమ్యాన్ని మది లో నింపుకొని, ఆ ప్రేరణ తో..భారత గణతంత్ర రాజ్య నిర్మాణాన్ని సంపూర్ణం గా అమలుచేయడానికి...సిద్ధపడదాం. అందులో భాగం గానే 90% BC ,SC,ST లు గా బతుకుతున్న 100 కోట్లమంది పేద ప్రజల కోసం "రిజర్వేషన్ల ఉద్యమ యుద్ధాన్ని" తిరిగి నిర్మిద్దాం. ప్రతి ఒక్కరూ..రిజర్వేషన్ల సాధన సంకల్పాన్ని తీసుకుందాం. ఫూలే,సాహు,అంబేద్కర్,కాన్షీరామ్ కలల్ని సాకారం చేద్దాం.
#ConstitutionDay
#Reservationsmovement
#BCSCST
"ఆత్మహత్య చేసుకొనే వారు ఎన్నటికీ అమర వీరులు కాదు"
ఆ విధంగా కీర్తించకండి.అట్లా కొనియాడే వారికి విజ్ఞప్తి చేస్తున్న.
🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷
ఆత్మహత్య చేసుకునే వారిని "అమరవీరులు" "తొలి అమరుడు" 'అమరత్వం' ...ఇలాంటి పదాలు అనవద్దు. ఆత్మహత్య చేసుకున్న వారిని పిరికివారు, మార్గం తెలియని అమాయకులు అనండి. అంతేగాని...వారిని పట్టుకుని అమరత్వం, అమరవీరుడు, BC తొలి అమరుడు అంటే అది గొప్పదిగా, గర్వంగా హుందా తో కూడిన గౌరవంగా, ఉద్యమ వీరుడుగా వారు భావించుకొని.. తెలంగాణలో మంచి మనసు ఉండి ,భావోద్వేగ BC,SC,ST అమాయకులంతా ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం ఉంది. సమస్య పరిష్కారం కొరకు శాంతియుత, ప్రజాస్వామ్య పోరాటం,యుద్ధం చేయాలి, ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవాలి,భావజాల వ్యాప్తి చేస్తూ, ప్రజలకు నాయకత్వం వహించి వారిని మనమే కన్నబిడ్డలుగా చూడాలీ. ఆ పోరాట జీవితంలోనే కాల ధర్మం చెందటం,లేదా పాలక వర్గాల చేతిలో నష్ట పోవడం అమరత్వం అవుతుంది తప్ప ఆత్మహత్యలు చేసుకొనే వార్ని అమరవీరులు గా కీర్తించవద్దు
ఆత్మహత్య చేసుకున్న వారిని అమర వీరులు అనడం అగ్రకులాల కుట్ర. ఎందుకంటే మన చావులు వారికి కావాలి దానితో వారు సింహాసనం ఎక్కాలి కాబట్టి. కానీ మనకి.. మన వారు బతకటం కావాలి." ఫూలే - అంబేడ్కర్ - కాన్షిరాం "ల మార్గమే మనకు ఆదర్శం.
మంచి మనసు ఉండి, జీవిత, పోరాట మార్గం తెలియకుండా ఈశ్వర చారి 42% బీసీ రిజర్వేషన్ల కోసం చనిపోతే... 1)ప్రభుత్వం కళ్ళు తెరిచి సమస్యను వెంటనే పరిష్కరించాలి , 9th షెడ్యూల్లో BC 42% రిజర్వేషన్లను చేర్చాలి.
2. ఈశ్వర చారి కుటుంబానికి ఒక కోటి రూపాయలు పరిహారం చెల్లించాలి .
3. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి.
4. ఈశ్వర చారి మృతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరపాలి. తన చావుకి కారణమైన ప్రేరేపిత శక్తుల్ని శిక్షించాలి.
#BCSCST
#Telangana
#Constitution
#reservations
రాజేష్ తల్లిని..పోలీస్ అధికారులు లొంగదీసుకున్నారూ,మమ్మల్ని ఒంటరివాళ్ళని చేశారు.
🔸🔹🔸🔹🔹🔸🔹
పోలీసుల చేతిలో హత్యకు గురైన కోదాడ మాదిగ దళిత యువకుడు కర్ల రాజేష్ కి న్యాయం జరగాలని నిన్నటి నుండి కోదాడ పట్టణం లో రాజేష్ డెడ్ బాడీ ని పెట్టుకొని భారీ ధర్నా చేయడం జరిగింది... ప్రధానం గా పోలీసుల మీద చర్య తీసుకోవాలి & కుటుంబానికి కంపెన్సేషన్ ఇవ్వాలి అనే డిమాండ్స్ తో. అర్ధరాత్రి నుండి అనేక మంది పోలీస్,రెవెన్యూ అధికార్లు మధ్యవర్తులు గా వచ్చారు.. వారు కేవలం కుటుంబానికి నష్టపరిహారం గా,అమౌంట్ ని పోస్ట్ ఆఫీసులో FD చేస్తాము, ఉద్యోగం,ఇల్లు ఇస్తాము అని వాగ్దానం ఇస్తున్నారు కానీ,పోలీసుల పై మాత్రం చర్య తీసుకోలేము అంటున్నారు.ఫైనల్ గా రాజేష్ తల్లి,కుటుంబ సభ్యులు పోలీసులకి ,అధికారులకు లొంగి పోయి,రాజీ పడ్డారు,శవాన్ని దహనం చేయడానికి సిద్ధపడ్డారు, నన్ను నా బృందాన్ని ఒంటరివాళ్ళని చేశారు.. ఐనా మేము లీగల్ గా ఫైట్ చేస్తాం,పోలీసులపై హత్య నమోదు కేసు కోసం పోరాడుతాం అని ప్రకటిస్తున్నాం.
@TelanganaDGP@CollectorSRPT
#JusticeforKarlaRajesh
#AtrocitiesonDalits
#Telangana
కాళేశ్వరం కమీషన్ లో ఇక అగ్రవర్ణాలందరికి సమాన వాటాలు...!
కాళేశ్వరం ద్వారా KCR కి,రేవంత్ రెడ్డి ద్వారా రాహుల్ గాంధీ కి, CBI ద్వారా BJP పార్టీ కి,
ఇదే అంతిమంగా జరిగేది - ఇదే అగ్రవర్గ సంస్కృతి.
కాళేశ్వరం అణగారిన వర్గాలకు శనీశ్వరం
#KaleshwaramProject#Telangana#BCSCST
కాళేశ్వరం కమీషన్ లో ఇక అగ్రవర్ణాలందరికి సమాన వాటాలు...!
కాళేశ్వరం ద్వారా KCR కి,రేవంత్ రెడ్డి ద్వారా రాహుల్ గాంధీ కి, CBI ద్వారా BJP పార్టీ కి,
ఇదే అంతిమంగా జరిగేది - ఇదే అగ్రవర్గ సంస్కృతి.
కాళేశ్వరం అణగారిన వర్గాలకు శనీశ్వరం
#KaleshwaramProject#Telangana#BCSCST
సీఎం సొంత జిల్లా నారాయణపేట, ధన్వాడ మండల కేంద్రంలోని ప్రభుత్వ మాడల్ స్కూల్ గర్ల్స్ హాస్టల్లో 15 రోజుల నుంచి సెప్టిక్ ట్యాంక్ నిండి దుర్వాసన రావడంతో విద్యార్థినిలు దైనందిన జీవితం అస్తవ్యస్తమై రోడ్ల పై కి ఎక్కారు, CM తన సొంత జిల్లా నే పట్టించుకునే దిక్కు లేదు, ఇగ రాష్ట్రాన్నేం బాగుచేస్తాడు, ఈ హాస్టల్ లో ఘోరమైన పరిస్థితికి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి వహించాలి... ఈ సమస్యను వెంటనే సీఎం పరిష్కరించాలని BC,SC,ST JAC గా డిమాండ్ చేస్తున్నాం.
@TelanganaCMO@revanth_anumula
#RevanthReddy
CM రేవంత్ రెడ్డి..! అవి సన్న బియ్యం కాదు,దున్న బియ్యం.
🔹🔸🔹🔸🔹🔹🔸
CM రేవంత్ రెడ్డి..! అవి సన్న బియ్యం కాదు,దున్న బియ్యం.మొత్తం ప్రభుత్వ స్కూల్స్ లో,సంక్షేమ హాస్టల్స్ లో విద్యార్థులకు ,దున్న(లావు) బియ్యాన్ని మిల్లులో రీసైక్లింగ్ చేసి సన్న బియ్యం మాదిరి గా చేసి పెడుతున్నారు..ఇది..మా భూమి రథ యాత్ర లో స్వయంగా మా పరిశీలనలో వచ్చిన నిజాలు..వెంటనే..మీరు తగు సంబంధిత అధికారులకు చెప్పి ఈ పద్ధతిని మార్చండి,అదే విధం గా నాసిరకం పప్పు,గుడ్లు,నీళ్ళ చారు ఇస్తున్నారు..వంట చేసే వారికి ఇప్పటివరకు బిల్లులు రావడం లేదు..మీరు తగు ఆదేశాలు ఇవ్వక పోతే..ఈ పరిస్థితికి మీరే బాధ్యులుగా ప్రకటిస్తాం
@revanth_anumula@TelanganaCMO
#BCSCSTJAC
#Telangana
సీఎం రేవంత్ రెడ్డి సాబ్.. ఉప రాష్ట్రపతి గా..గొల్ల కురుమ వర్గ మైన బండారు దత్తాత్రేయ గారిని నియమించ మని సలహా ఇచ్చినట్లుగానే... మీరు కూర్చున్న ముఖ్యమంత్రి సింహాసనం నుండి మీరు వైదొలగి..ఆ స్థానం పై బీసీ గొల్ల కురుమ కులస్తుడైన "బీర్ల ఐలయ్య" ఆలేరు MLA గారిని ముఖ్యమంత్రి గా కూర్చోబెట్టాలని సూచిస్తున్నాం.అప్పుడే మీరు చేసిన కులగణ నకి సార్థకత. @revanth_anumula
#BeerlaIlaiah
#Castecensus
#BCSCST
#Telangana
కెసిఆర్ రెడ్డి ఐతే...అతడే రేవంత్ రెడ్డి.
🔹🔸🔹🔸🔹🔸🔹
కెసిఆర్ రెడ్డి ఐతే...అతడే రేవంత్ రెడ్డి.కేసీఆర్ ప్రభుత్వం ఇంకా పోలేదు...దానికి కొనసాగింపు గా నడుస్తున్న ప్రభుత్వమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అందుకే తెలంగాణ భూమిని వెలమ,రెడ్లు రోజు భోంచేస్తున్నారు. బీసీ,ఎస్సీ,ఎస్టీ ప్రజలారా సోయి తో బతకండి,సమరానికి సిద్ధం కండి.
#KCR
#RevanthReddy
#BCSCST
జార్ఖండ్ రాజ్య సృష్టికర్త..ప్రజా వీరుడు శిబూ సొరేన్ మరణం..తీవ్ర బాధాకరం, అణగారిన కులాల ఆత్మ గౌరవ యోధుడా...! నీ యుద్ధ ప్రేరణతో తెలంగాణ లో కూడా పీడితుల రాజ్యాన్ని స్థాపిస్తాం.
#TributeToShibuSoren#Telangana
*ఆగస్టు 9- న "వరల్డ్ ఇండీజనస్ పీపుల్ డే" అంటే...బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజల దినోత్సవం అని అర్ధం (ఈ రోజు ST ల దినోత్సవం అని కాదు అర్థం.) ఈ దేశ మూల వాసులైన 100 కోట్ల మంది బీసీ,ఎస్సీ,ఎస్టీ లందరి జన్మ దినోత్సవం.*
- డా విశారదన్ మహారాజ్
*నేడు ఆగస్టు 9 న "ప్రపంచ మూలవాసి స్వదేశీయుల దినోత్సవం"*
ఎవరు ఆ... మూలవాసు లైన ప్రజలు...? భూమాత గర్భాన్ని చీల్చుకొని పుట్టిన భూమి పుత్రులు, ఈ దేశ స్థానిక మూలవాసులు, ఈ దేశ నిర్మాతలు,సమస్త వృత్తి,ఉత్పాదక కులాలు. మొట్ట మొదట గణ రాజ్యాలని ఏలిన గణ రాజులు,న్యాయం, ధర్మం సమానత్వం తో,మాతృస్వామిక వ్యవస్థతో..నాగరిక సమాజాన్ని నిర్మించిన ప్రకృతి బిడ్డలు. వారే..ఈ బీసీ,ఎస్సీ,ఎస్టీ లైన ఇండీజనస్ జంబుద్వీప భారత ప్రజలు. ఆదివాసీలు..అంటే.. ఎస్టీ..లు అని కాదు."ఆది....వాసి" అంటే ఈ భూమి పై మొట్ట మొదటి నివాస స్థానికులు అని అర్థం. అందుకే వీరు ఈ దేశానికి,ఈ భూమి కి యజమానులు. పరాయి వారు ఈ మూలవాసుల పై యుద్ధం చేసి ఓడించి, ఇక్కడి స్థానికుల్ని బానిసలు గా మార్చుకొని ఈ అగ్రవర్ణాలు అధికారానికి వచ్చారు.ఈ మొత్తం చరిత్రని,సంస్కృతిని మనమంతా స్మరించుకుని ..భవిష్య సంకల్పాన్ని ఏర్పర్చు కోవడానికి కావాల్సిన ప్రేరణ పొందటాని కే..ఈ ఇండిజినస్ డే. ఈ మూల వాసుల దినోత్సవం. భారత రాజ్యాంగం ద్వారా తిరిగి ఈ దేశ ఆది,మూల వాసులైన బీసీ,ఎస్సీ,ఎస్టీ లు తిరిగి తమ రాజ్యాన్ని,కల్చర్ నీ నిర్మించు కోవాలి. అందరికీ ఇండీజనస్ పీపుల్స్ డే (ఆది వాసుల దినోత్సవ) శుభాకాంక్షలు.
#IndigenousPeoplesDay2025
గణతంత్రం లేని స్వాతంత్ర్యమా..!
🔹🔸🔹🔸🔹🔸
గణతంత్రం లేని స్వాతంత్ర్యమా..! భారత రాజ్యాంగం ఎప్పుడు సంపూర్ణంగా అమలు అవుతుందో..అప్పడు మాత్రమే భారత ప్రజలకు నిజమైన,అసలైన స్వాతంత్ర్యం లభిస్తుంది.భారత రాజ్యాంగమే కొలమానం మీటర్... దీన్ని తీసుకొని వీరి పాల (న) లో నీళ్ళు ఎన్ని కలిసాయో క్లియర్ గా చూడవచ్చు. ఈ మీటర్ తో దొంగల్ని క్షణం లో పట్టు కోవచ్చు.
#IndependenceDay
#Constitution
BC,SC,ST ఉద్యమాలకు భయ పడ్డ 'గడీ'లు
అందుకే మార్వాడీ ఉద్యమ రంగ ప్రవేశం రెడీ
🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸
రెడ్డి, వెలమ దొరల గడీ లను కూల్చే BC,SC,ST ల ఉద్యమాన్ని అంతం చేయాలంటే "మార్వాడీ - గో బ్యాక్ " ఉద్యమాన్ని ప్రారంభించాలి.
ఇదే.. కాంగ్రెస్,BRS, BJP రెడ్డి,వెలమ దొరల భారీ స్కెచ్.
🔹 అందుకోసం ఎలాంటి వ్యాపారం లేని, దుకాణం లేని, అమాయక పేద SC,ST,BC లను ముందు పెట్టాలి, కోమటోళ్లను వెనుకపెట్టి వారితో పైసలు పెట్టించాలి... ఉద్యమాలు అంటూ నడిపించాలి.
🔹 కాంగ్రెస్ ప్రభుత్వం...చాట్ల తవుడు పోసి కుక్కల పంచాయతీ పెట్టినట్టు...స్థానిక తెలంగాణ వైశ్యుల వ్యాపారాన్ని దెబ్బతీస్తున్న " మార్వాడీ వైశ్యు లపై చర్యలు ప్రారంభించే దమ్ముందా"..?
🔹 అదే BC,SC,ST -JAC & ధర్మ సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తే 24 గంటల్లో ఒక లక్ష లారీ లను తెప్పించి అందులోకి మార్వాడీ లను, వారి దుకాణాల సామాన్లను సదిరి వారి మార్వాడి ప్రాంతాల్లోకి నెట్టి పంపిస్తాం.
స్థానిక తెలంగాణ వైశ్యులకు & బీసీ,ఎస్సీ,ఎస్టీ లకు వారి జనాభా ను బట్టి దుకాణాలను ఏర్పాటు చేసి వ్యాపారం చేపిస్తాం.
🔹అంతే కానీ... ఈ పాలక అగ్రకుల పార్టీలు మార్వాడి లపై ఏ చర్యలు లేకుండా.. రోడ్ల పై కొట్లాటలు పెట్టించి, అగ్గి రాజేసి దాంట్లో అమాయక SC,ST,BC లను కాల్చి బూడిద చేసే పన్నాగం లో ఉన్నారు.
🔹ఇప్పటికే.... తెలంగాణ ఉద్యమంలో, కమ్యూనిస్ట్, నక్సలైట్ ఉద్యమాలలో మన తాతలు, అయ్యలు, అన్నలు, అక్కలు ఐన లక్షల మంది SC,ST,BC లు పాల్గొని అంతమై పోయారు. తర తరాల కాలమంతా వృధా అయిపోయింది.
🔹 తెలంగాణ అమాయక SC,ST,BC ప్రజలారా...!
మీ ముందుకు..ఏ ఉద్యమం వచ్చినా అది ఫూలే, అంబేడ్కర్, కాన్షిరామ్ ఉద్యమానికి కొనసాగింపా..? కాదా? అని చూడాలి. మరియు మనం చేసే ఉద్యమం ద్వారా వచ్చే ఫలం లో మన వాటా ఎంత? (మార్వాడీలు మన తెలంగాణ నుండి వెళ్ళిపోతే ఆ వ్యాపారం మన BC,SC,ST లకు వస్తుందా..?) మనం పాల్గొనే ఉద్యమం మనకు రాజ్యాధికారం అందిస్తుందా..? లేదా..? మరియు ఇది శాంతియుత - ప్రజాస్వామ్య ఉద్యమమేనా అని చూడాలి. మనల్ని అన్యాయం గా కేసుల్లో ఇరికించి మన జీవితాలను ఆగం చేస్తుందా..?
ఇవన్నీ అంచనా వేసుకొని... మన ముందుకొచ్చే ఉద్యమాల్లో ప్రవేశించమని BC,SC,ST ప్రజలకు, ఆ వర్గ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం.
రెడ్డి, వెలమ దొరలతో పాటు మన BC,SC,ST ల శత్రు వర్గంలో మార్వాడి అగ్రకులం కూడా ఉంటుంది. కానీ ఆర్డర్ ఆఫ్ వర్క్ ప్రయారిటీలో ఏ ఉద్యమం ముందు ఏది వెనుక అనేది ప్రధానం. అసలు అన్నింటిని నిర్ణయించేది, నియంత్రించేది రాజ్యాధికార ఉద్యమం... అధికారం మన BC,SC,ST ల చేతిలోకి వస్తే అందరి ఆటల్ని నియంత్రించవచ్చు( మార్వాడీల దుకాణల్ని ఒక్క క్షణం లో బంద్ చేయవచ్చు) అందుకని మన శక్తిని, కాలాన్ని వృధా చేసుకోకుండా మన పితరులు "ఫూలే, అంబేడ్కర్,కాన్షీరాం లు, రాజ్యాంగం ఇచ్చిన మార్గంలో నడుద్దాం - అధికారాన్ని సాధిద్దాం.
🔹"రెడ్డి,వెలమ దొరల అధికారం హటావో-
BC,SC,ST తెలంగాణ బచావో"🔸
నోట్: తెలంగాణ లో వ్యాపార,రాజకీయ,సామాజిక,సాంస్కృతిక ఆధిపత్యం చలాయిస్తు,దోపిడి చేస్తున్న.. రెడ్డి,వెలమ,కమ్మ,కాపు,కరణం,బ్రాహ్మణ, వైశ్య వర్గాలపై మనకు స్పష్టమైన అవగాహన ఉండాలి..వీరితో మార్వాడి అగ్రకులాలు ఆర్థిక,అధికార వర్గం గా కలిసే ఉంటాయి(కాంగ్రెస్,BJP, BRS పార్టీలకు కోట్ల రూపాయలు చందాలు ఇచ్చి అధికారం లో తెర వెనుక భాగస్వాములుగా ఉంటారు, వ్యాపారం లో కూడా వాటా దారులుగా ఉంటారు)
అదే మార్వాడి ప్రాంతం నుండి చిన్న,చిన్న వ్యాపారాలు (కూలీ మందం) చేయడానికి వచ్చి న ఎస్సీ, ఎస్టీ,బీసీ ల పై సానుభూతిని కలిగి వుండాలి.ఆనాడు ఇది లేకనే తెలంగాణ ఉద్యమం అని పోరాడి ఆంధ్ర వాళ్ళ నుండి అధికారాన్ని తీసుకొచ్చి తెలంగాణ లో మనల్ని దోపిడీ చేసే రెడ్డి,వెలమ దొర ల కు అధికారాన్ని అప్పచెప్పాము.
#Telangana
#BCSCST
#MarvadiMovement