🚨 రేవంత్ నోట అరాచక భాష.. అదే ప్రేరణగా పేట్రేగుతున్న అసాంఘిక శక్తులు 🆘
⛔ యథా రాజా.. తథా క్రిమినల్స్ 🛑
📣 ప్రతీకార ప్రసంగాల ప్రభావంతో ఉత్తేజితులవుతున్న నేరస్తులు
🚫 యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కు నైతిక ప్రేరణనిచ్చేలా బెదిరింపుల భాష
🚨 మరోవైపు హోంశాఖ పర్యవేక్షణ గాలికి! లా అండ్ ఆర్డర్ చట్టుబండలు!
📢 రెండున్నరేండ్లుగా రాష్ట్రంలో హెచ్చుమీరిన క్రైమ్.. ఎన్సీఆర్బీ ఆందోళన
🆘 హత్యలు, పిల్లలు, మహిళలపై అఘాయిత్యాలు.. అదుపు తప్పుతున్న నేరాలు
🔸 నిందితులకు అంటకాగుతున్న కాంగ్రెస్ నేతలు.. చేష్టలుడిగిన పోలీసులు
⛔ ఇదే అదనుగా రెచ్చిపోతున్న నేరగాళ్లు.. పెరిగిన దాడులు, దౌర్జన్యాలు
📈 తొలిసారి నేరాలతో జైళ్లకు చేరుతున్నవారి సంఖ్య పెరిగిందన్న జైళ్ల శాఖ
లాగుల తొండలు ఇడుస్తా! పండబెట్టి తొక్కుతా! పేగులు మెడలో వేసుకుంటా! రక్తం పొలాలకు పారిస్తా! గద్దెలు కూలుస్తా! కనుగుడ్లు పీకి గోటీలాడుతా! బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తా!.. ఇప్పుడు రాష్ట్రంలో తరచూ వినిపిస్తున్న మాటలివి. అధికార పక్షం అసహనం నుంచి, ముఖ్యనేత ఫ్రస్ట్రేషన్ నుంచి బూతులు, బెదిరింపుల వరద పారుతున్నది. రాజకీయ ప్రత్యర్థులే లక్ష్యంగా మొదలవుతున్న అరాచక భాషకు.. ఆఖరికి ప్రభుత్వ అధికారులు, మేధావులు, సామాన్యులు బాధితులుగా మారుతున్నారు. ప్రతీకార ప్రసంగాలతో నేరమయ వాతావరణం పెరుగుతున్నది. ప్రభుత్వ పెద్దల మాట తీరుతో సమాజ స్వభావం మారుతున్నది.
నేరాల సంఖ్య పెరుగుతున్నది. ఫలితంగా రెండున్నరేండ్లలో రాష్ట్రంలో క్రైమ్‌రేటు గణనీయంగా పెరిగి పోయింది. జాతీయ క్రైమ్‌రికార్డు బ్యూరో గణాంకాల ప్రకారం 2023లో 1.83 లక్షల కేసులు నమోదైతే 2024లో అవి 2.18 లక్షలకు చేరాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది.. అంటే 2024లో రాష్ట్రంలో నమోదైన తీవ్ర నేరాల సంఖ్య క్రితం ఏడాదికన్నా 273 శాతం పెరిగింది.
ఎవరినీ లెక్క చేయని ధోరణి.. ఏదైనా మాట్లాడొచ్చనే ఆలోచన.. అధికారం అండదండలు.. మౌన ప్రేక్షకులుగా మారిన పోలీసు వ్యవస్థ.. నేరస్తుల తయారీకి ఉపకరిసున్నది. ప్రభుత్వ పెద్దలు బాధ్యత మరచి అరాచక భాష మాట్లాడుతుంటే.. శాంతిభద్రతలను గాలికొదిలి, పోలీసులను పొలిటికల్ గేమ్‌లోకి దించుతుంటే.. నేరధోరణికి నీరుపోసినట్టే! అసాంఘిక శక్తులకు అవకాశమిచ్చినట్టే!
It feels like you were a toddler holding my hand just yesterday !! Time flew and here we are as you turn 21
Dear Binku, Couldn’t be more proud and happy on how you transformed from a naughty child into a confident, handsome young adult
I know what you had to endure over the last few years but I also believe that this birthday is the beginning of a fabulous journey ahead. May you scale the greatest heights and conquer all your challenges
Always remember to dream big, be kind to others and continue to stay true to yourself
I love you more than you’ll ever know and will always be your biggest cheerleader ❤️
కాళేశ్వరం అంటే కేవలం ఒక బ్యారేజ్ కాదు!
వందల కిలోమీటర్ల కాలువలు, సొరంగ మార్గాలు (టన్నెల్స్), ఆసియాలోనే అతిపెద్ద భూగర్భ పంప్‌హౌస్‌లు, భారీ సబ్స్టేషన్లు, బాహుబలి మోటార్లు, లక్షల ఎకరాలకు జీవం పోసే విశాల రిజర్వాయర్ల సమాహారం
ఒక్క మాటలో చెప్పాలంటే… “తెలంగాణ జీవధార కాళేశ్వరం”
#KaleshwaramProject
మమ్మల్ని నరికి మా రక్తంతో పంటలు పండిస్తారంటే.. కేసీఆర్, కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలంతా సిద్ధమే
తెలంగాణ గడ్డలోని ప్రతి ఇంచుపై కేసీఆర్ చెమట రక్తాలు ఉన్నాయి
తెలంగాణ స్వేచ్ఛాయువు తీసుకోవడానికి,
తెలంగాణ ఓ భౌగోళిక రాష్ట్రంగా ఏర్పడటానికి..
కేసీఆరే కారణం!
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @jagadishBRS 🔥
కేసీఆర్ గారి ముందుచూపుతోనే ‘సీతారామ’ ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా పంట భూములకు సాగునీరు
ఉమ్మడి ఖమ్మం జిల్లా వరప్రదాయినిగా, కేసీఆర్ మానస పుత్రికగా పేరుగాంచిన సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులోని బీజీ కొత్తూరు పంపుహౌస్ నుంచి గోదావరి జలాలను విడుదల చేయడంపై బీఆర్ఎస్ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు హర్షం వ్యక్తం చేశారు.
@RegaKantharao
నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతా అంటవా..రక్త పిశాచీ!
ఇంకా తీరలేదా మీ రక్తదాహం ?
60 ఏండ్లు పీడించి తెలంగాణ నెత్తురు తాగారు కదా..సరిపోలేదా?
తెలంగాణ రక్తం రుచిమరిగిన తోడేలు కాంగ్రెస్ పార్టీకి ఇంకెంత రక్తం కావాలి?
తెలంగాణ పిల్లల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చిపారేసి ఎన్ కౌంటర్ల పేరుతో నెత్తుటేళ్లు పారించిన నరహంతకులు మీరు!
1952లో ఏడుగురు యువకులను కాల్చిచంపి రక్తం కళ్లజూసిన రాక్షసులు మీరు!
1969లో 369 మంది ముద్దుబిడ్డలపై తూటాలు కురిపించి రక్తం పారించిన ఖూనీకోర్లు మీరు!
మలిదశ పోరాటంలో వేయిమందిని బలితీసుకున్న మృగాలు మీరు!
కాంగ్రెస్ పార్టీ చేతులు తెలంగాణ బిడ్డల రక్తంతో తడిచినై..!
కాంగ్రెస్ రక్కసి కోరలకు తెలంగాణ నెత్తుటి మరకలు అంటినై..!
నీకు మా రక్తం ఎంత కావాలంటే అంత పంపిస్తాం..కానీ, నువ్వు రైతులకు నీళ్లు ఇవ్వు!
పేగులు తెగేదాకా రాష్ట్రం కోసం కొట్లాడిన వాళ్లం.. రైతుల కోసం ఎంత రక్తమైనా ధారపోయడానికి సిద్ధంగా వున్నం!
నీళ్లలో నిప్పులు పుట్టించి జలసాధన పోరాటాలు చేసిన వాళ్లం..!
నెత్తురు ఇస్తేనే..నీళ్లు ఇస్తాం అని కర్కశ కాంగ్రెస్ ప్రభుత్వం కోరుతుంటే మా నెత్తురు ధారపోస్తాం!
మీ రక్తదాహం తీర్చుకోని.. ఎండుతున్న పొలాల జలదాహం తీర్చండి!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు..
మీరు కూర్చున్నది ఉన్నతమైన, బాధ్యతాయుతమైన పీఠంపై, ఫ్యాక్షన్ గద్దె పై కాదు!
- ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ 🔥
ప్రతిపక్ష నాయకులైన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లను ఉద్దేశించి
"నరికి వాళ్ల నెత్తురు, కొవ్వు పొలాలకు పారించాలి" అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరం, అనాగరికం.
ఈ దేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే ఒక ముఖ్యమంత్రి ఇంతటి హింసాత్మక, క్రూరమైన పదజాలాన్ని వాడిన దాఖలాలు లేవు.
మీ ప్రభుత్వ చేతకానితనాన్ని సరిచేసుకుని, ఇచ్చిన హామీలను నెరవేర్చడం ద్వారానే .. రైతుల కష్టాలు తీర్చండి అంతే కానీ ఇలాంటి రక్తపాత వ్యాఖ్యలతో కాదు.
రాజకీయ వైరుధ్యాలు ఎన్ని ఉన్నా, మాట్లాడే భాషలో కనీస సంస్కారం, విచక్షణ ఉండాలి. కక్ష సాధింపులు, క్రూర కర్కోటక అమానవీయ వ్యాఖ్యలతో తెలంగాణ సమాజంలో హింసను ప్రేరేపించాలని చూస్తున్నారా ?
ఇక్కడి ప్రజలు ఈ రకమైన వైఖరిని సహించరు. ఈ మాటలు విన్న తర్వాత దైవాలగూడా హంతకుని మనస్తత్వానికి రేవంత్ మనస్తత్వానికి పెద్దగా తేడా లేదని అనిపిస్తున్నది.
ముఖ్యమంత్రి తన జుగుప్సాకరమైన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకుని, తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను.
@TheDeshapathi
రేవంత్ రెడ్డి ఇవ్వాళ పెట్టింది
రైతు ఆశీర్వాద సభ కాదు.. అది రైతు వంచన సభ!
రైతులకు ఇప్పటికే దాదాపు రూ. 30 వేల కోట్ల రైతు భరోసా పైసలు బాకీ పడ్డది కాంగ్రెస్ సర్కార్
రేవంత్.. బాకీ పడ్డ రైతు భరోసా రైతులకు ఎప్పుడు ఇస్తావ్?
నీ రైతు వంచన సభలో చెప్పాలి!
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish🔥
Proud and delighted to see yet another T-Hub incubated startup redefining the future of aerospace.
Recently, BluJ Aero, a Hyderabad-based startup, unveiled its second-generation prototype aircraft, marking a major step in scaling up its eVTOL (Vertical Take-off and Landing) ambitions.
BluJ Aero is developing hydrogen-electric and battery-powered VTOL aircraft for short-distance mobility, enabling fast passenger and cargo transport without conventional airport infrastructure.
Built entirely in Hyderabad, @BlujAero is backed by @THubHyd, whose mentorship, market access, and innovation ecosystem have helped transform the company from a promising idea into a pioneering aerospace venture.
I remember presenting them with the ‘Most Promising Innovation Award’ in 2022 on the occasion of T-Hub Foundation Day.
Wishing the BluJ Aero team continued success as they soar to even greater heights.
కన్నతండ్రికి పిల్లల మీద ఎంత ప్రేమనో..
పోరాడి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిగా కేసీఆర్ కి తెలంగాణ మీద అంతే ప్రేమ.
ఉమ్మడి పాలనలో కుదేలైన కులవృత్తులకు పునరుజ్జీవం పోసి,
గౌడన్నల జీవితాల్లో చిరునవ్వును నింపిండు.
అన్ని వర్గాలకు అండగా నిలిచి, పదేళ్లలోనే తెలంగాణను
అగ్రపథాన నిలిపిండు!
మనకు మన తాతల కథ, తండ్రుల కథ, మన జాతి కథ తెల్వకపోతే..
భవిష్యత్తు కూడా అర్థమయ్యే అవకాశం లేదు.
కాబట్టి ఎన్నో పోరాటాలతో.. ఎన్నో బలిదానాలతో..
ఏర్పడిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర చరిత్రను తెలుసుకోవాల్సిన బాధ్యత
ప్రతి తెలంగాణ బిడ్డ మీద ఉన్నది.
జై తెలంగాణ! ✊🏻
@KTRBRS
ఇది ప్రజాస్వామ్య జయకేతనం..!!
అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని అరాచకాలు చేసినా మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠాలను BRS కైవసం చేసుకోవడం ఎంతో హర్షణీయం
మున్సిపల్ ఛైర్మన్, వైస్ చైర్మన్లుగా ఎన్నికైన వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు
ఇందుకోసం శక్తివంచన లేకుండా కృషి చేసిన మంచిర్యాల జిల్లా అధ్యక్షులు, తమ్ముడు @balkasumantrs గారికి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు @ManchireddyBRS గారికి, తమ్ముడు @BuntyBRS గారికి, పార్టీ నాయకులు, శ్రేణులకు పేరుపేరునా అభినందనలు
అడ్డదారుల్లో వీటిని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టినా, రకరకాలుగా ఒత్తిళ్లు తెచ్చినా వేటికి లొంగకుండా మొక్కవోని దీక్షతో ఒక్క తాటిపై నిలిచిన కౌన్సిలర్లకు ప్రత్యేకంగా సెల్యూట్ చేస్తున్నా
క్యాతనపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు మిత్రపక్షమైన సిపిఐ కామ్రేడ్లు అడుగడుగునా కనబరిచిన పోరాట పటిమ ఎంతో స్ఫూర్తిదాయకం
అణచివేతకు, బెదిరింపులకు, అవినీతి అక్రమాలకు, అప్రజాస్వామిక చర్యలకు తెలంగాణలో తావులేదని ఈ తీర్పు తేల్చిచెప్పింది.
రెండున్నరేళ్లలోనే పీకల్లోతు ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న కాంగ్రెస్ కు ప్రజాక్షేత్రంలో కౌంట్ డౌన్ మొదలైందని ఈ ఫలితాలు నలుదిశలా చాటి చెప్పాయి
అటు పంచాయతీ, ఇటు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ముచ్చెమటలు పట్టించిన గులాబీ జెండా సైనికులను పార్టీ ఎప్పటికీ కంటికి రెప్పలా కాపాడుకుంటుంది.
ఈ విజయాలు అందించిన స్ఫూర్తిని కొనసాగిద్దాం.. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అడుగడుగున విధ్వంసం చేస్తున్న రేవంత్ సర్కారుకు బుద్ధి చెబుదాం
జై తెలంగాణ
జై కేసీఆర్
జై బీఆర్ఎస్
మా అపార్ట్‌మెంట్‌ను కూలగొట్టి, మా కుటుంబాలను రోడ్డున పడేస్తారని ముందే తెలిసుంటే మావాళ్లు ఎవ్వరూ కాంగ్రెస్ కి ఓటెయ్యకపోయేది..
ఇప్పుడు మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి.. మా అమ్మ వాళ్లకు టెన్షన్ పెరుగుతుంది అంటూ ఓ చిన్నారి ఆవేదన
కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు డిసెంబర్లో నాట్లు వేసే సమయానికి రైతుబంధు పడుతుండే.. ఇప్పుడు కోతల సమయానికి కూడా పడ్తలేదు.
రేవంత్ రెడ్డి రైతుబంధు పథకం ఎగ్గొట్టి రాహుల్ బంధు పథకం తెచ్చిండు.
ఆయన సీటు కాపాడుకునేందుకు రాహుల్ గాంధీకి సంవత్సరానికి రూ. 1,000 కోట్లు కప్పం కడుతున్నాడు.
- బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
వనదేవతలు సమ్మక్క సారలమ్మను కొలుస్తూ.. ప్రతీ రెండేళ్లకొకసారి ఎంతో వైభవోపేతంగా జరుపుకునే అతిపెద్ద ఉత్సవం మన మేడారం జాతర.
గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపడుతూ... సమ్మక్క సారలమ్మల పోరాట స్ఫూర్తిని, త్యాగనిరతికి ప్రతీక సమ్మక్క సారలమ్మ మహా జాతర.
తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా లక్షల సంఖ్యలో భక్తులు హాజరయ్యే తెలంగాణ కుంభమేళా మేడారం జాతర సందర్భంగా... ఆ తల్లుల దీవెనలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ప్రార్థిస్తున్నాను 🙏
మేడారం జాతర (జనవరి 28-31) సందర్భంగా భక్తులందరికీ శుభాకాంక్షలు.