అన్న పోలీసులు పట్టుకున్నారు. కాపాడన్నా.
నువ్వేం కంగారు పడకు..
1) ఫోన్ తీసుకో
2) ప్లే స్టోర్ ఓపెన్ చేయి
3) రప్పా రప్పా యాప్ డౌన్ లోడ్ చేసుకో
4) లాగిన్ అవ్వు
5) otp వస్తుంది ఎంటర్ చేయి
6) అక్కడ 11 పేజీల ఫామ్ ఉంటుంది.
7) షిక్కటి షిరునవ్వుతో ఫిల్ చెయ్యి
8) లాస్ట్‌లో why not 175 అనే బటన్ మీద
క్లిక్ చెయ్యి
9) 4 ఏళ్లు కళ్ళు మూసుకో.. అందరికీ
సినిమా చూపిద్దాం ఓకేనా అని మెసేజ్ వస్తుంది
10) కింద "షిద్ధం" బటన్ మీద క్లిక్ చెయ్యి
11) అంతే ఇంక అంతా దేవుడు షూసుకుంటాడు🤫
(సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటే… సమకాలీన రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టేలా ఉందని షేర్ చేస్తున్నాను. అజ్ఞాత సృష్టికర్త సృజనాత్మకతకు అభినందనలు.)
కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డుల కార్యక్రమం లో రాష్ట్రం నుండి మూడు మున్సిపాలిటీలు ఎంపిక కాబడి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని , రాష్ట్రం నుండి ఎంపిక కాబడిన 3 మునిసిపాలిటీలలో ఒకటైన రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మరియు సిబ్బందిని అభినందించి సర్టిఫికెట్లను అందజేయడం జరిగింది.
@blsanthosh@JPNadda
After the programme in Thoothukudi, landed in Tiruchirappalli to a warm welcome by various dignitaries. Looking forward to tomorrow’s programme at Gangaikonda Cholapuram.
రాంచందర్ రావు ..
ఇప్పుడు తెలంగాణలో ఈ పేరు మారుమోగుతోంది.
బిజెపి తెలంగాణ నూతన సారథిగా ఈయన పేరు ఖరారవుతుందనే ప్రచారం సాగుతోంది.
ఇంతకీ ఈ రాంచందర్ రావు ఎవరంటే..
హైదరాబాద్ కు చెందిన రాంచందర్ రావు రాజనీతి శాస్త్రంలో ఎంఏతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎల్ఎల్బీ పూర్తి చేశారు.
ఎమర్జెన్సీ సమయంలో ఏబీవీపీ విద్యార్థి విభాగంలో ఎంతో యాక్టివ్ గా ఉన్న రాంచందర్ రావు, డిగ్రీ చదివే సమయంలోనే విద్యార్థి సంఘానికి నాయకత్వం వహించాడు.
విద్యార్థిగా వివిధ అంశాలపై గళమెత్తి 14సార్లు అరెస్ట్ అయ్యాడు
బిజెపి యువ మోర్చా మొదటి స్టేట్ సెక్రటరీగా నియమితుడయ్యాడు.
బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జనరల్ సెక్రటరీగా, హైదరాబాద్ నగర బిజెపి అధ్యక్షుడిగా, బిజెపి జాతీయ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా పార్టీలో సుదీర్ఘ అనుభవం సంపాదించారు.
ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో పలుమార్లు బిజెపి తరఫున బరిలోకి దిగడంతో పాటు 2015లో ఎమ్మెల్సీగా గెలిచి మంచి పేరు సంసాదించారు.
తెలంగాణ ప్రజల సమస్యలపై గళమెత్తారు, అన్నార్థుల గొంతుగా నిలిచారు.
అవినీతిని నిలదీసే నైజం ఉన్న రాంచందర్ రావు గారు.
కాళేశ్వరంపై కాగ్ ఇచ్చిన రిపోర్ట్ నేపథ్యంలో సీబీఐ చేత విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పార్టీలో సుదీర్ఘ అనుభవం,ప్రజా సమస్యలపై గళమెత్తే తత్వం, అవినీతిని నిలదీసే నైజం ఎవరికీ బెదరని ధైర్యం.. ఇప్పుడివే రాంచందర్ రావుకు బిజెపి తెలంగాణ రథసారథి పదవికి అర్హతలు గా మారాయి.
కొత్త సారథి నాయకత్వంలో కమలదళంలో నూతనోత్సాహం వస్తుందని ఆశిద్దాం.
ప్రతి నెల దేశ ప్రజలను ఉద్దేశించి ప్రియతమ ప్రధాని శ్రీ @narendramodi గారు తన అభిప్రాయాలను పంచుకునే వేదిక #MannKiBaat కార్యక్రమాన్ని రాజమహేంద్రవరం సిటీ అసెంబ్లీ 107వ పోలింగ్ బూత్ కార్యకర్తలతో కలిసి వీక్షించాను.
@blsanthosh@JPNadda#mannkibaat2025
ఉగ్రవాదులకు, పాకిస్తాన్‌కు ఆపరేషన్ సింధూర్ ద్వారా గుణపాఠం చెప్పిన భారత త్రివిధ దళాలకు, ప్రధాని
@narendramodi గారికి సంఘీభావంగా విజయవాడలో జరిగిన తీరంగా యాత్రలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ @ncbn, ఉప ముఖ్యమంత్రి శ్రీ @pawankalyan, రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి @PurandeswariBJP, జాతీయ కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్సీ శ్రీ @somuveerraju, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ @satyakumar_y మరియు ఎన్డిఏ సభ్యులు
#TirangaYatra #SindoorYatra
శ్రీకాకుళం జిల్లాకు చెందిన"మేజర్ మల్ల రాంగోపాల్ నాయుడు" భారత సైన్యం అందించే అత్యున్నత పురస్కారాల్లో రెండోదైన #కీర్తిచక్ర పురస్కారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతులమీదుగా అందుకున్న తొలి తెలుగు రైతుబిడ్డ మన రాంగోపాల్ నాయుడు కావడం మనకి గర్వకారణం.
భారత స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఏటా సైనికులు ఇచ్చే గ్యాలంట్రీ అవార్డులను ఈ ఏడాదికి సంబందించి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మొత్తం 4 కీర్తి చక్ర అవార్డులను ప్రధానంచేశారు.ఇందులో ముగ్గురు అధికారులు వీర మరణం పొందాక అందుకుంటే, మన రాష్ట్రానికి చెందిన మల్ల రాంగోపాల్ నాయుడు మాత్రం స్వయంగా ముర్ము చేతుల మీదుగా అవార్డును అందుకుని సగర్వంగా నిలిచారు.
శ్రీకాకుళం జిల్లా,సంతబొమ్మాళి మండలం, నగిరిపెంట గ్రామానికి చెందిన సన్నకారు రైతు అప్పలనాయుడు కుమారుడైన నాయుడికి చిన్నప్పటి నుంచే సైన్యంలో చేరాలని కోరిక ఉండేది.అందుకు కష్టపడి విజయనగరం జిల్లాలోని కోరుకొండ సైనిక స్కూల్ లో విద్యాభ్యాసం పూర్తి చేసి, 2012లోనే నేషనల్ డిఫెన్స్ అకాడెమీ (ఎన్డీఏ) పరీక్ష ద్వారా నాయుడు భారత సైన్యంలోకి ప్రవేశించారు. డెహ్రాడూన్ లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ నుంచి బంగారు పతకంతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.అనంతరం ఇండియన్ ఆర్మీలో లెఫ్ట్ నెంట్ హోదాలో అడుగుపెట్టిన నాయుడు, 2022 లో మేజర్ హోదా పొందారు.
ప్రస్తుతం 56 రాష్ట్రీయ రైఫిల్స్ లోని మరాఠా లైట్ ఇన్ ఫాంట్రీలో మేజర్ హోదాలో పనిచేస్తున్న నాయుడు, జమ్ము కశ్మీర్ లోని కుప్వారాలో నియంత్రణ రేఖ వెంట ఉగ్రవాదులను మట్టుబెట్టే విషయంలో అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించారు.2023లో జరిగిన ఈ ఆపరేషన్ లో నాయుడు సాహసోపేతమైన చర్యలతో ఉగ్రవాదులు హతం చేసిన విషయాన్ని భారత ప్రభుత్వం గుర్తించి వారిని #కీర్తిచక్ర అవార్డుకు ఎంపిక చేసింది.
2023లో కుప్వారాలో ఏమి జరిగిందో తెలుసుకుందాం.అక్టోబర్ 26 ఉదయం నాయుడు క్యాంపునకు సమీపంలో ఉగ్రవాదులు ఉన్నట్లుగా సమాచారం అందింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా మేజర్ నాయుడు నేతృత్వంలో మరాఠా లైట్ ఇన్ ఫాంట్రీ బెటాలియన్ తో పాటు 56 రాష్ట్రీయ రైఫిల్స్ సైనికులు రంగంలోకి దిగిపోయారు. ఉగ్రవాదులు కంటబడినంతనే తన బృందానికి నాయకత్వం వహిస్తున్న నాయుడు, నాయకుడిగా అందరి కంటే ముందు ఉండి కదిలారు.ఉగ్రవాదులను చీల్చిచెండాడుతూ కదిలారు.ఈ క్రమంలో ఇద్దరు ఉగ్రవాదులు తమకు సమీపంలోని ఓ గుహలో దాక్కోగా, నాయుడు తన బృందాన్ని సేఫ్ మోడ్ లోనే ఉంచి,తను ఉగ్రవాదులపైకి లంఘించారు. తమపైకి సింహంలా దూకుతూ వస్తున్న నాయుడును చూసి ఉగ్రవాదులు గ్రెనేడ్లను విసిరుతున్న, తనప్రాణాలను సైతం ఏమాత్రం లెక్కచేయకుండా వాటినుంచి తప్పించుకుంటూ ఉగ్రవాదులకు అతిదగ్గరికి చేరి,ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు.
మన రాష్ట్రానికి చెందిన రాంగోపాల్ నాయుడు నిన్న #కీర్తిచక్ర పురస్కారం అందుకోవడం మనందరికీ గర్వకారణం.
🇮🇳 జైహింద్ 🇮🇳