🎓 గ్రాడ్యుయేట్స్ అందరూ ఓటు నమోదు చేసుకోండి.
నేను మా సతీమణి గారితో కలిసి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓటు నమోదును, ఆఫ్లైన్ విధానంలో పూర్తి చేసుకోవడం జరిగింది.
అర్హత కలిగిన ప్రతి గ్రాడ్యుయేట్ తప్పనిసరిగా తమ ఓటును నమోదు చేసుకోవాలి.
ఎవరు అర్హులు?
సంబంధిత గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో సాధారణ నివాసిగా ఉండాలి.
అర్హత:- 2023 అక్టోబర్ 31 వరకు డిగ్రీ లేదా సమాన అర్హత పూర్తి చేసి ఉండాలి.
గ్రాడ్యుయేట్ నియోజకవర్గం ఓటు నమోదు కోసం
Form-18 దరఖాస్తు చేయాలి.
నమోదు ఎలా చేసుకోవాలి?
ఆఫ్లైన్: Form-18ను పూర్తి చేసి, అవసరమైన ధ్రువపత్రాలతో సంబంధిత ERO/AERO కార్యాలయంలో సమర్పించవచ్చు.
ఆన్లైన్: ఎన్నికల సేవల అధికారిక పోర్టల్ ద్వారా అందుబాటులో ఉన్న సంబంధిత సేవలను ఉపయోగించి దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యంగా: ఆఫ్లైన్లో దరఖాస్తు చేసిన వారు సంబంధిత MRO/ERO కార్యాలయంలో దరఖాస్తును సమర్పించి, నమోదు ప్రక్రియ పూర్తయ్యేలా చూసుకోవాలి.
మీ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో కూడా తప్పనిసరిగా పరిశీలించండి.
అర్హత ఉన్న ప్రతి గ్రాడ్యుయేట్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని MLC Graduates’ Constituency ఓటుగా నమోదు చేసుకోవాలని కోరుతున్నాం.
@BRSparty@KCRBRSPresident@KTRBRS
జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ శ్రమించాలి...
ఈరోజు తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులతో "జిల్లా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల సన్నాహక సమావేశంలో" పాల్గొనడం జరిగింది...
♦️జిల్లా స్థాయి పదవుల కోసం అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలి.
♦️పార్టీ కోసం అంకితభావంతో పని చేయాలి.
♦️పార్టీ కోసం పని చేసే వారికి గుర్తింపు ఉంటుంది.
♦️సర్పంచ్ ఎన్నికల తరహాలోనే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం కష్టపడి పని చేయాలి.
♦️అర్హులైన వారికి పదవులు సమయానుకూలంగా వస్తాయి.
❇️ ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ధారసింగ్ గారు, ఆర్య వైశ్య కార్పొరేషన్ ఛైర్పర్సన్ కల్వ సుజాత గారు, పార్టీ పరిశీలకులు వినోద్ రెడ్డి గారు, రాంశెట్టి నరేందర్ గారు పాల్గొన్నారు.
#TelanganaRising2047
#PrajaPrabhutwam
@revanth_anumula@Bhatti_Mallu@Bmaheshgoud6666@INCTelangana
తెలంగాణ ప్రగతి పథంలో తనదైన ముద్ర వేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారికి అండగా ఉంటూ, రాష్ట్రాభివృద్ధికి దిశానిర్దేశం చేస్తున్న దార్శనిక నాయకులు శ్రీ @Vemnarenderredy గారికి జన్మదిన శుభాకాంక్షలు.
విద్యార్థుల కల సాకారం..
మనోహరన్న చొరవతో చెంగోల్ ప్రభుత్వ పాఠశాల మైదానం సిద్ధం.
మైదానం సమస్యను చెంగోల్ గ్రామ కాంగ్రెస్ నాయకులు రాము యాదవ్, గ్రామ యువత ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చిన వెంటనే స్పందించి మైదానం సిద్ధం చేసిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు.
#buyyanimanoharreddy #telanganaprajaprabhutwam #development #prajapalana #tandur
@revanth_anumula
శంషాబాద్ పట్టణంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీధర్ బాబు గారు, సహచర ఎమ్మెల్యేలతో కలిసి పాల్గొనడం జరిగింది.
🔹 నూతనంగా విజయం సాధించిన సర్పంచులకు శుభాకాంక్షలు, గ్రామాలలో వీధిలైట్లు, శానిటేషన్, త్రాగునీటి సదుపాయాలపై సర్పంచులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి
🔹 కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సర్పంచులు ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసి, బాధ్యతాయుతంగా పనిచేసి గ్రామస్తుల మన్ననలు పొందాలి.
🔹 సర్పంచుల ఆలోచనలు, సేవాభావాన్ని బట్టి ప్రజల్లో గుర్తింపు ఏర్పడుతుంది.
🔹 ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్ నాయకులు ఎవ్వరూ అధైర్యపడవద్దని, గ్రామాల్లో మరింత సేవ చేస్తే పార్టీ తగిన సమయంలో అవకాశం కల్పిస్తుందని భరోసానివ్వడం జరిగింది.
🔹 తాండూర్ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
🔹 జిల్లాలోనే అత్యధికంగా తాండూర్ నియోజకవర్గం నుంచి 25 స్థానాలు ఏకగ్రీవం కావడం ఆనందకరమైన విషయం.
🔹 ప్రతి సర్పంచ్ తమ విధులు, బాధ్యతలను పూర్తిగా అవగాహన చేసుకొని పనిచేయాలి.
🔹 గత ప్రభుత్వంలో సర్పంచులు చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యారు.
🔹 గత రెండు సంవత్సరాలుగా గ్రామాల్లో పాలకవర్గం లేక పాలన కుంటుపడిన విషయం వాస్తవం.
🔹 గత రెండేళ్లుగా నిలిచిపోయిన ఆర్థిక సంఘం నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం భారీ మొత్తంలో నిధులు విడుదల చేస్తుంది. ఆ నిధులతో మీ గ్రామాలను అభివృద్ధి చేయండి.
🔹 ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులుగా ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోలి.
🔹 సర్పంచుల పనితనం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావడానికి పునాదిగా నిలవాలి.
🔹 ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధారాసింగ్, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు, మండల పార్టీ అధ్యక్షులు, నూతన సర్పంచులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఉత్తర ద్వార దర్శనం ద్వారా మోక్షం ప్రసాదించే ఆ వైకుంఠనాథుడు, మీ జీవితాల్లోని కష్టాలను తొలగించి శాంతిని ప్రసాదించాలని ప్రార్థిస్తూ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు.
గౌరవనీయులైన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని హైదరాబాద్లో మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా తాండూరు వ్యవసాయ మార్కెట్ యార్డు నిర్మాణానికి అనుమతులు ఇప్పించాల్సిందిగా మంత్రి గారిని కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం పట్ల సంతోషంగా ఉంది.
@revanth_anumula@TummalaOfficial@Tummala_INC@INCTelangana@IPRTelangana
తాండూరు పట్టణంలోని శ్రీ సద్గురు పోట్లి మహారాజ్ దేవస్థాన దుకాణాలు శిథిలావస్థలో ఉన్న దుకాణాలను నూతనంగా నిర్మించుటకు దేవాదాయ శాఖ వారు అనుమతి ఇచ్చినందున ఆలయ ఈవో తాడేం నరేందర్ గారు, ఆలయ చైర్మన్ ఎస్ ప్రసాద్ గౌడ్ గారు కలిసి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా దేవస్థాన కిరాయిదారులను కలుపుకొని వెంటనే పనులు ప్రారంభించాలని ఆలయ ఈవో, చైర్మన్ గార్లను ఆదేశించాను.
లక్ష్యం ఎంత పెద్దదైనా.. ఒక్క అడుగుతోనే ప్రయాణం మొదలవుతోంది. ఈ ఏడాది మీరు వేసే ప్రతి అడుగు మిమ్మల్ని శిఖరాగ్రానికి చేర్చాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
#HappyNewYear
నూతన సంవత్సర ప్రారంభోత్సవం సందర్భంగా తాండూరు డీఎస్పీ యాదయ్య, సీఐ లు సంతోష్, ప్రవీణ్ రెడ్డి, ఎస్ఐ లు శంకర్, విట్ఠల్ రెడ్డి, న్యూమన్ అలీ, వినోద్ రాథోడ్, అంబరయ్య ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్ లో ముఖ్యమంత్రి @revanth_anumula గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, పలు నియోజకవర్గ సమస్యలు వివరించడం జరిగింది...
✳️ తాండూరు పట్టణ శివారులో బై పాస్ రోడ్డు నిర్మాణంలో భూమి కోల్పోయిన రైతులకు నష్ట పరిహారంగా రూ. 25 కోట్లు మరియు కాగ్న నదిలో ఉన్న త్రాగునీటి పైపులైన్ పునరుద్ధరణ కోసం దాదాపు రూ.50 కోట్లు మంజూరు చేయాలని కోరగా, ముఖ్యమంత్రి @revanth_anumula గారు సానుకూలంగా స్పందించి, త్వరలో నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇవ్వడం జరిగింది..
హామీ ఇచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి @revanth_anumula గారికి ప్రత్యేక ధన్యవాదాలు..
#TelanganaRising2047
#TandurRising
#PrajaPrabhutwam
@revanth_anumula@INCTelangana@Bmaheshgoud6666