దువ్వ గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ కేదారి రాము గారి మేనకోడలు కుమారి ఈలి రేణుక నూతన వస్త్రాలంకరణ వేడుకలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించడం జరిగింది…ఈ సందర్భంగా చిన్నారి ఈలి రేణుకకు ఉజ్వల భవిష్యత్తు కలగాలని ఆకాంక్షిస్తూ, కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేసెను
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తణుకు పట్టణంలోని SKSD మహిళా కళాశాలలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది.
యోగాను ప్రతి ఒక్కరూ తమ నిత్యజీవితంలో భాగంగా చేసుకుని ఆరోగ్యవంతమైన జీవనం సాగించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చాను.
#InternationalYogaDay
మన రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం మరింత ముందుకు సాగాలంటే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చాను. ప్రజల ఆశయాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని మరొక్కమారు తెలియచేస్తున్నాను.
గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి చేపట్టిన కార్యక్రమాలను వివరించాను. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు వంటి కీలక పనులను వేగవంతం చేస్తూ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.
#RenduYellaNammakam
మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం-జనసేన-భారతీయ జనతా పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా భీమవరం మండలం పెదమిరం గ్రామంలోని రాధాకృష్ణ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన విజయోత్సవ సభలో పాల్గొనటం జరిగింది.
కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా భీమవరం విజయోత్సవ సభలో పాల్గొనడం జరిగింది. అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ, ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసి పనిచేయాలని పిలుపునివ్వడం జరిగింది.
#RenduYellaNammakam#Tanuku
రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” విజయోత్సవ సభను తణుకులో ఘనంగా నిర్వహించాం. గత రెండేళ్లలో తణుకు నియోజకవర్గంలో ₹2,000 కోట్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యాయి. ఇదే స్ఫూర్తితో మరింత అభివృద్ధి కోసం ముందుకు సాగుతూ, రాబోయే ఎన్నికల్లో విజయం సాధిద్దాం.
#RenduYellaNammakam
రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం
కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తైన సందర్భంగా తణుకులో విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించాం.
తణుకు నియోజకవర్గంలో ₹2,000 కోట్లకు పైగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం.
ఇరగవరం మండలం రేలంగి గ్రామంలోని శ్రీ చిన్న మండలమ్మ, పెద్ద మండలమ్మ ఆలయాలను సందర్శించి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో ఉండాలని అమ్మవారిని ప్రత్యేకంగా ప్రదించడం జరిగింది
#ArimilliRadhaKrishna
ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న పైడిపర్రు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త శ్రీ నల్లా సత్తిబాబు గారి నివాసానికి వెళ్లి పరామర్శించడం జరిగింది. అలాగే ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, అవసరమైన వైద్య సేవలు అందుతున్నాయా అని తెలుసుకొని ధైర్యం చెప్పడం జరిగింది
" ప్రజల సంక్షేమం, రాష్ట్ర ప్రగతి ధ్యేయంగా నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఇది కేవలం పాలన కాదు.. స్వర్ణాంధ్ర నిర్మాణానికి పునాది ”
#2YrsOfTrustDevelopmentWelfare#IdhiManchiPrabhutvam
ప్రజా పాలనకు రెండు ఏళ్ళు… అభివృద్ధికి స్వర్ణ అధ్యాయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా, ప్రజా సంక్షేమం - అభివృద్ధి అనే ద్విచక్రాలతో ముందుకు సాగుతున్న సువర్ణ పాలనకు ఇది నిదర్శనం.
#2YearsOfHistoricVictory
ఇరగవరం మండలం తూర్పు విపర్రు గ్రామానికి చెందిన అడ్డగర్ల వెంకటేశ్వరరావు గారి మాతృమూర్తి శ్రీమతి అడ్డగర్ల వెంకటరత్నం గారు ఇటీవల పరమపదించగా, వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది…వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రదిస్తునాను